Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్నకు సూరజ్ కనిపిస్తాడు. సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్లి తిడుతుంది. మా కుటుంబం ఎలా అవస్థలు పడుతుందో చూడటానికి వచ్చావా. నా కళ్లు ఏడ్చి ఏడ్చి ఎలా ఎరుపెక్కాయో చూడరా. నావాళ్లను ఎలా కాపాడుకోవాలో తెలియక తల తిరుగుతుందని జ్యోత్స్న అంటుంది.
ఇది మనిషిని చంపడం కన్నా దారుణంరా

ఎన్నో గుళ్లకు విరాళాలు ఇచ్చిన నా కుటుంబం ప్రసాదంతో కడుపునింపుకుంది. ఈరోజు నా కారణంగా అవమానాలు పడుతుంది. ఇది మనిషిని చంపడంకన్నా దారుణంరా. నీతో పెళ్లికి ఓకే చెప్పకుంటే ఇదంతా జరిగేది కాదురా. నేను ఒప్పుకున్నాకాబట్టే నిన్ను సూరజ్‌లా కాకుండా అల్లుడిలా చూశారా. తప్పు ఎక్కడ జరిగిందంటే నిన్ను కార్తీక్, దీప నమ్మడం. లేకుంటే నీకంతా ఫ్రీడమ్ ఉండేది కాదురా అని జ్యోత్స్న అంటుంది.
అంటే తప్పులన్నీ మీరే చేశారని ఒప్పుకుంటున్నావా అని సూరజ్ అడుగుతాడు. అవునురా. తప్పులన్నీ మేమే చేశాం. కానీ, మీరు పాపాలు చేశారు. నువ్వు మీ అమ్మ, తాత కడుక్కోలేని పాపాలు చేశారు. నీ తండ్రిని చంపారన్న కారణంతో ఇంత పగ తీర్చుకుంటావా. అసలు గుడిలోనుంచి వెళ్లగొట్టడానికి కారణం కూడా నువ్వే కావచ్చు అని జ్యోత్స్న అంటుంది.
నిజాలు వెంటనే చెప్పలేం. మీ తాత వాళ్లు మా అత్తను దూరం చేసి, నా తండ్రి చావుకు కారణం అయ్యారు. దానికంటే పెద్దదా ఇది అని సూరజ్ అంటాడు. నువ్వు చెప్పేది వినేంత ఓపిక కూడా లేదురా నాకు. ఎందుకొచ్చావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. ఇది ఇవ్వడానికి వచ్చానని ఫోన్ ఇస్తాడు సూరజ్. నాకు తిరిగి ఇవ్వడం అలవాటని అంటాడు.
దీని వెనుక మాలిని ఉండొచ్చు
దాంతో జ్యోత్స్నకు తన గిఫ్ట్స్ ఇచ్చింది గుర్తు చేసుకుని సైలెంట్‌గా ఉంటుంది. సూరజ్ వెళ్లిపోతాడు. గుడిలోనుంచి శివ నారాయణను వెళ్లగొట్టడం వెనుక మాలిని ఉండొచ్చని, లేకుంటే ధర్మకర్తకు వాళ్లు ఇక్కడ ఉన్నారని ఎలా తెలుస్తుంది. ఉదయాన్నే వచ్చి ఎందుకు గొడవ చేస్తాడు. సాధారణంగా ఎవరైనా నార్మల్‌గా చెబుతారు. కావాలని అంతలా అవమానించారు అంటే అర్థం కావట్లేదా అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}దాంతో జ్యోత్స్నకు తన గిఫ్ట్స్ ఇచ్చింది గుర్తు చేసుకుని సైలెంట్‌గా ఉంటుంది. సూరజ్ వెళ్లిపోతాడు. గుడిలోనుంచి శివ నారాయణను వెళ్లగొట్టడం వెనుక మాలిని ఉండొచ్చని, లేకుంటే ధర్మకర్తకు వాళ్లు ఇక్కడ ఉన్నారని ఎలా తెలుస్తుంది. ఉదయాన్నే వచ్చి ఎందుకు గొడవ చేస్తాడు. సాధారణంగా ఎవరైనా నార్మల్‌గా చెబుతారు. కావాలని అంతలా అవమానించారు అంటే అర్థం కావట్లేదా అని కార్తీక్ అంటాడు.
