కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పేదరాణిగా పారు, గదికి సీల్- సూరజ్‌ను గెంటేసే కుట్ర- దీపకు బంగారం, చీరలు-జ్యోపై సుమిత్ర డౌట్
Karthika Deepam 2 Serial June 27th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్‌లో శివ నారాయణ శిక్ష విధించడంతో పారిజాతం పనిమనిషిలా మారిపోతుంది. జ్యోత్స్న ఏదైనా తప్పు చేస్తే అస్సలు క్షమించకండని, కన్నతండ్రిని వద్దనుకున్నదాన్ని కూతురుని వదులుకోలేనా అని సుమిత్ర అంటుంది. ఆ మాటలు జ్యో వింటుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో పారుకు నెలరోజుల పాటు దీక్ష శిక్ష వేస్తాడు శివ నారాయణ. ఆ బాధ్యతలు కార్తీక్‌కు అప్పగించి ఈ క్షణమే అమలు జరుగుతుందంటాడు. కట్ చేస్తే పారిజాతం పని మనిషిలా వస్తుంది.

నన్ను పనిదాన్ని చేశావుగారా
నగలు, కాస్ట్‌లీ చీర కాకుండా అచ్చం మునుపటి పని మనిషిలా కనిపిస్తుంది. పూర్వ వైభవం వచ్చినట్లు లేదు అని కార్తీక్ అంటే.. నన్ను పనిదాన్ని చేశావు కదరా. దీప యజమాని అయింది, నేను పనిదాని అయ్యాను అని పారిజాతం అనుకుంటుంది. సర్వసంగ పరిత్యాగిలా తయారయ్యానురా అని బయటకు అంటుంది పారిజాతం.
పారు మీద నాకు నమ్మకం లేదు. సీక్రెట్‌గా ఏసీలా పడుకుని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటుందేమో అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం గదికి శివ నారాయణ సీల్ వేస్తాడు. ఇంట్లో ఎక్కడైనా పడుకోవచ్చని చెబుతాడు. మీరు దేవుడు సర్ అని కార్తీక్ అంటాడు. ఈ పారిజాతం శపథం విను. మళ్లీ మీ తాత చేతులతో ఆ గది సీల్ తీసేవరకు నేను ఈ కురులు ముడివేయను అని పారిజాతం శపథం చేస్తుంది.
నిన్ను ఈ గెటప్‌లో చూడాలా. జుట్టు విరబూసుకుని తిరిగితే నీకేదో గాలి సోకిందని బూత వైద్యుడిని పిలిపిస్తారని పారిజాతం అంటుంది. అయితే, ఈ శిక్ష మాకు అని కార్తీక్ అంటాడు. మరోవైపు నువ్వు ఎప్పుడైతే దీప మెడలో తాళి కట్టావో అప్పటి నుంచి దీపపై పగ పెంచుకుంది జ్యోత్స్న. ఆ పగతో దీప ఎన్నో కుట్రలు చేసింది. అలాంటిది ఇప్పుడు దీపను సీఈఓగా ఉండనిస్తుందా అని కాంచన అంటుంది.
సీఈఓగా శౌర్య
కానీ, దీప కడుపుతో ఉంది. అదే నా భయం. దీంట్లో అత్తగారిగా నాకు గర్వంగా ఉంది. నా కొడుకు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే నువ్వు గౌరవంగా బాధ్యతలు తీసుకోబోతున్నావు అని కాంచన అంటుంది. అవును నానమ్మా.. మా అమ్మ సీఈఓ అయిందని ఫ్రెండ్స్‌కి చెబుతానని శౌర్య అంటుంది.
జ్యోత్స్న రెస్టారెంట్‌కు అందరు మనింటి నుంచే సీఈఓలు అవుతున్నారు. ముందు నువ్వు తర్వాత మీ నాన్న, ఇప్పుడు నీ భార్య అని కాంచన అంటుంటే.. తర్వాత నేను అని శౌర్య అంటుంది. పెద్దయ్యాక అవుతాను అంటుంది. అమ్మ ఇప్పుడు సీఈఓగా చీర కట్టుకుని వెళ్తుందా.. సూట్ వేసుకుంటుందా అని శౌర్య అంటే.. చీర అని దీప చెబుతుంది.
జ్యోత్స్న గురించి తెలిస్తే మా వదిన అస్సలు ఊరుకోదు అని కాంచన అంటుంది. మరోవైపు శివ నారాయణ, దశరథతో సుమిత్ర మాట్లాడుతుంది. నా కూతురు ఏమైనా చేసిందా. గెలిచినందుకు దీప సంతోషంగా ఉంది. కానీ, జ్యోత్స్న మాత్రం దీప గెలిచినందుకే ఎక్కువ బాధగా ఉందనిపించింది. అలాగే, మీరు అత్తయ్య విషయంలో కోపంగా ఉన్నారు. శిక్ష విధించారు. అందులో నా కూతురు కూడా ఉందా. ఉంటే అస్సలు క్షమించకండి మావయ్య గారు అని సుమిత్ర అంటుంది.
