కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: షాక్ ఇచ్చిన దక్షిణామూర్తి- దీపను ఇరికించిన జ్యోత్స్న- నిలదీసిన కాంచన-సుమిత్రకు అన్న కూడా!

Karthika Deepam 2 Serial June 4th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 4వ ఎపిసోడ్‌లో సుమిత్ర పుట్టినరోజుకు దక్షిణామూర్తి వచ్చి షాక్ ఇస్తాడు. శివ నారాయణ దక్షిణామూర్తి వాదించుకుంటారు. దీప చెప్పడంతోనే దక్షిణామూర్తి వచ్చాడని జ్యోత్స్న గట్టిగా ఇరికిస్తుంది. దాంతో దీపను కాంచన నిలదీస్తుంది.

Published on: Jun 4, 2026, 07:53:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర పుట్టినరోజు సందర్భంగా పాపకు జన్మనిచ్చిన తల్లి ఫొటోను డ్రాయింగ్‌లా ఇస్తుంది దీప. అది చూసి సుమిత్ర మురిసిపోతుంటే పారిజాతం తెగ భయపడిపోతుంది. పుట్టినప్పుడు పిల్లలను మార్చడం గురించి తలుచుకుని భయపడిపోతుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 4 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 4 ఎపిసోడ్

డ్రాయింగ్ వేయమంది అమ్మే

శౌర్యను డ్రాయింగ్ వేసినందుకు తలపై ముద్దు పెట్టి మెచ్చుకుంటుంది. ఈ డ్రాయింగ్ వేయమని చెప్పింది అమ్మే. తనకు ముద్దుపెట్టు అని శౌర్య అనడంతో సుమిత్ర కూతురు దీపకు ముద్దు పెట్టి థ్యాంక్స్ చెబుతుంది. నా పుట్టినరోజు నాడు నేను అమ్మగా పుట్టిన క్షణాన్ని అమ్మగా ఇచ్చారు. ఇంతకన్నా గొప్ప కానుక ఇంకేముంటుందని సుమిత్ర అంటుంది.

చాలా ఎమోషనల్‌గా సంతోషంగా ఫీల్ అవుతూ తను బిడ్డకు జన్మనివ్వడం గురించి చెబుతుంది. ఈరోజు అమ్మగా పుట్టినట్లుందని మరోసారి దీపకు థ్యాంక్స్ చెబుతుంది సుమిత్ర. ఈ ఆనందాన్ని ఎంతోసేపు ఉంచకూడదనుకుంటుంది జ్యోత్స్న. ఈ డ్రాయింగ్‌లో ఏదో మిస్టేక్ ఉందని జ్యోత్స్న తీసుకోబోతుంటే పేపర్ కిందపడుతుంది. అక్కడికి దక్షిణామూర్తి తలకు కట్టుతో వచ్చి షాక్ ఇస్తాడు.

అతన్ని చూసి అంతా అవాక్కవుతారు. డ్రాయింగ్ చూస్తుంటాడు. వీళ్లు నిజంగానే దక్షిణామూర్తిని పిలిపించారు అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. డ్రాయింగ్ ఎవరు వేశారని అడుగుతాడు దక్షిణామార్తి. దానికి శౌర్య సమాధానాలు ఇస్తుంది. శౌర్యను లోపలికి తీసుకెళ్లమని పారుతో కోపంగా అంటాడు శివ నారాయణ. పారు తీసుకెళ్తుంది.

రావడానికి 2 కారణాలు

నా ఇంటికి ఎందుకొచ్చావని శివ నారాయణ అంటే నేను రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకోడానికి అని దక్షిణామూర్తి అంటాడు. రక్తం ఇవ్వడం, స్నేహం గురించి ఇద్దరు వాదించుకుంటారు. మీ మనవడు, మనవరాలికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి పది కాలాలపాటు సంతోషంగా జీవించాలని దీవిస్తాడు దక్షిణామూర్తి.

