కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న మైండ్ బ్లాక్ చేసిన సూరజ్..బిర్యానీలో బొద్దింక డ్రామా అట్టర్ ప్లాప్.. జ్యో టెన్షన్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 9 ఎపిసోడ్ లో.. జ్యోత్స్నకు సూరజ్ అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. జ్యో కుట్రను అతను బయటపెడతాడు. రెస్టారెంట్ ను సీజ్ చేసే పరిస్థితి నుంచి కాపాడతాడు. అసలు కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చదివేయండి.

Published on: Jun 9, 2026, 06:54:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీపతో కలిసి సూరజ్ పని చేయడం.. దక్షిణామూర్తి గురించి శివ నారాయణ చెప్పడం.. సీఈఓ రేసు కోసం పోటీతో కథ రసవత్తరంగా సాగుతోంది. కార్తీక దీపం 2 టుడే జూన్ 9 ఎపిసోడ్ లో జ్యోత్స్న కుట్రను సూరజ్ అడ్డుకుంటాడు. రెస్టారెంట్ సీజ్ చేయకుండా కాపాడతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ ఫోకస్

ఆఫీస్ లో మరోసారి జ్యోత్స్న వర్సెస్ సూరజ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. జ్యోత్స్నను అలాగే చూస్తుంటాడు సూరజ్. అది చూసి జ్యో కంగారు పడుతుంది. అలా ఎందుకు చూస్తున్నావంటే.. ఫోకస్ చేస్తున్నానని సూరజ్ చెప్తాడు. ఇక్కడ మహిళలపై వేధింపులను అస్సలు సహించం. కంప్లైంట్ ఇస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని జ్యో అంటుంది. అయినా తన ఫోకస్ కరెక్ట్ గానే ఉందని సూరజ్ చెప్తాడు.

టైమ్ స్టార్ట్

నన్ను గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నావని జ్యో అడుగుతుంది. మీరు అనుకోవడం కాదు, చూస్తున్నానని నేను అనుకోవాలి. నేను మిమ్మల్ని చూడటం లేదు. మీ వెనకాల ఉన్న వాల్ క్లాక్ ను చూస్తున్నా. ఇప్పటివరకూ మీ టైమ్ రన్ అయింది. ఈ సారి నా టైమ్ స్టార్ట్ అయిందనిపిస్తోందని సూరజ్ చెప్తాడు. నా పనులు పక్కనపెట్టి ఫోకస్ చేస్తే మసి అయిపోతావని జ్యో అంటున్నా.. సూరజ్ పట్టించుకోడు.

ఆ ఫ్యామిలీ వద్దు

మరోవైపు కాఫీ తాగుతూ దక్షిణామూర్తి గురించి శివ నారాయణ చెప్పిన మాటలను దీప, కార్తీక్ గుర్తు చేసుకుంటారు. మా నాన్న, అమ్మల పెళ్లికి దక్షిణామూర్తి ఒప్పుకొంటే అయిపోయేదని దీప అంటుంది. ఇప్పుడు జ్యోత్స్నకు కూడా తాను ఎవరో తెలిసింది కదా. కానీ నిజం ఒప్పుకొని మారిపోలేదు కదా అని కార్తీక్ చెప్తాడు. నా తండ్రి చావు కోరుకున్నా ఆ ఫ్యామిలీ నాకు కూడా అవసరం లేదని దీప క్లియర్ గా చెప్పేస్తుంది.

వర్క్ మీద ఫోకస్ చేయ్ దీప. నువ్వు ఈ కంపెనీకి సీఈఓ కావాలని కార్తీక్ అంటాడు. సూరజ్ ను జ్యోత్స్న ఉండనీయదేమోనని దీప అంటే, సూరజ్ ఏం మామూలోడు కాదని కార్తీక్ చెప్తాడు. జ్యోకు సూరజ్ సరైనోడని అంటాడు. కాఫీ తాగి కార్తీక్, దీప వెళ్తారు. మనకు చిన్న చిన్న ఆర్డర్లు వచ్చాయని దీపకు సూరజ్ చెప్తాడు. వాటిని వదలొద్దంటాడు.

