కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: వాట్ ఏ ట్విస్ట్.. దీప చేతిలో జ్యోత్స్న బతుకు.. బెల్ నొక్కగానే మేడం అంటూ.. కండీషన్లతో షాక్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 1 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్న తిక్క కుదిరేలా అందరూ కలిసి ఆటాడుకుంటారు. ముఖ్యంగా శివ నారాయణ పెట్టిన కండీషన్లకు జ్యో ఫ్యూజులు అవుట్ అవుతాయి. దీపకు అసిస్టెంట్ గా జ్యో పనిలో చేరడమే హైలైట్. పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం. 

Published on: Jul 1, 2026, 07:02:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 1 ఎపిసోడ్ లో జ్యోత్స్నను ఓ ఆటాడుకుంటారు. ఛైర్మన్ శివ నారాయణ పెట్టిన రూల్స్ ను విని జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. జ్యోత్స్న తిక్క కుదిరేలా దీప, కార్తీక్ కౌంటర్లు వేస్తారు. ఇంకా ఈ రోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యోత్స్న షాక్

జ్యోత్స్న గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్స్ సీఈఓగా దీప ఛార్జ్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే జ్యోత్స్న కోసం శివ నారాయణ ప్రిపేర్ చేసిన రూల్స్ పేపర్ ను కార్తీక్ చదువుతాడు. అందులో జ్యోత్స్న పోస్టు ‘డీఏ’ అని ఉంటుంది. అంటే.. దీప అసిస్టెంట్ అని కార్తీక్ చెప్పగానే జ్యో, పారు షాక్ అవుతారు.

అకౌంట్లు కూడా లాక్

దీపకు జ్యోత్స్న అసిస్టెంట్ గా ఉండాలి. దీప కంటే ముందే ఆఫీస్ కు రావాలి. దీప వెళ్లిన తర్వాతే వెళ్లాలి. సీఈఓ ఏ వర్క్ ఇస్తే ఆ వర్క్ చేయాలి. కాదు కుదరదు అనకూడదు అని కార్తీక్ చదువుతుంటే జ్యోత్స్న ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఈ రోజు నుంచి జ్యోత్స్నకు కారు, డ్రైవర్ ఇలాంటివి ఏవీ ఉండవు. జ్యోత్స్న అకౌంట్లు అన్ని లాక్ అవుతాయని కార్తీక్ వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తాడు.

ఇంట్లో నుంచి కూడా అవుట్

కంపెనీ నుంచి కానీ పర్సనల్ అకౌంట్ నుంచి కానీ డబ్బులు వాడటానికి వీలు లేదు. అప్పులు, తప్పులు చేయడానికి వీలు లేదు. దీప అసిస్టెంట్ గా పని చేసినందుకు కొంత జీతం వస్తుంది. అది కూడా దీప నిర్ణయిస్తుంది. ఈ నిబంధనలు నచ్చకపోతే జ్యోత్స్న సంస్థ నుంచి వెళ్లిపోవచ్చు. ఆఫీస్ నుంచి వెళ్లిపోతే ఇంట్లో కూడా చోటు లేదని కార్తీక్ చదవడంతో జ్యోత్స్న కంగు తింటుంది.

సింహాసనంపై దీప

మనవరాలికి మరీ ఇంత కఠినమైన శిక్ష ఇవ్వడం దారుణమని శివ నారాయణతో పారిజాతం అంటుంది. పూర్వంలో రాజులు తమ పిల్లలను కష్టలు తట్టుకునేలా పెంచేవారని శివ నారాయణ చెప్తుంటాడు. అది దీపకు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. సింహాసనంపై దీప కూర్చుందని కార్తీక్ అనుకుంటాడు. రూల్స్ నచ్చితే సంతకం పెట్టమని, లేదంటే వెళ్లిపొమ్మని జ్యోత్స్నకు శివ నారాయణ చెప్తాడు. చేసేదేం లేక జ్యో సంతకం పెడుతుంది.