నువ్వు పాములాంటివి. నీ ఆశీర్వాదాలు కూడా విషం లాంటివని, వెళ్లిపోమ్మని శివ నారాయణ అంటాడు. నేను వచ్చిన రెండో కారణం చెప్పలేదని, డ్రైవర్‌ను పిలిచి ఈరోజు నా కూతురు పుట్టినరోజు అని, గుడికి వెళ్లి పూజ చేయించుకొచ్చానని దక్షిణామూర్తి అంటాడు. ఎందుకీ నాటకాలు. ఇన్నేళ్లలో నా పుట్టినరోజులు ఎన్నో జరిగాయి. ఏనాడైనా ఈ కూతురు గుర్తుకు వచ్చిందా అని సుమిత్ర ఫైర్ అవుతుంది.

మన కుటుంబాల మధ్య అగ్గి రాజుకోడానికి కారణం నేనే కావచ్చు. కానీ, తగలబెట్టింది ఎవరు నువ్వు కాదా అని శివ నారాయణను అంటాడు దక్షిణామార్తి. నీతిలేని మాటలు మాట్లాడకు. నీకు నీ కొడుక్కి అని శివ నారాయణ అంటాడు. నీ అన్నను అంటే మౌనంగా ఉంటావేంటని దక్షిణామూర్తి సుమిత్రను అంటే.. తండ్రే లేడనుకున్నప్పుడు తోడబుట్టినవాడు ఎలా ఉంటాడని సుమిత్ర అంటుంది.

ఎడం కాలితో తన్నారు

అలా సుమిత్రకు ఓ అన్న కూడా ఉన్నాడని తెలుస్తుంది. నువ్వు అనుకున్నంత తేలిగ్గా బంధాలు తెగిపోవని దక్షిణామూర్తి అంటాడు. తెంపేసుకుంది, చంపేసుకుంది మీరు. ఆరోజు అహంకారంతో కళ్లు మూసుకుపోయి అయినవాళ్లందరిని ఎడం కాలితో తన్నారు. ఈరోజు అవే బంధాలు కావాలని మళ్లీ అడుగుతున్నారు అని కాంచన కోప్పడుతుంది.

అవి చంపేసుకుంది మీరు. అందుకే ఇన్నేళ్లయిన రాత్రి విగ్రహాల్లా ఉన్నారు. నా కూతురు పుట్టినరోజుకు వచ్చాను అని దక్షిణామూర్తి అంటే.. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కూతురు చచ్చినరోజును అని సుమిత్ర అంటుంది. అలాంటి మాటలు వద్దని దక్షిణామూర్తి అంటాడు. తన తండ్రి ప్రేమ గురించి చెబుతాడు. నువ్వు చనిపోయావని తలనీళ్లు పోసుకున్న ఆ గుమ్మంలోనే పసుపు నీళ్లు చల్లి నిన్ను ఆహ్వానిస్తున్నా, దా అమ్మా పుట్టింటికి వెళ్దామని దక్షిణామూర్తి అంటాడు.

నాకు పుట్టిల్లు అయిన, మెట్టిల్లు అయినా ఇదేనని గట్టిగా చెబుతుంది సుమిత్ర. రగులుతున్న పర్వతంలాంటి నీ మనసు మార్చే రోజు వస్తుంది. అక్షింతలు వేసి వెళ్లిపోతాను అని దక్షిణామూర్తి వేయబోతుంటాడు. ఎవరికి కావాల్రా నీ అక్షింతలు అని చేతిని పైకి అంటాడు శివ నారాయణ. అయినా అక్షింతలు సుమిత్ర తలపై పడతాయి.

ఇప్పుడైనా చనిపోవాలని దీవించావా

ఏమని దీవించావు నాన్న చనిపోవాలనుకున్న మనిషి ఇంకా బతికుంది. ఇప్పుడైనా చనిపోవాలనా అని సుమిత్ర అంటుంది. నీ మామ చేసినదానికి నేను ఏం చేశాను. నేను నిజాలు మాట్లాడితే నా ముందు నిలబడలేవు శివ నారాయణ అని దక్షిణామూర్తి అంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడిది అని దక్షిణామూర్తిపైకి వెళ్తాడు శివ నారాయణ.

