కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు దీప షాక్ మీద షాక్.. వంటలక్క ఫ్లాష్ సేల్‌తో లాభం.. ఆ ఫేక్ చెక్ వెనుక ఎవరు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 23 ఎపిసోడ్ లో విన్నర్లకు శివ నారాయణ గోల్డ్ కాయిన్స్ అందిస్తాడు. 20 శాతం లాభాలు కూడా రావడంతో దీప, సూరజ్ ను ఛైర్మన్ పొగిడేస్తాడు. అది చూసి జ్యోత్స్నకు మండిపోతుంది. సూరజ్ తో గొడవ పెట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 23 ఎపిసోడ్ లో ఫుడ్ మొత్తం సేల్ చేసిన దీప, సూరజ్ ను శివ నారాయణ అభినందిస్తాడు. ఇది చూసి జ్యోత్స్న తట్టుకోలేదు. మరి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూసేయండి.

శివ నారాయణ హ్యాపీ
వంటలక్క స్పెషల్ ఫ్లాష్ సేల్ లక్కీ డ్రాలో గెలిచిన వాళ్లకు ఆఫీస్ లో గోల్డ్ కాయిన్స్ అందిస్తారు. ఛైర్మన్ శివ నారాయణ చేతుల మీదుగా దీప ఈ కాయిన్లు ఇప్పిస్తుంది. గోల్డ్ కాయిన్లు తీసుకున్నవాళ్లు తెగ మురిసిపోతారు. జ్యోత్స్న రెస్టారెంట్ క్వాలిటీలో నంబర్ వన్ అని ఆ విన్నర్స్ చెప్తారు. శివ నారాయణ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
దీపకు కంగ్రాట్స్
పాతికేళ్ల వయసులో వ్యాపారంలో స్నేహితుడి చేతిలో ఓడిపోయా. అప్పుడు నా మీదే నాకు కోపం వచ్చింది. మోసపోయేంతగా వాడిని నమ్మడం నాదే తప్పు. ఎవడో ముక్కు మోహం తెలియనివాడు ఆఫీస్ కు వచ్చి ఫేక్ చెక్ ఇచ్చి మనల్ని వెర్రివాళ్లను చేయడంతో ఇప్పుడు మీపై కోపం వచ్చింది. మీరు గెలిచి నా అహంకారాన్ని చంపేశారు. సంస్థకు మంచి పేరు తీసుకొచ్చి నా నమ్మకాన్ని గెలిచారు. దీప, సూరజ్ కంగ్రాట్స్ అని శివ నారాయణ చెప్తాడు.
20 శాతం ఫ్రాఫిట్
కార్తీక్ నీకు కూడా థ్యాంక్స్ అని శివ నారాయణ చెప్తాడు. నష్టాల సంగతి పక్కనపెడితే ఫుడ్ వేస్ట్ కాకుండా చూశారని జ్యోత్స్న ఎగతాళిగా మాట్లాడుతుంది. నష్టాలేంటీ మేడం, సంస్థకు 20 శాతం ప్రాఫిట్ వచ్చిందని మేనేజర్ వంశీ చెప్పడంతో జ్యో షాక్ అవుతుంది. శివ నారాయణ క్లాప్స్ కొడతాడు. ఇదంతా చూసి జ్యోకు మండిపోతుంది. మోసపోకుండా జాగ్రత్త పడటం మంచిది. నేను వద్దన్న ఆర్డర్ తాను ఓకే చేయకపోయి ఉంటే ఇలా ఉండేది కాదు అని జ్యో అంటుంది.
వాతావరణం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదని జ్యో అంటుంది. ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం. ఈ వార్నింగ్ నీక్కూడా అని శివ నారాయణ అంటాడు. పార్టీ అరెంజ్ చేశా, ఎంజాయ్ చేయమని ఛైర్మన్ చెప్తాడు. అప్పుడే పిక్చర్ అబీ బాకీ హై మేరా మరదల్స్ అని కార్తీక్ అనడంతో జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. లోపలికి వెళ్లి బావ ఏం చేయబోతున్నాడని ఆలోచిస్తుంది.
సూరజ్ రివర్స్ కౌంటర్
అప్పుడే కాఫీ కప్ తో వచ్చిన సూరజ్.. హే పొగరుబోతుదానా కాఫీ తాగు అని జ్యో ముందు కప్ పెడతాడు. లోపల జరిగిన దానికి తల బద్దలైపోతుంటుంది అని తననే జ్యో అంతకుముందు అన్న మాటలను సూరజ్ రివర్స్ కౌంటర్ గా వేస్తాడు. నేనే నీకు ఆఫర్ ఇస్తా. నాతో చేతులు కలుపు. మంచివాళ్లలా మారిపో అని సూరజ్ అంటాడు. చివరకు గెలిచేది నేనే, సీఈఓ అయ్యేది నేనే. నేను ఛైర్మన్ మనవరాలిని అని జ్యోత్స్న బిల్డప్ ఇస్తుంది.
