కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కంపెనీలో, ఇంట్లో దీప ఇంకోసారి అడుగుపెట్టొద్దు- విరుచుకుపడిన శివ నారాయణ- సాయంత్రం దాకా గడువు
Karthika Deepam 2 Serial June 20th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 20వ ఎపిసోడ్‌లో వెయ్యి భోజనాల ఆర్డర్ ఇచ్చిన అతను రాంగ్ అడ్రస్ ఇచ్చి మోసం చేస్తాడు. దాంతో దీపపై విరుచుకుపడతాడు శివ నారాయణ. రోడ్డు మీద నిలబెట్టావ్, చేతకానీ తనం అంటూ నానా మాటలు అంటాడు. తాత కాళ్లపై పడుతుంది వేడుకుంటుంది దీప.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో బాల్‌రాజు చెప్పిన అడ్రస్‌కి వెళ్లిన సూరజ్‌కు అది రాంగ్ అని తెలుస్తుంది. బాల్‌రాజుకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టాడంటేనే వాడు మీకు టోకరా వేశాడు అని ఇంటి అసలు ఓనర్ అంటాడు.

రోడ్డు మీద నిలబెట్టావ్
మళ్లీ కాల్ చేస్తాడు సూరజ్. అయినా స్విచ్ఛాఫ్ వస్తుంది. వాడు మోసం చేశాడని అనుకుంటాడు సూరజ్. కట్ చేస్తే ఫుడ్ అంతా చూస్తాడు శివ నారాయణ. మనిషి నమ్మకంగా కనిపించాడని దీప చెబుతుంది. దీపను తిడతాడు శివ నారాయణ. నిన్ను నమ్మినందుకు రోడ్డు మీద నిలబెట్టావ్. 1000 భోజనాలు ఏం చేయాలి అని శివ నారాయణ అంటాడు.
ఇంకా రెండు ట్రక్కులు ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ కాదు ఆఫీస్‌లో మాట్లాడుకుందామని వెళ్తారు. 100, 200 అంటే ఏం కాదు కానీ వెయ్యి స్పెషల్ మీల్స్ అంటే సాధారణ విషయం కాదు. 20 లక్షల కాంట్రాక్ట్ జాగ్రత్తగా ఉండాలిగా అని శివ నారాయణ అంటాడు. వాడు తప్పుడు అడ్రస్ ఇచ్చాడని సూరజ్ అంటాడు.
దీప మాట్లాడబోతుంటే ఇంకేం చెప్పకు. నాకు నీతో మాట్లాడాలంటే చిరాకు వేస్తుంది. నువ్వే చెప్పావు కదా. ఒకసారి మోసం పోవడం అమాయకత్వం రెండోసారి మోసపోవడం చేతకానీ తనం. నీ మాట ప్రకారం చూసుకుంటే ఇది నీ చేతకానీ తనం, ఇది నీ చేతకానీ తనం కాదు మాది. పరువు తీశావు కదమ్మా. ఇది నాలుగు గోడల మధ్యే ఉంటుందా అని శివ నారాయణ నానా మాటలు అంటూ విరుచుకుపడతాడు.
చెక్కు బౌన్స్ అయింది
దాంతో దీప షాక్ అవుతుంది. ఇంకా నయం 50 శాతం చెక్కు ఇచ్చాడు. లేకపోతే మరింత నష్టం జరిగేదని జ్యోత్స్న అంటుంది. 10 లక్షలు ఇచ్చినవాడు ఎందుకు మోసం చేస్తాడు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కార్తీక్ అంటాడు. ఇంతలో మేనేజర్ వచ్చి చెక్కు బౌన్స్ అయిందని, అడ్వాన్స్ పేరతో వాడు మనల్ని నిండా ముంచేశాడని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
ముంచింది వాడు కాదు ఈ దీప. వాడు తక్కువ రేటుకు అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నా మీద పంతానికిపోయి ఇలా చేసిందని జ్యోత్న్న అంటుంది. బ్యాంక్ హాలీడే రోజే వాడు చెక్కు ఇచ్చాడంటే అర్థం చేసుకోవాలిగా అని శివ నారాయణ అంటాడు. ఇంకో మనిషిని పెట్టుకున్నాక కూడా లక్షల్లో నష్టం వచ్చింది. ఇప్పుడు ఆ బ్రాంచ్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చిందని జ్యో అంటుంది.
నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను. కంపెనీ ఒక్కటే కాదు పేరు కూడా పోతుంది. ఇన్నేళ్లలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. నష్టం కాదు ఇంతలా మోసపోలేదు. డ్రైవింగ్ దీపకు ఇచ్చాం అని తింగరివాళ్ల స్టోరీ చెబుతాడు శివ నారాయణ. అసలే నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌కు మరింత నష్టం వచ్చింది. క్లోజ్ చేయడం తప్పా ఇంకో దారి కనిపించట్లేదని శివ నారాయణ అంటాడు.
పెద్దరికాన్ని చంపేసుకున్నాం
పెద్దయ్య గారు అని దీప అంటే.. ఇంకెక్కడి పెద్దరికం. ఒకరిని నమ్మి పెద్దరికాన్ని చంపేసుకున్నాం అని శివ నారాయణ అంటాడు. తనకు ఒక అవకాశం ఇవ్వమని దీప అంటుంది. ఏం చేస్తావని జ్యో అంటే.. బాధ్యత తనది కాబట్టి దాన్ని పూడ్చే బాధ్యత తనదే. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్. తను మట్టి మనిషి. అందరిని గుడ్డిగా నమ్ముతుందని కార్తీక్ చెబుతాడు.
