కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర దగ్గర దాచిన నిజం-పారిజాతంకు శిక్షగా 5 నియమాల దీక్ష-జ్యోత్స్నకు మాత్రం ఒకరోజు వాయిదా

Karthika Deepam 2 Serial June 26th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26వ ఎపిసోడ్‌లో సీఈఓ రేసులో దీప గెలిచిందని శివ నారాయణ ప్రకటిస్తాడు. బయటకి వచ్చాక పారిజాతం పీక పట్టుకుంటుంది జ్యోత్స్న. సుమిత్ర దగ్గర నిజం చెప్పొద్దని శివ నారాయణను బతిమిలాడుకుంటారు పారిజాతం, జ్యోత్స్న. దాంతో ఇంట్లో అది చెప్పడు.

Published on: Jun 26, 2026, 07:06:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సీఈఓ పోటీలో దీపే విన్నర్ అని, దీపే కాబోయే సీఈఓ అని, రేపటి నుంచి దీపే సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుందని, ఎవరో వదిలేసుకోవడం వల్ల దీప సీఈఓ కాలేదని శివ నారాయణ అనౌన్స్ చేస్తాడు.

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26 ఎపిసోడ్

పారిజాతం పీక పట్టుకున్న జ్యోత్స్న

అంతా చప్పట్లు కొడతారు. కంగ్రాట్స్ చెబుతారు. జ్యోత్స్న కూడా దీపకు కంగ్రాట్స్ మేడమ్ అని చెబుతుంది. పారిజాతం పారిపోతుంది. గ్రానీ ఆగు అని పిలిచిన జ్యోత్స్న పారిజాతం పీక పట్టుకుంటుంది. నేనేం చేశానే అని పారిజాతం అంటుంది. దీపను ఇంకా నీ మనవరాలివని నమ్ముతున్నావుగా. అందుకే ఎవరితోనే ఫోన్ చేయించి నిజం బయటపెట్టించావుగా అని జ్యోత్స్న అంటుంది.

అసలు ఫోన్ చేయించిందే కార్తీక్ గాడు. వాళ్లకు మనిద్దరం దొరికాం. ఒక లైవ్ ఎవిడెన్స్ కోసం ఇదంతా చేశాడు అని పారిజాతం చెబుతుంది. నిజం చెప్పు నువ్వు వాళ్ల పార్టీనే కదా అని జ్యోత్స్న అంటుంది. కాదే.. నీ పార్టీనే అని ఒట్టు వేయబోతుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటీ పారు పార్టీ మార్చేశావా అని కార్తీక్ అంటాడు.

వినేశావా. అన్ని వింటావురా.. అని టేబుల్‌కు తలను బాదుకుంటుంది పారిజాతం. పారిజాతం తెగ భయపడుతుంది. నన్ను కాపాడురా అని పారిజాతం అంటే.. నేను మరి అంత మంచోడిని కాదని, మీరు ఇద్దరు తోడుదొంగలని తెలిశాక ఎందుకు వదిలిపెడతాం అని కార్తీక్ అంటాడు. వీడు ఇంక నన్ను నమ్మడని పారిజాతం అంటుంది.

ఊరికే వదిలేయడం కరెక్ట్ కాదు

వాళ్లంతా సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇది మర్చిపోతారులే అని జ్యో పారును తీసుకెళ్తుంది. శివ నారాయణ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది దీప. తప్పు చేసిన వాళ్లను ఊరికే వదిలేయడం కరెక్ట్ కాదు అని సూరజ్ అంటాడు. మోసం చేసే వాళ్ల నీడను కూడా మా తాత ఇంటి మీద పడనీయడు. అలాంటిది ఇది చాలా పెద్ద తప్పు అని కార్తీక్ మరింత ఎక్కిస్తాడు.

దీప సీఈఓగా ఉంటుంది. సూరజ్ సహాయంగా ఉంటాడు. ఈ దోషుల గురించి ఇంట్లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అంటాడు పారిజాతం. అమ్మకు తెలిస్తే ఇంట్లోంచి గెంటేస్తుందని గుర్తు చేసుకున్న జ్యో పారుకు సైగ చేస్తుంది. దాంతో శివ నారాయణ కాళ్ల మీద పడుతుంది పారిజాతం.

