కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శౌర్యతో బయటపడిన శివ నారాయణ, దక్షిణామూర్తి ఫొటో- సుమిత్ర తండ్రి ఎంతటి ఘాతకుడో చెప్పిన తాత!

Karthika Deepam 2 Serial June 8th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 8వ ఎపిసోడ్‌లో పారుతో సూరజ్ గురించి జ్యో చెబుతుండగా సూరజ్ కాల్ చేస్తాడు. కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తాడు. శివ నారాయణ గదిలో దక్షిణామూర్తితో ఉన్న చిరిగిన ఫొటో శౌర్యకు దొరుకుతుంది. దాంతో తాతను శౌర్య ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది.

Published on: Jun 8, 2026, 07:21:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప కోసం సూరజ్ వచ్చి పనిచేయడం గురించి పారుకు చెబుతుంది జ్యోత్స్న. దీప చావుదెబ్బ కొట్టిందిగా అని పారిజాతం అంటే.. ఇవి బావ తెలివితేటలు అని జ్యో అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 8 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 8 ఎపిసోడ్

పారిపోయేలా చేస్తాను

ఇలాగే చూస్తుంటే దీప సీఈఓ అవుతుందని పారిజాతం అంటుంది. ఎవరు ఎంత ఆశపడ్డా గెలిచేది నేనే అని జ్యోత్స్న అంటుంది. సూరజ్ వచ్చినంత మాత్రాన ఏం చేయలేడని, వాడిని ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను, ఈ జ్యోత్స్న గురించి తలుచుకోవాలంటేనే భయపడేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది.

ఇంతలో జ్యోత్స్నకు సూరజ్ కాల్ చేస్తాడు. ఇంటికెళ్లాక కూడా నా నన్నే తలుచుకుంటున్నట్లు ఉన్నారు అని సూరజ్ అంటాడు. రేయ్ నువ్వా.. జ్యూస్‌లు అమ్ముకునేవాడు, దీప వేసిన బిస్కెట్లకు తోక ఊపుకుంటూ వచ్చినవాడంటూ అవమానిస్తుంది జ్యోత్స్న. గుంపులను చూసి సింహం భయపడదని జ్యో అంటే.. నేను చెప్పేది అదే. ఈసారి సింహాలే గుంపు కట్టాయి. వేట కాదు ఆట అని సూరజ్ అంటాడు.

నన్ను ఎక్కువగా తలుచుకోవడం ఆపండి అని సూరజ్ అంటాడు. నీకు టైమ్ దగ్గరపడింది. దూరంగా ఉంటే మంచిది లేకుంటే అడ్రస్ లేకుండా పోతుంది అని జ్యోత్స్న అంటుంది. జ్యో ఏది అన్న సూరజ్ పట్టించుకోడు. కోపం రావట్లేదా అని జ్యో అంటే.. నేను నీ కంట్రోల్‌లో ఎందుకు ఉంటాను, నాకు నచ్చినప్పుడు కోపం తెచ్చుకుంటాను అని సూరజ్ అంటాడు.

నువ్వే గుర్తు చేశావ్

సూరజ్ మాటలకు జ్యో ఇరిటేట్ అవుతుంది. నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే అది ఇక్కడితే ఆపేయ్ అని జ్యో అంటే.. ఇప్పటివరకు నేను అనుకోలేదు. ఇక తీర్చుకుంటాను. నువ్వు గుర్తు చేశావుగా అని సూరజ్ అంటాడు. నీ గోడ మీద పేపర్‌పై ఒకటి రాసిపెట్టుకోరా.. నువ్వు నన్ను ఏం చేయలేవని. అర్థమైందా అని జ్యోత్స్న అంటే.. అర్థమైంది. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే రేపటి నుంచి నీకు నిద్రపట్టదు. గుడ్ నైట్ అని సూరజ్ అంటాడు.

