కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ మాస్టర్ స్ట్రోక్- జ్యోత్స్న, పారు కుట్ర బట్టబయలు- సీఓగా దీప- బాంబ్ పేల్చిన సూరజ్!
Karthika Deepam 2 Serial June 25th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 25వ ఎపిసోడ్‌లో బాలరాజుకు షూటింగ్ అని చెప్పి శివ నారాయణ ముందు ఆర్డర్ గురించి చెప్పిస్తాడు కార్తీక్. పారిజాతం అలా చేయించిందని బాలరాజు నిజం చెబుతాడు. జ్యోత్స్నతో పారు మాట్లాడిన కాల్ రికార్డ్ వినిపిస్తాడు కార్తీక్.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కంపెనీలో సీఈఓ అనౌన్స్‌మెంట్ కోసం బోర్డ్ మీటింగ్ ఏర్పాటు అవుతుంటుంది. మెంబర్స్ వచ్చారని శివ నారాయణకు స్టాఫ్ బాయ్ చెప్పడంతో మీటింగ్‌కు వెళ్తాడు. దారిలో కార్తీక్ ఆపి ఒక వర్ధమాన నటుడుని చూశాక బోర్డ్ మీటింగ్‌కు వెళ్లమని ఆపుతాడు.

బాలరాజుతో కార్తీక్
పారిజాతం కూడా ఆఫీస్‌కు వస్తుంది. ఎందుకు వచ్చావని శివ నారాయణ అడిగితే.. సీఈఓ ఎవరనేది కళ్లారా చూద్దామని వచ్చానని పారు అంటుంది. జ్యోత్స్న కాల్ చేసి చెబుతానని చెప్పాగా అని అంటే.. లైవ్‌లో చూస్తే వచ్చే మజా వేరని పారు అంటుది. మరోవైపు బాలరాజు దగ్గరికి వెళ్లిన కార్తీక్ ఇది షూటింగ్‌లా ఉండదని, పాత్రలు ప్రవేశాన్ని బట్టి మారిపోతుందని చెబుతాడు.
బాలరాజు కళ్లకు గంతలు కడతాడు. ఎదుటి వాళ్లను మీరు చూస్తే వాళ్లు తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో నిన్ను డామినేట్ చేస్తారు. అందుకే కళ్లకు గంతలు కట్టానని కార్తీక్ అంటాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టమని బాలరాజు అంటాడు. పాకెట్‌లో చెక్ పెట్టి సేమ్ దీప దగ్గర చేసినట్లు స్క్రిప్ట్ చెబుతాడు కార్తీక్. ఇలాగే ఇదివరకే చేశానని బాలరాజు అంటాడు.
ఇలా అనుమానాలుంటే హీరోవి అవ్వలేవని బాలరాజును శివ నారాయణ దగ్గరికి తీసుకెళ్లిపోతాడు కార్తీక్. సూరజ్, దీప కూడా వస్తారు. బాలరాజును చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. వీడు బావకు ఎలా దొరికేశాడని జ్యో అనుకుంటుంది. బాలరాజు యాక్షన్ అని కార్తీక్ అనగానే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. వెయ్యి భోజనాలు కావాలి. మెనూ మాత్రం రిచ్‌గా ఉండాలని బాలరాజు అంటాడు.
చెంపదెబ్బ కొట్టిన శివ నారాయణ
ఆ మాటలు విన్న శివ నారాయణ వాడేనా వీడు అని కళ్లతో సైగ చేస్తాడు. అవును అన్నట్లుగా కార్తీక్ అంటాడు. బాలరాజు చెక్ తీసుకోండి అని ఇస్తుంటే లాగిపెట్టి గట్టిగా కొడతాడు శివ నారాయణ. అతను కిందపడిపోతాడు. కళ్లకు గంతలు తీసి ఏంటీ సర్ చెంపదెబ్బలు ఉన్నాయని ముందే చెప్పాలిగా. సడెన్‌గా కొట్టేసరికి గూబ గూయ్ మందని లేస్తాడు బాలరాజు.