నా కాళ్ల మీద పడే అర్హత కూడా నీకు లేదు. బయటి వాళ్లు నా గౌరవం కోసం ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం పోయేలా చేస్తున్నారు. మిమ్మల్ని దండించి, శిక్షించి నేను అలసిపోయాను. మీలో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇంకా మిమ్మల్ని మార్చేది నా కోడలే. తను ఏ నిర్ణయం తీసుకుంటుందో తనిష్టం అని శివ నారాయణ అంటాడు.

అడ్డు పడిన దీప

సుమిత్రకు చెప్పొద్దని పారిజాతం, జ్యోత్స్న వేడుకుంటారు. దీప కూడా ఇంట్లో చెప్పొద్దని అంటుంది. నువ్వెందుకు అడ్డు పడతున్నావ్. మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా అని కార్తీక్ అంటాడు. మమ్మీకి చెప్పొద్దని జ్యో భయపడుతుంది. ఈ భయం తప్పు చేసేటప్పుడు ఎందుకు ఉండట్లేదు, మేమెందుకు గుర్తుకు రావట్లేదు అని శివ నారాయణ అంటాడు.

పట్టుదల వస్తే కన్నతండ్రినే వదులుకున్న సుమిత్ర కూతురు విషయంలో ఊరుకుంటుందా. దీప రేపు సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాకా నీ సంగతి చెబుతా అని శివ నారాయణ అంటాడు. తాత పెద్ద నిర్ణయమే తీసుకున్నాడని జ్యో అనుకుంటుంది. సూరజ్ వెళ్లిపోతానని అంటే.. కోపంగా ఎక్కడికి వెళ్తావ్. నువ్వు కూడా ఇక్కడే ఉంటావని, కార్తీక్ నీ బాధ్యత చూసుకుంటాడు అని శివ నారాయణ అంటాడు.

మరోవైపు ఇంట్లో దీప గెలిచినందుకు సంతోషంగా ఉందని సుమిత్ర అంటుంది. వీళ్ల మొహాలు ఎందుకు తప్పు చేసినట్లు ఉన్నాయని జ్యో, పారిజాతంను అంటుంది. ప్రయత్నించి ఓడిపోయిన విజయమే అని సుమిత్ర అంటుంది. అవును మమ్మీ నేను స్పోర్టీవ్‌గానే ఉన్నా. దీప గెలిచినందుకు సంతోషంగా ఉందని జ్యో అంటుంది. ఎంత మెచ్యూర్డ్‌గా మాట్లాడుతుందో, ఈ పోటీ తనలో మార్పు తీసుకొచ్చిందని సుమిత్ర అంటుంది.

పారిజాతంకు శిక్ష

అవును. జ్యోత్స్న అందరి హృదయాలు గెలుచుకుందన్న కార్తీక్ పారిజాతంకు ఇచ్చే పనిష్‌మెంట్ ఏదో చెబితే వెళ్తామని అంటాడు. శిక్ష ఏంటని సుమిత్ర అడిగితే.. వాడు ఏదో ఆటపట్టిస్తున్నాడని, దీప వండిన వంటలు వడ్డించమని చెప్పి సుమిత్రను తీసుకెళ్తాడు దశరథ్. కార్తీక్ మీద పారిజాతం అరుస్తుంది. ఏం సర్ పాపిని క్షమించినట్టేనా అని కార్తీక్ అంటాడు.

పారిజాతం సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. తనకు ఎలాంటి శిక్ష వేస్తుందో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో అది చెప్పండని శివ నారాయణ అంటాడు. నా భార్యను ఎప్పుడు పని మనిషి అంటుంది. అది బాధగా ఉంటుంది. పారు మరోసారి నా భార్యను ఏం అనకుండా తీర్పు ఇవ్వాలని కార్తీక్ అంటాడు. సరే. ఈరోజు నుంచి నెల రోజులు పారిజాతం దీక్ష పాటించాలని శివ నారాయణ అంటాడు.

5 నియమాలతో పారు దీక్ష

దానికి 5 నియమాలు ఉంటాయి. ఇలాంటి చీరలు, నగలు ధరించకూడదు. ఒక్కపూట భోజనం చేయాలి. నాలుగు నేలపై పడుకోవాలి. గెటప్పులు, మేకప్పులు ఉండకూడదు అని శివ నారాయణ అంటాడు. అంటే పని మనిషిలా బతకడం అంటావా అని పారిజాతం అంటుంది. కానీ, పారు ఇవన్ని చేయదని కార్తీక్ అంటాడు.

ఒక్కరోజు తప్పిన ఇంకో రోజు శిక్ష పెరుగుతుంది. ఇదంతా చేయించాల్సిన బాధ్యత నీదే అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More