బ్రాంచ్ లో గొడవ

అప్పుడే దీపకు మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. బ్రాంచ్ లో గొడవ జరుగుతుందని దీప కంగారు పడుతుంది. కార్తీక్ కూడా వస్తానంటే జ్యోత్స్న వెళ్లనివ్వదు. అది మొత్తం జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు సంబంధించిందని కార్తీక్ చెప్తే, అయితే తాను కూడా వస్తానని జ్యో వెళ్తుంది.

బిర్యానీలో బొద్దింక

అందరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్తారు. వెజ్ బిర్యానీలో బొద్దింక వచ్చిందని మాణిక్యం అనే వ్యక్తి నానాగొడవ చేస్తాడు. అది చూసి దీప, కార్తీక్ షాక్ అవుతారు. మంచి ఫుడ్ తిందామనే వస్తాం కదా. కానీ బొద్దింకలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఫుడ్ తింటే మా ప్రాణాలు పోతాయి. ఈ జ్యోత్స్న రెస్టారెంట్ మూత పడాల్సిందేనని మాణిక్యం గొడవ పెద్దది చేస్తాడు. అప్పుడే శివ నారాయణ వస్తాడు.

రెస్టారెంట్ సీజ్

పక్కకు తీసుకెళ్లి మాట్లాడమని శివ నారాయణ చెప్పినా మాణిక్యం వినడు. ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు కంప్లైంట్ కూడా చేశానంటాడు. అప్పుడే ఫుడ్ ఇన్ స్పెక్టర్ వస్తాడు. బిర్యానీలో బొద్దింక వచ్చిందని మాణిక్యం చూపిస్తాడు. వెంటనే లైసెన్స్ క్యాన్సిల్ చేయించి, రెస్టారెంట్ ను సీజ్ చేయాలంటాడు. కానీ మా రెస్టారెంట్లో ఫుడ్ క్వాలిటీగా ఉందని శివ నారాయణ అంటాడు.

మాణిక్యం డ్రామా

కానీ ఇక్కడ జరిగిందంతా లైవ్ లో స్ట్రీమింగ్ అవుతోందని యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఫుడ్ ఇన్ స్పెక్టర్ చెప్తాడు. ఒకసారి మా కిచెన్ ను చూడండని ఫుడ్ ఇన్ స్పెక్టర్ ను దీప కిచెన్ లోకి తీసుకెళ్తుంది. మాణిక్యంపై డౌట్ వచ్చిన సూరజ్ అతని దగ్గరకు వెళ్తాడు. యాక్టింగ్ ఇరగదీస్తున్నావ్ భయ్యా, నేను ఒకసారి రెస్టారెంట్లో ఇలాగే యాక్టింగ్ చేస్తే రూ.లక్ష ఇచ్చారని సూరజ్ చెప్పగానే.. మరి నాకేంటి రూ.10 వేలు ఇస్తానంది అని మాణిక్యం డ్రామా బయటపెట్టేస్తాడు.

వీడియో రికార్డు

ఎవరు నీతో ఈ పని చేయించిందని సూరజ్ అడిగితే.. జ్యోత్స్ననే అని మాణిక్యం చూపించేసరికి సూరజ్ షాక్ అవుతాడు. ఇంకో రూ.10 వేలు ఇస్తానని చెప్పి మాణిక్యం డ్రామాను సూరజ్ రికార్డు చేస్తాడు. కిచెన్ అంతా శుభ్రంగానే ఉందని ఫుడ్ ఇన్ స్పెక్టర్ చెప్తాడు. బొద్దింక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తానని సూరజ్ మొత్తం డ్రామాను బయటపెడతాడు.

మాణిక్యాన్ని సూరజ్ లాగిపెట్టి కొడతాడు. కుట్ర బయటపడేసరికి జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. మాణిక్యాన్ని శివ నారాయణ కూడా చెంపపై కొట్టి నీతో ఎవరు ఈ పని చేయించారని అడుగుతాడు. అతను జ్యోత్స్న వైపు చూస్తాడు. దీంతో కార్తీక్, దీపకు జ్యోత్స్నే ఈ పని చేయించిందని తెలుస్తుంది. ఆ మనిషి ఎవరో మాణిక్యం చెప్తుండగా దీప అడ్డుపడుతుంది. ఇక్కడితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More