Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- శివ నారాయణ మాలిని మాటల యుద్ధం- సూరజ్ సీక్రెట్ లవర్- జ్యోత్స్నకు షాక్

Karthika Deepam 2 Serial July 11th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 11వ ఎపిసోడ్‌లో గుడిలో శివ నారాయణ, దక్షిణామూర్తిల మధ్య గొడవ అవుతుంది. విలువ గురించి మాట్లాడిన శివ నారాయణనను మాలిని నిలదీస్తుంది. శ్రీధర్ వస్తాడని శౌర్య స్కూల్‌కి వెళ్లనంటుంది. అనసూయ ఎంట్రీ ఇస్తుంది. జ్యోకి సూరజ్ షాక్ ఇస్తాడు.

Published on: Jul 11, 2026, 07:22:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో దీప ఎవరో తెలిసే కావాలనే మాలిని అలా అడుగుతుందని కార్తీక్‌తో శివ నారాయణ అంటాడు. ఈవిడ ఎవరు తాతయ్య గారు అని దీప అడిగితే.. నీకు అత్త అవుతుందమ్మా అని దక్షిణామూర్తి అంటాడు. నా కోడలు సుమిత్రకు వదిన అని చెబుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 11 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 11 ఎపిసోడ్

మాటల యుద్ధం

మా అమ్మకు వదిన అంటే నాకు అత్త. అంటే అమ్మ వాళ్ల అన్నయ్య భార్య అని మనసులో దీప సంతోషంగా అనుకుంటుంది. మనుషులను పరీక్షించడానికి కొంతమంది ఇలాంటి చేస్తుంటారని. నా ఇంట్లోవాళ్లకు నా విలువ తెలుసు అని శివ నారాయణ అంటాడు. కూతురుని ఇంట్లో నుంచి పంపించినప్పుడు ఏమైంది బాబాయ్ నీ విలువ అని మాలిని అనేస్తుంది.

పెళ్లయిన మనవడిని నడిరోడ్డుపైకి గెంటేసినప్పుడు ఏమైంది ఈ విలువ. ఆస్తిలో వాటా పంచాల్సిన మనవడిని ఇంటి డ్రైవర్‌ను చేశావ్. కూతురు కోడలిని ఇంటి పని మనిషిని చేశావ్. పని మనిషిని సీఈఓ చేశావ్. బ్రహ్మదేవుడు రాసిన రాతలను కూడా మార్చి రాయగలిగే శక్తి నీకుంది బాబాయ్ అని మాలిని నిలదీస్తుంది.

మేము వ్యాపారులతో మాత్రమే ఆడుకుంటాం. నువ్వు సొంత వాళ్లతోనే ఆడుకుంటావ్‌గా బాబాయ్ అని మాలిని అంటే.. ఆడుకోవడం గురించి నీలాంటి వాళ్లు కాదు నీలాంటిది మాట్లాడుకుంటేనే మంచిది. నువ్వు నన్ను వెలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుడిని అయితే వీళ్లు నాతో ఉండేవారే కాదు. జీవితంలో నడవడానికి రెండు దారులు ఉంటాయి. ఒకటి నిజాయితీ, రెండోది నమ్మకద్రోహం అని శివ నారాయణ అంటాడు.

మనకున్న మనుషులను బట్టి

మనం ఏ దారిలో నడుస్తున్నామనేది మనవైపు ఉన్న మనుషులను బట్టి తెలుస్తుంది. నీవైపు ఎంతమంది ఉన్నారు, నా వైపు ఎంతమంది ఉన్నారని గట్టిగానే కౌంటర్ ఇస్తాడు శివ నారాయణ. దక్షిణామూర్తి కోప్పడుతాడు. మళ్లీ గొడవ అయ్యేలా ఉంటుంది. దాంతో కార్తీక్ ఆపుతాడు.

గొడవ పెట్టుకునేందుకే ఎదురుపడుతున్నట్లు ఉంది. పెద్దవాళ్లు మాట్లాడుతున్నారని మౌనంగా ఉంటున్నాం. గతంలో ఏం జరిగిందో తెలుసు. మీ జోలికి రావట్లేదుగా. కలిసి బతకలేనప్పుడే విడిపోవడమే మంచిది. అది ఎవరైనా సరే. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మా వ్యాపారాలు చేసుకుంటాం అని కార్తీక్ అంటాడు. చేసిన పాపాలు కుటుంబాన్ని వెంటాడుతాయని దక్షిణామూర్తి అంటాడు.

