Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. పారుకు భలే అయిందే- మాలిని గతం దాచిన కాంచన- కార్తీక్, దీపకు వార్నింగ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 15 ఎపిసోడ్ లో జ్యోత్స్న, పారిజాతానికి తిక్క కుదురుతుంది. సూరజ్ ను తప్పించాలని అనుకున్న వీళ్లకు షాక్ కలుగుతుంది. మరోవైపు మాలిని ఎంత ప్రమాదకరమైందో కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Published on: Jul 15, 2026, 07:12:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ లో సూరజ్ ను తప్పించడానికి కారు బ్రేక్ ఫెయిల్ చేస్తుంది పారు. కానీ పారు తీసిన గోతిలో తానే పడుతుంది. మరోవైపు మాలిని ఎంత ప్రమాదకరమైందో కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

పారు ఐడియా

పొద్దున పారిజాతం సిటప్స్ చేస్తుంటుంది. ఐడియా వచ్చిందా? అని జ్యోత్స్న వచ్చి అడుగుతుంది. ఐడియా వచ్చింది కానీ చెప్పను, చేసి చూపిస్తానని పారు చెప్తుంది. ఈ పారిజాతం ఐడియానే దాసు కూతురిగా పెరగాల్సిన నిన్ను దశరథ కూతురిని చేసింది. దీపలో అష్టకష్టాలు పడాల్సిన నిన్ను రాజభోగాలు అనుభవించేలా చేసిందని గొప్పలు చెప్పుకుంటుంది పారు.

కారు బ్రేకులు తీసేసి

నాకు మామూలు కష్టాలు లేవు. దీప దగ్గర విలువ లేదు. నాతో ఆడుకుంటున్నారని జ్యోత్స్న వెటకారంగా అంటుంది. సూరజ్ ను ఆపేందుకు ఐడియా చెప్పమని జ్యో మళ్లీ అడిగితే.. చెప్పడం కాదు ఎప్పుడో చేసేశా. కారు బ్రేకులు తీసేశా అని పారు చెప్పగానే జ్యో షాక్ అవుతుంది. ఈ కారుకు బ్రేకులు లేవు, నడిపితే పోతారు. ఆ సూరజ్ ను ఈ కారు డ్రైవ్ చేసేలా చూడాలని పారు, జ్యో సంబరపడిపోతారు.

అమ్మ చాలా బిజీ

మరోవైపు దీప బిజీగా ఫోన్ మాట్లాడుతుంటుంది. మీ అమ్మ చాలా బిజీ అయిపోయిందని శౌర్యతో అనసూయ అంటుంది. మా అమ్మకు నీలా పని లేదంటున్నారా? అమ్మ ఇప్పుడు సీఈఓ. ఏ టూ జెడ్ లోని మూడు అక్షరాలు అని శౌర్య అమాయకంగా చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. కడుపుతో ఉన్న ఆడది సమయానికి ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి కదా. కానీ మాటలు తింటుందని కార్తీక్ కు అనసూయ చెప్తుంది.

కార్తీక్ ప్రేమ

పెద్దమ్మ కాస్త నువ్వే భయం చెప్పాలి. నన్ను మొత్తానికి వదిలేసిందని దీపను కార్తీక్ ఇరికిస్తాడు. 24 గంటలు ఫోన్లోనే ఉంటావంటా కదా, కార్తీక్ బాబు మంచివాడు కాబట్టి సరిపెట్టుకుంటాడని దీపను తిడుతుంది అనసూయ. దీప ఇంటి ముందు వేపచెట్టులాంటిది పెద్దమ్మ. పట్టించుకోకపోయినా ఆరోగ్యాన్ని చూసుకుంటుంది. తన కడుపులో బిడ్డ కంటే నేనే ఎక్కువ అని వెంటనే దీపపై కార్తీక్ ప్రేమ కురిపిస్తాడు.

ఇక చిన్న మరదలు పెళ్లి బాధ్యత మీరే తీసుకున్నారంటా కదా, ఎవరో ఒకరిని చూసి ముడివేయమని కార్తీక్ తో అనసూయ అంటుంది.

