కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను వదిన అన్న సూరజ్.. పిన్నీసుతో పొడిచిన జ్యోత్స్న.. దీప అసిస్టెంట్‌గా జ్యో.. తాత శిక్ష
Karthika Deepam 2 Serial June 30th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 30వ ఎపిసోడ్‌లో దీపను సూరజ్ వదిన అని పిలుస్తాడు. దాంతో దీప తెగ మురిసిపోతుంది. మరిది ఫ్యామిలీ గురించి తెలుసుకోమ్మని కార్తీక్‌తో చెబుతుంది దీప. స్కూటీపై వెళ్తుంటే సూరజ్‌కు పిన్నీస్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది జ్యోత్స్న.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌ను గెంటేసేందుకు వేసిన పారిజాతం ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అవుతుంది. పారిజాతంతో తను చేసింది, అవుట్ హౌజ్‌కి తాళం కొన్నదే తానని, మూడు తాళాల్లో నా దగ్గర ఒక్కటుంది. సూరజ్ కాల్ చేయడంతో వచ్చి తీశాను. తప్పు పారు. మంచోడిని నాశనం చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని కార్తీక్ అంటాడు.

చాలా అనుభవిస్తున్నావ్
ఇప్పటికే చేసిన వాటికి చాలా అనుభవిస్తున్నావ్. ఇది తాతకు తెలిస్తే అని కార్తీక్ అంటే.. బతకనివ్వడు అని పారిజాతం అంటుంది. ఎవరికి మంచిది కాదు అని కార్తీక్ అంటాడు. పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. చప్పట్లు కొడుతుంది జ్యో. క్యారెక్టర్ లేని సూరజ్ గాడిని మరో రెండు మెట్లు ఎక్కించావ్. అంతా తెలిసి బావ సైలెంట్‌గా ఉన్నాడంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉందని జ్యోత్స్న అంటుంది.
మనం ఊహించలేనిది ఏదో జరుగుతుందని జ్యోత్స్న అంటుంది. మరోవైపు సూరజ్ థ్యాంక్స్ చెబుతాడు. జరిగింది చెబుతాడు. సూరజ్‌కు దీప స్వీట్స్ ఇస్తుంది. థ్యాంక్స్ వదినా అని సూరజ్ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఎందుకో వదినా అని పిలవాలనిపించింది. నాకు ఒక బంధం ఉండాలని అని, స్వీట్స్ చాలా బాగుంది వదిన అని సూరజ్ అంటాడు.
జాగ్రత్తగా ఉండమని చెప్పి కార్తీక్, దీప వెళ్లిపోతారు. సూరజ్ వదిన అన్నది తలుచుకుని దీప మురిసిపోతుంది. కొత్త బంధం నా మరిది సూరజ్, నాకు ఒక మరిది దొరికాడు. నీకు తమ్ముడు దొరికాడు అని దీప అంటుంది. ఎక్కువ రోజులు ఉండని బంధంపై ఎక్కువ ప్రేమ పెంచుకోకని, మనం అనుకున్నదానికంటే సూరజ్ డిఫరెంట్‌గా ఉన్నాడని, రేపు వెళ్లిపోతానంటే ఏం చేయలేమని కార్తీక్ అంటాడు.
సూరజ్ గురించి తెలుసుకోవాలి
సూరజ్ మనతో ఉండాలంటే నువ్వో పని చేయాలి. తను సొంత విషయాలు తెలుసుకో. తనెవరో, అమ్మనాన్న, కుటుంబం గురించి తెలుసుకుంటే ఇంకో బ్రాంచ్‌లో తన స్టాల్ పెట్టొచ్చు. సూరజ్ చాలా మంచివాడు బావ. నేను గెలవడానికి ఎంతో హెల్ప్ చేశాడు. నాకో తోబుట్టువు ఉంటే బాగుండు అనేది జ్యోతో తీరలేదు కానీ, తమ్ముడుంటే బాగుండు అనేది సూరజ్‌తో తీరిగిందని దీప అంటుంది.
అక్క అని పిలిస్తే తమ్ముడు అయ్యేవాడు వదిన అని పిలిచి మరిది అయిపోయాడు. అతనికోసం ఏదైనా చేయాలని దీప అంటుంది. ఎందుకు చేయలేం అని శౌర్య లేస్తుంది. ఇద్దరిని పడుకోమంటుంది. ఇద్దరు పడుకుంటారు. సూరజ్ గురించి తెలుసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం జ్యోత్స్నకు మేనేజర్ కాల్ చేసి అర్జంట్‌గా ఆఫీస్‌కు రావాలని, ఛైర్మన్ ఆర్డర్ అని అతను చెబుతాడు.
