Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-పగ కోసం భర్తనే చంపుకొన్న మాలిని-కార్తీక్, దీపను వెళ్లిపొమ్మన్న శివనారాయణ
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 31 ఎపిసోడ్ లో మాలిని అసలు రంగు బయటపడుతుంది. తన భర్త చావుకు తానే కారణమని తెలుస్తుంది. కానీ నిజాన్ని దాచి సైకో విలన్ లా బిహేవ్ చేస్తుంది మాలిని. మరోవైపు కార్తీక్, దీపను కంటికి కనిపించొద్దని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన భర్త కృష్ణమూర్తి ఫొటోను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది మాలిని. దశరథ అన్నయ్యను చంపడానికి యాక్సిడెంట్ చేయించా. ఈ పని చేయాల్సింది నువ్వు. కానీ నువ్వు చెల్లి మీద ఉన్న ప్రేమకు కరిగిపోయి క్షమించి వదిలేశావ్. కానీ నేను నీలా చేతకానిదాన్ని కాదని భర్తతో గతంలో మాలిని అంటుంది.

సుమిత్రను వదలను
నా చెల్లి దశరథను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. నాకు కోపం వచ్చి అరిచాను. కానీ తర్వాత ఆలోచించా. దాని బతుకు అది బతుకుందని వదిలేశానని కృష్ణమూర్తి అంటాడు. కానీ నేను అలా వదల్లేను. సుమిత్రను మా అన్నయ్యకు ఇచ్చి చేస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉండేవి. కానీ సుమిత్ర ఆ దశరథను పెళ్లి చేసుకుంది. మా అన్నయ్యను ఛీ కొట్టినట్లే కదా అని మాలిని చెప్తుంది.
సైకో విలన్ మాలిని
దశరథ అన్నయ్యను చంపి సుమిత్రను తీసుకొస్తా. సుమిత్రకు మా అన్నయ్యకు పెళ్లి చేస్తానని మాలిని అంటుంది. ఈ విషయాన్ని వెంటనే మా నాన్నకు చెప్తానని కృష్ణమూర్తి అనడంతో నాకు పగ కంటే ప్రాణం ఎక్కువ కాదని గన్ గురిపెట్టుకుంటుంది మాలిని. సుమిత్రను కోడలిని చేస్తానని మా నాన్నకు మాటిచ్చానని మాలిని చెప్తుంది.
చనిపోతామని బ్లాక్ మెయిల్
కాంచనకు కాళ్లు పోవడానికి కారణం మనమేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నేను నిజం చెప్పి క్షమించమని అడుగుతానని కృష్ణమూర్తి అంటాడు. పెళ్లి చేసుకొని పారిపోయిన చెల్లిని తీసుకొచ్చే దమ్ము లేదు. నేను ఏమైపోయినా పర్వాలేదా? నీ చెల్లి క్షేమంగా ఉంటే చాలు కదా. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. నేను, నా బిడ్డ ఇప్పుడే చనిపోతామని మాలిని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
కృష్ణమూర్తి సూసైడ్
దశరథను బతకనివ్వను. సుమిత్రను తీసుకొచ్చి మా అన్నయ్యకు పెళ్లి చేస్తా. నాకు మీరే సహాయం చేయాలని చెప్పి మాలిని వెళ్లిపోతుంది. మాలిని దశరథను చంపాలనుకున్న నిజం నాన్నకు చెప్తే మాలిని బతకదు. కడుపులో ఉన్న బిడ్డను బతకనివ్వదు. నిజం చెప్పకపోతే నా చెల్లి అన్యాయం అయిపోతుందని బాధపడ్డ కృష్ణమూర్తి సూసైడ్ చేసుకుంటాడు. ఈ రకంగా తన భర్త చావుకు మాలినియే కారణమవుతుంది.
ఈ గతాన్ని మాలిని గుర్తు చేసుకుంటుంది. నీ చెల్లి కారణంగానే నువ్వు చచ్చావని నీ తండ్రిని, కొడుకును నమ్మించడానికి కష్టపడ్డానని మాలిని అనుకుంటుంది. చెల్లెలి గురించి ఆలోచించి ప్రాణం తీసుకున్నావ్. సుమిత్రను వదిలిపెట్టను. నాశనం అయిపోయిన కూతురి జీవితాన్ని చూస్తూ దశరథ, సుమిత్ర కుమిలి కుమిలి ఏడవాలని మాలిని అనుకుంటుంది.
