కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అర్ధరాత్రి జ్యోత్స్నను పాల గ్లాస్‌తో పిలిపించిన సూరజ్.. తనతో కలిసిపొమ్మన్న జ్యో.. ట్విస్ట్!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 18 ఎపిసోడ్ లో దీపకు కళ్లు తిరగడంతో కార్తీక్ కంగారు పడతాడు. దీపను తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు జ్యోతో సూరజ్ ఆడుకుంటూనే ఉంటాడు. అర్ధరాత్రి పాలు తీసుకొని రమ్మంటాడు. సూరజ్ ను తనతో కలిసిపొమ్మని జ్యో ఆఫర్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 18 ఎపిసోడ్ లో కథ ఊహించని మలుపులు తిరిగింది. ఒకవైపు దీప ఆరోగ్యంపై కార్తీక్ ఆందోళన పడుతుంటే.. మరోవైపు జ్యోత్స్నను సూరజ్ బ్లాక్‌మెయిల్ చేయడం ఈరోజు ఎపిసోడ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. జ్యో పాల గ్లాస్ తో సూరజ్ దగ్గరకు వెళ్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దీపకు లో బీపీ.. కార్తీక్ కేర్!
పెద్ద ఆర్డర్ ప్రిపేర్ చేయాలని దీప తీవ్రంగా ఆలోచిస్తుండగా ఆమెకు కళ్లు తిరుగుతాయి. అది గమనించిన కార్తీక్.. తరచుగా నీళ్లు తాగాలని డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాడు. లో బీపీ ఉండటం వల్ల సాల్ట్ వాటర్ తెచ్చి దీపకు ఇచ్చి తాగమంటాడు. ఇంతలో సూరజ్ ఏమో పులావ్, బిర్యానీ క్వాలిటీ తాను చెక్ చేస్తానని.. కార్తీక్‌ను దీపతో పాటు ఇంటికి వెళ్లమని చెప్తాడు.
జ్యో ప్లాన్
అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జ్యోత్స్న.. "మరి నా కారు డ్రైవర్‌గా నువ్వు ఉంటావా సూరజ్? మా బావ నాతోనే ఉండాలి" అని గొడవ పడుతుంది. కానీ కార్తీక్ ఏమాత్రం తగ్గకుండా, డ్రైవర్లు కూడా ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకోవచ్చని కారు కీస్ జ్యోత్స్న చేతిలో పెట్టి షాక్ ఇస్తాడు. తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో.. దీప, కార్తీక్‌లను దెబ్బకొట్టేందుకు జ్యోత్స్న మనసులోనే మరో పెద్ద ప్లాన్ వేస్తుంది.
ఆఫీస్‌లో సూరజ్ ఆటలు..
మరో సీన్ లో ఆఫీస్‌లో ఉన్న జ్యోత్స్న, సూరజ్ ఒకరినొకరు చూసుకుంటారు. లంచ్ టైమ్‌లో వర్క్ ఏంటని శివ నారాయణ అడగ్గా.. జ్యోత్స్న రెస్టారెంట్ నుంచే ఫుడ్ తెప్పించి తినేశానని సూరజ్ చెప్తాడు. అప్పుడే జ్యోత్స్నకు పిజ్జా ఆర్డర్ వస్తుంది. ఆ పిజ్జా ఆర్డర్ చేసింది సూరజ్ అని తెలిసి జ్యో షాక్ అవుతుంది. "మన రెస్టారెంట్ ఫుడ్ మనమే తినకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది" అని సూరజ్ అంటాడు.
దానికి జ్యోత్స్న కూడా తెలివిగా.. "వేరే రెస్టారెంట్ ఫుడ్ తింటేనే కదా క్వాలిటీ, ప్రైస్ తెలిసేది" అని బదులిస్తుంది. శివ నారాయణ అక్కడి నుంచి వెళ్లగానే సూరజ్ మళ్లీ జ్యోత్స్నను ఆటపట్టించడం మొదలుపెడతాడు. జ్యోత్స్న చేత్తో ఇచ్చిన పిజ్జా ముక్క తినగానే తన చేతి నొప్పి పోయిందని ఆఫీస్ బాయ్ ముందు సూరజ్ అనడంతో జ్యోత్స్న నోరెళ్లబెడుతుంది.
కాంచన వార్నింగ్..
ఇక దీపను నాలుగు రోజుల పాటు ఎక్కడికీ వెళ్లొద్దని కాంచన గట్టిగా చెప్తుంది. ఎక్కువ సేపు వాటర్ తాగకపోవడం వల్లే ఇలా జరిగిందని దీప అంటుంది. ఇంతలో సుమిత్ర ఫోన్ చేసి దీప ఆరోగ్యం గురించి అడగ్గా.. కాంచన కాస్త సీరియస్‌గా సమాధానం ఇస్తూ, దీప రేపటి నుంచి ఆఫీస్, రెస్టారెంట్‌కు రాదని చెబుతుంది. కార్తీక్ వెంటనే ఫోన్ తీసుకుని పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
పాల గ్లాస్‌తో అర్ధరాత్రి జ్యోత్స్న
మరోవైపు సూరజ్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే విషయాన్ని పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న. సూరజ్ దగ్గర ఆ వీడియో ఉండటం వల్లే ఆడుకుంటున్నాడని అంటుంది. దీనికి పారు స్పందిస్తూ.. "దీప, కార్తీక్ కలిసి మనకు పెద్ద గొయ్యి తవ్వుతున్నారు. వాళ్లను దెబ్బ కొట్టాలంటే సూరజ్ ను నీ వైపు తిప్పుకోవాలి" అని ఐడియా ఇస్తుంది.
వెంటనే జ్యోత్స్న ఫోన్ నుంచి సూరజ్ కు పారు కాల్ చేయగా.. జ్యో కట్ చేస్తుంది. మిస్డ్ కాల్ చూసి సూరజ్ మళ్లీ కాల్ బ్యాక్ చేస్తాడు. "నా నిద్ర పాడుచేశావ్. ఐదు నిమిషాల్లో వచ్చి సారీ చెప్పకపోతే ఆ వీడియో పెద్దాయనకు పంపిస్తా. వచ్చేటప్పుడు పాలు తీసుకురా" అని జ్యోకు ఆర్డర్ వేస్తాడు.
జ్యో డీల్
తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోత్స్న అర్ధరాత్రి పాల గ్లాస్ పట్టుకుని సూరజ్ దగ్గరకు వెళ్తుంది. అక్కడే జ్యోత్స్న అసలు ప్లాన్ బయటపెడుతుంది. "దీప సీఈఓ అయితే ఇద్దరికీ లాభం లేదు. నాతో చేయి కలుపు, నేను సీఈఓ అవుతా. నువ్వు దీపతోనే ఉంటూ నా కోసం పని చెయ్" అని డీల్ మాట్లాడుతుంది. ఆ డీల్‌కు సూరజ్ నవ్వి.. "నీ డీల్ నాకు నచ్చింది బేబీ" అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగిసింది.
మరి సూరజ్ నిజంగానే జ్యోత్స్న వైపు మారాడా? లేక జ్యోత్స్న, పారిజాతాలకు ఇంకా పెద్ద షాక్ ఇవ్వడానికి నాటకమాడుతున్నాడా? అనేది రాబోయే ఎపిసోడ్‌లలో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


