కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోను ఇరికించిన సూరజ్-తాత ఫైర్-పోటీకి దక్షిణామూర్తి-చెంపపై కొట్టినా బయటపడని సూరజ్-ప్లాన్!
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 6 ఎపిసోడ్ లో జ్యోత్స్నను బాగా ఇరికిస్తాడు సూరజ్. తాతతో తిట్లు తింటుంది జ్యో. బెస్ట్ రెస్టారెంట్ కాంపిటీషన్లో దక్షిణామూర్తి కూడా పోటీకి సై అంటాడు. దక్షిణామూర్తి ముందే సూరజ్ ను చెంపదెబ్బ కొడతాడు శివ నారాయణ. టుడే పూర్తి ఎపిసోడ్ ను చూసేయండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 6 ఎపిసోడ్ లో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రెస్టారెంట్ల మధ్య పోటీకి దక్షిణామూర్తి కూడా బరిలో దిగుతాడు. శివ నారాయణపై పోటీకి సై అంటాడు. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

జ్యోత్స్న వర్క్
ఆఫీస్ లో పని చేసుకుంటున్న జ్యోత్స్న దగ్గరకు వెళ్లి సూరజ్ మళ్లీ కౌంటర్లు వేస్తాడు. హాయ్ డియర్, వర్క్ ఉందా అని సూరజ్ అడుగుతాడు. నాకు హెల్ప్ చేయవా? అని సూరజ్ కూల్ అయ్యేలా క్యూట్ గా అడుగుతుంది జ్యోత్స్న. నాకు అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి కదా. లేకపోతే మా తాతకు చెప్తానని జ్యో అంటుంది.
బకరాలా దొరికావని
మీ తాత మీద గౌరవంతో చేస్తానని సూరజ్ అంటాడు. జ్యోత్స్న వర్క్ ను షేర్ చేసుకుంటాడు. నా బంగారం నైట్ అంతా ఇలా కష్టపడటం నాకు ఇష్టం లేదు. నీకు హెల్ప్ చేయడం అంటే నాకు నేను హెల్ప్ చేసుకోవడమే అని సూరజ్ చెప్తాడు. బకరాలా భలే దొరికావు రా అని జ్యో ఫోన్ చూసుకుంటూ బిల్డప్ ఇస్తుంది. ఎవరిని ఎలా ఇరికించాలో నాకు తెలుసని సూరజ్ అనుకుంటాడు.
శివ నారాయణ ఫైర్
వర్క్ అంతా ఫినిష్ చేశానని ఉదయం ఫైల్స్ అన్ని శివ నారాయణకు ఇస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీపతో శివ నారాయణ ప్రేమగా మాట్లాడతాడు. అది చూసి జ్యో, పారు తట్టుకోలేకపోతారు. ఫైల్స్ చూసి జ్యోపై శివ నారాయణ ఫైర్ అవుతాడు. నీ డిగ్రీ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో పాడేయ్. 56089 అని కోడ్ ఉంది. ఇది ఏ బ్రాంచ్ అంటే.. అమీర్ పేట్ అని జ్యో చెప్తుంది. నీ తలకాయ్ అని శివ నారాయణ తిడతాడు.
ఎందుకు పనికిరాదని
అది మణిికొండ బ్రాంచ్ అని దీప చెప్తుంది. దీంతో జ్యోపై శివ నారాయణ మరింత రెచ్చిపోతాడు. అసిస్టెంట్ గా పని చేయడం కూడా చేతకాదంటూ ఫైర్ అవుతాడు. అప్పుడే పారిజాతం కాఫీ తెస్తే, దాన్ని దీపకు ఇవ్వమని శివ నారాయణ చెప్తాడు. దీప కోసమే అడిగానంటాడు. పారు కనీసం కాఫీ ఇచ్చేందుకైనా పనికొస్తుంది. ఈ జ్యోత్స్న ఎందుకూ పనికిరాదని శివ నారాయణ తిడతాడు.
