Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..ట్విస్ట్ అదుర్స్- దక్షిణామూర్తి కోడలే మాలిని- జ్యోత్స్నకు సూరజ్ చుక్కలు

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 8 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కొత్త విలన్ మాలిని ఎవరో తెలిసిపోయింది. తనకు కావాలనుకున్న హోటల్ ను పట్టుబట్టి మరీ సాధించుకుంటుంది. మరోవైపు జ్యోత్స్నకు అదిరే కౌంటర్ ఇస్తాడు సూరజ్. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 8, 2026, 07:06:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాలిని ఎవరో కాదు.. దక్షిణామూర్తి కోడలే అని తెలిసిపోతుంది. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అమ్మాయితో పెళ్లి

సూరజ్ రెండు గంటలు లేటుగా ఆఫీస్ కు వస్తానని పర్మిషన్ అడుగుతాడు. ఎక్కడికి వెళ్తావని కార్తీక్, జ్యోత్స్న గుచ్చిగుచ్చి అడుగుతారు. శనీశ్వరుణ్ని కలిసేందుకు వెళ్తున్నా. నాకే దోష నివారణ కోసం వెళ్తున్నా. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని జ్యోత్స్న వైపు చూస్తూ సూరజ్ చెప్తాడు.

పెళ్లి సంబంధాలు

ఛైర్మన్ నా పెళ్లి గురించి అడిగారు. మిమ్మల్ని, వదినను చూసి నేను పెళ్లి చేసుకుని మీలాంటి ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగించాలని అనుకుంటున్నా. ఆన్ లైన్ లో రెండు మూడు సంబంధాలు చూశా కానీ రిజెక్ట్ అయ్యాయి బ్రదర్ అని కార్తీక్ తో సూరజ్ చెప్తాడు. నీకు ఇష్టమైన ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను కార్తీక్ అంటాడు. దీంతో తన పేరు సూరజ్ చెప్తాడేమోనని జ్యో కంగారు పడుతుంది.

దోష నివారణ కోసం

జ్యోత్స్న పేరు అయితే సూరజ్ చెప్పడు. కానీ జ్యో చెప్పిన మాటల ప్రకారమే దోష నివారణకు వెళ్తున్నాననే అర్థం వచ్చేలా మాట్లాడాడు. దోష నివారణ చేయించకపోతే పెళ్లి అయిన వాళ్ల మీద వ్యామోహం కలుగుతుందని పంతులు చెప్పాడు. మనది కానిది దక్కించుకోవాలని అనుకుంటారంటా. రేపు శని త్రయోదశి. అందుకే గుడికి వెళ్తున్నానని సూరజ్ చెప్తాడు.

సుమిత్రతో మనం కూడా రేపు గుడికి వెళ్దామని శివ నారాయణ చెప్తాడు. ఎందుకు తాత అని జ్యోత్స్న అడుగుతుంది. నీకు కూడా దోషం ఉందని చెప్తాడు శివ నారాయణ. అందరు కలిసి భోజనానికి రెడీ అవుతారు. సూరజ్ ను కూడా తమ ఇంట్లోనే తినమని శివ నారాయణ చెప్పేసరికి జ్యో షాక్ అవుతుంది.

మాలిని పొగరు

మరోవైపు మాలిని దగ్గరకు హోటల్ ఓనర్ బాలా పరుగెత్తుకుంటూ వస్తాడు. నా హోటల్ లో చెఫ్ లు అందరికీ అడ్వాన్స్ ఇచ్చి కొనేశారు. ఇప్పుడు నేను హోటల్ క్లోజ్ చేసుకోవాలా? అని బాలా అడుగుతాడు. ఎప్పుడూ ఎదుటివాళ్లను ఏం చేయాలని అడగొద్దు. నాకు అవసరం వచ్చింది. వాళ్లకు అవకాశం వచ్చింది అని పొగరుగా మాలిని అంటుంది.

బాలా సరెండర్

నీ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చి చెఫ్ లను కొనసాగిస్తానని బాలా అంటాడు. అప్పుడే బాలాకు కాల్ వస్తుంది. హోటల్ పై రాళ్లు విసురుతున్నారని తెలిసి బాలా షాక్ అవుతాడు. రాళ్లకు బదులు అగ్గిపెట్టె విసిరితే బుగ్గే మిగులుతుంది. నేనేమైనా మిమ్మల్ని బెదిరిస్తున్నానా? అని తనలోని విలనిజం చూపిస్తుంది మాలిని. నేను హోటల్ అమ్మేస్తానని బాలా దిగివచ్చేలా చేస్తుంది మాలిని.

