కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోకు చుక్కలు చూపించిన సూరజ్.. దీప, కార్తీక్ ముందే ఊహించని సీన్.. చివర్లో బిగ్ ట్విస్ట్!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 16 ఎపిసోడ్ లో జ్యోత్స్నను సూరజ్ ఆటాడుకుంటాడు. అలాంటి పిల్లనే తనకు భార్యగా రావాలంటాడు. సూరజ్ చేతిని తన భుజంపై వేసుకుని మరి జ్యో ఆఫీస్ కు వెళ్తుంది. దీంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. ఇక ఆర్డర్ విషయంలో జ్యో పొగరు చూపిస్తుంది.

Published on: Jun 16, 2026, 06:55:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా జ్యోత్స్న, సూరజ్ మధ్య జరుగుతున్న వార్ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. జ్యోత్స్న పొగరును అణిచివేసేందుకు సూరజ్ వేస్తున్న ప్లాన్స్, మరోవైపు దీప తన తెలివితో ఆర్డర్స్ దక్కించుకోవడం నేటి ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారాయి. మరి కార్తీక దీపం 2 టుడే జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

వీడియోతో సూరజ్ బ్లాక్ మెయిల్

జ్యోత్స్నకు సూరజ్ మామూలు ట్విస్ట్‌లు ఇవ్వడం లేదు. రౌడీ మాటల వీడియో చూపించి జ్యోత్స్న మైండ్ బ్లాక్ చేశాడు. ఆ వీడియోతో ఏం చేయాలో అర్థంకాక జ్యోత్స్న తలపట్టుకుంటుంది. "వెళ్లవే.. వెళ్లి అందరిని పిలువు. ఈ రోజు మన ఇద్దరి గుట్టు రట్టు చేసుకుందాం. కానీ నష్టం నీకే ఎక్కువ. ఇద్దరం జైలుకు పోదాం. అక్కడ చెరో సెల్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం.. రెడీనా?" అంటూ సూరజ్ ఆడుకుంటాడు.

జ్యోత్స్న లాంటి పిల్ల

లక్షణంగా ఉండే పిల్ల తనకు అవసరం లేదని, బలుపు, తిక్క ఉన్న జ్యోత్స్న లాంటి పిల్లే తనకు భార్యగా కావాలని తాతకు చెప్పాల్సింది అంటూ సూరజ్ రెచ్చగొడతాడు. ఆట ఇప్పుడే మొదలైందని జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చినా సూరజ్ మాత్రం ఫన్నీ సెటైర్లతో కౌంటర్లు వేస్తాడు.

జ్యోత్స్నకు తాతయ్య షాక్

మరుసటి రోజు ఉదయం కార్తీక్, శివ నారాయణ, జ్యోత్స్న కార్లో ఆఫీస్‌కు బయలుదేరుతారు. రోడ్డు పక్కన ఉన్న సూరజ్‌ను చూసిన శివ నారాయణ కార్ ఎక్కమంటాడు. జ్యో అందుకు ససేమిరా అనడంతో, తాతయ్య ఆమెను కారు నుంచి దించేస్తాడు. ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ క్లాస్ పీకి, సూరజ్‌తో పాటే ఆఫీస్‌కు రావాలని ఆర్డర్ వేస్తాడు.

చేసేది లేక సూరజ్‌తో కలిసి జ్యో ఆటో ఎక్కుతుంది. ఆటోలో కూడా ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారు. కోపంతో సూరజ్ వాకింగ్ స్టిక్‌ను జ్యోత్స్న బయటకు పడేస్తుంది.

షాక్‌లో కార్తీక్, దీప!

ఆఫీస్ దగ్గర కార్తీక్, దీప వెయిట్ చేస్తుంటారు. అప్పుడే ఒక ఊహించని దృశ్యం వారికి కనిపిస్తుంది. సూరజ్ చేతిని తన భుజంపై వేసుకుని జ్యోత్స్న నడుచుకుంటూ వస్తుంది. ఇది చూసి దీప, కార్తీక్ షాక్ అవుతారు. పెద్దయ్య చెప్పాడని జ్యోత్స్న ఇంత శ్రద్ధ తీసుకుంటుందా అని కార్తీక్ ఆశ్చర్యపోతాడు. స్టిక్ ఏమైందని కార్తీక్ అడిగితే, ఒక కుక్క లాక్కెళ్లిందని సూరజ్ కవర్ చేస్తాడు. జ్యోత్స్నను కార్తీక్ పొగడటంతో ఆమె కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.

దీప మాస్టర్ స్ట్రోక్.. ఆర్డర్ క్లోజ్

ఆఫీస్‌లో ఉండగా బాలరాజు అనే కస్టమర్ తన కూతురి వోణీల ఫంక్షన్ కోసం 1000 మందికి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వస్తాడు. జ్యోత్స్న తన బిల్డప్‌తో ప్లేట్ రూ.3 వేలు అని చెప్పడంతో కస్టమర్ షాక్ అవుతాడు. రూ.2 వేలకే కావాలని కస్టమర్ అడిగినా, ఒక్క రూపాయి తగ్గించనని జ్యోత్స్న తెగేసి చెబుతుంది.

కస్టమర్ కోపంగా వెళ్లిపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన దీప, సూరజ్.. లాభాలు తగ్గించుకుని తాము ఆ ధరకు సప్లై చేస్తామని చెబుతారు. దీంతో బాలరాజు ఆర్డర్ ను దీపకు ఇచ్చి అడ్వాన్స్ కూడా చెల్లిస్తాడు.

దీంతో జ్యోత్స్న అహంకారం ఆమెకే మైనస్ అవ్వగా, దీప తెలివిగా పెద్ద ఆర్డర్ దక్కించుకుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఈ ఆర్డర్ ను దీప ఎలా కంప్లీట్ చేస్తుందో, జ్యోత్స్న ఎలాంటి కుట్రలు చేస్తుందో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More