Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2-కార్తీక్‌కు డౌట్‌-జ్యోను పెళ్లి చేసుకుందామ‌న్న సూర‌జ్‌-కొత్త క్యారెక్టర్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 7 ఎపిసోడ్ లో సూరజ్ పై కార్తీక్ కు కూడా డౌట్ వస్తుంది. మరోవైపు జ్యోత్స్నను పెళ్లి చేసుకుందామని అడిగి ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. ఇక సీరియల్ లో మాలిని అనే పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

Published on: Jul 7, 2026, 06:49:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 7 ఎపిసోడ్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. మాలినే అనే పవర్ ఫుల్ లేడీ ఓ హోటల్ కొనాలనుకుంటుంది. తన పవర్, పొగరు చూపిస్తుంది. మరోవైపు జ్యోను పెళ్లి చేసుకుందామని సూరజ్ అడుగుతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సూరజ్ పై అనుమానం

కిచెన్ లో ఉన్న దీప జ్యూస్ చేస్తూ సూరజ్ గురించి ఆలోచిస్తుంటుంది. జ్యూస్ ఎవరికి అని కార్తీక్ అడుగుతాడు. అమ్మతో మాట్లాడాలి. సూరజ్ పై అనుమానం ఉందో లేదో అడగాలి అని దీప చెప్తుంది. సూరజ్ కు నాపై అనుమానం ఉంది. మనకు ఏమీ తెలియని వ్యక్తి మన శత్రువుతో మాట్లాడుతున్నానంటే అనుమానాలు కచ్చితంగా వస్తాయని కార్తీక్ అంటాడు.

నాన్న ఎక్కడ?

ఇన్ని రోజులు ఇంటి భోజనం తిన్న జ్యోత్స్ననే ఈ ఇంటికి ద్రోహం చేయడానికి వెనుకాడలేదు. ఇక బయటవాళ్లను ఎలా నమ్ముతామని కార్తీక్ అడుగుతాడు. మనలో మనం గొడవ పడాలని దక్షిణామూర్తి తాత ఇలా చేస్తున్నాడేమోనని దీప అనుమానపడుతుంది. ఇంత జరుగుతుంటే మా నాన్న ఎక్కడికి వెళ్లారని దీప అడుగుతుంది. రెస్టారెంట్స్ టూర్ అని బెస్ట్ రెస్టారెంట్స్ ను చూసేందుకు వెళ్లారని కార్తీక్ చెప్తాడు.

ఆడవాళ్ల భావోద్వేగాలన్నీ సముద్రంలోని అలల్లాంటివి. కుబేర్ నా తండ్రి కాదు. కానీ నన్ను పెంచాడు కాబట్టి తండ్రిలాగే ఫీల్ అవుతా. పెంచిన వాడి మీదే ఇంత ప్రేమ ఉంటే, కన్నవాళ్లపై ఇంకెంత ప్రేమ ఉండాలి. కానీ అమ్మ అంత కఠినంగా ఉందంటే ఏదో జరిగిందని దీప అంటుంది. ముందు నెగెటివ్ ఆలోచనలు తీసేయ్ అని దీపకు హితబోధ చేస్తాడు కార్తీక్.

సూరజ్ కౌంటర్

మరోవైపు స్కూటీ క్లీన్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే వచ్చిన జ్యోత్స్న.. లగేజీ ప్యాక్ చేసుకున్నావా? ముహూర్తం బాగోలేదని వెళ్లకుండా ఆగిపోకు. మా తాత నిన్ను కొట్టాడు అంటే నీ ఈగో ఊరుకుంటుందా? మా తాత అవమానం చేశాక మళ్లీ మా ముందు తల ఎత్తుకుని తిరగగలవా? నీకు సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చానని అంటుంది. ఊరికే ఎందుకు అరుస్తావే అని సూరజ్ తన స్టైల్లో కౌంటర్ వేస్తాడు.

అమ్ముడుపోయావా?

కొట్టడాన్ని గౌరవంగా తీసుకున్నానని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. అంటే నువ్వు నిజంగానే దక్షిణామూర్తితో కలిసిపోయావా అని జ్యో అడుగుతుంది. అతను ఇచ్చిన డబ్బుకు అమ్ముడుపోయావని అంటుంది. ఆపవే, నా బంగారు వసపిట్ట. నన్ను కొనేంత ఖలేజా ఇక్కడ ఎవరికీ లేదు. నేను తలవంచేది మంచితనానికే. మీ తాత నన్ను కొట్టడంలో నాకు అభిమానం కనిపించిందని సూరజ్ చెప్తాడు.

