కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: మేనేజర్‌తో కలిసి జ్యోత్స్న కుట్ర-బలైపోయిన దీప-ఆఫీస్ నుంచి వెళ్లమంటూ శివ నారాయణ ఫైర్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 2 ఎపిసోడ్ లో మేనేజర్ తో కలిసి జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. దీంతో దీప ఓ పెద్ద ఆర్డర్ ను రిజెక్ట్ చేస్తుంది. ఈ విషయం తెలిసి దీపపై శివ నారాయణ ఫైర్ అవుతాడు. ఆఫీస్ నుంచి వెళ్లిపొమ్మంటాడు. అదే సమయంలో సూరజ్ సాయం కోసం దీప వెళ్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ దీపను సీఈఓ రేసు నుంచి తప్పించేందుకు మేనేజర్ తో కలిసి జ్యోత్స్న కుట్ర పన్నుతుంది. ఈ మేరకు దీపకు వచ్చిన మెయిల్ లో ఉన్న విషయాలను మార్చి చదువుతాడు మేనేజర్ వంశీ. మరి ఏం జరిగిందో పూర్తి వివరాలు కార్తీక దీపం 2 టుడే జూన్ 2 ఎపిసోడ్ లో చూసేయండి.

దీపకు మెయిల్
సూరజ్ స్టాల్ నుంచి ఆఫీస్ కు వెళ్లిన జ్యోత్స్న జరిగింది తలుచుకుంటూ రగిలిపోతుంది. జ్యూస్ ఇవ్వమంటారా? అని అడిగిన మేనేజర్ వంశీపై జ్యో మండిపడతుంది. కార్తీక్ ఏమో జరిగింది వెటకారంగా చెప్తాడు. అప్పుడే దీపకు మెయిల్ వస్తుంది. అది ఓపెన్ చేసి, ఫుడ్ ఆర్డర్ వచ్చింది మేడం అని వంశీ చెప్తాడు. మనం ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నామని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ప్లేట్ రూ.60కే
350 మందికి రోజూ లంచ్ ఆర్డర్ కానీ ప్లేటు రూ.60కే ఇవ్వాలని అడుగుతున్నారని మేనేజర్ వంశీ ఎక్స్ ప్లెయిన్ చేస్తాడు. రూ.60కే ఎలా అని దీప ఆలోచిస్తుంది. మన రెస్టారెంట్ కు జనాలు వచ్చేది క్వాలిటీ కోసమే. ఈ రేటుకు ఇవ్వలేమని చెప్పండని దీప వంశీకి చెప్పేస్తుంది.
శివ నారాయణ ఫైర్
మరోవైపు శివ నారాయణకు ఫోన్ వస్తుంది. వెంటనే సీఈఓలను, కార్తీక్, మేనేజర్ ను రమ్మనమని శివ నారాయణ సీరియస్ గా ఆఫీస్ బాయ్ కు చెప్తాడు. అందరూ వస్తారు. శాండల్ వుడ్ మీడియా నుంచి ఆర్డర్ వచ్చిందా అని శివ నారాయణ అడుగుతాడు. వచ్చిందని దీప చెప్తుంది. నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లే ఇచ్చామని మేనేజర్ చెప్తాడు. వెంటనే అతని చెంప చెళ్లుమనిపిస్తాడు శివ నారాయణ.
కార్తీక్ షాక్
మీరు కంపెనీని బాగు చేయడానికి ఉన్నారా? లేదా నాశనం చేయడానికా? అని శివ నారాయణ ఫైర్ అవుతాడు. శాండల్ వుడ్ మీడియా ఎంత పెద్ద కంపెనీరా? అలాంటి పెద్ద ఆర్డర్ వస్తే మన కంపెనీ నష్టాల నుంచి బయటపడుతుంది అని శివ నారాయణ మండిపడతాడు. దీప మేడం చెప్పిందే చేశానని వంశీ చెప్తాడు. అవును, నేనే వద్దన్నానని దీప చెప్పడంతో శివ నారాయణ, కార్తీక్ షాక్ అవుతారు.
మేనేజర్ తో కుట్ర
కంపెనీ పెద్దదే అయి ఉండొచ్చు. కానీ ప్లేట్ మీల్స్ రూ.60కే అడిగారు. నాణ్యత లేకపోయినా పర్వాలేదన్నారని దీప చెప్తుంది. కానీ దీప అబద్ధం చెప్తుందని వంశీ ప్లేటు ఫిరాయిస్తాడు. దీప ఎందుకు అబద్ధం చెప్తుందని కార్తీక్ అడిగితే.. నువ్వు ఎందుకు బావ ఇన్వాల్వ్ అవుతున్నావని జ్యోత్స్న మధ్యలోకి వస్తుంది. నిరూపించుకునేందుకు నా దగ్గర సాక్ష్యం ఉందని కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ ను దీప చూపిస్తుంది.
