Karthika Deepam 2: సూరజ్‌కు తెలియకుండా మాలిని దారుణాలు.. ఇంత క్రూరత్వమా? కార్తీక దీపం 2లో ట్విస్ట్ ఇదేనా?
Karthika Deepam 2: బుల్లితెరపై అత్యధిక టీఆర్‌పీతో దూసుకుపోతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. కొడుకు సూరజ్‌కు తెలియకుండా మాలిని దారుణాలు చేస్తోంది. ఈ విషయాలు సూరజ్ కు తెలిస్తే పరిస్థితి ఏంటీ? సీరియల్ ఏ మలుపు తీసుకోనుంది? అనేది క్యూరియాసిటీని పెంచుతోంది.
Karthika Deepam 2: స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' రోజుకో ఊహించని మలుపుతో ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. కథలో ప్రధాన విలన్‌గా మారిన మాలిని.. తన కొడుకు సూరజ్ కన్నుగప్పి వరుస దారుణాలకు ఒడిగడుతోంది. శివ నారాయణకు చెందిన వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన రెస్టారెంట్లపై భౌతిక దాడులు చేయిస్తోంది.

దీపను చంపాలని
కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని విలనిజం ఎక్స్ ట్రీమ్ కు చేరుకుంది. ఆమె క్రూరత్వంతో వ్యవహరిస్తోంది. శివ నారాయణ రెస్టారెంట్లపై దాడులు చేయిస్తోంది. అంతే కాకుండా తనకు అడ్డుగా నిలుస్తోందని భావించిన దీపను శాశ్వతంగా అంతమొందించేందుకు యాక్సిడెంట్ చేయించింది.
సూరజ్ కు తెలియకుండా
కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని డబుల్ ఫేస్ చూపిస్తోంది. సూరజ్ ముందు మాత్రం ఏం తెలియని అమాయకురాలిలా కొడుకును రెచ్చగొడుతోంది. కానీ వెనుకాల మాత్రం శివ నారాయణ కుటుంబాన్ని నాశనం చేసేందుకు గోతులు తవ్వుతోంది.
ఊహించని ట్విస్ట్!
అయితే, మాలిని వేసిన ప్లాన్‌ను తిప్పికొడుతూ సూరజ్, జ్యోత్స్నలు కలిసి దీపను కాపాడేందుకు రంగంలోకి దిగడం కథను మరో మలుపు తిప్పింది. ఇప్పటికే తన తల్లి ప్రవర్తనపై తీవ్ర అనుమానంతో ఉన్న సూరజ్, ఈ వరుస ఘటనల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనే దానిపై ఆరా తీసే అవకాశముంది.
హాట్ టాపిక్
రెస్టారెంట్లపై దాడి, దీప యాక్సిడెంట్ రెండూ ఒక్కరి పనేనని సూరజ్ గ్రహించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు. అప్పుడు తన తల్లి మాలిని అసలు రంగు బయటపడనుంది. సొంత తల్లే ఈ దారుణాలకు ఒడిగట్టిందని తెలిస్తే సూరజ్ ఆస్తిని, బంధాలను త్యాగం చేస్తాడా? జ్యోత్స్నను పెళ్లి చేసుకుని ఈ డ్రామాకు ముగింపు పలుకుతాడా అనేదే ఇప్పుడు బుల్లితెర వీక్షకులలో హాట్ టాపిక్‌గా మారింది.
అదే ప్లాన్
తెలుగు బుల్లితెరపై ప్రైమ్‌టైమ్ సీరియల్స్ వ్యూయర్‌షిప్‌ను నిలబెట్టుకోవడంలో 'కార్తీక దీపం' ఫ్రాంచైజ్ ఎప్పుడూ ముందుంటుంది. సాధారణంగా కథనంలో హీరోయిన్ (దీప)కి ప్రమాదం ఎదురవ్వడం లేదా విలన్ కుట్రలు పరాకాష్టకు చేరినప్పుడు సీరియల్స్ టీఆర్‌పీ (TRP) గణనీయంగా పెరుగుతుంది.
ప్రస్తుతం మాలిని పాత్ర ద్వారా నడిపిస్తున్న నెగెటివ్ షేడ్స్, సూరజ్-జ్యోత్స్నల మధ్య నలిగిపోయే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను స్క్రీన్‌లకు కట్టిపడేస్తున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లలో సూరజ్ తన తల్లిని నిలదీసే సన్నివేశాలు, జ్యోత్స్న పెళ్లికి సంబంధించిన నిర్ణయం ఈ సీజన్‌లోనే అత్యధిక రేటింగ్ సాధించే అవకాశానికి దారితీయొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


