Karthika Deepam 2: కార్తీక దీపం 2 టీఆర్పీని మార్చేయబోతున్న మాలిని.. తేజస్విని ప్రకాష్ ఎంట్రీ వెనుక అసలు కథ.. ఆమె ఎవరు?

Karthika Deepam 2: కొత్త ట్విస్ట్ లతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. పవర్ ఫుల్ లేడీగా మాలిని అడుగుపెట్టింది. ఈ మాలిని క్యారెక్టర్ చేస్తున్న తేజస్విని ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవాల్సిందే. ఆమె తెలుగు సినిమాలూ చేసింది.

Published on: Jul 7, 2026, 08:35:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2: స్టార్ మా (Star Maa) ఛానల్‌లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న టాప్ సీరియల్ 'కార్తీకదీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్‌ కథ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. దీనికి ప్రధాన కారణం.. కథలోకి సరికొత్త విలన్‌గా 'మాలిని' పాత్ర ప్రవేశించడం. ఆ మాలిని క్యారెక్టర్ చేస్తున్న తేజస్విని ప్రకాష్ గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే.

కార్తీక దీపం 2లో కొత్త క్యారెక్టర్ మాలిని.. ఎవరీ తేజస్విని ప్రకాష్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్! (instagram)
కార్తీక దీపం 2లో కొత్త క్యారెక్టర్ మాలిని.. ఎవరీ తేజస్విని ప్రకాష్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్! (instagram)

తేజస్విని ప్రకాష్ గ్రాండ్ ఎంట్రీ

అమితమైన డబ్బు, పొగరు, అహంకారం కలిగిన ఒక రిచ్ బిజినెస్‌వుమన్‌గా కార్తీక దీపం 2 సీరియల్ లోకి మాలిని అడుగుపెట్టింది. ఈ పాత్రలో కన్నడ నటి తేజస్విని ప్రకాష్ నడింపల్లి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. హోటల్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా సాగే ఈమె పాత్ర సీరియల్‌లో సరికొత్త డ్రామాను రేపుతోంది.

సినిమా కుటుంబ నేపథ్యం

తేజస్విని ప్రకాష్ కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనలోనే పుట్టి పెరిగిన కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి దివంగత ప్రకాష్ (ఏప్రిల్ 2020లో మరణించారు) కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టంట్ మాస్టర్, స్టంట్ కోఆర్డినేటర్. అలాగే ఆమె తల్లి వినయ కన్నడ బుల్లితెరపై ఎస్టాబ్లిష్డ్ సీనియర్ నటి.

తెలుగు బ్యాక్ గ్రౌండ్

పుట్టింట్లో కన్నడ, కొంకణి సంస్కృతులు చూసిన తేజస్విని.. 2022లో ఫణి వర్మ నడింపల్లిని వివాహం చేసుకుని తెలుగు కోడలిగా మారింది. వీళ్లకు ఓ పాప ఉంది. ఈ మల్టీలింగ్వల్ బ్యాక్‌గ్రౌండ్ వల్లే ఆమెకు తెలుగు భాషా ఉచ్ఛారణపై, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులపై మంచి పట్టు ఉంది.

వెండితెరపై రికార్డులు

తేజస్విని ప్రకాష్ కేవలం టీవీ నటి మాత్రమే కాదు, వెండితెరపై స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఆమెకుంది. 2007లో వచ్చిన 'మాసనద మక్కలు' చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా SICA అవార్డు అందుకున్నారు. అదే ఏడాది కన్నడ స్టార్ హీరో దర్శన్ సరసన 'గజ' (2007) అనే కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సినిమాలో 'వరలక్ష్మి'గా నటించి మెప్పించింది.

అంతేకాకుండా, 2015లో 'గూలిహట్టి' సినిమాలో పోషించిన 'పూర్ణి' పాత్రకు గాను ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక SIIMA (సైమా) అవార్డు లభించింది. తమిళంలో 'అంబుట్టు ఇంబుట్టు ఎంబుట్టు', తెలుగులో 'కట్ చేస్తే' (తనీష్క అనే స్క్రీన్ నేమ్‌తో), 'సినిమా మహల్ - రోజుకి 4 ఆటలు', 'ప్రతిక్షణం' వంటి చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

బుల్లితెరపై విలనిజానికి కేరాఫ్ అడ్రస్

కన్నడ టెలివిజన్ రంగంలో తేజస్విని ప్రకాష్ ఒక ట్రెండ్ సెట్టర్. 'నిహారిక' సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, బిగ్ బాస్ కన్నడ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అలరించింది. అయితే, ఆమె టెలివిజన్ కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం 'నన్నరసి రాధే' సీరియల్.

ఇందులో ఆమె పోషించిన హై-ఫ్యాషన్, అహంకారపూరిత నెగెటివ్ క్యారెక్టర్ 'లావణ్య' బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఆ రిచ్ లుక్, స్టైలిష్ విలనిజం, కాలిక్యులేటెడ్ మైండ్‌సెట్ ఉన్న పాత్రే ఇప్పుడు 'కార్తీక దీపం 2' లో మాలిని పాత్రకు పక్కా బ్లూప్రింట్‌గా మారింది. 2022 లో వచ్చిన 'యడ్రూ శ్రీ సిద్ధలింగేశ్వర' పౌరాణిక సీరియల్‌లో 'కాళి' మాతగా కూడా పవర్‌ఫుల్ రోల్ పోషించింది తేజస్విని.

కార్తీకదీపం 2 లో మాలిని

ప్రస్తుతం కార్తీకదీపం 2 లో తేజస్విని ప్రకాష్ 'మాలిని'గా తన రాయల్ విలనిజంతో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రెడీ అయింది. ఈ క్యారెక్టర్ తో సీరియల్ టీఆర్పీ మరింత పెరగడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేవలం ఒక సాధారణ విలన్‌లా కాకుండా, కార్పొరేట్ స్టైల్‌లో మాలిని పండించే హావభావాలు సీరియల్‌కు కొత్త వెయిటేజ్ తెచ్చాయి. రాబోయే రోజుల్లో దీప, కార్తీక్‌ల జీవితాల్లో ఈ మాలిని ఎలాంటి తుఫాను తీసుకురాబోతుందనేది కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం.

మాలిని ఎవరు?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో మాలిని ఎంట్రీ ఇచ్చింది. ఓ హోటల్ ను ఎలాగైనా దక్కించుకోవాలనే పొగరుతో ఆ క్యారెక్టర్ కనిపించింది. తథాస్తు దేవతలు దిగి రావాలి అని సూరజ్ అనగానే మాలిని ఎంట్రీ ఇచ్చింది. దీన్ని బట్టి సూరజ్ కు మాలినికి మధ్య రిలేషన్ షిప్ ఉండొచ్చనే అనుమానం కలుగుతోంది.

ఇక మాలిని విజిటింగ్ కార్డు మీద డీఎం రెస్టారెంట్స్ అని ఉంది. అంటే దక్షిణామూర్తి (డీఎం) కి మాలిని కూతురు లేక కోడలు అయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే శివ నారాయణకు పోటీగా దక్షిణామూర్తి రెస్టారెంట్లు ఓపెన్ చేశాడు. మరి ఈ మాలిని ఎలాంటి షాక్ ఇస్తుందో వేచి చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More