కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు సరైన మొగుడు సూరజే- శ్రీధర్ బతకడం కష్టమే,అమెరికాలో హార్ట్ సర్జరీ-ఏడిపించే సీన్లు
Karthika Deepam 2 Serial June 6th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 6వ ఎపిసోడ్‌లో సూరజ్‌ను 2 రోజుల్లో ఆఫీస్ నుంచి పంపించేస్తానని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తే నీ పతనం మొదలైందని, దీపను గెలిపిస్తానని సూరజ్ అంటాడు. శ్రీధర్‌కు మళ్లీ గుండెపోటు రావడంతో అమెరికాలో సర్జరీ చేయించుకునేందుకు వెళ్తాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ కాఫీకి వెళ్తారు. సూరజ్‌ను చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ కనిపించడు. దాంతో లేచి కంగారుగా చూస్తుంది జ్యోత్స్న. అప్పుడే వెనుక నుంచి వచ్చి షాక్ ఇస్తాడు సూరజ్.

నీ పతనం మొదలైంది
ఇలా వస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా. రౌడీలతో నువ్వే కొట్టించావని తెలుసు అని సూరజ్ అంటాడు. దానికి ప్రూఫ్ ఉందా. మహా అయితే మా తాతతో చెబుతావ్ అంతేగా. రెండు రోజుల్లో నిన్ను ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది. నీ పతనం మొదలైందని సూరజ్ అంటే.. నన్ను తట్టుకుని దీపను గెలిపించడం నీ వల్ల కాదని జ్యో అంటుంది.
నువ్ అహంకారంతో నిండిపోయిన కోతిలాంటిదానివి. ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి ఎవరు పట్టుకోలేరని గెంతులేస్తున్నావ్. దానికి బుద్ధి చెప్పడానికి నాలాంటి వాడు జెట్ ఫ్లైట్‌లో వస్తాడు. ఆల్రెడీ వచ్చాడు. దీప గారిని గెలిపిస్తాడు. తమరికి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించే పోతాను అని సూరజ్ ఛాలెంజ్ చేస్తాడు. అదంతా చూసిన కార్తీక్, దీప వాటే సీన్ అనుకుంటారు.
జ్యోత్స్నను సూరజ్ కంట్రోల్ చేస్తాడనిపిస్తుందా బావ అని దీప అంటే.. ఈ మాట అనకూడదు కానీ, ఈ తిక్కలదానికి సూరజే సరైన మొగుడు. బ్రదర్ యాటిట్యూడ్‌కి, తిక్కలదాని వెర్రితనానికి కరెక్ట్ సరిపోద్ది అని కార్తీక్ అంటాడు. దాని తాట తీయాలి, లేకుంటే సూరజ్‌నే కొట్టిస్తుందా. ఇప్పుడు జ్యోత్స్న ఏం చేసిన నువ్వే కాపాడాలి. బయట ఉంటేనే రౌడీలతో కొట్టించింది. ఆఫీస్‌లో ఉంటే ఇంకా ఏం చేస్తుందో అని దీప అంటుంది.
శ్రీధర్‌కు మళ్లీ గుండెపోటు
నిజమే. జ్యోత్స్నపై ఇంట్లో కూడా ఓ కన్నేయాలని కార్తీక్ అంటుండగా కాల్ వస్తుంది. శ్రీధర్‌కు మళ్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కార్తీక్ కంగారుగా వెళ్తాడు. హాస్పిటల్‌లో శ్రీధర్‌కు ట్రీట్‌మెంట్ ఇస్తారు. మీ నాన్నకు ఇంత నిర్లక్ష్యం ఏంట్రా అని కార్తీక్‌తో తిడతాడు శివ నారాయణ. ఇప్పటివరకు కాపాడుకున్నాను. ఇప్పుడు కాపాడుకుంటాను అని కార్తీక్ అంటాడు.
అత్తయ్యకు చెప్పారా అని దీప అంటే.. డాక్టర్ వచ్చి పరిస్థితి చెప్పాక చెబుదామని దశరథ్ అంటాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి వెంటనే సర్జరీ చేయాలని, చాలా కాంప్లికేటెడ్ కేసు, ఆపరేషన్ చేసిన 90 శాతం బతకడం కష్టం, ఒకవేళ బతికిన ఎంతవరకు రికవరీ అవుతాడో అర్థం కావట్లేదని డాక్టర్ చెబుతాడు. దానికి అంతా షాక్ అవుతారు.