ఏంటా పాపం అని కార్తీక్ అడిగితే.. ఈ కుటుంబం కారణంగానే నా కోడలు.. అని దక్షిణామూర్తి చెబుతుంటే మాలిని వద్దని ఆపుతుంది. అది చెప్పాల్సిన సందర్భం, వినాల్సిన సందర్భం ఇది కాదు. మేము వచ్చింది హోమం జరిపించడానికి. ఎవరిని గాయపర్చేందుకు కాదని. చాలా కాలం తర్వాత అందరిని చూశాను. ఆ ఆనందం ఉంది. అందరిని గుర్తు పట్టానుగానీ ఈ అబ్బాయిని గుర్తు పట్టలేదు ఎవరితను మాలిని అడుగుతుంది.

అతి తెలివి అంటున్నావ్

తనకు మాకు రక్తసంబంధం లేదు కానీ మా కుటుంబంతో సంబంధం ఉందని శివ నారాయణ అంటాడు. నీ మనసులో అందరికి స్థానం ఉంటుందని మాలిని అంటే.. కొందరికే ఉంటుందని, జ్యోని సూరజ్ కాపాడాడని చెబుతాడు శివ నారాయణ. నీ మనవరాలిని కాపాడిన వాడిని పక్కన పెట్టుకుని కృతజ్ఞత అన్నావ్, మా మావయ్యను కాపాడిన దీపను నా పక్కన పెట్టుకోవాలనుకుంటే అతి తెలివి అంటున్నావ్ అని మాలిని పంచ్ ఇస్తుంది.

దక్షిణామూర్తిని కాపాడినందుకు కార్తీక్, దీపలకు థ్యాంక్స్ చెబుతుంది మాలిని. మీ మేలు ఎప్పటికీ మర్చిపోమని మాలిని చెబితే.. మర్చిపోండి. అదే అందరికి మంచిదని సుమిత్ర అంటుంది. శివ నారాయణ వాళ్లు వెళ్తారు. నా పేరు మాలిని, నన్ను గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా అవసరం పడితే నన్ను మర్చిపోకు అని మాలిని అంటుంది.

దీప కార్తీక్ వెళ్తారు. జ్యోత్స్న దగ్గరికి వెళ్లి చాలా అందంగా ఉన్నావ్ మేనకోడల అని మాలిని అంటుంది. జ్యోత్స్న వెళ్లిపోతుంది. మాలిని, దక్షిణామూర్తి కూడా వెళ్లిపోతారు. మరోవైపు శౌర్యను స్కూల్‌కి రెడీ చేస్తుంది కాంచన. తాత ఇవాళ వస్తున్నాడంటా కదా. నేను స్కూల్‌కు వెళ్లను అని శౌర్య అంటే.. కాంచన వద్దంటుంది.

శౌర్య అల్లరి

శౌర్య, కాంచన ఇద్దరు గొడవ పడతారు. డోర్ సౌండ్ వినిపిస్తే తాత వచ్చాడని తీస్తుంది శౌర్య. అక్కడ అనసూయ ఉంటుంది. తాతేంటీ చీర కట్టుకుని వచ్చాడు. నువ్వు వచ్చావేంటని ప్రశ్నిస్తుంది శౌర్య. నీకోసం వస్తే అలా అంటావేంటే అని లోపలికి వెళ్తుంది శౌర్య. శ్రీధర్ ఆపరేషన్ సక్సెస్ అని, అమెరికా నుంచి వస్తున్నారని చెబుతుంది కాంచన.

శౌర్య కోసం జంతికలు తీసుకొచ్చినట్లు అనసూయ చెబుతుంది. దాంతో కూర్చొబెట్టి అనసూయతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత శౌర్యకు జంతికలు ఇస్తుంది అనసూయ. జంతికలకు వంకలు పెడుతుంది శౌర్య. ఇంతలో స్కూల్ బస్ రావడంతో శౌర్యను పంపిస్తారు. తాత వస్తే సాయంత్రం వరకు ఇక్కడే ఉంచండి అని శౌర్య వెళ్లిపోతుంది.