పారును చూసి హాయ్ మేడమ్. మీరేంటీ ఇక్కడ ఉన్నారు అని బాలరాజు అడుగుతాడు. తనేలా నీకు తెలుసు అని శివ నారాయణ అడుగుతాడు. దీపను కూడా చూసిన బాలరాజు ఇది వేరే షూటింగ్ అన్నారని అంటాడు. కానీ, ఆర్టిస్టులంతా సేమే. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకుంటే జరిగిన నష్టానికి పోలీసులు తీసుకెళ్తారు. భోజనం ఆర్డర్ ఇచ్చి తీసుకోకుంటే నష్టమేగా. పైగా చెక్కు కూడా ఇచ్చావని కార్తీక్ అంటాడు.
నేను ఇవ్వడమేంటీ. అది ఇప్పించింది ఈ మేడమ్ కదా అని పారిజాతం గురించి చెబుతాడు బాలరాజు. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలని కార్తీక్ అడుగుతాడు. నేను జూనియర్ ఆర్టిస్ట్‌నండి. క్యారెక్టర్ ఉందని చెప్పి నాతో ఫుడ్ ఆర్డర్ ఇప్పించారు. రెమ్యునరేషన్ అయితే మంచి పేమెంట్ ఇచ్చాడు. కానీ, ఎవరికి చెప్పొద్దన్నారని బాలరాజు నిజం చెప్పేస్తాడు.
పారిజాతంపై నింద
తాత ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అని కార్తీక్ అంటాడు. పోలీసులకు ఫోన్ చేయండని శివ నారాయణ అంటాడు. దాంతో శివ నారాయణ కాళ్ల మీద బాలరాజు పడతాడు. క్యారెక్టర్ ఉందంటే వచ్చాను సర్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని వేడుకుంటాడు బాలరాజు. ఇంకోసారి కెమెరా ముందే నటించు అని పంపిస్తాడు శివ నారాయణ.
పారిజాతంను దోషి అంటూ శిక్ష పడాలని శివ నారాయణ తిడుతుంటే.. డైవర్ట్ చేయాలని జ్యో అనుకుంటుంది. ఏంటీ గ్రానీ దీపపై కోపం ఉంటే వేరేలా చూసుకోవాలి కానీ ఇలా చేయాల అంటుంది. పారిజాతం షాక్ అవుతుంది. జ్యో కన్నుకొట్టి పారిజాతంపై నింద నెట్టేస్తుంది. దీప జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది కదా అని డ్రామా చేస్తుంది జ్యోత్స్న.
తాత మీద కూడా పారుకు కోపం ఉన్నట్టుంది అని కార్తీక్ అంటాడు. తాత గ్రానీని గట్టిగా శిక్షిద్దాం. కానీ, ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ మనకోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లకు ఇది తెలిసిన బాగోదు అని జ్యోత్స్న అంటుంది. నువ్వెందుకు కంగారుపడుతున్నావ్. బాలరాజు ఇచ్చిన ఆర్డర్ నువ్వు ఎప్పటికీ తీసుకోవు. నాలుగు వేలకు ఇచ్చిన కూడా తీసుకోవు. ఎందుకంటే బాలరాజను పారుతో పురామియించిది నువ్వే కాబట్టి అని కార్తీక్ అంటాడు.
అడ్రస్ లేకుండా చేస్తాను
దాంతో అంతా షాక్ అవుతారు. దీపను సీఈఓ చేయడానికి నింద నా మీద వేస్తున్నావా అని జ్యోత్స్న అంటుంది. అందుకే మంచి కాల్ రికార్డింగ్ పట్టుకొచ్చాను అని పారిజాతంతో జ్యోత్స్న మాట్లాడింది వినిపిస్తాడు. బాలరాజును పంపించింది నేనే. దీప సీఈఓ కాదు. నేను సీఈఓ అయ్యాక దీపను, సూరజ్ గాడిని అడ్రస్ లేకుండా చేస్తాను అని పారుతో జ్యో మాట్లాడింది వింటాడు శివ నారాయణ.