సుమిత్రకు స్ట్రోక్
మరోవైపు సుమిత్రకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటారు. సుమిత్ర షాక్ కు గురైంది. బ్రైన్, హార్ట్ ఎఫెక్ట్ అయ్యాయి. స్ట్రోక్ ఎక్కువైనా, ఆమెను టైమ్ కు తీసుకురాకపోయినా చనిపోయేదే. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. మరోసారి స్ట్రోక్ వస్తే కాపాడటం చాలా కష్టమని డాక్టర్ చెప్పడంతో శివ నారాయణ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది.
కారణం కార్తీక్, దీప
సుమిత్ర ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం కార్తీక్, దీప. అసలు పెళ్లి దాకా ఎలా వచ్చింది? మనం దక్షిణామూర్తి, మాలినిని పూర్తిగా మర్చిపోయాం. గతాన్ని కూడా తలుచుకోలేదు. అలాంటి దక్షిణామూర్తి మొదటిసారి నా ఇంట్లో అడుగుపెట్టడానికి కారణం కార్తీక్. సూరజ్ ఆఫీస్ లో అడుగుపెట్టడానికి కారణం దీప. సూరజ్ ను గుడ్డిగా నమ్మేలా చేశాడని శివ నారాయణ సీరియస్ అవుతాడు.
వెళ్లగొట్టిన శివ నారాయణ
ఏం మాట్లాడాలన్నా జ్యోత్స్నను చూసి మాట్లాడు. పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి జ్యోత్స్న షాక్ లోనే ఉంది. మాట్లాడటం లేదు, ఏడవడం లేదు. కార్తీక్ నీ కారణంగానే జ్యోత్స్న పెళ్లి మూడు సార్లు ఆగిపోయిందని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు. నమ్మకం ఎంత ప్రమాదమో అర్థమైంది. మీ ముఖాలు నేను చూడాలనుకోవడం లేదు. మిమ్మల్ని చూస్తే సుమిత్రకు అంతా గుర్తుకొస్తుంది. తను బతకదు. అమ్మా కాంచన ఇక్కడ నుంచి వెళ్లిపోండని శివ నారాయణ దండం పెడతాడు.
కాంచన, శ్రీధర్, కార్తీక్, దీప అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ల ముఖాలను చూపించొద్దని, కంటికి కనిపించొద్దని శివ నారాయణ అంటాడు. ఇక జ్యోత్స్నను తీసుకొని పారిజాతం ఇంటికి వెళ్తుంది.
అమ్మ దోషిలా కనిపిస్తుందా?
మరోవైపు ఆగిపోయిన పెళ్లి గురించి, గతం గురించి సూరజ్ ఆలోచిస్తుంటాడు. అక్కడ జరిగిన గొడవ, వాళ్లు అన్న మాటలు నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నేనే మీ నాన్న చావుకు కారణమని, నేనే మీ నాన్నను రెచ్చగొట్టి దశరథను చంపేందుకు పంపానని, కాంచన కాళ్లు పోవడానికి కారణం నేనే అని నిందలు వేశారు. ఈ అమ్మ నీకు దోషిలా కనిపిస్తుందా? అని సూరజ్ ను మాలిని అడుగుతుంది.
అమ్మ నువ్వు ఏదైనా తప్పు చేశావా? జరిగిన దాంట్లో నీ తప్పు ఉందా? అని తల్లిని సూరజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలియాలని.. మాలిని పచ్చి అబద్ధాలు చెప్తుంది. సుమిత్రకు సపోర్ట్ గా తాను మాట్లాడానని అంటుంది. మీ అత్త కేసు పెట్టడంతో ఆ బాధతో మీ నాన్న చనిపోయారని మాలిని మొసలి కన్నీరు కారుస్తుంది.
ఈ ప్రపంచంలో నేను నమ్మే వ్యక్తి నువ్వే అమ్మా. నేను మనసులో మోస్తుంది నా తండ్రి చావు, నా తల్లి ప్రేమ మాత్రమే అని సూరజ్ చెప్తాడు.
సూరజ్ ఆట
ఇటు దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ బాధపడతారు. మనల్ని తప్పు చేసినవాళ్లలాగా ఆ సూరజ్ నిలబెట్టాడు. ఇదంతా సూరజ్ ఆట. తప్పు మనదే దీప. మనమే అవకాశం ఇచ్చాం. మంచితనంతో మోసపోయామని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న పెళ్లి బాధ్యతను మన భుజాలపై పెట్టిన కుటుంబమే ఇప్పుడు మనల్ని పొమ్మందని కార్తీక్ ఫీల్ అవుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


