కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అదిరే ట్విస్ట్- బాలరాజును కనిపెట్టిన కార్తీక్- సీఈఓగా జ్యో పగటికలలు- శిక్ష తప్పదన్న సుమిత్ర
Karthika deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. పెద్ద ఆర్డర్ పేరుతో మోసం చేసిన బాలరాజును కార్తీక్ కనిపెట్టి ట్విస్ట్ ఇస్తాడు. ఇక సీఈఓ తానే అంటూ జ్యోత్స్న బిల్డప్ ఇస్తుంది. మరోవైపు తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని సుమిత్ర హెచ్చరిస్తుంది.
Karthika deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ లో ఫేక్ చెక్ ఇచ్చిన బాలరాజును కార్తీక్ కనిపెడతాడు. మరోవైపు సీఈఓ అవుతానని జ్యోత్స్న తెగ కలలు కంటుంది. మరి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కాంచన అనుమానం
ఆ ఫేక్ చెక్ వెనుకాల కొత్త శత్రువు ఎవరైనా ఉన్నారేమోనని కాంచన అనుమానపడుతుంది. మాక్కూడా కోపం, పౌరుషం ఉన్నాయి. మేం కూడా కారం తింటున్నాం. కానీ మార్నింగ్ ఫుడ్ సేల్ కోసమే ఆలోచించాం. టెన్షన్ పడ్డామని కార్తీక్ చెప్తాడు. మనల్ని ఈజీగా మోసం చేయాలనే ఆలోచన వచ్చినవాడిని వదిలేయకండని కాంచన గట్టిగానే చెప్తుంది.
దొరికిన బాలరాజు
టెన్షన్ పడకు అమ్మా, నీకు నచ్చిన సీరియల్ చూడు అని కాంచన చేతికి ఫోన్ ఇస్తాడు కార్తీక్. అప్పుడే అందులో బాలరాజు అనే డైలాగ్ చెప్తూ ఫుడ్ ఆర్డర్ పేరుతో మోసం చేసిన వ్యక్తి కనిపిస్తాడు.
కట్ చేస్తే షూటింగ్ లోకేషన్ కు డైరెక్ట్ గా వెళ్తాడు కార్తీక్. అక్కడ బాలరాజు యాక్టింగ్ ను కార్తీక్ తెగ పొగిడేస్తాడు. మీరు ప్రొడ్యూసర్ కదా సార్. టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ల కోసం తిరుగుతున్నారు కదా అని బాలరాజు అనగానే.. ఇదే మంచి ఛాన్స్ అని కార్తీక్ అవునంటాడు. నా నెక్ట్స్ ప్రాజెక్ట్ హీరో నువ్వే, అవసరమైతే హీరోయిన్ ను బాంబే నుంచి దింపుతానని కార్తీక్ అంటాడు.
లైవ్ డెమో కావాలని కార్తీక్ చెప్తాడు. ఒకరి దగ్గరకు వెళ్లి లైవ్ లో నటించాలంటాడు. ఫోన్ చేసి లోకేషన్ కు వచ్చేయమని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. ఇక మన జాతకం మారిపోయినట్లేనని బాలరాజు అనుకుంటాడు.
సూరజ్ కౌంటర్
మరోవైపు జ్యోత్స్న, సూరజ్ టామ్ అండ్ జెర్రీ వార్ కొనసాగుతూనే ఉంటుంది. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్ అని సూరజ్ అనగానే జ్యోకు మండిపోతుంది. జ్యోత్స్న తిక్క కుదిర్చేలా సూరజ్ తిక్కతిక్కగా మాట్లాడతాడు. నేను అగ్నిపర్వతం లాంటిదాన్ని. గతంలో యుద్ధాలన్నీ ఆడవాళ్ల కోసమే జరిగాయి. చచ్చింది మగవాళ్లే అని జ్యో అంటుంది. అంటే ఆడవాళ్ల కోసం చచ్చినా తప్పు లేదని సూరజ్ కౌంటర్ వేస్తాడు.
దీపకు నువ్వు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందని హీరోలా ఫీల్ కావొద్దని జ్యో అంటుంది. నేను హీరో కాదు, విలన్. విలన్ కోసం విలనే వస్తాడని సూరజ్ మరో కౌంటర్ వేస్తాడు. నువ్వు ఐలవ్యూ చెప్పినా సేమ్ టూ యూ చెప్తానని జ్యోతో ఆటాడుకుంటాడు. అప్పుడే కార్తీక్, దీప స్కూటీపై వస్తారు.
మామయ్య రమ్మన్నాడని
దీపే నన్ను తీసుకొచ్చిందని కార్తీక్ చెప్తాడు. దీపకు ఇంట్లోకి ఎంట్రీ లేదు బావ అని జ్యో అంటుంది. ఎంట్రీ ఉంది పెద్ద మేడం. మామయ్య స్వయంగా కాల్ చేసి దీపను రమ్మన్నాడు. మామయ్యకు దోసకాయ పచ్చడి తినాలనిపించిందంటా, అది చేయడానికే దీప వచ్చింది. మా అత్త కోసం నువ్వుల ఉండలు కూడా తెచ్చిందని కార్తీక్ చెప్తాడు.