పారు, జ్యో డ్రామా

ఇటు సూరజ్ తన రూమ్ నుంచి బయటకు రాగానే పారు, జ్యోత్స్న డ్రామా స్టార్ట్ చేస్తారు. జ్యో కారు ఎక్కి స్టార్ట్ చేస్తున్నట్లు నాటకం ఆడుతుంది. కారు స్టార్ట్ కావడం లేదని గట్టిగా చెప్తుంది. నువ్వేం కంగారుపడకు, మానవత్వం ఉన్నవాళ్లు ఈ చుట్టుపక్కలా ఉంటారని సూరజ్ ను పారు పిలుస్తుంది. అర్జంట్ గా పార్లర్ కు వెళ్లాలని, కారు స్టార్ట్ కావడం లేదని జ్యో అడుగుతుంది.

కారు ఎక్కిన సూరజ్

సూరజ్ కారు స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది. సూరజ్, పారు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. కారు దారిలో ఆగిపోతే ఎలా అని జ్యోత్స్న అడుగుతుంది. ఒక రౌండ్ వేసి రమ్మంటుంది. పారు కూడా కార్లోకి సూరజ్ ను నెడుతుంది. జ్యో రెచ్చగొట్టడంతో సూరజ్ కారు తీసుకొని వెళ్తాడు. సూరజ్ అంబులెన్స్ లోకి ఎక్కడం గ్యారెంటీ అని పారు తెగ సంబరపడిపోతుంది.

మాలిని పులి లాంటిది

మరోవైపు వంటల పోటీ గురించి కార్తీక్, దీపను కాంచన అడుగుతుంది. ఈ పోటీ దక్షిణామూర్తితో అని నాకు తెలుసు. మాలిని వచ్చిందని కూడా నాకు తెలుసు. మాలిని ఎలాంటిదో తన పేరే చెప్తుంది. మా అంటే మ్యానిపులేటర్. మాయ మాటలతో తన పని చేయించుకునే వ్యక్తి అని కాంచన అంటుంది. తన వల్ల ఎవరు నష్టపోయారు అని కార్తీక్ అడుగుతాడు. కానీ కాంచన అసలు విషయం చెప్పదు.

మాలిని పూర్తిగా చంపకుండా సగం ప్రాణంతో వదిలేస్తుంది. మీరు ఆవిడతో జాగ్రత్తగా ఉండండని కార్తీక్, దీపను కాంచన హెచ్చరిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని కార్తీక్ అడిగితే కాంచన చెప్పదు. మాలిని బోనులో ఉన్న పులి లాంటిదే. మీరు మాత్రం చేతులు పెట్టొద్దు. అది ఆకలితో ఉన్న ఆడ పులి. వేటకు బయల్దేరింది. మీరు జాగ్రత్తగా ఉండండని కాంచన చెప్తుంది.

షాకిచ్చిన సూరజ్

ఇక సూరజ్ ఇంకా తిరిగి రాలేదంటే యాక్సిడెంట్ అయి ఉంటుందా? అని పారు, జ్యో మాట్లాడుకుంటారు. అప్పుడే సూరజ్ యమ స్పీడ్ తో రావడంతో జ్యో, పారు షాక్ అవుతారు. బ్రేకులు పడ్డాయా? బండి కండీషన్ లో ఉందా? అని పారు అడుగుతుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏమైందని అడిగితే.. జరిగిన విషయం చెప్తాడు సూరజ్. జ్యోత్స్నను పార్లర్ కు వెళ్లమని కార్తీక్ అంటాడు.

గ్రానీని కూడా కారు ఎక్కిస్తుంది జ్యోత్స్న. పారు భయపడుతూనే ఉంటుంది. బ్రేక్ ఫెయిల్ అయిందని జ్యో అంటుంది. పారు కంగారు పడుతుంది. కారుకు గుద్దేశామంటూ పారు అరుస్తుంది. అప్పుడే చెట్టుకు జ్యోత్స్న ఢీ కొడుతుంది. పారు మెడ విరిగిపోతుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More