కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సూరజ్‌పై జ్యోత్స్న రౌడీల దాడి.. సుమిత్ర బర్త్‌డే.. దీప ఇచ్చిన గిఫ్ట్ చూసి పారు గుండె గుభేల్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 3 ఎపిసోడ్ లో సూరజ్ పై రౌడీలతో జ్యో దాడి చేయిస్తుంది. ఆ వీడియో చూసి సైకో ఆనందం పొందుతుంది. మరోవైపు సుమిత్ర బర్త్ డే సందర్భంగా దీప గిఫ్ట్ చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 3 ఎపిసోడ్ లో.. సూరజ్ పై రౌడీలతో జ్యోత్స్న దాడి చేయిస్తుంది. ఆ వీడియో చూసి సైకో ఆనందం పొందుతుంది. సుమిత్ర బర్త్ డే కు దీప ఇచ్చిన గిఫ్ట్ చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

సూరజ్ ఒప్పుకోలేదని
కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ ను సాయం అడిగిన విషయాన్ని, అతను ఒప్పుకోలేదని కార్తీక్ కు దీప చెప్తుంది. నువ్వు అడిగితే సూరజ్ ఒప్పుకుంటాడని అనుకున్నానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు సూరజ్ భయపడుతున్నాడేమోనని దీప డౌట్ పడుతుంది.
స్వప్నకు జాబ్
భయపడేవాడే అయితే సూరజ్ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయడు కదా. అతనికి ఏం ఇబ్బంది ఉందో మనకు తెలియదు కదా అని దీపతో కార్తీక్ చెప్తాడు. ఈ పనికి మాలిన జ్యోత్స్న వచ్చిన ఆర్డర్లు రాకుండా చేస్తోందని దీప అంటుంది. సూరజ్ ఒప్పుకోలేదు కాబట్టి స్వప్నను పెట్టుకుందాం. స్వప్న చాలా చదువుకుంది. పైగా ఖాళీగానే ఉంది. తను పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుందని దీప చెప్తుంది.
ఇష్టం లేదన్న కార్తీక్
నా చెల్లి పని చేయడమే నాకు ఇష్టం లేదు. ఇప్పుడే కాశీ, స్వప్న మధ్య ప్రేమ మొదలైంది. వీళ్లను దూరం చేయలేను. పైగా జ్యోత్స్న అంటే స్వప్నకు అసలు పడదు. ఇక నాన్నను తనే జాగ్రత్తగా చూసుకుంటుంది. తను మా నాన్న దగ్గర ఉండటం చాలా అవసరమని కార్తీక్ చెప్తాడు. మరి కాశీని తీసుకొద్దామని దీప అంటే.. కార్తీక్ వద్దంటాడు. సూరజ్ మనసు మారాలని కార్తీక్ అనుకుంటాడు.
సూరజ్ పై దాడి
రాత్రి స్టాల్ క్లోజ్ చేసి సూరజ్ ఇంటికి వెళ్తుంటాడు. జ్యో చెప్పడంతో అప్పుడే ఇద్దరు రౌడీలు సూరజ్ పై కర్రలతో దాడి చేస్తారు. ఒకరు చితకబాదుతుంటే మరొకరు వీడియో తీస్తాడు. అప్పుడే పోలీస్ కారు సైరన్ విని రౌడీలు పారిపోతారు. మరోవైపు సూరజ్ ను రౌడీలు కొడుతున్న వీడియోను చూసి జ్యోత్స్న సైకో ఆనందం పొందుతుంది. మీరు చెప్పినట్లే చేయి విరగ్గొట్టామని రౌడీలు కాల్ చేసి చెప్తారు.
ఆ వీడియోను పారిజాతానికి జ్యో చూపిస్తుంది. జ్యోత్స్న జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. నన్ను చూసిన ప్రతిసారి వీడు భయపడాలని జ్యోలోని విలన్ బయటకు వస్తుంది. ఈ విషయం మీ తాతకు సూరజ్ చెప్తే ఎలా అని పారు అడుగుతుంది. సాక్ష్యం లేదు కదా అని జ్యో లైట్ తీసుకుంటుంది.
