కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:వాట్ ఏ ట్విస్ట్! ఇంట్లో నుంచి వెళ్లేలా దీపను దెబ్బకొట్టిన జ్యోత్స్న-మనవరాలివి కాదని తాత షాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 12 ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. మారిపోయినట్లు డ్రామా ఆడిన జ్యోత్స్న.. దీపను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా దెబ్బ కొడుతుంది. అసలు జ్యో తన మనవరాలు కాదని శివ నారాయణ షాకిస్తాడు. చివర్లో రౌడీలతో సూరజ్ ఫైట్ చేస్తాడు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 11 ఎపిసోడ్ లో.. పొద్దున్నే అందరిని హాల్లోకి పిలిచి జ్యోత్స్న మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నా. కాంపిటేషన్లో ఎలాగైనా గెలవాలనుకున్నా. అందుకే తప్పు చేశా. దానివల్ల సంస్థకు చెడ్డపేరు వస్తుందని అనుకోలేదని జ్యోత్స్న చెప్తుంది.

దీపకు సారీ
దీపకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నానని జ్యోత్స్న అనగానే అందరూ షాక్ అవుతారు. కార్తీక్ ఏకంగా గుండె పట్టుకుంటాడు. సారీ దీప అని జ్యోత్స్న చెప్తుంది. నేను చేసిన మరో తప్పు కూడా ఉంది. ముందు దాన్ని సరిచేసుకోవాలి. కాంపిటేషన్ పేరుతో భార్యాభర్తలను విడగొట్టా. అది ఎంత పాపమో ఇప్పుడు అర్థమైందని జ్యో అంటుంది. ఇది కల కాదుగా అని దీపతో గిల్లించుకుంటాడు కార్తీక్.
ఇంటికి వెళ్లిపొమ్మని
నేను పెట్టిన కండీషన్ ను వెనక్కి తీసుకుంటున్నా. బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్లొచ్చు. రాత్రంతా నేను మా మమ్మీ గురించే ఆలోచించా. నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు తప్పులు చేయకూడదు. బావ నువ్వు అత్తను, దీపను తీసుకొని వెళ్లిపోవచ్చని జ్యోత్స్న మళ్లీ చెప్తుంది. అగ్రిమెంట్ గురించి కాంచన అడిగితే.. నా పెళ్లి అయ్యేంతవరకూ అది అలాగే ఉంటుందని జ్యో అంటుంది.
దీపకు జ్యోత్స్న సారీ చెప్పకపోయి ఉంటే నేను తీసుకున్న నిర్ణయం ఏంటో చెప్పేవాడిని అని శివ నారాయణ వెళ్లిపోతాడు. ఇలా తెలివిగా సారీ చెప్పి శిక్ష నుంచి జ్యోత్స్న తప్పించుకుంటుంది. నా వల్ల ఇంకా ఎవరికీ ప్రాబ్లం ఉండదని జ్యో అంటుంది. తనలో నేను కోరుకున్న మార్పు మొదలైందని సుమిత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
పారు పార్టీ ఛేంజ్
అందరూ వెళ్లిపోయాక పారుతో కార్తీక్ మాట్లాడతాడు. పారూ, ఏంటీ పార్టీ మార్చేశావని కార్తీక్ అడుగుతాడు. నా మీద అనుమానం రాకూడదనే అటు వైపు సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తున్నానని పారు అబద్దం చెప్తుంది. మరోవైపు తన తల్లికి దూరం చేసేలా జ్యోత్స్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ దీప ఫీల్ అవుతుంది.
జ్యోత్స్న తప్పించుకుందని
ఇప్పుడు కూడా అదే గెలిచింది. జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకుంది. నన్ను క్షమించండి అనే మాటతో అందరి కోపాన్ని పోగొట్టింది. నన్ను మా అమ్మకు దూరం చేసిందని కార్తీక్ తో దీప చెప్తుండగా జ్యోత్స్న వస్తుంది. మీరందరూ కలిసిపోతుంటే చూస్తూ ఉండాలా? ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసని జ్యో అంటుంది. దీన్ని ఎత్తుకు పై ఎత్తు అనరు మరదలా.. మంచితనాన్ని మోసంతో గెలవడం అంటారు అని కార్తీక్ అర్థమయ్యేలా చెప్తాడు.
