కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అదిరే ట్విస్ట్‌.. సూర‌జ్ గ‌దిలోకి అమ్మాయి.. కార్తీక్‌, దీప ఎంట్రీతో పారిజాతం ఫ్యూజులు ఔట్‌

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 29 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సూరజ్ ను ఇంటి నుంచి గెంటించాలని ఓ అమ్మాయితో పారు ప్లాన్ వేస్తుంది. కానీ కార్తీక్ ఊరుకుంటాడా? అదిరిపోయే ఎంట్రీతో పారు ఫ్యూజులు ఔట్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు. దీంతో పారు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది.

Published on: Jun 29, 2026, 07:21:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 29 ఎపిసోడ్ లో సూరజ్ ను ఔట్ హౌస్ నుంచి గెంటించేలా పారిజాతం ప్లాన్ వేస్తుంది. కానీ కార్తీక్ ఎంట్రీ ఇచ్చి ఆ ప్లాన్ ను అట్టర్ ఫ్లాప్ చేస్తాడు. పారుకు దిమ్మతిరిగే షాకిస్తాడు. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీపకు చీరలు, నగలు

దీప సీఈఓ కావడంతో అత్త కాంచన పొంగిపోతోంది. పట్టు చీరలు, నగలు ఇస్తుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడివని దీప అడుగుతుంది. మీ మామయ్య ఇచ్చారని కాంచన అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. మీ అవసరాల కోసమంటూ మీ మామయ్య గతంలో డబ్బు ఇచ్చారు. ఇప్పుడు అది ఇలా ఉపయోగపడింది. ఆయనకు జరిగిందంతా చెప్తే చాలా సంతోషపడ్డారు. మీ మామయ్య నీకు ఇస్తున్న కానుకలు అనుకో అని దీప చేతిలో కాంచన బంగారు చైన్ పెడుతుంది.

తాతయ్యకు ఫోన్

అప్పుడే వచ్చిన శౌర్య ఏమో కాంచనను ఇరికిస్తుంది. నన్ను రాత్రి పడుకో అని తాతయ్యతో ఫోన్లో మాట్లాడావ్ కదా. ఈ సారి ఫోన్ చేసినప్పుడు నాకు సైకిల్ తెమ్మని తాతయ్యకు చెప్పు అని శౌర్య అంటుంది. దీంతో ఒక్కసారిగా కాంచన కంగు తింటుంది. కొత్త బంగారు చైన్ కు తాళిబొట్టు కట్టి దీప మెడలో వేస్తాడు కార్తీక్. ఆ సీన్ అదిరిపోతుంది.

పారిజాతం ప్లాన్

మరోవైపు సూరజ్ ను ఇంటి నుంచి పంపించేందుకు పారిజాతం ప్లాన్ వేస్తుంది. ఒక అమ్మాయికి క్యారేజీ ఇచ్చి సూరజ్ ఉన్న ఔట్ హౌస్ కు పంపిస్తుంది పారు. పారును చూసి పని మనిషి అని ఆ అమ్మాయి అనుకుంటుంది. సూరజ్ లవర్ లా నటించి, హగ్ చేసుకోవాలి అంతే కదా అని ఆ అమ్మాయి ఔట్ హౌస్ కు వెళ్తుంది. ఆ అమ్మాయిని ఎవరు నువ్వు అని సూరజ్ అడుగుతాడు. ఆ అమ్మాయిని బయటకు వెళ్లమంటాడు. అప్పుడే పారు బయట నుంచి డోర్ వేసి లాక్ వేస్తుంది.

లోపల ఇరుక్కుపోయిన సూరజ్ ఆ అమ్మాయిపై అరుస్తాడు. మరోవైపు ఇంటి లోపలికి పరుగెత్తిన పారిజాతం ఘోరం జరిగిపోయిందంటూ కేకలు వేస్తుంది. చెప్పుకుంటే సిగ్గు చేటు, చెప్పకుండా గుండె పోటు అంటూ పారు తెగ ఓవరాక్షన్ చేస్తుంది. మీ కళ్లతో మీరే చూడండి అంటూ అందరినీ ఔట్ హౌస్ దగ్గరకు తీసుకెళ్తుంది.