నన్ను ఇంట్లో ఉండనివ్వరు
ఆ మాటలు జ్యోత్స్న విని షాక్ అవుతుంది. నీ కూతురును సరిచేసే బాధ్యత నాదే అని శివ నారాయణ అంటాడు. అయితే నా కూతురు తప్పు చేసిందని అర్థమైందని సుమిత్ర అంటుంది. పందెంలో గెలవలేదు. ఆటలో నేను గెలిపిస్తాను అని శివ నారాయణ అంటే.. వద్దు. తన ఆట తను ఆడనివ్వండి. లేకుంటే గెలుపు విలువ తెలియదు. క్షమించరాని తప్పు చేస్తే నాకు చెప్పండని సుమిత్ర అంటుంది.
ఏం చేస్తావని దశరథ్ అడిగితే.. నన్ను కన్నవాళ్లనే వద్దనుకున్నాదాన్ని కన్నదాన్ని వద్దనుకోలేనా అని సుమిత్ర షాక్ ఇస్తుంది. అంటే నేను తప్పు చేశానని తెలిస్తే వీళ్లు నన్ను ఇంట్లో ఉండనివ్వరు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న నీ కూతురు కాదని నేనే చెబుతాను అని దశరథ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు తన గదికి వెళ్లిన జ్యోత్స్నకు జుట్టు విరబోసుకుని చీకట్లో దెయ్యంలా కనిపిస్తుంది పారిజాతం.
అది చూసి షాక్ అవుతుంది జ్యో. లైట్ వేసి చూసి భయం ఆపుకుని నా రూమ్‌లోకి వచ్చావేంటని అడుగుతుంది జ్యోత్స్న. ఈ శిక్షకు పూర్తిగా అర్హురాలివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు నాకు మనవరాలిగా పుట్టకుండా ఉండాల్సిందే. నేను నిన్న మహారాణి చేద్దామని చూస్తే నువ్వు నన్ను ఇదిగో పేదరాణివి చేశావు అని పారు అంటుంది.
సూరజ్‌ను తరిమేసే ప్లాన్
మీ తాత మర్చిపోయినదాన్ని సూరజ్ గాడే గుర్తు చేశాడని పారిజాతం అంటుంది. పారును ఎగతాళి చేస్తే రేపు నీకు ఇదే గతి. నువ్వు నన్ను అంటే అద్దంలో నీపై నువ్వు ఉమ్మేసుకున్నట్లే అని పారు అంటుంది. సూరజ్ గాడు ఉన్నంతకాలం ఏం చేయలేం. పాతరోజులు రావాలంటే వాడు ఉండకూడదు. ఆ సూరజ్ గాడు పెద్ద 420. వాడి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అని జ్యోత్స్న అంటుంది.
నాకు వచ్చిన పరిస్థితే ఆ సూరజ్ గాడికి వచ్చేలా చేస్తా. ఏ క్యారెక్టర్ చూసి మీ తాత గొప్పగా ఫీల్ అవుతున్నాడో ఆ క్యారెక్టర్‌నే లేకుండా చేస్తాను అని పారు అంటే.. ఏం చేసిన నన్ను ఇరికించకు అని దండం పెడుతుంది జ్యో. ఈ పారు జుట్టు ముడేసిందంటే ఎవరికో మూడినట్లే. కాసేపట్లో అందరిని అరిపిస్తా. సూరజ్ గాడిని తరిమేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందని జుట్టు ముడేసి శపథం చేస్తుంది.
నువ్వు ఇక్కడే ఉండు. కాసేపట్లో ఇంటి వాకిట్లో సూరజ్ గాడి పరువు తీసి శివ నారాయణ చేత గేట్ బయటకు గెంటించే బాధ్యత నాది అని వెళ్తుంది పారిజాతం. సూరజ్‌ను తరిమేయడానికి గ్రానీ ఏం చేయబోతుందని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు దీప ఉదయమే వెళ్లాలని రాత్రే స్వీట్స్ చేస్తుంది. అత్తకు ఇస్తుంది. బాగుందని కాంచన అంటుంది.
దీపకు బంగారం, చీరలు
కార్తీక్ కూడా తిని ఈ గెలుపుకు కారణమైన సూరజ్‌కు కూడా ఇద్దాం. బాక్స్‌లో పెట్టమని కార్తీక్ అంటాడు. దీపకు బంగారంతో చేయించిన చైన్, చీరలు ఇస్తుంది కాంచన. అదంతా సీఈఓ అయినందుకు అని, పదవికి తగినట్లుగా ఉండాలని కాంచన చెబుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