మీరూ మోసగాళ్లే. దాసు కూతురిని అని తెలిసినా తెలియనట్లే ఉన్నారు కదా అని జ్యో అంటుంది. మీ అమ్మ నీతో దీప నా కడుపున పుట్టి ఉంటే బాగుండేదని అన్న ఒక్క మాటతో ఇక్కడే ఉందామని అనుకున్నావ్ అని దీపతో జ్యో మాట్లాడుతుంది. అందుకే కదా మారిపోయినట్లు నటించావ్ అని దీప అంటే, ఇంకా నటిస్తానని జ్యో పొగరుగా చెప్తుంది.
దీప సుమిత్ర కూతురా?
మళ్లీ దీపను ఈ గుమ్మం కూడా తొక్కనివ్వను. ఈ ఇంటి వారసురాలిగా ఎప్పటికీ ఉండేది నేనే అని జ్యో అంటుంది. నా భార్య అనాథగా కాదు, సుమిత్ర అత్త కూతురిగా ఇక్కడే ఉంటుందని కార్తీక్ అంటుండగా శివ నారాయణ వస్తాడు. తాతను చూసి అందరూ షాక్ అవుతారు. ఏంట్రా అన్నావ్? దీప సుమిత్ర కూతురిగానే ఉంటుందా? అని శివ నారాయణ అడుగుతాడు. దీప అనాథ కాదు, తను నా బిడ్డలాగే అని సుమిత్ర అత్త చెప్పిందనే మాటను మార్చి చెప్తాడు కార్తీక్.
మనవరాలివి కాదు
జ్యోత్స్న, శివ నారాయణ ఒకే కారులో వెళ్తుంటారు. నువ్వు నా మనవరాలివి కాదు అని శివ నారాయణ అనగానే మైండ్ బ్లాక్ అయిన జ్యోత్స్న సడెన్ గా కారు ఆపుతుంది. నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. నిన్ను మెడ పట్టుకుని గెంటేయాలి. కొన్ని నెలలుగా నీ ప్రవర్తన తేడాగా ఉంది. అసలు నువ్వు ఎవరివి? ఈ శివ నారాయణ వారసత్వానికి నువ్వు ఊపిరివి. నా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాలి. కానీ నువ్వు ఇలాగేనా ఉండేదా? అని తాత అనగానే జ్యోత్స్న రిలీఫ్ అవుతుంది.
రౌడీల ఎంట్రీ
నువ్వు నీ భర్తతో కలిసి నా వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకోవాలి. దీని కోసం పోరాడాలి, గెలవాలి. నువ్వు తప్పు చేస్తే అందరికంటే ఎక్కువగా శిక్షిస్తానని శివ నారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న రౌడీలు కారు దగ్గరకు వచ్చి నమస్కారం పెడతారు. వీళ్లెవరూ అని శివ నారాయణ అడుగుతాడు. జ్యో కంగారుగా కారు దిగి కంగారుగా రౌడీలతో మాట్లాడుతుంది.
సూరజ్ ఫైటింగ్
మీరు చెప్పిన పని అయిపోయింది. సూరజ్ ఇక మీకు కనబడడు. మాకు రూ.50 లక్షలు కావాలి. మీరు ఇవ్వకపోతే, మీ తాత దగ్గర తీసుకోవాల్సి ఉంటుందని జ్యోను రౌడీలు బెెదిరిస్తారు. జ్యోను కారెక్కించాలని చేతులు పట్టుకుంటారు. అది చూసి నా మనవరాలిని వదలమంటూ శివ నారాయణ వస్తే రౌడీలు తోసేస్తారు. అప్పుడు సూరజ్ వచ్చి వాళ్లతో ఫైట్ చేస్తాడు. సూరజ్ కాలు మీద కొట్టి రౌడీలు పారిపోతారు.
మరోవైపు సూరజ్ కాల్ కలవట్లేదని దీప కంగారు పడుతుంది. సూరజ్ కాలికి గాయమైందని శివ నారాయణ జరిగిన విషయం చెప్తాడు. ఆ రౌడీలను వైరా పంపించాడేమోనని శివ నారాయణ అంటాడు. ఇక్కడతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