పీఏ పోస్టుకూ పనికి రావు
ఇదే నీకున్న ఏకైక అర్హత. అది తీసేస్తే నువ్వు ఆఫీస్ లో అసిస్టెంట్ పీఏ పోస్టుకు కూడా పనికి రావని జ్యోకు దిమ్మతిరిగే షాకిస్తాడు సూరజ్. నువ్వు ఇంకా ఎన్ని రోజులో ఉండవు. నీ టైమ్ దగ్గరపడుతుందని జ్యో వార్నింగ్ ఇస్తుంది. నీకున్న తెలివి మంచికి వాడితే గొప్ప స్థాయికి వెళ్తావ్. మంచి అందగత్తెవి. నువ్వు చందమామలా ఉంటావ్. నాకు చందమామ అంటే ఇష్టం. చందమామ కోపంలో కూడా చాలా అందంగా ఉంటుందని సూరజ్ ఓ ఆటాడుకుంటాడు.
కాంచన ప్రశ్న
మరోవైపు దీపకు కాంచన దిష్టి తీస్తుంది. అప్పుడే కాంచనకు కాల్ చేసిన సుమిత్ర.. దీపకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. ఆర్డర్ ఆగిపోవడం కూడా మన మంచికే జరిగింది. అన్నార్థులకు భోజనం పెట్టామనే మంచి పేరు వచ్చింది. విన్నర్లకు గోల్డ్ కాయిన్ ఇవ్వడంతో ఇంకా మంచి పేరు వచ్చింది. దీపకు అప్పగించిన బ్రాంచ్ లో వంటలక్క స్పెషల్ వైరల్ అయిందని సుమిత్ర చెప్తుంది. అయితే దీప గెలుస్తుందా వదిన అని కాంచన అడగ్గానే, సుమిత్ర ఒక్క క్షణం సైలెంట్ అవుతుంది. ఎవరు గెలిచినా సంతోషమేనని సుమిత్ర చెప్తుంది.
జ్యో గొడవ
బయట వాకింగ్ చేస్తున్న సూరజ్ దగ్గరకు వెళ్లి మరీ జ్యోత్స్న మళ్లీ గొడవ స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు నువ్వు, దీప నాపై గెలిచారు కదా. సంతోషం పట్టలేక నిద్ర రావడం లేదా అని జ్యో అడుగుతుంది. చదివిన చదువుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వక ఫుట్ పాత్ పై స్టాల్ పెట్టుకున్నావ్. గంతకు తగ్గ బొంత అన్నట్లు ఆ అయిదో తరగతి దీపకు ఈ పొగరుబోతు తోడయ్యాడు. ఏదో నాలుగు భోజనాలు అమ్మేసరికి సూపర్ స్టార్ లా ఫీల్ అవుతున్నారని జ్యో అంటుంది.
శివ నారాయణ యావదాస్తికి ఈ జ్యోత్స్ననే వారసురాలని తెగ బిల్డప్ ఇస్తుంది. మొత్తం ఆస్తి ఎంత ఉంటుందని సూరజ్ అడుగుతాడు. రూ.500 కోట్లు అని జ్యో చెప్తే, ఓ అంతేనా అని లైట్ తీసుకుంటాడు సూరజ్. నీ కంటూ సొంతంగా ఏం ఉందో చెప్పు. నీలాంటి నెపో కిడ్స్ అంతా తాతల ఆస్తులను తీసుకుంటారు. మేం కష్టపడి ఎదగాలని అనుకుంటామని సూరజ్ అంటాడు.
బంగారమంటూ
జ్యోత్స్న, సూరజ్ కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటారు. దీప గురించి సూరజ్ గొప్పగా చెప్తాడు. నైట్ టైమ్ నువ్వు ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు. గుడ్ నైట్ బంగారం అని సూరజ్ మళ్లీ టోన్ మారుస్తాడు.
మరోవైపు మోసపోయిన వాడిపై పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని కాంచన ఫైర్ అవుతుంది. ఈ దరిద్రపు పని జ్యోత్స్న చేయించిందని కాంచన అంటుంది. అసలు ఈ ఫేక్ చెక్ పని ఎవరు చేయించారని కార్తీక్ ఆలోచిస్తాడు. ఇంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