సుమిత్ర బర్త్ డే
మార్నింగ్ కేకు గురించి దశరథ ఫోన్లో మాట్లాడతాడు. కేకు ఎందుకు? అని శౌర్య అడుగుతుంది. ఈ రోజు సుమిత్ర బర్త్ డే అని దశరథ చెప్తాడు. శౌర్య పరుగెత్తుకుంటూ వెళ్లి ఈ రోజు అమ్మమ్మ పుట్టిన రోజంట కదా అని దీపను అడుగుతుంది. నేనే ఎవరికీ చెప్పొద్దన్నానని సుమిత్ర అంటుంది. నువ్వు చెప్పనంత మాత్రాన నీ బర్త్ డే అని నాకు తెలీదా మమ్మీ అని జ్యో డ్రామా స్టార్ట్ చేస్తుంది.
మీ అమ్మ పరాయిది అందుకే తెలియదు. కానీ నేను కన్నకూతురిని కదా నాకు తెలుసు అని శౌర్యతో జ్యో అంటుంది. ప్రేమగా శుభాకాంక్షలు చెప్తే చాలు, ఇంకేం వద్దని సుమిత్ర లోపలికి వెళ్లిపోతుంది. మీ వదిన బెంగంతా నీ మేనకోడలు పెళ్లి గురించేనని కాంచనతో దశరథ అంటాడు.
దక్షిణామూర్తిని రప్పిద్దామని
కార్తీక్ కు బయటకు తీసుకెళ్లి కోపంగా మాట్లాడుతుంది దీప. అమ్మ పుట్టిన రోజని ఎందుకు చెప్పలేదు. ముందే చెప్తే చీర కొనేదాన్ని కదా. అమ్మ కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేయాలి. దక్షిణామూర్తి తాతను పిలిస్తే ఎలా ఉంటుంది? కూతురు పుట్టిన రోజు నాడు తండ్రితో శుభాకాంక్షలు చెప్పించడం స్పెషల్ గా ఉంటుందని దీప అంటుంది. ఈ మాటలు జ్యోత్స్న, పారు వింటారు.
దక్షిణామూర్తి తాతను పిలవడం వద్దంటాడు కార్తీక్. బంధాల గురించి ఎమోషనల్ గా చెప్తాడు. వెంటనే బావా అంటూ దీప హగ్ చేసుకుంటుంది. మరోవైపు దీపకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని పారుతో జ్యో అంటుంది. దక్షిణామూర్తి గురించి తాతకు చెప్తానంటుంది. ఇప్పుడే కాదు ఆగుదామని పారు చెప్తుంది.
దీప గిఫ్ట్
అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వాలోనని దీప ఆలోచిస్తుంటుంది. అమ్మకు డ్రాయింగ్ గిఫ్ట్ గా ఇస్తానని శౌర్య చెప్తుంది. ఇదే ఆలోచనను దీప అమలు చేస్తుంది. ఈ సలహా ఇచ్చిన కార్తీక్ కు దీప ముద్దు ఇస్తుంది. మరోవైపు సుమిత్ర కేక్ కటింగ్ కు కార్తీక్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందరూ రెడీ అయి వస్తారు. కేక్ బాగుందని పారిజాతం అంటుంది.
పారు, జ్యో షాక్
సుమిత్రకు దీప గిఫ్ట్ ఇస్తుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా అని దీప చెప్తుంది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి, ఆ స్కెచ్ చూసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. పక్కన ఊయలలో ఉన్న బిడ్డను చూస్తూ బెడ్ పై పడుకున్న తల్లి చిత్రం అది. అది చూసి పారిజాతం, దీప షాక్ అవుతారు. సుమిత్రకు దీప పుట్టినప్పుడు హాస్పిటల్లో ఎలా ఉందో ఈ డ్రాయింగ్ అలాగే ఉందని అనుకుంటారు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


