Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. దీపను తెలియకుండా కన్నావా? నీచంగా మాట్లాడిన మాలిని- తల్లికి సూరజ్ షాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 7 ఎపిసోడ్ లో సుమిత్రకు మాలిని కాల్ చేసి నీచంగా మాట్లాడుతుంది. సూరజ్ ను మర్చిపోలేేనని జ్యోత్స్న అంటుంది. కార్తీక్, దీపపై శివ నారాయణ ఫ్యామిలీ నిందలు వేస్తూనే ఉంటుంది. సూరజ్ మారిపోతాడేమోనని మాలిని భయపడుతుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. సుమిత్రకు మాలిని కాల్ చేస్తుంది. చెల్లి చేసిన అన్యాయానికి మీ అన్నయ్య పోయాడు కానీ నీ కూతురికి జరిగిన అన్యాయానికి నువ్వు బతికేశావ్. గట్టి గుండె. నువ్వు నీ అన్నయ్యను పొట్టన పెట్టుకున్నావ్ కదా అని సుమిత్రను బాధపెట్టేలా మాలిని మాట్లాడుతుంది.

సుమిత్ర షాక్
చావడమంటే ప్రాణాలు పోవడం మాత్రమే కాదు మాలిని. వదిలేయ్ మాలిని, జరిగింది మర్చిపో. అదే మనిద్దరికి మంచిది అని సుమిత్ర సీరియస్ గానే చెప్తుంది. అదే కోరుకుంటే నువ్వు నీ కూతురిని నా కొడుకు దగ్గరకు పంపేదానికి కాదు సుమిత్ర అని మాలిని చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్స్న సూరజ్ ను కలిసిందని అసలు విషయం చెప్తుంది సుమిత్ర.
తెలియకుండా కన్నావా?
నా కూతురు నీ ఇంటికి వచ్చిందా? బయట కలిశారంటే నీ కొడుకు కూడా దిగజారినట్లే కదా అని సుమిత్ర కూడా కౌంటర్ ఇస్తుంది. నీ మేనల్లుడు, నీ మేనల్లుడి భార్య కార్తీక్, దీప మా ఇంటికి వచ్చారు. నీ మీద పగ సాధించొద్దని కావాలంటే ఊడిగం చేస్తామన్నారు. మీరు ఛీ కొట్టినా కూడా కార్తీక్, దీపకు మీ మీద ప్రేమ ఎందుకు తెలియడం లేదు. దీప నీ కన్నకూతురు కాదు కదా. ఎవరికి తెలియకుండా కన్నావా? అని మాలిని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.
నీ పుట్టింటికి పౌరుషం ఉంది. నీ మెట్టింటికి సిగ్గు లేదు. అందుకే రాయబారానికి పంపారా? నా కొడుకును మీ వైపు తిప్పుకుందామని అనుకుంటున్నారా? నీ కూతురు బతికినంత కాలం నా కొడుకును మర్చిపోలేదు. అదే జీవిత కాల శిక్ష. దాన్ని నా కొడుకును కలవొద్దని చెప్పు అని మాలిని గట్టిగా మాట్లాడుతుంది. దీంతో సుమిత్ర కాల్ కట్ చేస్తుంది.
జ్యోత్స్న ఫీలింగ్స్
ఇటు సూరజ్ ను కలవడానికి ఎందుకు వెళ్లావని జ్యోత్స్నను అందరూ అడుగుతారు. అబ్బాయి పుడితే ఏం ఆలోచించరు కానీ అమ్మాయి పుడితే పేరు దగ్గర నుంచి అన్నీ ఆలోచిస్తారు. ఒక కుక్కను పెంచుకుంటే 15 ఏళ్లు బతుకుతుందనే నిజం మర్చిపోయి ప్రేమిస్తాం. దాని చావును తట్టుకోలేం. కానీ మన ఆశలపై ఎంత ప్రేమ ఉండాలి. మన కలలు మన కంటి ముందే చచ్చిపోతుంటే ఎంత బాధ ఉండాలంటూ జ్యోత్స్న తన ఫీలింగ్స్ చెప్తుంది.
సుమిత్ర కూతురని తాళి కట్టకుండా వెళ్లిపోయాడు. నాకు పెళ్లి మీద కొత్త ఆశలను కలిపించి మనిషి ఎగిరిపోతే నేను సైలెంట్ గా ఉండిపోవాలా? అడిగే అధికారం ఉండదా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. కచ్చితంగా ఉంటుందని అప్పుడే కార్తీక్, దీప వస్తారు. అందరూ కార్తీక్ నే మాటలంటారు. సూరజ్ ను నేను కలవడానికి బావకు ఏం సంబంధం లేదని జ్యోత్స్న చెప్తుంది.