రూ.2 కోట్లకే

అగ్రిమెంట్ ను చూసి బాలా మళ్లీ షాక్ అవుతాడు. అగ్రిమెంట్ రూ.2 కోట్లు అని రాశారేంటీ? రూ.4 కోట్లు ఇస్తా అన్నారు కదా అని బాలా అడుగుతాడు. నేను అడిగినప్పుడు నువ్వు అమ్మి ఉంటే రూ.4 కోట్లు, నువ్వు అమ్మినప్పుడు నేను కొంటే రూ.2 కోట్లే. సంతకం పెట్టడం తప్పా మీకు వేరే ఆప్షన్ ఉందా? అని బ్లాక్ మెయిల్ చేస్తుంది మాలిని. మీ వీక్ నెస్ గురించి మీరే చెప్పారని మాలిని అంటుంది.

దక్షిణామూర్తి కోడలే

బాలా అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుండగా దక్షిణామూర్తి ఇంట్లోకి వస్తాడు. తన హోటల్ ను మనకు అమ్మేశాడు మామయ్య అని మాలిని చెప్తుంది. దీంతో దక్షిణామూర్తి కోడలే ఈ మాలిని అనేది కన్ఫామ్ అయింది. మనం గెలవాలంటే బాగా పరుగెత్తే గుర్రాలే కావాలి. హోటల్ నచ్చింది. అమ్మమంటే అమ్ముతానన్నాడు అని తాను బ్లాక్ మెయిల్ చేసిన విషయాన్ని మాత్రం దాచేస్తుంది మాలిని.

నాకు కూతురైనా, కొడుకైనా నువ్వే. అంతా చూసుకోమ్మని మాలినికి దక్షిణామూర్తి చెప్పి లోపలికి వెళ్తాడు. మీకు ఎంత వరకు చెప్పాలో నాకు తెలుసు మామయ్య. ప్రతీకారం తీర్చుకోవడానికి వేదిక సిద్ధమైంది. ఇక ఎదురు పడటమే మిగిలింది. అది కూడా తొందర్లోనే జరుగుతుందని మాలిని అనుకుంటుంది.

ప్రియమైన దీప

మరోవైపు శివ నారాయణ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారు. జ్యోత్స్నను భోజనం చేయమంటే మాత్రం కంపరంగా ఉందనుకోని తినడానికి కూర్చోదు. వడ్డిస్తానని కవర్ చేస్తుంది. జ్యో సాధారణంగా వడ్డించదు కదా అని కార్తీక్ అడుగుతాడు. ప్రియమైన దీప అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. దీప సీఈఓ అయిన తర్వాత మొదటిసారి మా ఇంట్లో భోజనం చేస్తుంది. మన గెస్ట్ సూరజ్ కూడా ఉన్నాడు. అందుకే నేనే వాళ్లకు వడ్డిస్తానని జ్యో మరో ప్లాన్ చేస్తుంది.

షర్ట్ పై పప్పు

పప్పు వేసుకో సూరజ్ అని షర్ట్ మీద మొత్తం ఒలకబోస్తుంది జ్యోత్స్న. చేతకాని పనులు చేయడం అవసరమా? సూరజ్ కు సారీ చెప్పమని జ్యోను కోప్పడుతుంది సుమిత్ర. జ్యో సారీ చెప్పడం ఏంటీ? ఏదో అనుకోకుండా పడింది. లేకపోతే బయటవవాడు మా ఇంట్లో భోజనం చేయడం ఏంటని అవమానించేందుకు పోసిందంటారా? దీప చేతిలో జ్యో ఓడిపోవడానికి పరోక్షంగా నేను కారణమని ఇలా చేశారా? అని సూరజ్ ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తాడు.

జ్యోత్స్న చాలా మంచిదని అంటాడు సూరజ్. ఆ షర్ట్ ను జ్యోత్స్నతోనే క్లీన్ చేయిస్తానని సుమిత్ర చెప్తుంది. నేనే క్లీన్ చేసుకుంటానని సూరజ్ వెళ్లిపోతాడు.

జ్యోత్స్న శారీతో

జ్యోత్స్న, పారిజాతం గదిలో మాట్లాడుకుంటారు. సూరజ్ సారీ వద్దన్నాడు అంటే ఏదో ప్లాన్ చేశాడని పారు అంటుంది. అప్పుడే జ్యోకు సూరజ్ వీడియో కాల్ చేస్తాడు. మీకు గుర్తుగా మీరు పప్పు పోసిన షర్ట్ అలాగే ఉంచుకున్నా. వెదర్ చల్లగా ఉందని చలిమంట వేసుకుందామని అనుకుంటున్నా. మంట వేసుకునే మెటీరియల్ కూడా చూడండని జ్యో శారీ చూపిస్తాడు సూరజ్.

దాని కాస్ట్ రూ.1.50 అని జ్యోత్స్న చెప్తుంది. మీ శారీకి ఏం కాకూడదంటే మీరొచ్చి నా షర్ట్ ఉతకాలని సూరజ్ కండీషన్ పెట్టేసరికి జ్యో దిమ్మ తిరుగుతుంది. ఇక్కడితో నేటిి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More