జ్యోత్స్న పెళ్లి గురించి కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. దీపను చూసి చాలా రోజులయిందని అనసూయ అంటుంది. మరోవైపు గుడిలో అత్త మాలిని గురించి కార్తీక్‌తో దీప అంటుంది. నువ్వు కొత్త తలనొప్పులు తలకెక్కించుకోకు పదా. నువ్వు సీఈఓ అని తెలిసి కూడా వంటమనిషిగా అడిగిందంటే తను ఎంత లోతైనా మనిషో అర్థమవుతుందని కార్తీక్ చిరాకు పడతాడు.

వెన్నుపోటు పొడిచేవారు

అంటే పైకి కనిపించే మనిషి వేరు, లోపల ఉండే మనిషి వేరు అని కార్తీక్ అంటాడు. ఇంతలో సూరజ్ వస్తాడు. జరిగిందంతా మర్చిపోయి కంపెనీ గురించి మాత్రమే ఆలోచించు. ఇంటికెళ్లాక జ్యోత్స్నను ఆఫీస్‌కు తీసుకెళ్లు. దీప మేము కారులో వెళ్తాం. తాత ఏదో మీటింగ్ ఉందన్నాడని కార్తీక్ చెబుతాడు. మరోవైపు సుమిత్ర అన్నదానం వైపు చూస్తుంది.

వాళ్లు కనిపించే శత్రువులు కాదు వెన్నుపోటు శత్రువులు, చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోత్స్నతో చెబుతాడు శివ నారాయణ. నీ కూతురుని మళ్లీ నీ ఇంటికి చేరుస్తాను మావయ్య అని దక్షిణామూర్తితో అంటుంది మాలిని. దక్షిణామూర్తి కారులో కూర్చుంటాడు. ఏది తెలియకుండా జరగలేదు (సుమిత్ర గుడికి రావడం) మావయ్య అన్ని తెలిసే జరిగాయ్. ఇకనుంచి అన్నీ తెలిసే జరుగుతాయ్. కానీ నాకు తెలిసినట్లు మీకు తెలియదు అంతే అని మాలిని అంటుంది.

తర్వాత స్కూటీపై జ్యోత్స్నను సూరజ్ తీసుకెళ్తాడు. ఇంతకుముందు నాకు డ్రైవర్‌గా మా బావ ఉండేవాడు. ఇప్పుడు నువ్వున్నావని జ్యో అంటే.. నన్ను కూడా మీ బావే అనుకో అని సూరజ్ అంటాడు. రేయ్ బావ అంటే అత్త కొడుకురా అని జ్యో అంటుంది. అలాగే అనుకో. రేపు పెళ్లయితే అప్పుడు మేనత్త కొడుకు అనుకుంటావో, మేనమామ కొడుకు అనుకుంటావో నీ ఇష్టం అని సూరజ్ అంటాడు.

సూరజ్ సీక్రెట్ లవర్

స్కూటీ ఆపమంటుంది జ్యో. సూరజ్ ఆపుతాడు. ఆటోలో వెళ్తానంటుంది. సూరజ్ మాటలు ఇరిటేట్ తెప్పిస్తున్నావని అంటే.. బంగారం అని పిలవను అని సూరజ్ అంటాడు. గుడిలో నేను అందమైన అమ్మాయిని చూశాను. తననే పిలుస్తాను. తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను అని సూరజ్ అంటాడు. దేవుడు ఉన్నాడురా. నీ బారీ నుంచి తప్పించడానికి నన్ను గుడికి రప్పించాడని జ్యోత్స్న సంతోషిస్తుంది.

అవును, నీకంటే అందగత్తెను నాకు పరిచయం చేశాడు అని సూరజ్ అంటాడు. నీ కంట్లో పడిందంటే అది ఎన్ని జన్మల పాపం చేసుకుందో అని జ్యో అంటుంది. నీకంటే అందగత్తె అని నీకు కుళ్లు అని సూరజ్ ఫొటో చూపిస్తాడు. ఆ ఫొటో ఎవరిదో కాదు జ్యోత్స్నదే. జ్యో ఫొటోనే చూపించి ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. అది చూసి జ్యో మరింత షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More