జ్యో తొందరపాటు
ఈ రోజు సాయంత్రంతో నేను సీఈఓ కావడం గ్యారెంటీ. దీప ఏం చేస్తుందో అనుకున్నా. కానీ పాత డ్యూటీకి దీప రెడీ అయిపోయందని జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. దీన్నే తొందరపడి ఓ కోయిల ముందే కూయడమంటారు. సాయంత్రం వరకూ వెయిట్ చేయమని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. దీప మెనూలోని ఐటెమ్స్ నా రెస్టారెంట్లో ఉన్నాయి. ఆర్డర్లన్నీ ఫుల్ అని జ్యో గొప్పగా చెప్తుంది.
దీప ఐడియా కాపీ చేసిన జ్యోత్స్న స్మార్ట్ నెస్ నచ్చిందని సూరజ్ ఎగతాళిగా అంటాడు. అందరు కలిసి లోపలికి వెళ్తారు. శివ నారాయణ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మీరు నలుగురు కలిసి జ్యోత్స్న రెస్టారెంట్ కు కొత్త ఊపిరి పోశారని శివ నారాయణ అంటాడు. అప్పుడే పారు, కార్తీక్ సరదాగా మాట్లాడుకుంటారు.
జ్యోత్స్ననే విన్నర్
దీప, జ్యోత్స్న రెస్టారెంట్ బ్రాంచ్ లు లాభాల్లో ఉన్నాయి. ఇద్దరూ ఈక్వెల్ గానే ఉన్నారని శివ నారాయణ అంటాడు. ఎంత ఈక్వెల్ గా పరుగెత్తిన విన్నర్ ఒక్కరే కదా సార్ అని సూరజ్ గుర్తు చేస్తాడు. ఆ విన్నర్ జ్యోత్స్ననే. దీప నువ్వు ఓడిపోయావని ఫీల్ కావొద్దని పారు అంటుంది. దీప ఓడిపోయిందని రిజల్ట్ అనౌన్స్ చేయకముందే నీకు తెలుసా పారు? జ్యోత్స్నను గెలిపించడానికి ఏదో చేసినట్లున్నావ్. మళ్లీ ఎక్కడైనా బొద్దింక పాకిందేమోనని కార్తీక్ ట్విస్ట్ ఇస్తాడు.
సుమిత్ర క్లారిటీ
ఏ పోటీలో అయినా న్యాయంగా కష్టపడే వాళ్లే విజేతలు అవ్వాలి. వాళ్లకే గౌరవం, పదవులు దక్కాలి. ఈ పోటీ న్యాయంగానే జరిగిందనుకుంటున్నా. లెక్కల్లో, ప్రవర్తనలో తప్పున్న వాళ్లను కఠినంగా శిక్షించండి మామయ్య. నిర్ణయాలు తీసుకోవడంలో బంధుత్వం చూపించకండి. తప్పు జరిగితే జ్యోత్స్న అయినా, దీప అయినా ఒకటేనని సుమిత్ర అంటుంది. ఒకవేళ జ్యోత్స్న తప్పు చేసి ఉంటే ఏం చేస్తావ్ అత్త అని కార్తీక్ అడుగుతాడు.
పోటీలో గెలిచేందుకు తప్పు చేశారని తెలిస్తే ఎవరైనా సరే ఇంట్లో అడుగుపెట్టనివ్వను. తప్పు చేసే వాళ్లు దోషులే అని సుమిత్ర గట్టిగా చెప్తుంది. సుమిత్ర చెప్పినట్లు తప్పు చేసిన వాళ్లకు శిక్ష ఇంటి నుంచి వెళ్లగొట్టడమేనని శివ నారాయణ తీర్పు ఇస్తాడు.
జ్యో ఆఫర్
ఇక ఆఫీస్ కు వెళ్లగానే జ్యోత్స్న తెగ బిల్డప్ ఇస్తుంది. సీఈఓ క్యాబిన్ క్లీన్ చేయమని, నేమ్ బోర్డు ముందు సీఈఓ అని రాయించాలని ఆఫీస్ బాయ్ కు చెప్తుంది జ్యోత్స్న. దీప ఓడిపోతుంది కాబట్టి నీ స్టాల్ తో ఇక్కడ పని లేదు. కానీ నా సైడ్ కు వచ్చేయ్. అన్ని బ్రాంచ్ ల్లో నీ స్టాల్ పెట్టేలా చేస్తానని జ్యో ఆఫర్ ఇస్తుంది. కానీ సూరజ్ అందుకు ఒప్పుకోడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