కడుపుతో ఉన్నా కూడా నిన్నటి నుంచి ఆర్డర్ గురించే ఆలోచిస్తుంది. కడుపులో బిడ్డ గురించి చెబితే.. పెద్దయ్య గారి కోసం నేను నా బిడ్డ కూడా కష్టపడతాం అంది తాత. తన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇంకో అవకాశం ఇవ్వు తాత అని కార్తీక్ అంటాడు. ఇవ్వకు తాత అని జ్యో అంటుంది. ఇవ్వకపోతే ఎలా నిరూపించుకుంటుంది అని కార్తీక్ అంటాడు.
ఇంకేం నిరూపించుకుంటారు. ఇదే మొదటి, ఆఖరి సారి అని చెప్పి అవకాశం తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో అవకాశం ఇచ్చి నా మాట మీద నిలబడకుండా ఉండాలా. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నా. కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప ఇంకోసారి కంపెనీలో అడుగుపెట్టకూడదు. తన నిర్లక్ష్యానికి ఈ కంపెనీ బలయింది కాబట్టి దీప మొహం ఇంకోసారి చూడను. నష్టాన్ని నేనే భరిస్తాను వెళ్లండి అని శివ నారాయణ అంటాడు.
సాయంత్రం వరకు సేల్ అయిపోవాలి
దాంతో శివ నారాయణ కాళ్ల మీద పడుతుంది దీప. ఇంకో అవకాశం ఇవ్వమంటుంది. దశరథ్ ఇస్తే తప్పు లేదంటాడు. జ్యో వద్దంటుంది. దీపను లేవమని సరే ఇంకో అవకాశం ఇస్తున్నాను. కానీ, ఒక కండిషన్. సాయంత్రం వరకు ఆ భోజనాల్లో ఒక్క మెతుకు కూడా ఉండొద్దు. అంతా సేల్ అయిపోవాలి. అప్పుడే నీ సమర్థత తెలుస్తుంది. ఏం చేస్తారో చేయండి. నాకు డబ్బు నష్టం, పరువు నష్టం జరగకూడదు. సాయంత్రం వరకే గడువు అని శివ నారాయణ అంటాడు.
నిరూపించుకోకపోతే అని జ్యో అంటే.. ఇంకోసారి కంపెనీలో దీప అడుగుపెట్టదు. జ్యోత్స్న సీఈఓ అవుతుంది. ఇంట్లో కూడా దీప అడుగు పెట్టాల్సిన అవసరం లేదని శివ నారాయణ అంటాడు. ఇది కదా మనకు కావాల్సింది అని జ్యో సంతోషంతో అంటుంది. దాంతో అంతా చూస్తారు. ఇలా చేసిన మనిషికి ఇదే కదా జరగాల్సిందని జ్యోత్స్న కవర్ చేస్తుంది.
తర్వాత తలపట్టుకున్న సూరజ్‌కు కాఫీ ఇచ్చి సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. మాట అంటే కౌంటర్లు ఇస్తావు. ఈసారి ఏమైంది నోరు పడిపోయిందా. ఇది నీకు కష్టకాలమే. అమాయకంగా భలే మోసపోయార్రా అని జ్యోత్స్న అంటుంది. మోసపోలేదు. మోసం చేశారు. నువ్వే అని సూరజ్ అంటాడు. సాక్ష్యం లేకుండా మాట్లాడితే ఊరుకోను అని జ్యో అంటుంది.
నాతో చేతులు కలుపు
నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నీకు రెండు దారులు ఉన్నాయి. ఈవెనింగ్ వరకు మీరు ఆ ఫుడ్ సేల్ చేయలేరు. రెండోది నాతో చేతులు కలుపు అని జ్యోత్స్న అంటుంది. నా ఓటమిని నేను డిసైడ్ చేయాలి నువ్వు కాదు అని సూరజ్ అంటాడు. పారిపోవడం, నాతో చేతులు కలపడం తప్పా నీకు ఇంకో దారి లేదురా అని జ్యోత్స్న అంటుంది.
దాంతో కాఫీ తీరిగ్గా తాగుతాడు సూరజ్. కాఫీ బాగుంది. థ్యాంక్యూ అంటాడు సూరజ్. నాకు ఆఫర్ చేసే మనిషి కూడా నచ్చాలి. నీకో మాట చెప్పాలి ఐ లవ్యూ అని సూరజ్ అంటాడు. ఆ వంటలక్కను పోయి ఓదార్చు. మీరిద్దరు ఏం చేయలేరు అని జ్యోత్స్న అంటుంది. దీప దగ్గరికి సూరజ్ వెళ్తాడు. ఇడ్లీ కొట్టు నడుపుతున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చిందా అని అడుగుతాడు.
సూరజ్ లాటరీ ఐడియా
ఓసారి వచ్చిందని లాటరీ తీసి నెక్ట్స్ డే వాళ్లకు ఫ్రీగా ఇచ్చేవాళ్లమని, మిగిలిపోయిన ఫుడ్ హాస్పిటల్‌లో ఫ్రీగా పంచేదాన్నని చెబుతుంది దీప. అయితే, పదండి. ఇప్పుడున్న సమస్యకు గతంలో మీరు చేసిన పని పరిష్కారం అయిందని, ముందు మనం డిస్కస్ చేసుకుని పెద్దయ్య గారి దగ్గరికి వెళ్దామని సూరజ్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