పారిజాతం సరే ఉంటాను అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చింది, ఏం పారు అంతా ఓకేనా అన్నది గుర్తు చేసుకుంటుంది పారిజాతం. వీడే దగ్గరుండి ఫోన్ చేయించాడు. వీడే తీసుకొచ్చాడు. గట్టిగా ఇరికించేశాడు ఈ మాయలోడు అని భయపడిపోతుంది పారిజాతం. అంటే, ఇదంతా కార్తీక్ మాస్టర్ స్ట్రోక్ అని అర్థమైపోతుంది. అలా పారిజాతం, జ్యోత్స్న ద్రోహాన్ని బట్టబయలు చేస్తాడు కార్తీక్. గ్రానీ నీతోపాటు నన్ను కూడా ముంచేశావ అని జ్యోత్స్న అనుకుంటుంది.
శివ నారాయణ గారు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. కానీ, తీసుకునేదానికంటే ఈ ఆఫీస్ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని పెద్ద బాంబ్ పేలుస్తాడు సూరజ్. వాళ్లు తప్పు చేస్తే మీరు వెళ్లిపోవడమేంటీ అని దీప అంటుంది. నేనే కాదు మీరు కూడా వెళ్లిపోండి. ఇలాంటి మనుషులతోనా మనం పోటీ పడేది. అడ్డదారులతో గెలిచేవాళ్లతో పోటీ పడలేం. వాళ్లలో నిజాయితీ ఉండదు అని సూరజ్ అంటాడు.
మీరు వెళ్లిపోండి దీప గారు
ప్లీజ్ దీపగారు మీలాంటి వాళ్లు ఉండాల్సిన ప్లేస్ కాదు ఇది. మీరు వెళ్లండి. నేను వెళ్లిపోతాను అని సూరజ్ వెళ్లిపోతుంటే శివ నారాయణ ఆపుతాడు. నేరం చేసినవాళ్లు వెళ్లాలి. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు నేరస్థులే అని శివ నారాయణ అంటాడు. గ్రానీని ఏమనకు తాత. నేను చెబితేనే చేసిందని జ్యోత్స్న నిజం ఒప్పుకుంటుంది. ఇంతలో స్టాఫ్ వచ్చి బోర్డ్ మెంబర్స్ గురించి చెబుతాడు.
దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు బోర్డ్ మీటింగ్‌కు వెళ్దామని శివ నారాయణ అంటాడు. అంతా మీటింగ్‌కు వెళ్తారు. బోర్డ్ మెంబర్స్ సీఈఓ ఎవరనేది అడుగుతారు. ఇప్పుడు తాత దీప పేరే చెబుతాడు. దానికంటే ముందు ఓ పని చేయాలని శివ నారాయణ చెప్పబోతుంటే ఆపుతుంది జ్యోత్స్న. ఈ సీఈఓ కాంపిటీషన్ విన్నర్ ఎవరో నేనే అనౌన్స్ చేస్తాను అని జ్యోత్స్న అంటుంది.
జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓకి అర్హత కలిగిన మనిషి దీప అని జ్యోత్స్న చెబుతుంది. చదివింది ఐదో క్లాస్ అయిన తన ఓర్పుతో, తెలివితో సీఈఓగా గెలిచింది అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న గారు వద్దనుకోవడం వల్లే దీప గెలిచిందని ఒకతను అంటాడు. అని ఎవరు చెప్పారు. వారికి వచ్చిన లెక్కలతోనే చూద్దామని శివ నారాయణ అంటాడు.
జ్యో కంటే దీపకు 41 శాతం ఎక్కువ
జ్యోత్స్నకు అప్పగించిన బ్రాంచ్ 44 శాతం గ్రోత్ సాధించింది. దీపకు అప్పగించిన బ్రాంచ్ 85 శాతం గ్రోత్ సాధించింది అని శివ నారాయణ చెబుతాడు. దాంతో అంతా చప్పట్లు కొడతారు. అలా దీప సీఈఓగా గెలుస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