కాపాడటం మీ వల్ల కాదు అంటే డైరెక్ట్ చెప్పేసేయండి అని డాక్టర్‌పై సీరియస్ అవుతాడు కార్తీక్. నాన్నకు ఏం కాదని దీపతో అంటాడు. వెంటనే సర్జరీ చేయాలి అంతేగా. తాత మీ హెల్ప్ కావాలి అని కార్తీక్ అంటాడు. మనదంతా ఒక్కటే ఫ్యామిలీరా అని శివ నారాయణ అంటాడు. ఒక్కమాట ఇది కాంప్లికేటెడ్ కేసు, ఈ పరిస్థితిలో ఆపరేషన్స్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ అని మరోసారి జాగ్రత్తపడమని చెబుతాడు డాక్టర్.
అమెరికాలో శ్రీధర్‌కు సర్జరీ
శ్రీధర్‌ను ఇంటికి తీసుకెళ్తారు. శ్రీధర్ క్షేమంగా ఉండాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఫ్యామిలీ అందరికి చెబుతాడు శివ నారాయణ. కాంచన, కావేరి కంగారుపడతారు. నాన్నకు ఏం కాదు. మావయ్య ఫ్రెండ్ డాక్టర్ అమెరికాలో ఉంటారు. సీనియర్ హార్ట్ సర్జన్. ఆయనతో మాట్లాడాం. వెంటనే అమెరికా తీసుకురమ్మన్నారు అని కావేరి చేయి పట్టుకుని కార్తీక్ చెబుతాడు.
అమెరికాలో ట్రీట్‌మెంట్ అంటే అని దాసు అంటుండగా.. అక్కడ కావాల్సింది అంతా నేను చూసుకున్నా. కానీ, అక్కడి రూల్ ప్రకారం పేషంట్‌తో ఒక్కరే ఉండాలి. శ్రీధర్‌తో కావేరి వెళ్తుంది. ఈరోజే ప్రయాణం. కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అని శివ నారాయణ చెబుతాడు. శివ నారాయణ, దశరథ్ వెళ్లిపోతారు. స్వప్న ఏడుస్తూ నేను వస్తానంటుంది.
శ్రీధర్ మాత్రం నవ్వుతూ సరదాగా మాట్లాడుతాడు. మంచివాళ్లకే దేవుడు ఇలా చేస్తాడేంటని దాసు అంటాడు. ఒక మనిషిని నువ్వు ప్రేమించిన దాన్ని బట్టే గొప్పగా, చెడుగా కనిపిస్తాడు. దేవుడు కూడా అంతే. ఇలా ఎంతోమందికి అయింది. కానీ, నాకున్న ఫ్యామిలీ ఎవరికి ఉంది నాన్నకు నడక నేర్పిన కొడుకు, తండ్రి కోసం కాపురం చక్కదిద్దుకున్న కూతురు, నా క్షేమం కోరుకునే కాంచన, నాకు ఏం జరిగిన తట్టుకోలేని కావేరి, కొడుకులా నిలబడ్డ అల్లుడు, కూతురులాంటి కోడలు శ్రీధర్ అంటాడు.
క్షమించమని కోరిన శ్రీధర్
మిత్రుడు లాంటి నువ్వు, దేవుడు లాంటి మామగారు, భుజం తట్టి ధైర్యం చెప్పే బావ. ఇంతమంది మంచివాళ్లను కుటుంబంగా ఇచ్చిన దేవుడుని ఇంకేం కోరుకుంటాను అని శ్రీధర్ అంటాడు. అలా అందరిని ఏడిపిస్తాడు శ్రీధర్. మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారని దీప అంటుంది. ఇవాళ అందరం ఇక్కడే భోజనం చేస్తున్నాం. కావేరి బిర్యానీ చేయి. మీరంతా కలిసి నాకు సెండ్ ఆఫ ఇవ్వాలి. సంతోషంగా వెళ్తాను అని శ్రీధర్ అంటాడు.
తర్వాత శ్రీధర్ ఏడుస్తుంటాడు. వెళ్లి కాంచన పలకరిస్తుంది. అందరిముందు నవ్వి పక్కకు వచ్చి ఏడుస్తున్నానని చూస్తున్నావా. నేను తిరిగి రాకపోతే అని శ్రీధర్ అంటాడు. తిరిగి వస్తారని కాంచన అంటుంది. ఓ మహా కవి చెప్పినదాని ప్రకారం మనిషి బ్రతికేది ఒక్కరోజే. ఒకవేళ ఇదే నా ఆఖరి రోజు అయితే. ఆపరేషన్ తర్వాత నాకు ఏమైనా అయితే అని శ్రీధర్ అంటుండగా.. కార్తీక్, దీప వచ్చి ఏం కాదని అంటారు.
