Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..రెచ్చగొట్టిన దక్షిణామూర్తి-బస్తీ మే సవాల్ అంటూ ఊగిపోయిన శివ నారాయణ-పోటీ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 13 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. బెస్ట్ వంటకం ఏదో తేలేందుకు పోటీ పడదామని శివ నారాయణను దక్షిణామూర్తి రెచ్చగొడతాడు. తల తీసి కాళ్ల దగ్గర పెడతానని శివ నారాయణ పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం. 

Published on: Jul 13, 2026, 06:56:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 13 ఎపిసోడ్ లో తనతో పోటీకి దిగమని శివ నారాయణను దక్షిణామూర్తి రెచ్చగొడతాడు. శివ నారాయణ ఆవేశంతో ఊగిపోతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

షాకిచ్చిన సూరజ్

తన లవర్ అంటూ జ్యోత్స్న ఫొటోను జ్యోత్స్నకే చూపించి షాకిస్తాడు సూరజ్. అరే.. ఈ ఫొటోలో ఉన్నది నువ్వేనా? నువ్వు సిగ్గు పడుతున్నప్పటి కంటే చిరాకులో ఉన్నప్పుడే బాగున్నావు. మనం అనుకోకుండా గొడవ పడ్డాం. ఇప్పుడు ఒకే దగ్గర ఉంటున్నాం. బ్రహ్మ దేవుడు నా షర్ట్ కు, నీ చీరకు ముడివేశాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్ని మా గురువు ఎప్పుడో పాటతో చెప్పాడని సూరజ్ అంటాడు.

జ్యోత్స్నను తీసుకొని సూరజ్ ఆఫీస్ కు స్టార్ట్ అవుతాడు. ఛైర్మన్ మీ బావతో కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ కు వెళ్లాడని సూరజ్ చెప్తాడు. మా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సి వస్తుందని జ్యో చిరాకు పడుతుంది.

మాలినితో పరిచయం

మరోవైపు రెస్టారెంట్ ఓనర్స్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ దక్షిణామూర్తి కోడలు మాలినిని, శివ నారాయణను ఒకరికొకరికి పరిచయం చేస్తాడు రెస్టారెంట్స్ అసోషియేన్ ప్రతినిధి గౌరీ ప్రసాద్. ఇంతకుముందు మాలినిని చూడలేదని శివ నారాయణ అంటాడు. మేం ఇంతకుముందు వేరే ఊర్లో ఉండేవాళ్లం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడే ఇల్లు కూడా కొన్నాం. ఇక మీదట ఇక్కడే ఉంటామని మాలిని అంటుంది.

మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉన్నారా? అని మాలినిని గౌరి అడుగుతాడు. అవును, శివ నారాయణ అని మాలిని షాక్ ఇస్తుంది. కానీ అసోసియేషన్ లో ఉన్నవాళ్లంతా ఒక కుటుంబంలా ఉండాలి కదా అని మాలిని కవర్ చేస్తుంది. ఈ రెస్టారెంట్ అసోషియేషన్ లో ఉన్నవాళ్లంతా మా బంధువులేనని మాలిని అంటుంది. ఎందుకు పిలిపించారో చెప్పండని గౌరీ ప్రసాద్ ను శివ నారాయణ మళ్లీ అడుగుతాడు.

శివ నారాయణతో పోటీ

అప్పుడు దక్షిణామూర్తి మాట్లాడతాడు. ఈ సిటీలో బెస్ట్ చెఫ్ లు అంతా నా రెస్టారెంట్లో ఉన్నారు. నాతో పోటీపడటం ఇష్టం లేక మిగతా వాళ్లు డ్రాప్ అయ్యారు. ఇక మిగిలింది మీరే అని శివ నారాయణతో దక్షిణామూర్తి పొగరుగా అంటాడు. పోటీకి మేం సిద్ధంగా లేము, ఎవరూ పోటీపడనప్పుడు పోటీ ఎందుకు? క్యాన్సిల్ చేయండని శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు.

జ్యోత్స్న రెస్టారెంట్ నంబర్ వన్

అలా అయితే బెస్ట్ రెస్టారెంట్ ఏదో ఎలా తెలుస్తుందని దక్షిణామూర్తి అడుగుతాడు. జ్యోత్స్న రెస్టారెంట్ నంబర్ వన్ అని శివ నారాయణ అంటాడు. మరి పోయిన సారి ఓడిపోయారు కదా అని మాలిని గుర్తు చేస్తోంది. ఓడిపోయింది మనవడి చేతుల్లోనే కదా అని అందరూ అంటారు. బెస్ట్ వంటకం ఎవరిది అనే దాని మీద పోటీపడదామని మాలిని అడుగుతుంది. మేం మీతో కానీ శివ నారాయణతో కానీ పోటీపడలేమని మిగతా రెస్టారెంట్ ఓనర్లు అంటారు.