దాని గురించి జ్యోత్స్న మండిపడుతుంది. పారిజాతం కూడా ఆఫీస్‌కు వస్తానని అంటే కారు ఏది లేదని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కార్తీక్ స్కూటీపై వచ్చిన సూరజ్ హారన్ కొడతాడు. దానికి ఇద్దరు షాక్ అవుతారు. పది నిమిషాల్లో ఉండాలని కాల్ వచ్చిందిగా. 2 నిమిషాలు అయిపోయాయి. స్కూటీ ఎక్కితే తీసుకెళ్తా లేకుంటే లేదని సూరజ్ అంటాడు.
ఒకే బైక్‌పై సూరజ్, జ్యోత్స్న
చేసేది లేక స్కూటీ ఎక్కుతుంది జ్యోత్స్న. గోతులు ఉంటాయని, జాగ్రత్తగా కూర్చోమని సూరజ్ చెబితే. జ్యోత్స్న వినదు. గోతుల్లో పడకుండా నడపరా అని జ్యోత్స్న అంటుంది. గోతిల్లో పడేటప్పుడల్లా జ్యోత్స్న తన పిన్నీసుతో సూరజ్‌ను పొడుస్తుంది. పిన్నీస్ ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో సూరజ్ నొప్పి పుడుతుందని అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు.
మరోవైపు దీపకు ఆఫీస్‌లో అంతా చప్పట్లతో వెల్‌కమ్ చెబుతారు. జీవితంలో దీప మొహం చూడను అన్న శివ నారాయణే కంగ్రాట్స్ చెబుతాడు. దీప అందరికి స్వీట్స్ ఇస్తుంది దీప. దశరథ్ గురించి అడిగితే.. ముఖ్యమైన పని మీద బెంగళూరు వెళ్లాడని తాత చెబుతాడు. దీపను క్యాబిన్‌లోకి తీసుకెళ్లి సీఈఓ చైర్‌లో కూర్చొబెడతాడు శివ నారాయణ.
ఇకనుంచి కంపెనీ బాధ్యతలు నీవే అని చెప్పి అందరితోపాటు వెళ్లిపోతాడు శివ నారాయణ. కార్తీక్‌కు స్వీట్ తినిపించి ఆశీర్వదించమని కాళ్లమీద పడుతుంది దీప. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని కార్తీక్‌ను హగ్ చేసుకుంటుంది దీప. ఇదంతా నువ్వు ఇచ్చిందే అని ఎమోషనల్ అవుతుంది. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకున్న ఈ దీప ఈ సంస్థకు అధినేత అయింది. ఇదంతా నీవల్లే అని దీప అంటుంది.
కూతురిగా నిలబెట్టిన రోజే
ఈ విజయాన్ని నీకే అంకితం ఇస్తున్నా. నువ్వు లేకపోతే నేను లేను అని దీప అంటుంది. నువ్వెవరు నాకోసం పుట్టినదానివి. ఈ పారిజాతం, జ్యోత్స్న ఎక్కడ ఉండాల్సినవారు. ఇది నీ స్థానం. నిన్ను సీఈఓ నుంచి మనవరాలిగా చేసే ప్రయాణం మరో ఎత్తు. నిన్ను అత్తమావయ్య పక్కన కూతురుగా నిలబెట్టిన రోజున అప్పుడు థ్యాంక్స్ చెప్పు అని కార్తీక్ అంటాడు.
నీ బిడ్డ సుమిత్ర మనవరాలిగానో, మనవడిగానో పుట్టాలి. ఏదో ఒక రోజు నేను నీ మనవరాలిని కాదని తాతతో జ్యోత్స్న చెప్పే రోజు వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకుని అందరి కాళ్లు పారిజాతం పట్టుకునే టైమ్ వస్తుంది. సరే.. ఇదంతా వదిలేయి. అమ్మ ఇచ్చిన చీరలో చాలా బాగున్నావని కార్తీక్ అంటాడు. ఆ మాటలన్నింటిని జ్యోత్స్న వింటుంది.
ఇంకో దోషికి ఏ శిక్ష పడుతుందో చూద్దాం పదా అని కార్తీక్ అంటాడు. దాంతో జ్యో వెళ్లిపోతుంది. శివ నారాయణ ఓ పేపర్ ఇచ్చి ఇందులో అన్ని రాశాను. నువ్వు జ్యోత్స్నకు అర్థమయ్యేలా చదువు అని అంటాడు. జ్యోత్స్న చేసిన తప్పుకి విధించబడుతున్న శిక్ష. పాయింట్ నెంబర్ 1 ప్రతిరోజు ఆఫీస్‌కు రావాలి అని కార్తీక్ అంటాడు.
దీప అసిస్టెంట్‌గా జ్యోత్స్న
ఆఫీస్‌కు వచ్చి నేనేం చేయాలని జ్యో అంటుంది. నీకో పోస్ట్ ఇచ్చారుగా డీఏ అని కార్తీక్ అంటాడు. డీఏ అంటే చాలా పెద్ద పోస్ట్ అని పారిజాతం మురిసిపోతుంది. అవును చాలా పెద్ద పోస్టు.. డీఏ అంటే దీప అసిస్టెంట్ అని కార్తీక్ అంటాడు. శివ నారాయణ కూడా అవును అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