బాంబ్ పేల్చిన సుమిత్ర
నేను సూరజ్ ను పార్కులో కలిశా. సూరజ్ వస్తాడనే తెలిసి వెళ్లా. నేను అడగాల్సిన ప్రశ్నలు అడిగానని జ్యోత్స్న చెప్తుంది. సమాధానాలు దొరకవని సుమిత్ర అంటుంది. అప్పుడే కార్తీక్, దీప మాట్లాడుతుంటే దశరథ అడ్డుకుంటాడు. వాళ్లిద్దరినీ బయటకు వెళ్లమంటాడు. తన భార్యను చంపుకోలేనంటాడు. కానీ కార్తీక్, దీప మాలిని ఇంటికి వెళ్లారని సుమిత్ర బాంబ్ పేలుస్తుంది.
శివ నారాయణ అపార్థం
మాలిని ఇంటికి ఎందుకు వెళ్లారు? మా కోసం వాళ్లింట్లో ఊడిగం చేస్తావా దీప? అని సుమిత్ర అడుగుతుంది. వీళ్లు రాయబారాలు కూడా మొదలెట్టారా? వాళ్ల కుటుంబం కారణంగా మీ అమ్మ నడక పోగొట్టుకుంది. అసలు ఆ ఇంటి గుమ్మం ఎలా తొక్కగలిగావు? అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. నీ మనవరాలి పెళ్లి ఆగిపోతే నీకు కోపం రాదేమో, కానీ నా మరదలు పెళ్లి ఆగిపోతే నాకు కోపం వస్తుంది. సూరజ్ గురించి తెలుసుకుందామని మనిషిలా వెళ్లానని కార్తీక్ చెప్తాడు.
కార్తీక్, దీపపై నిందలు
మా మమ్మీ శత్రువు నాకూ శత్రువే అని జ్యోత్స్న మరోసారి చెప్తుంది. గెలిచిన ఆనందంలో మాలిని ఫోన్ చేసిందని సుమిత్ర అంటుంది. వాళ్లను గెలిపించిన వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా అని శివ నారాయణ అంటాడు. మేం సూరజ్ ను నమ్మడం తప్పా? మోసపోవడం తప్పా? మంచివాడని అనుకున్నా. ముంచేవాడని తెలిస్తే నమ్ముతానా? అని కార్తీక్ అడుగుతాడు. కానీ శివ నారాయణ మాత్రం అవేమీ పట్టించుకోకుండా కార్తీక్, దీప పై నిందలు వేస్తూనే ఉంటాడు.
నేను సూరజ్ ను మర్చిపోలేను. కానీ వాడి వెంట పడను అని చెప్పి జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. కార్తీక్, దీపను ఇంటి నుంచి వెళ్లిపోమ్మని చేతులు జోడిస్తాడు శివ నారాయణ. ఇది కేవలం అపార్థం మాత్రమే తాత. ఈ మనవడి నిజాయతీ తెలిసే రోజు కోసం వెయిట్ చేస్తానని కార్తీక్ వెళ్లిపోతాడు.
కొత్తగా సూరజ్
మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర సూరజ్ ప్రవర్తన చూసి మాలిని షాక్ అవుతుంది. పనోళ్లను కూడా తమతో పాటు కూర్చుని తినమంటాడు సూరజ్. ఎవరిని ఎక్కడ ఉంచాలో, అక్కడే ఉంచాలని మాలిని చెప్తుంది. మీ తాతకు సొంత కూతురే మోసం చేసింది. పరాయిదాన్ని అయిన నేను మీ తాత కోసం నిలబడ్డానని మాలిని అంటుంది.
మన అనుకున్నంత వాళ్లంతా మనవాళ్లు కాలేరు. మనవాళ్లు ఎవరో మనకు తెలియాలి. నమ్మితే మోసం చేస్తారు. అందుకే ఎవరినీ నమ్మకూడదని మాలిని చెప్తుంటే.. నిన్ను నమ్మాను కదమ్మా అని సూరజ్ దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. సుమిత్ర అత్త సొంతవాళ్లే కదా అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. సూరజ్ ఎప్పటికీ మారడని చెప్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


