కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సూపర్ ట్విస్టులు, ఏకమైన శత్రువులు- జ్యోత్స్నకు దీప చెంపదెబ్బ-దీపకు పార్టనర్‌గా సూరజ్ ఎంట్రీ
Karthika Deepam 2 Serial June 5th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 5వ ఎపిసోడ్‌లో ట్విస్టులు అదిరిపోయాయి. మేనేజర్ వంశీ చేసిన తప్పును కనిపెట్టి దీప కాలర్ పట్టుకుని నిలదీస్తుంది. బోర్డ్ మీటింగ్‌లో జ్యో బ్రాంచ్ లాభాల్లో, దీప బ్రాంచ్ నష్టాల్లో ఉందని దశరథ్ చెబుతాడు. దీపకు పార్టనర్‌గా సూరజ్ వస్తాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో జ్యోత్స్న, దీప ఎవరి వర్క్ వారు చూసుకుంటారు. దీంట్లో ఇన్ని తప్పులు పెట్టుకుని ఈ ఫైల్‌ను ఛైర్మన్ గారికి ఎలా పంపించాలనుకున్నావని జ్యోని అంటాడు కార్తీక్. ఇంట్లో ఏం జరగనట్లు భలే ఉన్నావ్ బావ అని జ్యోత్స్న అంటుంది.

మీరే చదువుకోండి
కొన్ని గుర్తు పెట్టుకోకపోవడమే మంచిదని కార్తీక్ అంటాడు. ఇంతలో మేనేజర్ వంశీ వచ్చి ఛైర్మన్ గారు సంతకం పెట్టమన్నారని ఓ ఫైల్ దీపకు ఇస్తాడు. ఇదివరకు వంశీ చేసింది గుర్తు చేసుకున్న దీప డౌట్ పడుతుంది. ఇది ఇంగ్లీషులో ఉంది. చదివి చెప్పండని దీప అంటుంది. మీకు ఈ ఫైల్ అర్థం కాకుంటే ఛైర్మన్ దగ్గర తిట్లు తినేది నేను. మీరే చదువుకోండి అని మేనేజర్ అంటాడు.
కార్తీక్ వెళ్లబోతుంటే చేయి పట్టుకుని ఆపుతుంది కార్తీక్. వంశీతో తప్పు ఎవరు చేయించారో తనకు తెలుసు అని, చీకట్లో మొహం కనపడట్లేదన్న ధైర్యంతో చేస్తారు. కానీ, అన్ని నిజం బయటపడుతుందని కార్తీక్ అంటాడు. అది ఎప్పటికీ జరగదు. నేను వెలుగును మింగేసే రాహువును అని జ్యో అంటే.. గ్రహణం విడిపోయే రోజు త్వరలోనే ఉందని కార్తీక్ అంటాడు.
వంశీనే చదవమంటుంది దీప. మీరు ముందు మార్చాలన్నారుగా. స్టాఫ్‌ని కూడా. అది అవసరం లేదని ఇందులో రాసి ఉందని వంశీ అంటాడు. ఇది నిజమని ఎలా నమ్మాలని దీప అనుకుంటుంది. మరోసారి బకరా అయ్యేందుకు సిద్ధంగా ఉండమని జ్యో అనుకుంటుంది. అటెండర్ నానిని పిలిచి ఇంగ్లీషులో ఉంది చదవమంటాడు కార్తీక్.
యాప్‌తో కార్తీక్ హెల్ప్
తనకు చదవరాదని చెబితే.. ఈ మధ్య కొన్ని యాప్స్ వచ్చాయి. ఇంగ్లీషులో ఉన్నది తెలుగులో చూపిస్తుంది. తెలుగు చదవస్తే చాలు అని కార్తీక్ అంటాడు. అది ఎలా ఓపెన్ చేయాలో, ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలో కార్తీక్ నానికి చెబుతాడు. దీప అలాగే చేస్తుంది. ఇంతే ఇంగ్లీష్ ఏం బ్రహ్మవిద్య కాదు అని కార్తీక్ అంటాడు. దానికి దీప మనసులో, నాని బయటకు థ్యాంక్స్ చెబుతారు.
