Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-సూరజ్, జ్యో పెళ్లికి దక్షిణామూర్తి ఓకే-కానీ దిమ్మతిరిగే కండీషన్-ట్విస్ట్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 9 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. జ్యో అడిగిన ప్రశ్నలకు సూరజ్ సమాధానం చెప్పలేకపోతాడు. కార్తీక్, దీపను శివ నారాయణ ఆఫీస్ కు కూడా రావొద్దంటాడు. దీపకు రూ.10 కోట్ల చెక్ రాస్తాడు. సూరజ్, జ్యోత్స్న పెళ్లి కోసం దక్షిణామూర్తి కండీషన్ పెడతాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. అనుకోకుండా శివ నారాయణ ఇంటికి కార్లో వస్తాడు సూరజ్. ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాను కదా, మా ఇల్లు అనుకొని వచ్చానని సూరజ్ నిజాన్ని చెప్తాడు.

జ్యోత్స్న లాజిక్
నువ్వు మారిపోయావ్ జీనియస్. నీలో రియలైజేషన్ మొదలైంది. అందుకే నీ ఆలోచనలు అదుపు లేకుండా పోయాయని జ్యోత్స్న లాజిక్ మాట్లాడుతుంది. నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు రియలైజ్ అవుతా. మనసులోకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోను అంటూ సూరజ్ తిక్కగానే మాట్లాడతాడు.
ఆ హక్కు లేదు
కొందరికి ఊపిరి ప్రాణమైతే, కొందరికి మనసే ప్రాణం. ఒకరి ఊపిరి తీసే హక్కు లేనట్లే, ఒకరి మనసుకు గాయం చేసే హక్కు ఎవరికీ లేదని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. జరిగింది గతం, జరుగుతుంది వాస్తవం. నేను వాస్తవంలోనే బతుకుతా. గుడ్ బై అని సూరజ్ వెళ్లాలని అనుకుంటాడు.
ఒక్క ప్రశ్న, నీ ఆలోచనలో ఎవరున్నారని జ్యోత్స్న అడుగుతుంది. కానీ ఆన్సర్ చెప్పకుండా సూరజ్ వెళ్లిపోతాడు. ఎందుకంటే జ్యోత్స్న గురించి ఆలోచిస్తూనే సూరజ్ అక్కడికి వస్తాడు.
శివ నారాయణ ఫైర్
ఆఫీస్ లో కార్తీక్, దీపతో బ్యాంకు మేనేజర్ లోను గురించి మాట్లాడుతూ జ్యోత్స్న రెస్టారెంట్స్ గ్రాఫ్ పడిపోతుందని అంటాడు. వాళ్లను చూసిన శివ నారాయణ ఫైర్ అవుతాడు. ఎందుకు వచ్చారని గట్టిగానే అడుగుతాడు. నేను ఎవరి రూపాయి ఇచ్చుకోను, కచ్చితంగా అప్పు తీర్చేస్తానని శివ నారాయణ చెప్తాడు.
ఎందుకు వచ్చారు?
ఈ విషయాలన్నీ నాతోనే మాట్లాడొచ్చు. సీఈఓ మారినా.. ఛైర్మన్ మారడు కదా అని శివ నారాయణ దెబ్బిపొడిచినట్లే మాట్లాడతాడు. కార్తీక్, దీపను ఆఫీస్ కు ఎందుకు వచ్చారని అడుగుతాడు. ఇంటికిి రావొద్దన్నావ్ కానీ, ఆఫీస్ కు కాదు కదా. దీప సీఈఓ కాబట్టి చేయాల్సిన పనులున్నాయని కార్తీక్ చెప్తాడు. చేయల్సిందంతా చేశారు కదా అని మరోసారి శివ నారాయణ నిందిస్తాడు.
అన్నింటికీ మమ్మల్నే దోషులను చేస్తే ఎలా తాత? నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఎంప్లాయిస్ లో, బ్యాంకు వాళ్లకు భయం మీ వల్లే. మీరు సూరజ్ ను తీసుకురావడం వల్లే. మీరు ఈ క్షణమే ఆఫీస్ వదిలి వెళ్లిపోండని శివ నారాయణ ఫైర్ అవుతాడు. కార్తీక్ ఎంత చెప్పినా కూడా శివ నారాయణ వినాలనుకోడు.
జ్యోత్స్నను బతకనివ్వరు
మీరు నాకు కనిపించకండి. మీకు, నాకు ఏ సంబంధం లేదు. మీరు జ్యోత్స్నను కూడా బతకనివ్వరు. దాన్ని రెచ్చగొట్టి సూరజ్ చుట్టూ తిరిగేలా చేశారు. మీకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. నేను ఛైర్మన్ గా ఉండగా మీరు ఆఫీస్ కు వస్తే నేను చచ్చినట్లే అని శివ నారాయణ పెద్ద మాటలు మాట్లాడతాడు.