జీవితంలో ఏం పోయిన తిరిగి వస్తాయేమో కానీ జీవితం పోతే తిరిగిరాదు. అందుకే ఉండగానే ఏం చెప్పాలనుకుంది చెప్పేయాలి. నన్ను క్షమించు కాంచన అని చేతులతో దండం పెట్టి మరి చెబుతాడు శ్రీధర్. దాంతో కాంచన ఏడుస్తుంది. ఆడదాని బతుకుతో ఆడుకున్న మగాడికి పుట్టగతులు ఉండవట. అందుకే నేను శిక్ష అనుభవిస్తున్నా అని శ్రీధర్ అంటాడు.
తండ్రిని పట్టుకుని ఏడ్చిన కార్తీక్
మీరు ఇంకా చాలా జీవితాన్ని చూడాలి. నమ్మకంగా వెళ్లండి. తిరిగి రండి అని కాంచన అంటుంది. కార్తీక్ మాస్టర్ అని పిలవరా అని శ్రీధర్ అంటే.. ఎలా పిలుచుకున్న నాకున్నది నువ్వే కదా నాన్న. తండ్రి కొడుకు వారసంగా ఇచ్చేదాంట్లో విలువైనది ఏదైనా ఉందంటే అది తను పంచిన ప్రేమే నాన్న. నేను తిరిగి నీకు ఏం ఇవ్వగలను ప్రేమగా పిలిచే పిలుపు తప్పా. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం అని శ్రీధర్‌ను పట్టుకుని కార్తీక్ ఏడుస్తాడు.
కాంచన, దీప కూడా ఏడుస్తారు. తన జీవితానికి అన్యాయం చేశానని శ్రీధర్ చెప్పిన మాటలను కాంచన తలుచుకుంటుంది. శివ నారాయణ వచ్చి శ్రీధర్ ఫ్లైట్ ఎక్కాడు. హాయిగా నిద్రపోతున్నాడు అని చెబుతాడు. ఇది నీకు ఇవ్వమని చెప్పాడని కాంచనకు తన వాచ్ ఇస్తాడు శివ నారాయణ. అది చూసి మురిసిపోయిన కాంచన బయటకు మాత్రం నాకెందుకు అంటుంది.
నువ్వు జాగ్రత్తపడుతున్నాని అనుకున్నావ్ కానీ దొరికిపోతున్నావ్. కోపాన్ని, ప్రేమను నటించలేవు. శ్రీధర్ ఈ వాచ్ ఇచ్చి నాతోపాటు కాంచన మనసు కూడా వస్తుందని చెప్పాడు అని శివ నారాయణ చెబుతాడు. బావపై నీ ఆరాధన నీ కళ్లల్లో కనిపిస్తుందని దశరథ్ అంటాడు. తన గురించి ఆలోచిస్తూ ఎక్కడ బాధపడతావో అని గుర్తుగా నీకు ఈ వాచ్ ఇవ్వమన్నాడని శివ నారాయణ అంటాడు.
కాంచనకు గుర్తుగా వాచ్
నా జీవితంలో జరిగినవి మళ్లీ పిల్లకు రావద్దు అనుకున్నా. కానీ, దేవుడు పక్షపాతం లేకుండా కన్నీళ్లు అందరికి చల్లుతున్నాడని శివ నారాయణ అంటాడు. మనుషులు చేసేదానికి దేవుడు ఏం చేస్తాడని కాంచన అంటుంది.
మరి ఇప్పుడు శ్రీధర్ పరిస్థితికి ఏది న్యాయమో నువ్వే చెప్పు. అతన్ని నీ భర్తగా అనుకుంటే మేమంతా సంతోషంగా ఉంటాం. నిన్ను ప్రేమించే మనుషుల కోసం నిన్ను ప్రేమించే మనిషిని క్షమించలేవా అని శివ నారాయణ అంటాడు. శ్రీధర్ గుర్తుగా ఇచ్చిన వాచ్‌ను పట్టుకుని ఏడుస్తుంది కాంచన. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