ఇప్పుడు ఏ ఎధవని నమ్ముకోకుండా పని చేసుకోవచ్చు అని వంశీనే ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు కార్తీక్. అలా దీపకు కార్తీక్ సహాయం చేస్తాడు. ట్రాన్స్‌లేట్ చేసి చూసిన దీప మరోసారి ఏముందో చెప్పమంటాడు. ఇప్పుడు మాట మారుస్తాడు. దాంతో మేనేజర్ వంశీ కాలర్ పట్టుకున్న దీప ఇందాక వేరేలా ఎందుకు చెప్పావ్. ఎందుకు మాట మార్చావ్. నీతో ఇలా ఎవరు చేయిస్తున్నారు అని నిలదీస్తుంది.
దాంతో జ్యోత్స్న మేడమ్ అని మేనేజర్ వంశీ చెబుతాడు. దాంతో కోపంగా వెళ్లిన దీప ఇలా మోసం చేసి ఎన్నాళ్లు గెలుస్తావే అని ఆఫీస్‌లో అందరిముందు జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది. అవమానంతో రగిలిపోయిన జ్యోత్స్న తిరిగి చూస్తుంది. కానీ, దీప అక్కడే వంశీ కాలర్ పట్టుకుని ఉంటుంది. అదంతా జ్యో ఊహించుకుంటుంది. ఈ వెధవ నిజం చెబుతాడా అని భయపడుతుంది జ్యోత్స్న.
క్షమించమన్న వంశీ
నేనే ఇలా చేశాను అని వంశీ అంటాడు. పద మేనేజర్ దగ్గరికి అని దీప అంటే.. తప్పుగా అర్థం చేసుకున్నాను మేడమ్. క్షమించండి అని వంశీ అనడంతో దీప వదిలేస్తుంది. మీ టైమ్ బాగుంది. ఇప్పుడు బోర్డ్ మీటింగ్ ఉందని కార్తీక్ జ్యోతో అంటాడు. నా టైమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు ఆపలేరని జ్యో వెళ్లిపోతుంది.
నువ్వేంటో చూపించే టైమ్ వచ్చిందని దీపతో కార్తీక్ అంటాడు. అంతా బోర్డ్ మీటింగ్‌లో కూర్చుంటారు. వీరికి అప్పగించిన బ్రాంచ్ గ్రోత్ గురించి దశరథ్ చెబుతాడు. రెండు రోజుల్లో 10 శాతం గ్రోత్ కనిపించిందని చెప్పడంతో అంతా చప్పట్లు కొడతారు. దీపది మాత్రం మైనస్ 10లో ఉందని చెబుతాడు దశరథ్. మంచి ఆర్డర్ పోయిందిగా. అది వచ్చుంటే 20 శాతం గ్రోత్ ఉండేది. దీపను తీసేసి జ్యోకి సీఈఓ పదవి ఇవ్వమని బోర్డ్ మెంబర్ అంటాడు.
దానికి అతనికి కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. దీపకున్న సమస్య ఏంటో తెలుసుకోవాలంటాడు కార్తీక్. అది చెప్పమని అంతా అడుగుతారు. సపోర్ట్ ఉంటేనే కొంతమంది మాట్లాడగలరని జ్యో వెటకారంగా అంటుంది. కంపెనీ నడిపించడంలో నాకు ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. నేను ఇప్పటివరకు ఒంటరిగానే సాధించాను. ప్రత్యర్థి ఎలాంటి వారైన ఓటమిని ఒప్పుకోను అని దీప అంటుంది.
తలకు కట్టుతో సూరజ్ ఎంట్రీ
దానికి అంతా చప్పట్లు కొడతారు. నాకు భాషా పరంగా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ఒక మనిషి కావాలి. జ్యోత్స్నకు కార్తీక్ గారు సహాయంగా ఉన్నారు, మేనేజర్ ఉన్నారు. నాతో ఎవరున్నారు అని దీప అంటుంది. దానికి జ్యోత్స్న సరేనని కాకపోతే తన అసిస్టెంట్‌ను తనే వెతుక్కోవాలి. దానికి ఎవరు హెల్ప్ చేయకూడదు. 5వ తరగతి చదివిన తనకు మూడో క్లాస్ చదివిన వాళ్లే వస్తారని జ్యో అంటుంది.
నేను ఆల్రెడీ ఒకరితో మాట్లాడాను అని దీప అంటుంది. అతన్ని రమ్మనమని శివ నారాయణ చెబుతాడు. దాంతో చేతికి కట్టులతో సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి జ్యో అవాక్కవుతుంది. ఈ ట్విస్ట్ అదిరిపోతుంది. చేతికి కట్టు చూసి శివ నారాయణ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని అడిగితే కాదు కలిసి పనిచేయడానికి అని సూరజ్ అంటాడు.