మీరు ఎన్ని చెప్పినా ఆఫీస్ వదిలి వెళ్లమని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ వచ్చి కార్తీక్ ను లాగిపెట్టి కొడతాడు. మామయ్య ప్రాధేయపడుతుంటే నీకు అర్థం కావడం లేదా? అని ప్రశ్నిస్తాడు. నేను క్షమాపణ చెప్తున్నా. వీళ్లు ఆఫీస్ కు రారు అని శివ నారాయణకు చెప్పి కార్తీక్ కు శ్రీధర్ తీసుకెళ్తాడు.
దీపకు రూ.10 కోట్ల చెక్
సీన్ శివ నారాయణ ఇంటికి మారుతుంది. శివ నారాయణ రూ.10 కోట్లకు చెక్ రాస్తాడు. దీపను సీఈఓ పదవి నుంచి తప్పించాలంటే రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని జ్యోత్స్న అగ్రిమెంట్ రాసిందని శివ నారాయణ చెప్తాడు. దీపను సీఈఓ పదవి నుంచి ఎందుకు తప్పించాలని జ్యోత్స్న అడుగుతుంది. వాళ్లు మళ్లీ వస్తారు. అందుకే చెక్ ఇచ్చి మనకు దూరంగా ఉండమని చెప్తా. నేను కాంచనతో మాట్లాడలేను. అందుకే దశరథ, సుమిత్రను తీసుకెళ్తున్నానని శివ నారాయణ చెప్తాడు.
నిర్ణయం తీసేసుకున్నా. వాళ్లను నమ్మిన పాపానికి మనకు జరిమానా పడాల్సిందేనని శివ నారాయణ స్పష్టం చేస్తాడు.
శ్రీధర్ సారీ
మరోవైపు కార్తీక్ ను కొట్టినందుకు శ్రీధర్ సారీ చెప్తాడు. నీ ఓర్చుకునే గుణమే నీకు శత్రువు. తప్పంతా మీదే. జ్యోత్స్న పెళ్లి బాధ్యతలు మీరు తీసుకోవడమే పెద్ద తప్పు అని శ్రీధర్ అంటాడు. ఆ పెళ్లి తర్వాత అని చెప్పబోతూ కార్తీక్ ఆగిపోతాడు. పెళ్లి ఆగిపోయింది కదా, మరి ఎప్పుడు తెలుస్తుందని శ్రీధర్ అడుగుతాడు. కానీ కార్తీక్ ఏం చెప్పకుండా శ్రీధర్ ను ఇంటికి తీసుకెళ్తాడు.
కాంచన ఇంటికి దక్షిణామూర్తి
అప్పుడే కాంచన ఇంటికి దక్షిణామూర్తి, సూరజ్ వస్తారు. సూరజ్ కార్లోనే కూర్చుంటానంటాడు. ఇంట్లోకి రావొచ్చా అని దక్షిణామూర్తి అడుగుతాడు. కాంచన ఫైర్ అవుతుంటే, కార్తీక్ మాత్రం దక్షిణామూర్తిని లోపలికి రానిస్తాడు. నా కాళ్లు పోయాయా? లేదా నటిస్తున్నాని నా కాళ్లు చూస్తున్నారా? మీలా నేను నటించలేనని కాంచన మండిపడుతుంది.
దక్షిణామూర్తి కండీషన్
సాయం అడగడానికి వచ్చా. నా కూతురి, మనవరాలి కన్నీళ్లు తుడవడం కోసం నేను వంద మెట్లు దిగి వచ్చా. మనం కలిసుందాం. పగలు, ప్రతీకారాలు మర్చిపోదాం. ఈ గొడవకు కారణం మీ తాత శివ నారాయణ. అతను నా కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి. నా స్నేహితుడు కాబట్టి చేతులు పట్టుకున్నా సరిపోతుందని దక్షిణామూర్తి షాకిస్తాడు. అప్పుడే వచ్చిన శివ నారాయణ, సుమిత్ర, దశరథ ఈ మాటలు వింటారు.
నువ్వు మీ తాతలో అలా చేస్తే నా మనవడికి, మనవరాలికి పెళ్లి జరిపిస్తానని కార్తీక్ తో దక్షిణామూర్తి అంటాడు. అప్పుడే శివ నారాయణ కోపాన్ని చూసి దీప భయపడుతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


