కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఈ సూరజ్ మామూలోడు కాదు-తాళం వేసిన జ్యోత్స్నకే చుక్కలు-వీడియోతో చెక్-ఫుడ్ డెలివరీలో ట్విస్ట్!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 19 ఎపిసోడ్ లో జ్యోత్స్నకు సూరజ్ షాక్ ల మీద షాక్ లు ఇస్తాడు. వీడియో రికార్డ్ చేసి, విసనకర్రతో సేవలు చేయించుకుంటాడు. జ్యో తాళం వేసినా ఫుడ్ డెలివరీకి వెళ్లిపోతాడు. కానీ చివర్లో ఓ ట్విస్ట్ తో సూరజ్ కంగుతింటాడు.
Karthika Deepam 2 Today Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజుకో ఉత్కంఠభరిత మలుపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కార్తీక దీపం 2 టుడే జూన్ 19 ఎపిసోడ్‌లో జ్యోత్స్న, సూరజ్ మధ్య సాగిన మైండ్ గేమ్ అదిరిపోయింది. దీప ఎదుగుదలను చూసి పారిజాతం రగిలిపోవడం, లాస్ట్‌లో డెలివరీకి వెళ్లిన సూరజ్‌కు ఊహించని షాక్ తగలడం ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

విసనకర్రతో జ్యోత్స్న సేవలు
తనతో చేతులు కలపమని ఇచ్చిన ఆఫర్‌కు సూరజ్ ఒప్పుకోవడంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. "ఎలా నమ్మాలి?" అని జ్యోత్స్న అడగ్గా, తన ఫోన్ ఇచ్చి వీడియోలన్నీ డిలీట్ చేసుకోమంటాడు. వీడియోలు డిలీట్ చేయగానే జ్యోత్స్న తన అసలు రంగు బయటపెడుతుంది. కాలు మీద కాలు వేసుకుని పొగరుగా.. "ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నేను చెప్పినట్లే వినాలి" అని వార్నింగ్ ఇస్తుంది.
సూరజ్ మాస్టర్ మైండ్!
కానీ, అక్కడే సూరజ్ అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాడు. తన కెమెరా ఆన్ చేసి, వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్ అవుతున్నట్లు చూపించి జ్యోత్స్న మైండ్ బ్లాక్ చేస్తాడు. "నువ్వు నన్ను కొనలేవు బేబీ.. ఈ విసనకర్ర తీసుకుని గాలి విసురు, గాలి ఆగిందో ఆ వీడియో పెద్దాయన దగ్గరకు వెళ్తుంది" అని బెదిరిస్తాడు.
చేసేదేం లేక జ్యోత్స్న విసనకర్రతో విసురుతుండగా.. "థ్యాంక్స్ బేబీ, ఐ లవ్ యూ బంగారం" అని సెటైర్లు వేస్తూ సూరజ్ నిద్రపోతాడు. వెంటనే సూరజ్ ఫోన్లను బియ్యం డబ్బాలో దాచిపెట్టి, రూమ్‌కు తాళం వేసి జ్యో వెళ్లిపోతుంది. 'ఫుడ్ డెలివరీకి ఎలా వెళ్తావో చూస్తా' అని మనసులో కుళ్లుకుంటుంది.
ఆ రాక్షసికి పెళ్లి చేయాలంటూ!
మరోవైపు దీపకు ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆమె ఆరోగ్యం పట్ల కార్తీక్ ఆందోళన వ్యక్తం చేస్తాడు. దీప తన ఫ్రెండ్ సరిత కథ చెబుతూ.. "మన కోసం కన్నవాళ్లు ఏం చేశారన్నది కాదు, వాళ్ల కోసం మనం ఏం చేశామన్నదే ముఖ్యం" అని ఎమోషనల్ అవుతుంది. జ్యోత్స్న గురించి మాట్లాడుతూ.. "ఆమె రాక్షస గుణాలతో పుట్టినట్లుంది, ఆ రాక్షసి పీడ వదలాలంటే ఈ యుద్ధంలో మనం గెలిచి కంపెనీని లాభాల్లోకి తేవాలి. ఆమెకు పెళ్లి చేసి పంపించేయాలి బావ" అంటుంది. ఆ రాక్షసిని మార్చే మనసున్నోడు ఎక్కడున్నాడో అని కార్తీక్ నవ్వుతాడు.
పారిజాతానికి షాక్!
ఇక జ్యోత్స్న చూసుకుంటున్న రెస్టారెంట్ బ్రాంచ్ 30 శాతం లాభాల్లో ఉందని దశరథ చెప్పగానే పారిజాతం తెగ సంబరపడిపోతూ, అదంతా తన తాత పోలిక అని డబ్బా కొట్టుకుంటుంది. ఇంతలో "మన పని మనిషి బ్రాంచ్ పరిస్థితి ఏంటి?" అని పారు అడగ్గా సుమిత్ర, దశరథ సీరియస్ అవుతారు. దీపను పనిమనిషి అనొద్దని వార్నింగ్ ఇస్తారు.
"దీప బ్రాంచ్ మైనస్ 10 నుంచి ప్లస్ 10కి వచ్చింది. ఈరోజు వచ్చిన పెద్ద ఆర్డర్ డెలివరీ అయితే ఏకంగా 60 శాతం గ్రోత్ సాధిస్తుంది" అని దశరథ చెప్పడంతో పారిజాతానికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. "ఈ అనాథ కూడా ఏ ఉన్నోడి బిడ్డో కావొచ్చు కదా" అని దశరథ అన్న మాటలు ముందు ముందు రాబోయే పెద్ద ట్విస్ట్‌కు హింట్‌లా అనిపిస్తాయి.
సూరజ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్!
దీప ఫుడ్ ప్రిపేర్ చేసి క్వాలిటీ చెక్ చేస్తుంది. డెలివరీ బాధ్యతను సూరజ్‌కు అప్పగిస్తుంది. అటువైపు జ్యోత్స్న.. సూరజ్ రూమ్ దగ్గరకు వెళ్లి తాళం అలాగే ఉండటం చూసి మురిసిపోతుంటుంది. కట్ చేస్తే.. డెలివరీ ట్రక్ దగ్గర నుంచి సూరజ్ వీడియో కాల్ చేసి జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. "నా పేరు సూరజ్.. అంటే సూర్యుడు. తాళం వేసి వెలుగును ఆపలేవు డియర్, ఆల్ ది బెస్ట్ చెప్పు" అని కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు.
లాస్ట్‌లో భారీ ట్విస్ట్
చివరి సీన్‌లో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. పెద్ద ఆర్డర్ డెలివరీ చేయడానికి కస్టమర్ చెప్పిన లొకేషన్‌కు వెళ్లిన సూరజ్‌కు అక్కడ పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ ఆ ఆర్డర్ ఇచ్చిన 'బాలరాజు' అనే వ్యక్తే ఉండడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మరి అసలు ఆ ఆర్డర్ పెట్టింది ఎవరు? దీప 60% గ్రోత్ సాధించకూడదనే కుట్రతో పారిజాతం లేదా జ్యోత్స్న ఈ ఫేక్ ఆర్డర్ డ్రామా ఆడారా? ఈ నష్టాన్ని దీప, కార్తీక్ ఎలా ఎదుర్కొంటారు? అనేది రేపటి ఎపిసోడ్‌లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


