Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆస్తి విషయంలో జ్యోత్స్న పెళ్లి చేసుకోకుంటే కార్తీక్‌కు దక్కాలని క్లాజ్ పెట్టడంపై కాంచన అనుమానిస్తుంది. అలా కండిషన్ పెట్టకుంటే జ్యోత్స్న పెళ్లి చేసుకోదని, రిలాక్స్‌గా ఉంటూ అందరిని ఇబ్బందిపెడుతుందని, జ్యోత్స్న పెళ్లి చేసుకునేందుకే అలా దశరథ్ చేశాడని కార్తీక్ వివరిస్తాడు.
జ్యోత్స్న మారిపోయిందేమో

అది మంచిదే అని చెప్పిన కాంచన జ్యోత్స్నను చూస్తుంటే దశరథ్ కూతురు కాదనిపిస్తుందని చెబుతుంది. ఇటీవల హాస్పిటల్‌లో బిడ్డలను మార్చేశారట, కొద్ది రోజులకు టెస్ట్ చేయిస్తే తెలిసిందట. అలానే జ్యోత్స్న కూడా హాస్పిటల్‌లో మారిపోయిందేమే అనిపిస్తుంది కాంచన అంటుంది. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. కానీ, జ్యోత్స్న విషయంలో అలా జరగదులే. ఎందుకంటే వదినను కాపాడింది జ్యోత్స్నే కదా అని కాంచన అంటుంది.
దాంతో కార్తీక, దీప రిలాక్స్ అవుతారు. పారిజాతం పిన్నితో చేరి జ్యోత్స్న చెడిపోయిందని కాంచన అంటే.. జ్యోత్స్నను తులసి మొక్కలా చేస్తాగా అని కార్తీక్ అంటాడు. ముందు పారుకు చెక్ పెట్టాలని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్న్సకు డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒకతను ఇస్తాడు. సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు, దీపే సుమిత్ర కూతురు. ఆమెకే బోన్ మ్యారో ఆపరేషన్ జరిగిందంటాడు. డబ్బు ఇచ్చి అతన్ని పంపించేస్తుంది జ్యోత్స్న.
ఇంతలో జ్యోత్స్న భుజంపై పారిజాతం చేయి వేస్తుంది. దాంతో జ్యో షాక్ అవుతుంది. వాడికెందుకే డబ్బులిచ్చావ్ అని అడిగితే.. ఏదోటి చెప్పి కవర్ చేస్తుంది. కష్టాల్లో ఉన్నాడని సాయం చేశాడంటుంది జ్యో. ఇంతలో పారుకు దాసు కాల్ చేయడంతో వెళ్లిపోతుంది. నాకు అందరు దొరికారు. నా అనుమానమే నిజమైంది. దీపే సుమిత్ర కూతురు, డాక్టర్ అబద్థం చెప్పింది. బావకు దాసు నిజం చెప్పేశాడు. బావే ఈ నాటకం ఆడాడు. నాన్నకు ఈ నిజం తెలుసా. ఈ ఒక్క క్లారిటీ వస్తే ఏం చేయాలో తెలుస్తుంది అని జ్యోత్స్న అనుకుంటుంది.
దీపే నీ మనవరాలు
మరోవైపు దాసును పారిజాతం కలుస్తుంది. ఇదివరకు హాస్పిటల్ దగ్గర దాసు చెప్పినదాని గురించి నిలదీస్తుంది. ఎవరు నా మనవరాలు అని అడుగుతుంది. తనెవరో కాదమ్మా దీప అని దాసు అంటాడు. కుబేర్ తీసుకెళ్లింది నీ మనవరాలు దీపనే, కుబేర్ ఫొటో చూసి గుర్తుపట్టి అనసూయను దీప పుట్టుపూర్వోత్తరాలు అడిగితే నిజాలు తెలిసాయి. కావాలంటే నీకు తనకు పోలిక కలుస్తుంది చూడు అని తల్లితో దాసు అంటాడు.
{{/usCountry}}మరోవైపు దాసును పారిజాతం కలుస్తుంది. ఇదివరకు హాస్పిటల్ దగ్గర దాసు చెప్పినదాని గురించి నిలదీస్తుంది. ఎవరు నా మనవరాలు అని అడుగుతుంది. తనెవరో కాదమ్మా దీప అని దాసు అంటాడు. కుబేర్ తీసుకెళ్లింది నీ మనవరాలు దీపనే, కుబేర్ ఫొటో చూసి గుర్తుపట్టి అనసూయను దీప పుట్టుపూర్వోత్తరాలు అడిగితే నిజాలు తెలిసాయి. కావాలంటే నీకు తనకు పోలిక కలుస్తుంది చూడు అని తల్లితో దాసు అంటాడు.
{{/usCountry}}బాగా ఆలోచించిన పారిజాతం నేను పని మనిషినే, దీప పని మనిషే అని, వారసురాలు కనిపించిందారా అని పారిజాతం తెగ మురిసిపోతుంది. కళ్లముందు బంగారాన్ని పెట్టుకుని బొగ్గు అనుకున్నా. దీప నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాను. అమ్మా దీప నేను వస్తున్నా అని పారు అంటుంది. దీప నీ మనవరాలు అని అందరికి తెలిస్తే నువ్వు పిల్లలను మార్చిన విషయం బయటపడుతుంది అని దాసు హెచ్చరిస్తాడు.
కార్తీక్, జ్యోత్స్నకు విషయం తెలియనివ్వకు. కార్తీక్ గాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టావ్. వాడికి దొరికితే విడిచిపెడతాడా అని దాసు అంటాడు. అది నిజమే అన్న పారిజాతం దీపను చూడకుండా ఉండలేనని వెళ్తుంది పారిజాతం. జ్యోత్స్న తినకుండా ఆలోచిస్తుంటే దశరథ్ తినమంటాడు. మంచి సంబంధం చూస్తాం చేసుకో అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న చెప్పింది వినట్లేదని కోప్పడుతుంది సుమిత్ర.
విజిల్ కొట్టి పిలిచిన పారు
ఆవేశంతో మాట్లాడేసరికి దగ్గు వస్తుంది. జ్యోత్స్న నీళ్లు ఇస్తుంటే ఆపి తాను ఇస్తాడు దశరథ్. జ్యోత్స్నపై దశరథ్ ఫైర్ అవుతాడు. ముందు అంతా భోజనం చేయండి. మీ అందరితో నేను మాట్లాడాలి అని జ్యో అంటుంది. సరేనంటారు. మరోవైపు కార్తీక్ ఇంటికి పారిజాతం వెళ్తుంది. దీప నీకో సర్‌ప్రైజ్ ఉంది. ఏం జరిగినా సైలెంట్‌గా ఉండమంటాడు కార్తీక్.
దీపను ఆప్యాయంగా పిలుస్తుంది పారిజాతం. తప్పిపోయిన కూతురు కోసం వెతికినట్లు అలా వెతుకుతావేంటీ అని అనసూయ అంటుంది. నా తప్పులు ప్రక్షాళన చేసుకోడానికి వచ్చాను. దీప దర్శనం ఇప్పించండి అని పారిజాతం ఆవేదనగా అడుగుతుంది. కార్తీక్ విజిల్ కొడతాడు. వంట గదిలో నుంచి పొగ వస్తుంది.
పారిజాతం విజిల్ కొట్టి దీపను పిలుస్తుంది. దీప రావడంతోనే పారిజాతం ప్రేమగా, ఆప్యాయతగా మనవరాల అని హగ్ చేసుకుంటుంది. మనవరాలనా అంటూ అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.