{{/usCountry}}మాలిని ఇంకా వదిలిపెట్టదు. తాత వాళ్లు ఎక్కడికి వెళ్లిన ఇదే పరిస్థితి. మాటలతో మానసికంగా చంపానుకుంటుంది. ఇలానే జరిగితే తాత బతకడు. మనం ఏం చేయలేకపోతున్నాం. సూరజ్ గాడు చాలా తెలివిగా ఇరికించి వెళ్లాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అని కార్తీక్ అంటాడు. తర్వాత శివ నారాయణ కుటుంబంతో రోడ్డు మీద కావాలనే గట్టిగా మాట్లాడుతాడు కార్తీక్.
ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని కానీ ఇలా రావడం ఏంటీ. అల్లుడు ఇంట్లోంచి గెంటేశాడని అనుకోరు. తప్పంతా నాదే అన్నట్లు ఉండదు అని కార్తీక్ అంటాడు. అంతా చుట్టు చేరుతారు. ఆపరా నీ నాటకాలు. మీరంతా పోండి అని శివ నారాయణ అంటాడు. ఏంటండి కుటుంబంతా రోడ్లమీద తిరుగుతుంది. గొడవ పెట్టుకుంటున్నారు. దొంగల బ్యాచ్ ఆ మీరు అని ఒకతను అంటాడు.
రోడ్డు మీద కార్తీక్ డ్రామా
దాంతో అతన్ని తిట్టిన కార్తీక్ మా తాత, నా భార్యకు తండ్రి, తల్లి అంటూ వరసలు చెప్పి ఒకరు నిలువెళ్లా ముంచితే గుడిలో పడుకుంటున్నారు. మా ఇంటికి రావట్లేదని డ్రామా చేస్తాడు కార్తీక్. నా మామ కష్టాలు నావి కాదా, బాధలు పంచుకోలేనా అని కార్తీక్ అంటాడు. అదంతా విన్న ఒకతను ఆహా ఓహో ఈరోజుల్లో ఇలాంటి అల్లుడు దొరకడం చాలా కష్టం. అల్లుడు అదుర్సు అని అంటాడు.
మీ వల్లే కదరా రోడ్డు మీదకు వచ్చామని పారిజాతం అంటుంది. ప్రతి కుటుంబంలో లింకులు పెట్టేవాళ్లు ఉంటారు అని కార్తీక్ అంటాడు. ఇలాంటి అల్లుడు దొరకడం మీ అదృష్టం అంటూ అతను అంటాడు. ఈ జూనియర్ ఆర్టిస్టులను నటించమంటే ఓవరాక్టింగ్‌తో చెడగొట్టేలా ఉన్నారే అని కార్తీక్ భయపడతాడు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడిన మేము రామురా అని శివ నారాయణ అంటాడు.
మీరు మా ఇంటికి వచ్చేవరకు వదలను. దేవుడా మాకు నువ్వే సాయం చేయాలని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. ఇంతలో పోలీసులు వస్తారు. గొడవ అర్థమైంది. ఏమైంది తాతగారు ఎందుకు వెళ్లట్లేదు. తాతగారు ఇలా రోడ్ల మీద తిరిగితే దొంగలనే అంటారు. ఇలా తిరిగేవాళ్లను అరెస్ట్ చేయమని ఎస్పీ ఆర్డర్. ఏదైనా ఉంటే ఇంటికెళ్లి మాట్లాడుకుందాం. లేదు అంటారా పోలీస్ స్టేషన్‌కి రండి అని ఎస్సై అంటాడు.
కాంచన ఇంటికి తాత కుటుంబం
దాంతో నాన్న బయటి పరిస్థితులు బాగాలేవు. ఫ్యామిలీతో ఉన్నాం అని దశరథ అంటాడు. దాంతో ఏం చేయలేక కూతురు కాంచన ఇంటికి శివ నారాయణ కుటుంబం వెళ్తుంది. ఎస్సై కూడా వస్తాడు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని ఎస్సై అంటాడు. కానీ, మీరు వెళ్లక మా మావయ్య ఇంట్లో ఉండనంటాడు అని కార్తీక్ అంటాడు.