దాంతో జ్యో ఇరిటేట్ అవుతుంది. ఇన్నాళ్లు నువ్వే తేడా అనుకున్నాను.. కానీ, వాడు నీకన్నా తేడాగా ఉన్నాడు. వాడి జోలికి వెళ్లకే అని పారిజాతం అంటుంది. వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను అని జ్యో అంటుంది. తర్వాత శౌర్య వెళ్లి కప్‌బోర్డ్‌లో దాక్కుంటుంది. శౌర్య కోసం దీప వెతుక్కుంటుంది. వంట గదిలోకి వెళ్తుంది దీప. అమ్మ ఇంకా రావట్లేదేంటీ అని బయటకు శౌర్య వచ్చేటప్పుడు బుక్‌లో నుంచి ఓ ఫొటో బయటపడుతుంది.

అందులో ఆ ఫొటో రెండు ముక్కలుగా చింపి ఉంటుంది. అందులో శివ నారాయణ, దక్షిణామూర్తి కలిసి ఉంటారు. ఇది ఎందుకు చింపారు. ముద్దుల తాతను అడుగుదామని శౌర్య అనుకుంటుంది. వెళ్లి జ్యోత్స్నను అడుగుతుంది శౌర్య. ఇది ముద్దుల తాత గదిలో దొరికిందని శౌర్య అంటుంది. ఫొటో చూసి జ్యో షాక్ అవుతుంది. ఇది మా అమ్మను అడుగు అని జ్యో అంటుండగా సుమిత్ర, దశరథ్ వస్తారు.

దక్షిణామూర్తితో శివ నారాయణ ఫొటో

సుమిత్రను శౌర్య ఈ ఫొటో ఎలా చినిగిపోయిందని అడుగుతుంది. దాంతో సుమిత్ర తెగ షాక్ అవుతుంది. కార్తీక్, దీప కూడా వస్తారు. ఇప్పుడు తాత చూస్తే బయటకు గెంటేస్తాడు అని జ్యో అనుకుంటుంది. ఈ ఫొటో ఎందుకు చినిగిపోయిందో ముద్దుల తాతను అడుగుతానని శౌర్య అంటుంది. ఇంతలో శివ నారాయణ వచ్చి ఏంటీ అడిగేదని అంటాడు.

నీ రూమ్‌లో ఒక బుక్ నుంచి ఈ ఫొటో ముక్కలు పడ్డాయి. ఇది ఒకటి నువ్వు, ఇంకోటి ఎవరు. ఈ తాత సుమిత్ర అమ్మమ్మ బర్త్ డేకి వచ్చిన తాతేనా. ఈ ఫొటోలో ఎందుకున్నాడు, మీరిద్దరు ఫ్రెండ్సా అని వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది శౌర్య. శివ నారాయణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. తర్వాత చెబుతానని కార్తీక్ అన్నా కూడా శౌర్య వినదు.

ఈ తాతపై ముద్దుల తాతకు కోపం ఉంటే ఫొటో ఎందుకు తీయించుకున్నారని శౌర్య నిలదీస్తుంది. దాంతో కాంచన పిలిచి ఆ ఫొటో తీసుకుని నేను నీకు తర్వాత చెబుతాను. నువ్వెళ్లి ఆడుకో అని చెబుతంది. దాంతో శౌర్య వెళ్తుంది. కాంచన సారీ చెబుతుంది. నువ్వెందుకు చెబుతున్నావ్ అత్త. కూతురుని అడ్డుపెట్టుకుని వివరాలు తెలుకునేందుకు మీరే దీపే కదా పంపిందని నింద వేస్తుంది జ్యోత్స్న.

దక్షిణామూర్తితో వైరం కథ చెప్పిన శివ నారాయణ

నేనెందుకు అలా చేస్తానని దీప అంటుంది. ఇద్దరు వాదించుకుంటుంటే.. చాలు ఆపుతారా అని శివ నారాయణ అరుస్తాడు. ఆ మనిషి గురించి ఎవరికి తెలియదు. ఆ మనిషి గురించి ఎవరి ప్రస్తావన రాకూడదంటే ఆ మనిషి గురించి మీకు తెలియాలి శివ నారాయణ అంటాడు.

దక్షిణామూర్తికి, ఈ ఇంటికి వైరం ఏంటో ఈ ఇంటికి తెలియాలి. చెబుతాను. దక్షిణామూర్తి నా ప్రాణ స్నేహితుడు. ఎప్పుడు గొప్ప స్థాయిలో ఉండాలనుకునేవాడు. మా ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. మా పిల్లలు కూడా ఆప్యాయంగా ఉన్నారు. అలా దశరథ్, సుమిత్ర ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కానీ, కూతురు పెళ్లిని వ్యాపారంగా చేశాడు దక్షిణామూర్తి అని శివ నారాయణ చెబుతాడు.