కార్తీక్ ఆపుతాడు. నన్ను రెచ్చగొట్టడానికి కాకపోతే ఈ మనిషి ఎందుకు వచ్చాడని శివ నారాయణ అంటే.. ఆయనంతటా రాలేదని, పిలిస్తేనే వచ్చాడని, దీపనే పిలిచిందని జ్యోత్స్న అంటుంది. దీప నువ్వు పిలిచావా అని కాంచన అడిగితే దీప చెప్పబోతుంది. జ్యోత్స్న నిజం చెప్పమంటుంది.

కార్తీక్ కలుగజేసుకుని ఏంటీ చెప్పేది. దీపంటే బాగా వెటకారంగా అయిపోయిందని అంటాడు. మీరిద్దరి ఈ పెద్ద మనిషి గురించి మాట్లాడుకున్నారా లేదా. ఈ మనిషి వస్తే బాగుంటుందని బావతో అన్నావా లేదా అని జ్యోత్స్న అంటే.. అన్నాను అని దీప అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఈ మనిషిని ఎలా పిలవాలనుకున్నావ్ అని అత్త కాంచన నిలదీస్తుంది.

దీప గొప్పతనం

వాళ్లతో కలిసిపోయిందని జ్యో అంటే దీప కోప్పడుతుంది. ముందు అత్త అడిగినదానికి చెప్పమని జ్యో అంటుంది. సమాధానం దీప కాదు నేను చెబుతాను దీప పిలిస్తేనే, కార్తీక్ పిలిస్తేనో నేను రాలేదు. నా అంత నేనే వచ్చాను. నా కూతురి కోసం వచ్చాను. నిజంగా దీపకు పిలవాలనిపిస్తే అది తన గొప్పతనం. కానీ, నేను ఒకరు రమ్మంటే రాను, ఒకరు పొమ్మంటే పోను. ఇది నా ప్రాణ స్నేహుతుడు శివ నారాయణ ఇల్లు. నా కూతురు అత్తారిల్లు. నేను ఎప్పుడైనా వస్తాను అని దక్షిణామూర్తి అంటాడు.

ఇంకోసారి వస్తే మర్యాద చేతల్లో ఉంటుందని శివ నారాయణ అంటాడు. ఏదో ఒక రోజు నీచేత్తోనే విందు భోజనం వడ్డిస్తావ్ అని దక్షిణామూర్తి కూతురు సుమిత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. నీ రాకకోసం ఎదురుచూస్తున్నామని చెప్పి వెళ్లిపోతాడు దక్షిణామూర్తి. సుమిత్ర ఏడుస్తుంటే శివ నారాయణ ఓదారుస్తాడు.

జరిగింది ఇక్కడితో వదిలేసేయండని చెప్పి సుమిత్రను కేక్ చేయమని శివ నారాయణ అంటాడు. అమ్మకు అన్నయ్య, వదిన కూడా ఉన్నారని దీప అంటే.. ఆ కుటుంబం గురించి మాట్లాడకపోవడమే మంచిది. లేకుంటే ఈ కుటుంబానికి కూడా దూరమవుతాం అని కార్తీక్ హెచ్చరిస్తాడు.

దీప తప్పించుకుంది

శౌర్య వచ్చి ఇంకో తాత ఏడి అని అడుగుతుంది. అతను బయటి వ్యక్తి. అలా పిలవకూడదని దశరథ్ చెప్పడంతో సరేనంటుంది శౌర్య. దక్షిణామూర్తి చెప్పడంతో దీప తప్పించుకుందని జ్యోత్స్నతో పారు అంటుంది. ఆఫీస్‌లో చూసుకుంటానని జ్యో అంటుంది. సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. సుమిత్రకు అంతా కేట్ తినిపిస్తారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More