బయట మిమ్మల్ని చూస్తే దొంగలు అనుకునే ప్రమాదం ఉంది. అలాగే దొంగలతో మీకు కూడా ప్రమాదం ఉంది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లను, ఆడవాళ్లను వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతారు. కార్తీక్ మీ పెద్ద అల్లుడే కదా. అల్లుడు అంటే కొడుకుతో సమానం అని ఎస్సై అంటాడు. అప్పుడే మెచ్చుకోకండి అని పారిజాతం అంటే.. ఈ ఫ్యామిలీలో మీరే తేడాగా కనిపిస్తున్నారని ఎస్సై అంటాడు.
వాడు మంచోడే అని పారు అంటుంది. ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తున్నారు. రోజు ఉదయం మెసేజ్ చేస్తాను. నీ ఫ్యామిలీ ఉందని చెప్పాలి. డౌట్ వస్తే ఇంటికొస్తాను. వీళ్లు లేకుంటే నిన్ను లోపల ఏస్తాను. అత్తమామనలు సరిగా చూసుకోనందుకు అని ఎస్సై వార్నింగ్ ఇస్తాడు. అలా అయితే నన్ను కూడా లోపల వేయాలని, తాను కూడా అల్లుడినేనని శ్రీధర్ అంటాడు.
ఎస్సై ఫ్రెండ్‌తో కార్తీక్ డ్రామా సక్సెస్
ఏంటయ్యా ఇద్దరు అల్లుళ్లు ఉండి సరిగా చూసుకోరా. కార్తీక్ నువ్వు పక్కకు వస్తే నా పేరు చెప్పి నెంబర్ ఇస్తానంటాడు ఎస్సై. కార్తీక్ పక్కకు వెళ్తాడు. నిజానికి ఆ ఎస్సై కార్తీక్ ఫ్రెండ్. వారం క్రితమే ట్రాన్స్‌ఫర్ అయింది. టైమ్ చూసుకుని నేనే కలుద్దామనుకున్నా. ఇంతలో నువ్వే కాల్ చేసి రమ్మన్నావ్. అసలు జరిగింది ఏంటీ అని ఎస్సై అడుగుతాడు.
అదంతా పెద్ద కథ అని ఒకరిని నమ్మి మోసం చేశాడు. వాడిని తీసుకొచ్చింది నేనే. ఇక్కడ ఊహించని ట్విస్టులు జరిగాయి. అతను కూడా మేనత్త కొడుకే అని జరిగింది చెబుతాడు. సొంతవాళ్లే కదా కొట్టుకునేది. గోతులు తీసేది కూడా వాళ్లే కదా. ఇందులో నా తప్పు కూడా ఉంది. వాడిని నమ్మడం అని కార్తీక్ అంటాడు. వాళ్లు నిన్ను ఛీ కొడుతున్నారు మచ్చా. ఎలా ఉంటావ్ అని ఎస్సై అంటాడు.
ఛీ కొట్టిన నా ఫ్యామిలీనే కదా అని కార్తీక్ అంటాడు. నువ్వు ఏం మారలేదు. అలాగే ఉన్నావని ఎస్సై చెప్పి వెళ్లిపోతాడు. అలా ఎస్సై, ఆర్టిస్టులతో డ్రామా ఆడి లింక్ పెట్టి తాతను ఇంటికి తెచ్చుకుంటాడు కార్తీక్. మరోవైపు సూరజ్‌ను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావురా. ఈసారి ఎవరిని కాపాడటానికి వెళ్లావ్. ఎవరి రక్తపు మరకలు అంటించుకున్నావ్ అని అడుగుతుంది మాలిని.
మాలినితో సూరజ్ గొడవ
రక్తపు మరకలు కాదమ్మా కన్నీళ్లు. శివ నారాయణ దగ్గర నేను తీసుకున్న సంతకంతో వాళ్ల తలరాతలే మార్చావు కదా. అసలు వాళ్లను రోడ్డు మీద ఎందుకు పడేశావ్. ఇందుకేనా నన్ను రెండ్రోజులు ఇంటికి దూరంగా ఉంచింది అని కోపంగా అరుస్తాడు సూరజ్. ఉంటే ఆపేవాడివా. అడిగిన ఇదే సమాధానం చెప్పేదాన్ని అని మాలిని అంటుంది.
ఇది ఎప్పటికి ఆగుతుందమ్మా అని తల్లితో గొడవ పెట్టుకుంటాడు సూరజ్. మీ నాన్న చావుకి శివ నారాయణ కుటుంబానికి నేను నేర్పిస్తున్న గుణపాఠం ఇది అని మాలిని అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.