శివ నారాయణతో పోటీపడతామని దక్షిణామూర్తి అంటాడు. ఈ పోటీకి సిద్ధమేనా అని మాలిని అడుగుతుంది. మేం సిద్ధంగా లేము. ఏ రెస్టారెంట్లో బెస్ట్ వంటకాలు ఉంటాయో జనాలకు తెలుసు. మేం పోటీ పడాల్సిన అవసరం లేదని శివ నారాయణ వెళ్లిపోతాడు. చాలా తెలివిగా తప్పించుకున్నాడని దక్షిణామూర్తి అంటాడు. బాబాయ్ ను పోటీలోకి ఎలా దించాలో తనకు తెలుసని మాలిని అనుకుంటుంది.

సూరజ్ ట్విస్ట్

ఇక శివ నారాయణ ఇంట్లో పోటీ విషయంపై డిస్కషన్ జరుగుతుంది. మనం పోటీ పడాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. కానీ పోటీ పడాలని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. డీఎం రెస్టారెంట్ కు బెస్ట్ చెఫ్ లు ఉన్నాయని మిగతా రెస్టారెంట్లు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు బెస్ట్ వంటలు ఏ రెస్టారెంట్ అందిస్తుందనే ఇప్పుడు పోటీ. మనం పోటీపడదామని సూరజ్ చెప్తాడు. లిమిట్స్ క్రాస్ చేయొద్దని జ్యో అంటుంది.

దీప, కార్తీక్ సై

మధ్యలో సూరజ్ పరాయివాడని పారిజాతం అంటే శివ నారాయణ కోప్పడతాడు. సూరజ్ కూడా నా వాడేనని శివ నారాయణ అంటాడు. డీఎం రెస్టారెంట్ పోటీకి సిద్ధపడ్డారు అంటే మిమ్మల్ని ఓడించగలమనే నమ్మకంతోనే కదా. కానీ మీరు ఓడిపోతారనే భయంతో పోటీ నుంచి తప్పించుకున్నారని అంటారు. అందుకే పోటీపడదామని సూరజ్ అంటాడు. దీప, కార్తీక్ కూడా అదే మాట చెప్తారు.

దక్షిణామూర్తి ఫోన్

అర్థం లేకుండా మాట్లాడుతున్నారని దీప, కార్తీక్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. డీఎం రెస్టారెంట్ తో పోటీపడటం నాకు ఇష్టం లేదు. మా తాత ఎవరెస్ట్, ఎవరి ముందు తలవంచడని జ్యోత్స్న అంటుంది. అప్పుడు దక్షిణామూర్తి నుంచి శివ నారాయణకు ఫోన్ కాల్ వస్తుంది. మనకు మిగిలింది శత్రుత్వం మాత్రమేనని శివ నారాయణ అంటే, దక్షిణామూర్తి నవ్వుతాడు.

రెచ్చగొట్టేలా

భయపడ్డావ్ శివ నారాయణ. దక్షిణామూర్తిని చూసి శివ నారాయణ ఫస్ట్ టైమ్ భయపడ్డాడని దక్షిణామూర్తి నవ్వుతాడు. రేయ్ దక్షిణామూర్తి.. సింహం పంజా విసిరితే మెడ పోతుందని శివ నారాయణ కౌంటర్ ఇస్తాడు. అంత దమ్ముంటే పోటీకి రా అని శివ నారాయణను దక్షిణామూర్తి రెచ్చగొడతాడు. శివ నారాయణ పేరులోనే వీరత్వం ఉంది. ప్రతి మెట్టూ కట్టుకుంటూ వచ్చి, న్యాయంగా గెలిచా. భయపడటం, పారిపోవడం ఈ శివ నారాయణకు తెలియదని శివ నారాయణ ఊగిపోతాడు.

తల తీసి కాళ్ల దగ్గర

నేను భయపడ్డానని ఒక్కరు చెప్పినా బస్తీ మే సవాల్, నా తల తీసి నీ కాళ్ల దగ్గర పెడతానని శివ నారాయణ కోపంతో అంటాడు. నీకు పౌరుషం ఉంటే నాతో తలపడు శివ నారాయణ. నువ్వు పోటీకి సిద్ధమా? నీపై గెలిచే దమ్ము నాకుంది. నా మీద గెలిచే దమ్ము నీకుందా అని దక్షిణామూర్తి అడుగుతాడు. మరోసారి మా మామయ్యతో అలా మాట్లాడితే ఊరుకునేదే లేదని సుమిత్ర కాల్ కట్ చేస్తుంది.

మనం పోటీకి వెళ్లాలి. నా మెట్టినింటి పౌరుషం ఏంటో ఆ మనుషులకు తెలియాలి. మామయ్య మనం ఈ పోటీలో పాల్గొంటున్నామని సుమిత్ర ఆవేశంగా చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More