పారు రాద్ధాంతం

పారు తాళం తీయగానే కనిపించిన సీన్ చూసి అందరూ షాక్ అవుతారు. సూరజ్ ఏమో వర్క్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఇల్లు క్లీన్ చేస్తుంది. అయినా పారు తగ్గకుండా రాద్ధాంతం చేస్తుంది. సూరజ్ మంచోడు అనుకుంటే, ఆ అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నాడని గోల చేస్తుంది. గ్రానీ ప్లాన్ కు సపోర్ట్ చేయాలని జ్యోత్స్న కూడా అనుకుంటుంది. అర్ధరాత్రి అమ్మాయిని గదిలోకి పిలవడం చుట్టు పక్కల వాళ్ల చూస్తే ఏం అనుకుంటారు? అని పారు అరుస్తుంది.

సూరజ్ ను గెంటేయాలని

సూరజ్ ఎవరా అమ్మాయి? అని శివ నారాయణ అడుగుతాడు. కానీ పారిజాతం మాత్రం అరుస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి లవర్ ను రప్పించుకున్నాడని ఇరికించాలని చూస్తుంది. ఈ దరిద్రుడిని ఇంటి నుంచి వెంటనే పంపించేయండని శివ నారాయణకు చెప్తుంది పారు. ఏవండి, వాడిని వెంటనే గెంటేయండని అరుస్తూనే ఉంటుంది.

కార్తీక్ అదిరే ట్విస్ట్

అప్పుడే కార్తీక్ ఔట్ హౌస్ లోపల నుంచి అదిరిపోయేలా ఎంట్రీ ఇస్తాడు. ఏంటి పారు? అంటూ మ్యాంగోస్ తినుకుంటూ వస్తాడు. లోపలి నుంచి దీప కూడా రావడంతో పారు, జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. మీరు ఏంట్రా ఇక్కడ అని దశరథ అడుగుతాడు. ఆ మాట నేను అడగాలి, మీరు ఔట్ హౌస్ దగ్గరకు ఎందుకు వచ్చారని కార్తీక్ అడుగుతాడు.

ప్లాన్ మార్చిన దీప

ఆ అమ్మాయి సూరజ్ లవర్ అంటా, ఎవరికి తెలియకుండా తీసుకొచ్చాడని జ్యో అంటుంది. అయితే పసుపు తాడు తీసుకు రండి పెళ్లి చేసేద్దాం అని కార్తీక్ అనగానే ఆ అమ్మాయి కంగారు పడుతుంది. ఈ అమ్మాయి పని మనిషి. మా వీధిలోనే ఉంటుంది. పేరు బుజ్జి. సూరజ్ ఔట్ హౌస్ క్లీన్ గా లేదంటే నేనే రప్పించా అని దీప చెప్తుంది. అంతకుముందే ఆ అమ్మాయికి తల ఆడించాలని దీప లోపల గట్టి వార్నింగ్ ఇస్తుంది. దీంతో దీప చెప్పినదానికి ఆ అమ్మాయి అవునని చెప్తుంది.

బ్రదర్ కు క్యారేజీ కూడా తెచ్చామని కార్తీక్ అనడంతో పారిజాతం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. పారిజాతంపై దశరథ, శివ నారాయణ ఫైర్ అవుతారు. పారును ఇంకా ఇరికించాలని కార్తీక్ చూస్తాడు. శివ నారాయణ ఆర్డర్ తో సూరజ్ కు పారు సారీ చెప్తుంది. అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు.

పారు ఫ్యూజులు ఔట్

పారు వెనకాలే కార్తీక్, దీప వస్తారు. ఆ అమ్మాయి పేరు బుజ్జి కాదు, గీత. ఆ అమ్మాయి పని మనిషి కాదు. డబ్బుల కోసం మనసు అమ్ముకునే మనిషి. నీ మాటలు విని లోపలికి వచ్చింది. మా మాటలు విని బయటకు వెళ్లింది. అసలు ఔట్ హౌస్ కు తాళం కొన్నదే నేను అని కార్తీక్ చెప్పడంతో పారు ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More