కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సూరజ్ ట్విస్ట్- జ్యోత్స్నకు మైండ్ బ్లాక్- ఆ వీడియోతో గేమ్ రివర్స్- జ్యోకు మొగుడు అవుతాడా?

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 15 ఎపిసోడ్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. ఔట్ హౌజ్ లోకి సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. రౌడీలతో జ్యోత్స్న ప్లాన్ చేసిన విషయాన్ని వీడియోతో బయటపెడతాడు. దీంతో జ్యోత్స్న మైండ్ బ్లాక్ అవుతుంది. జ్యోకు సూరజ్ మొగుడు అవుతాడా అని పారు డౌట్ పడుతుంది.

Published on: Jun 15, 2026, 07:05:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జ్యోత్స్న వేసిన ప్లాన్ ఆమెకే రివర్స్ అవ్వగా, ఔట్ హౌజ్‌లో అడుగుపెట్టిన సూరజ్ ఆమెకు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాడు. అసలు సూరజ్ కిడ్నాప్ వెనుక ఏం జరిగింది? జ్యోత్స్నను సూరజ్ ఎలా భయపెట్టాడో కార్తీక దీపం 2 టుడే జూన్ 15 ఎపిసోడ్‌లో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ ట్విస్ట్

సూరజ్ ను ఇంటికి తీసుకొస్తాడు శివ నారాయణ. తమ ఔట్ హౌజ్ లో ఉండమని చెప్తాడు. సూరజ్ ఇబ్బంది పడతాడని జ్యోత్స్న అడ్డుకోవాలని చూస్తుంది. కానీ తాత వినడు. కానీ సూరజ్ ఏమో తాను ఇక్కడ ఉండలేనని ట్విస్ట్ ఇస్తాడు. నా బాధ్యత మీరు తీసుకోవడం నాకు నచ్చడం లేదు సార్ అని సూరజ్ చెప్తాడు.

జ్యోత్స్నకు షాక్

ఇది బాధ్యత కాదు సాయం మాత్రమే. ఎన్నాళ్లు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. నచ్చకపోతే వెళ్లిపోవచ్చని శివ నారాయణ చెప్తాడు. కానీ సూరజ్ మొహమాటపడతాడు. అప్పుడే కార్తీక్ మాట్లాడి సూరజ్ ను ఔట్ హౌజ్ లో ఉండేలా ఒప్పిస్తాడు. సూరజ్ ఓకే చెప్పడంతో జ్యోత్స్నకు షాక్ తగులుతుంది. ఔట్ హౌజ్ లో అడుగుపెట్టిన దీప ఏమో కార్తీక్ కు పెళ్లమైంది, మరి ఈ సూరజ్ దీపకు మొగుడు కాడు కదా అని పారిజాతం అనుకుంటుంది.

సూరజ్ ను పంపించేయాలని

నైట్ కాగానే పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. రౌడీలతో కొట్టించావ్ కదా, ఆ తర్వాత సూరజ్ ను వదిలేయాల్సిందని పారు చెప్తుంది. మాణిక్యాన్ని తీసుకొచ్చి మన ఇంట్లోనే క్యారెక్టర్ లేని మనిషిలా నన్ను నిలబెట్టాడు. ఎలా వదిలేయాలని జ్యో పొగరుగా అంటుంది. కానీ రౌడీ వెధవలు నీకు ఎందుకు రివర్స్ అయ్యారని పారు అడుగుతుంది. సూరజ్ ను త్వరగా పంపించేయాలని జ్యోత్స్న అంటుంది.

భోజనానికి అందరూ రెడీ అవుతారు. సూరజ్ ను భోజనానికి రమ్మని కాల్ చేస్తాడని శివ నారాయణ అంటాడు. అతనికి భోజనం ఏంటీ? సాయం చేసినంత మాత్రాన మా ప్రైవసీ గురించి ఆలోచించరా? అని జ్యోత్స్న అడుగుతుంది. అతను నిన్ను కాపాడాడు. ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉండాలి కదా అని సుమిత్ర అంటుంది. చివరకు భోజనం ఇచ్చి వద్దామని డిసైడ్ అవుతారు. జ్యో ఏమో తానే ఇస్తానంటుంది.

