కార్తీక దీపం 2 సీరియల్ సత్తా చాటుతోంది. తాజాగా 40వ వారం టీఆర్పీ రేటింగ్స్ లోనూ ఆ సీరియల్ టాప్ లో ఉండటమే కాదు.. తన రేటింగ్ కూడా భారీగా పెంచుకుంది. గత కొన్ని వారాలు తగ్గుతూ రాగా.. ఈవారం ఒక్కసారిగా పెరగడం విశేషం. మరో సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా తన రేటింగ్ మెరుగుపరచుకుంది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో మరోసారి సత్తా చాటాయి. టాప్ 10లో మొదటి ఆరు స్థానాల్లో ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. తాజాగా 40వ వారం రేటింగ్స్ రాగా.. అందులో తొలి స్థానంలో కార్తీక దీపం 2 నిలిచింది. ఈ సీరియల్ కు 14.83 రేటింగ్ నమోదు కావడం విశేషం. గత వారం కంటే చాలా మెరుగైన రేటింగ్ సాధించింది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా 14.02 రేటింగ్ సాధించడం విశేషం.
అర్బన్‌లో టాప్ గుండె నిండా గుడి గంటలు
ఇక మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 12.82 రేటింగ్ వచ్చింది. అయితే కేవలం అర్బన్ చూస్తే 11.87 రేటింగ్ తో టాప్ లో ఉంది. అటు కార్తీక దీపం 2కి కూడా ఇదే రేటింగ్ నమోదైంది. ఇక నాలుగో స్థానంలోకి ఇంటింటి రామాయణం తిరిగి వచ్చింది. ఆ సీరియల్ కు 12.38 రేటింగ్ నమోదు కాగా.. ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు 11.42 రేటింగ్ వచ్చింది. ఆరో స్థానంలో నిండు మనసులు ఉంది. ఈ సీరియల్ కు 7.98 రేటింగ్ నమోదైంది.
జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఇలా..
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం సీరియల్ 7.71 రేటింగ్ తో ఏడో స్థానంలో నిలిచింది. జీ తెలుగులో నంబర్ వన్ మాత్రం ఆ సీరియలే. ఇక ఎనిమిదో స్థానంలో చామంతి సీరియల్ 6.90 రేటింగ్ తో ఉంది. 9వ స్థానంలో లక్ష్మీ నివాసం నిలిచింది. ఈ సీరియల్ కు 6.88 రేటింగ్ వచ్చింది. 10వ స్థానంలో జగద్ధాత్రి సీరియల్ 6.78 రేటింగ్ తో ఉంది.
{{/usCountry}}ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం సీరియల్ 7.71 రేటింగ్ తో ఏడో స్థానంలో నిలిచింది. జీ తెలుగులో నంబర్ వన్ మాత్రం ఆ సీరియలే. ఇక ఎనిమిదో స్థానంలో చామంతి సీరియల్ 6.90 రేటింగ్ తో ఉంది. 9వ స్థానంలో లక్ష్మీ నివాసం నిలిచింది. ఈ సీరియల్ కు 6.88 రేటింగ్ వచ్చింది. 10వ స్థానంలో జగద్ధాత్రి సీరియల్ 6.78 రేటింగ్ తో ఉంది.
{{/usCountry}}