పెళ్లి చేసుకుందామన్న సూరజ్

నమ్మకం ఉన్న చోటే అనుమానం ఉంటుంది. ఎవరు మనతో ఉండాలని అనుకుంటున్నారో వాళ్లపైనే నమ్మకం ఉంటుంది. ఛైర్మన్ నన్ను ఏకంగా ఇంట్లో పెట్టుకున్నారు. నాపై నమ్మకం ఉంది కాబట్టే కొట్టారని సూరజ్ చెప్తాడు. మరి నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని జ్యో అడుగుతుంది. అర్థం చేసుకోవడం ఏంటీ? అర్థాంగినే చేసుకుంటా. సరే అను, పెళ్లి చేసుకుందామని సూరజ్ ప్రపోజ్ చేస్తాడు. నన్ను అందుకోవాలంటే నాలాంటి రేంజ్ ఉండాలి. మీరు ప్లాట్ ఫామ్ స్థాయి అని జ్యో కించపరిచేలా మాట్లాడుతుంది.

తాత డబ్బుతోనే

నీ వెనుక మీ తాత సంపాదించిన ఆస్తి, పరువు ఉంది. ఇవి పక్కనపెడితే నువ్వు రోడ్డు మీద అరటిపళ్లు అమ్ముకోవడానికి కూడా పనికి రావు. నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టే చెప్తున్నా. నువ్వు శివ నారాయణ మనవరాలివి కాదు. ఒక అనామకురాలివి. ఇప్పుడు చెప్పు ఏం పొడిచావో? నీ కాళ్లకు ఉన్న చెప్పులు కూడా మీ తాత డబ్బుతో కొన్నవే. నా షర్ట్ కూడా నేనే కొనుక్కున్నా అని సూరజ్ గర్వంగా చెప్తాడు.

కోటలోని రాణిని నేను అని జ్యో బిల్డప్ ఇస్తుంది. కోటలోని రాణి కోసం తోట రాముడు వస్తాడు. ఎప్పుడైనా ఎగరేసుకుపోవచ్చు. పెళ్లి మాత్రం ఈ ఇంట్లోనే చేసుకుందామని సూరజ్ అంటాడు. ఓ తథాస్తు దేవత తథాస్తు అను. మమ్మల్ని కలిపేందుకు నువ్వే ఈ భూమ్మీద అడుగుపెట్టాలని సూరజ్ గట్టిగా అరుస్తాడు.

కొత్త క్యారెక్టర్

అప్పుడే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఓ మహిళ రెస్టారెంట్ లో కాఫీ తాగుతుంది. రెస్టారెంట్ ఓనర్ ను కలవాలనుకుంటుంది. తన విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తుంది. ఆ విజిటింగ్ కార్డు మీద మాలిని అనే పేరు చూసి ఆ ఓనర్ షాక్ అవుతాడు. వెంటనే లోపలికి రమ్మంటాడు.

మీది సేమ్ బిజినెస్ కదా మాలిని గారు. మీరు నా హోటల్ కు వచ్చి కాఫీ తాగడం ఏంటీ? అని ఆ ఓనర్ అడుగుతాడు. ఈ హోటల్ ను కొనాలనుకుంటున్నా. మార్కెట్ రేటు రూ.2 కోట్లు. కానీ రూ.4 కోట్లు ఇస్తానని మాలిని అంటుంది. కానీ ఆ ఓనర్ ఒప్పుకోడు. మాలినిని వెళ్లిపొమ్మంటాడు.

కార్తీక్ ప్రశ్న

మరోవైపు ఫ్యామిలీ అందరూ ఉండగా శివ నారాయణ దగ్గరకు వెళ్తాడు సూరజ్. రేపు ఆఫీస్ కు రెండు గంటలు లేటుగా వస్తానని దీప దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. నువ్వేమీ ఎంప్లాయి కాదు కదా అని జ్యో వెటకారంగా అంటుంది. నేను ఏది చేసినా సిన్సియర్ గా చేస్తానని సూరజ్ కౌంటర్ వేస్తాడు.

నీకు సొంతవాళ్లు ఎవరూ లేరు కదా మరి రెండు గంటల టైమ్ ఎందుకు? అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న కూడా ఇదే ప్రశ్న వేస్తుంది. ఇక్కడితో కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More