సూరజ్ కౌంటర్లు

దీప అసిస్టెంట్ అనే విషయాన్ని తలుచుకుంటూ జ్యోత్స్న కోపంగా కూర్చుని ఉంటుంది. అప్పుడే వచ్చిన సూరజ్ ఏమో జ్యోకు మరింత మండేలా మాట్లాడతాడు. సీఈఓ గారు ఇలా కూర్చున్నారేంటీ? అరెరె ఇప్పుడు మీరు సీఈఓ డీఏ కదా అని సూరజ్ అంటాడు. ఇది శాశ్వతం కాదని జ్యో అంటే.. నువ్వు ఇలాగే ఉంటే ఇదే శాశ్వతం అవుతుంది. శివ నారాయణ మనవరాలిని అని ఎగిరి పడ్డావు కదా. ఒక తప్పు నీ పొజిషన్ ను, ఒక సంతకం నీ తలరాతనే మార్చేసిందని సూరజ్ గట్టి కౌంటర్లు వేస్తాడు.

రెక్కలు తెగిన పక్షిలా నేల మీద పడ్డావు. నీ అహంకారం, పొగరు, బలుపు నిన్ను నాశనం చేస్తాయని సూరజ్ అంటాడు. మీరు బయట నుంచి వచ్చి నా అధికారాన్ని, స్థానాన్ని లాక్కుంటానంటే ఊరుకుంటానా? నేను పొగరుతోనే బతుకుతా. అదే నా ఐడెంటిటీ అని జ్యో అంటుంది. అప్పుడే సూరజ్ కు కాల్ చేసి జ్యోత్స్నను తీసుకురమ్మంటాడు కార్తీక్.

దీప స్విచ్ నొక్కితే

డీఏ అని పిలవొద్దని కార్తీక్ కు జ్యో చెప్తుంది. కానీ అదే ప్రోటోకాల్ అని కార్తీక్ పదే పదే అలాగే పిలుస్తాడు. సీఈఓ దీప క్యాబిన్ బయట జ్యోకు టేబుల్ సెట్ చేస్తారు. అది చూసి జ్యో మళ్లీ షాక్ అవుతుంది. జ్యోను ఇలా చూడలేక మేనేజర్ వంశీ తెగ ఫీల్ అయిపోతాడు. అయితే టవర్ ఎక్కి దూకమని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. దీప స్విచ్ నొక్కగానే జ్యోత్స్న టేబుల్ మీద ఉన్న బెల్ రింగ్ అవుతుంది. దీపకు అవసరం ఉన్నప్పుడు బెల్ కొడితే జ్యోత్స్న వెళ్లాల్సిందేనని కార్తీక్ చెప్తాడు. దీంతో జ్యోత్స్న బతుకు దీప చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోతుంది.

మేడం అని పిలవాలని

ఈ ఐడియా నేనే ఇచ్చా. సీఈఓ నోటితో పిలిస్తే అలసిపోతారు. అందుకే బెల్ కొడతారని సూరజ్ క్లియర్ గా చెప్తాడు. జ్యోత్స్న చిరాకుగా లేచి వెళ్తుంది. ఎందుకు పిలిచావని అడిగితే, ఈ బెల్ పని చేస్తుందో లేదో అని టెస్ట్ చేశానని దీప అంటుంది. కార్తీక్, దీప బెల్ నొక్కుతూ ఆటాడుకుంటారు. అంతా బాగానే ఉంది కానీ ఒకటి తగ్గిందని దీప అంటుంది. అర్థమైంది మేడం అని పిలవాలని మేడం అని జ్యో అంటుంది.

ఆఫీస్ లో దీప, కార్తీక్, జ్యోత్స్న కూర్చుని లంచ్ చేస్తారు. తినే దగ్గర అందరూ ఒక్కటేనని జ్యోకు సాంబారు వడ్డిస్తుంది దీప. అప్పుడు దీప మెడలోని తాళి చూసి జ్యో గతాన్ని తలుచుకుని కుళ్లుకుంటుంది. ఈ తాళి నా మెడలో పడి ఉంటే ఈ సంస్థకు ఛైర్మన్ గా ఉండేదాన్ని అని జ్యో అనుకుంటుంది. అప్పుడు జ్యో స్పూన్ కింద పడిపోతే కార్తీక్ స్పూన్ తీసుకుంటుంది. వెంటనే ఆగవే అని దీప అరుస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More