నేను చెప్పిన మనిషి ఇతనే అని దీప చెబుతుంది. రాగానే జ్యోత్స్నకు కౌంటర్స్ ఇస్తాడు సూరజ్. దీపతో కలిసి పనిచేసేందుకు లక్షల్లోనే జీతం అడుగుతావ్. అసలే ఆవిడ బ్రాంచ్ నష్టాల్లో ఉంది. నీలాంటి వాడికి లక్షల్లో ఇచ్చి ఇంకా నష్టాలు తేలేదు. నువ్వు వెళ్లొచ్చు అని జ్యోత్స్న అంటుంది.
సాలరీ ఇస్తే జాబ్ చేయను
నేను సాలరీ అడిగానని ఎవరు అన్నారు. సాలరీ ఇస్తే జాబ్ చేయననే అంటాను అని సూరజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. దీపగారితో పని చేయడం వల్ల నాకు బెన్‌ఫిట్ ఉంది. దీప గారి బ్రాంచ్‌లో నా ఫుడ్ కోర్ట్ పెట్టుకునేందుకు ప్లేస్ ఇచ్చారు. మీల్స్ మీ దగ్గర తింటారు. జ్యూస్ నా దగ్గర తాగుతారు. ఇద్దరికి బెన్‌ఫిట్ ఉందని సూరజ్ అంటాడు.
శభాష్ దీప నీ తెలివితేటలు అమోఘం అని శివ నారాయణ మెచ్చుకుంటాడు. దానికి అంత చప్పట్లు కొడతారు. ఇదంతా బావే చేశాడు. నా శత్రువును గెలిపించడానికి మరో శత్రువును తీసుకొచ్చాడు అని జ్యో అనుకుంటుంది. ఈరోజు నుంచే రెస్టారెంట్ గురించి నువ్వు, సూరజ్ కలిసి పనిచేయాలని శివ నారాయణ అంటాడు. తర్వాత సూరజ్‌ను గాయాలేంటని దశరథ్ అడుగుతాడు.
కార్తీక్ కూడా నిజం చెప్పమంటాడు. నా శత్రువులను ఏకం చేసింది గాక నేను చేసింది ఒక్కోటి బయటపెడుతున్నారా అని జ్యో అనుకుంటుంది. రాత్రి ఇంటికి వెళ్తుంటే కుక్కలు వెంటపడ్డాయని సూరజ్ అంటాడు. ఆ కుక్కలను పంపించినవాళ్లదే తప్పు. అది ఎవరో తెలుసుకుని వాళ్లకే బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని సూరజ్ అంటాడు.
వంశీతో పని చేయించిన సూరజ్
మీటింగ్ పూర్తయిందని శివ కనారాయణ చెబుతాడు. సూరజ్ లాంటోడు మన వ్యాపారంలో ఉన్న మాటను భలే నిజం చేశావురా అని కార్తీక్‌ను తాత అంటే.. అదంతా దీపదే. తనే వెతుక్కుందని. తనకే థ్యాంక్స్ చెప్పమని కార్తీక్ అంటాడు. సూరజ్‌కు దీప ఫైల్స్ చూపిస్తుంది. బాగా మండుతున్నట్లుంది. ఆది పరాశక్తికి త్రిశూలం తోడైనట్లుందని కార్తీక్ అంటాడు.
మేనేజర్ వంశీని పిలిచి గ్రూప్‌లో మేసెజ్ పెట్టాను. అది టైప్ చేసి తీసుకురండని సూరజ్ చెబుతాడు. మీరే టైప్ చేసుకోండని వంశీ అంటే.. మీరెందుకు ఉన్నారు. కాఫీలు, టిఫిన్స్ అందివ్వడానికా అని పంచ్ ఇస్తాడు సూరజ్. దాంతో సరేనని వంశీ వెళ్లిపోతాడు. అలా మేనేజర్‌తో కూడా పని చేయిస్తాడు సూరజ్.
కార్తీక్ కాఫీ తాగేందుకు వెళ్తున్నాను అని హింట్ ఇస్తే దీప కూడా వెళ్లిపోతుంది. జ్యోత్స్ను సూరజ్ అలాగే చూస్తుంటాడు. జ్యోత్స్నకు షాక్‌ల మీద షాక్ తగులుతాయి. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