దీప తల్లి అయినట్లు

మరోవైపు కార్తీక్ ఇంట్లో కూడా అందరూ భోజనాలు చేస్తారు. మన ఇంట్లో కూర్చుని భోజనం చేసే తృప్తి ఎక్కడున్నా రాదు. ఎంతైనా మనది కాని ఇల్లు పరాయి ఇల్లే. పెళ్లి తర్వాత అమ్మాయికి పుట్టిల్లు కూడా పరాయి ఇల్లే అని కాంచన అంటుంది. ఆ ఇల్లు వదిలిపెట్టి రావడానికి దీప తెగ బాధ పడింది. మా వదిన ఏమో దీప తల్లి అయినట్లు, మా అన్నయ్య దీప తండ్రి అయినట్లు ఫీల్ అవుతుందని కాంచన అంటుంది.

తాతకు ఫోన్

దీపకు పుట్టిల్లు లేదు కాబట్టి కనిపించని అమ్మానాన్నలను అత్త, మామయ్యలో చూసుకుంటుంది. ఆ ఇల్లే పుట్టిల్లు అనుకుంటుందని కార్తీక్ చెప్తాడు. అప్పుడే నాన్న ఫోన్ చేశాడా? అని తల్లిని కార్తీక్ అడుగుతాడు. తాతకు నానమ్మ మెసేజ్ లు చేయడం, ఫోన్లో మాట్లాడటం చూశానని శౌర్య అసలు విషయం బయటపెడుతుంది. దీని స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏమోనని కాంచన లోపలికి వెళ్లిపోతుంది. సూరజ్ ను ఔట్ హౌజ్ లో ఉన్నమన్న సంగతిని దీపకు కార్తీక్ చెప్తాడు.

సూరజ్ డ్రామా

మరోవైపు సూరజ్ కోసం జ్యోత్స్న భోజనం తీసుకెళ్తుంది. అక్కడ గెంతుతూ వంట చేసుకుంటున్న సూరజ్ ను చూసి జ్యో షాక్ అవుతుంది. నేను చూస్తుంది నిజమేనా?విరిగిపోయిన కాళ్లు, చేతులు ఏమయ్యాయని జ్యో అడుగుతుంది. వెంటనే చేతికి పట్టీ వేసుకుని, కర్ర పట్టుకుంటాడు. ఇవన్నీ డ్రామాలా అని జ్యో అంటుంది. వెంటనే ఆగవే అంటూ సూరజ్ కోప్పడతాడు.

కిడ్నాప్ ట్విస్ట్

ఏంట్రా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నావ్. ఆ రౌడీలు నీ కాలు విరగ్గొట్టారు కదా అని జ్యో అడుగుతుంది. అదంతా డ్రామానే అని సూరజ్ అనగానే జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వు రౌడీలను నన్ను వేసేయమని పంపించావ్. మీకు డబ్బులు కావాలా? నా ప్రాణాలు కావాలా? అని అడిగా. జ్యోత్స్న కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పా. కిడ్నాప్ డ్రామాలో ఫైట్ సెట్ చేశానని సూరజ్ ట్విస్ట్ రివీల్ చేస్తాడు.

జైలుకు పంపిస్తానని

ఇంత మోసగాడివా అని జ్యోత్స్న అంటుంది. మోసాల గురించి నువ్వు మాట్లాడకూడదు బేబీ అంటూ సూరజ్ కౌంటర్ ఇస్తాడు. నా జోలికి ఎవరైనా వస్తే లైఫ్ లో వదిలిపెట్టను. నువ్వు నన్ను మాటలతో, మనుషులతో, చేత్తో కొట్టావ్. నేను బయట ఉంటే మళ్లీ రౌడీలను పంపిస్తావ్. అదే నీ కాంపౌండ్ లో ఉంటే ఏం చేయలేవని సూరజ్ అంటాడు. వెంటనే ఈ నిజాన్ని మా నాన్నకు చెప్తా. జైలుకు పంపిస్తా. నీ ఛాప్టర్ క్లోజ్ అని జ్యో తెగ రెచ్చిపోతుంది.

వీడియోతో మైండ్ బ్లాక్

అప్పుడే శివ నారాయణ మనవరాలు జ్యోత్స్న మేడం సూరజ్ ను కొట్టమన్నారు. లేపేయమన్నారని రౌడీ చెప్తున్న వీడియోను సూరజ్ చూపిస్తాడు. జ్యోకు మరో షాక్ తగులుతుంది. ఈ వీడియోను మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేస్తానని సూరజ్ చెప్పడంతో జ్యో నోరు మూసుకుంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More