కూతురును గొప్పింటి ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తే తాను బాగా ఎదగొచ్చని అనుకున్నాడు. అది తెలియని సుమిత్ర తండ్రి ఒప్పుకుంటాడని పెళ్లి చేసుకుంది. ఆ టైమ్‌లో దక్షిణామూర్తి దగ్గర దశరథ మ్యానేజర్‌గా చేస్తున్నాడు. పెళ్లి విషయం తెలిసి దశరథను గన్ తీసి దక్షిణామూర్తి కాల్చాలనుకున్నాడు. సుమిత్ర అడ్డు పడటంతో గోడకు దశరథకు తగలాల్సిన బుల్లెట్ గోడకు తగిలిందని శివ నారాయణ చెబుతాడు.

నా స్నేహాన్ని కూడా స్వార్థంగా

ఆరోజు పెద్ద గొడవ జరిగింది. కూతురు చచ్చిందనే మా ముందే నెత్తిన నీళ్లు పోసుకున్నాడు. కూతురు ఫొటోకు దండ వేశాడు. దక్షిణామూర్తి నా స్నేహాన్ని కూడా స్వార్థానికే వాడుకున్నాడని తర్వాత అర్థమైంది. చాలా సార్లు మనల్ని వేధిస్తూ వచ్చాడు. అందుకే వాడికి దూరంగా వచ్చేశాను అని శివ నారాయణ అంటాడు. ఇన్నాళ్లకు వచ్చాడంటే మారిపోయాడనేగా అని జ్యో అంటుంది.

వాడు మారడు. సుమిత్ర కడుపుతో ఉన్నప్పుడు మనసు కరిగి వాళ్ల అమ్మ చూసేందుకు దొంగచాటుగా వచ్చేది. ఆ విషయం తెలిసి సుమిత్రకు తల్లి లేకుండా చేశాడు. వాడు ఇన్నాళ్ల తర్వాత సుమిత్ర కోసం వచ్చాడంటే ఏ అనర్థం జరుగుతుందో అని భయంగా ఉంది. దక్షిణామూర్తి నీడ పాము పడగలాంటిది. మన ఇంటి మీద పడితే ప్రమాదం ఏర్పడినట్లే అని శివ నారాయణ అంటాడు.

శౌర్యకు ఏం చెబుతారో చెప్పండి. కానీ, ఇంటి బంధువు అని మాత్రం చెప్పకండి. వాడి గురించి గుర్తు చేసుకోడానికే ఫొటో రెండు ముక్కలుగా చేసి పెట్టుకున్నా. వాడి గురించి తెలిసిందిగా. ఇక ఆఫీస్‌కు పదండి అని శివ నారాయణ వెళ్లిపోతాడు. అంతా వెళ్లిపోతారు. అలా శివ నారాయణ చెప్పింది కాస్తా అటు ఇటుగా అత్తారింటికి దారేది సినిమా తరహాలో ఉంది.

సూరజ్ కౌంటర్

సూరజ్ ఆఫీస్‌లో అందరికంటే ముందు వచ్చి వర్క్ చేసుకుంటాడు. కార్తీక్ పొగుడుతాడు. పనిపాట లేకుండా ఖాళీగా ఉన్నవాళ్లు వర్క్ చేసుకోకుంటే ఏం చేస్తారు అని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. ఫోకస్ గురించి కార్తీక్ చెబుతాడు. కార్తీక్ కాఫీ తాగేందుకు వెళ్తాడు. ఏమైనా ఆర్డర్స్ రావడం గురించి సూరజ్, దీప మాట్లాడుకుంటారు.

తర్వాత కాఫీ తాగేందుకు దీప వెళ్లిపోతుంది. ఫోకస్ అంతా కాఫీల మీద ఉంటే ఆర్డర్స్ ఎలా వస్తాయని జ్యో అంటుంది. ఇక్కడ కావాల్సింది హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని సూరజ్ కౌంటర్ ఇస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More