రచ్చ రచ్చ
ఆ మెయిల్ లో ప్లేట్ రూ.60కి కాదు రూ.160 ఉందని కార్తీక్ చెప్తాడు. మేనేజర్ చదివి రూ.60 ఉందని చెప్పాడని దీప మరోసారి వివరిస్తుంది. కానీ తాను రూ.160 అని చదివానని మేనేజర్ మళ్లీ అబద్ధం చెప్తాడు. ప్లేట్ రూ.200 అంటేనే ఆర్డర్ చేయమని దీప చెప్పింది. రూ.60కి రూ.160కి తేడా తెలియకపోతే ఏం చేయమంటారని మేనేజర్ అనగానే అతని కాలర్ ను దీప పట్టుకుంటుంది. దీపను జ్యోత్స్న నెట్టేస్తుంది.
దీపపై సీరియస్
మీరు మీరు కొట్టుకోవడం బాగానే ఉంది. కానీ నా వ్యాపారం, నమ్మకం పోతుంది. శాండిల్ వుడ్ మీడియా ప్రొప్రైటర్ ఫోన్ చేసి లైఫ్ లో మీకు ఆర్డర్ ఇవ్వమని చెప్పేశారని శివ నారాయణ కోప్పడతాడు. నీకు డౌట్ వస్తే మమ్మల్ని అందరినీ అడగాలి. కానీ ఆఫర్ వద్దని ఎలా చెప్తావ్? సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే నీ గౌరవం ఏమైనా తగ్గిపోతుందా? చూస్తుంటే కంపెనీని దివాళా తీయించేలా ఉన్నారని శివ నారాయణ ఫైర్ అవుతాడు.
అదే సమయంలో వంశీని చూసి జ్యోత్స్న సైగ చేస్తుంది. జ్యోత్స్న మనిషా అని కార్తీక్ అనుకుంటాడు. ఇంత పెద్ద తప్పు చేసిన దీపకు సీఈఓగా ఉండే అర్హత లేదని జ్యో అంటుంది. శివ నారాయణ కూడా అదే అంటాడు. దీపను బయటకు పంపించేయమంటాడు. కానీ దీప అడగడంతో మరో ఛాన్స్ ఇస్తాడు. అందరూ బయటకు వెళ్తారు.
జ్యోత్స్న నాటకం
ఇదంతా జ్యోత్స్న ఆడించిన నాటకమని దశరథ, కార్తీక్ అంటారు. ఇప్పుడు నీకొక మనిషి అవసరం. ఒకరిని పని చేసేందుకు నియమించుకో. నమ్మకమైన మనిషిని పెట్టుకో అని దీపకు కార్తీక్, దశరథ చెప్తాడు. సీన్ ఇంటికి మారుతుంది. జ్యోత్స్న, పారిజాతం సంతోషంతో ఎగిరెగిరి పడతారు. ఈ కార్పొరేట్ ప్రపంచంలో బలంతో కాదు తెలివితో పోటీపడాలి. బావ కాళ్లు చేతులు కట్టేసి నా పక్కన కూర్చోబెట్టుకున్నానని జ్యో అంటుంది. అప్పుడే నోరు కట్టేయలేదని కార్తీక్ వచ్చి షాక్ ఇస్తాడు.
కార్తీక్, జ్యోత్స్న ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటారు. దీప ఓటమిని ఒప్పుకోదని చెప్తాడు కార్తీక్. దీప ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలని జ్యో వెళ్లిపోతుంది.
సూరజ్ ను కలిసిన దీప
మరోవైపు సూరజ్ ను దీప కలుస్తుంది. నాకు సాయంగా ఉంటారా? నాతో కలిసి పని చేస్తారా? అని దీప అడుగుతుంది. నేను ఒక దగ్గర పని చేయలేనని సూరజ్ చెప్తాడు. ఇది రెండు వారాల పోటీ మాత్రమే. మీకు నచ్చకపోతే వెళ్లిపోవచ్చని దీప అంటుంది. కానీ సూరజ్ ఒప్పుకోడు. సూరజ్ ను దీప కలవడం జ్యోత్స్న చూస్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