ఇరికించిన సూరజ్
వర్క్ చేశాక చెక్ చేసుకోవాలి కదా అని శివ నారాయణ అంటే.. ఆ మాట నేను కూడా చెప్పా సార్ అని సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. ఇంకొన్ని ఫైల్స్ చూడమని ఇస్తాడు. ఇవి కరెక్ట్ గానే ఉన్నాయని ఛైర్మన్ అంటాడు. జ్యోత్స్నకు నేను హెల్ప్ చేశా. లాస్ట్ లో చెక్ చేద్దామంటే వర్క్ నీకు కొత్త నాకు కాదు, నేను ఒక్కసారి ఫైల్ చేశానంటే అందులో తప్పులు పట్టుకోవడం బ్రహ్మ దేవుడి వల్ల కాదు అని జ్యో చెప్పిందని సూరజ్ ఇరికిస్తాడు.
రీల్స్ చూస్తే ఇలాగే
బయట సూరజ్, జ్యోత్స్న మళ్లీ గొడవ పెట్టుకుంటారు. కావాలనే చేశావ్ కదా అని జ్యో అడుగుతుంది. పని మానేసి రీల్స్ చూస్తూ కూర్చుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది బంగారం. అరిస్తే పోయేది నీ పరువే అని జ్యోకు కౌంటర్ వేస్తాడు సూరజ్. మరోవైపు పారిజాతం ఇల్లు తుడుస్తుంటుంది. అప్పుడే పారును కార్తీక్ ఫొటోలు తీస్తాడు. ఈ ఫొటోను ఫ్లెక్సీగా పెడతానని పారుతో ఆడుకుంటాడు కార్తీక్.
రెస్టారెంట్ కాంపిటీషన్
రెస్టారెంట్ ఓనర్లు వచ్చి శివ నారాయణను కలుస్తారు. కొత్త సీఈఓ అని దీపను వాళ్లకు పరిచయం చేస్తాడు శివ నారాయణ. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్ పెడుతున్నాం. దీని వల్ల సిటీలో బెస్ట్ ఫుడ్ ఏ రెస్టారెంట్ లో దొరుకుతుందో తెలుస్తుంది. కానీ ఈ సారి కాంపిటీషన్ లో రెస్టారెంట్ చెఫ్స్ లైవ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పోటీలో ఓ కొత్త రెస్టారెంట్ పోటీకి దిగుతుందని రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి సాయినాథ్ చెప్తాడు.
పోటీగా దక్షిణామూర్తి
ఆ రెస్టారెంట్ ఎవరిది అని శివ నారాయణ అడుగుతాడు. అప్పుడే నాదే అంటూ దక్షిణామూర్తి షాకింగ్ ఎంట్రీ ఇస్తాడు. నా పేరు దక్షిణామూర్తి. సిటీలో మీ బ్రాంచ్ లకు ఎదురుగానే కొత్త బ్రాంచ్ ను ఈ రోజే ఓపెన్ చేశా. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ లో మెంబర్ షిప్ తీసుకున్నా. మా రెస్టారెంట్ గురించి జనాలకు తెలిసేలా చేసేందుకు ఈ పోటీ మంచి వేదిక అని దక్షిణామూర్తి చెప్తాడు.
ఈ సారి మీకు గట్టి పోటీ ఉంటుంది శివ నారాయణ అని దక్షిణామూర్తి అంటాడు. మేమెంటో మా క్వాలిటీ చూపిస్తుందని శివ నారాయణ కౌంటర్ వేస్తాడు. దక్షిణామూర్తి, శివ నారాయణ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటారు. అప్పుడు దక్షిణామూర్తి కళ్లు ఎవరి కోసమో వెతుకుతాయి. సూరజ్ కోసం వెతుకుతున్నాడేమోనని శివ నారాయణ డౌట్ పడతాడు.
సూరజ్ కు చెంపదెబ్బ
అందరూ వెళ్లిపోయినా దక్షిణామూర్తిని మాత్రం ఉండమని శివ నారాయణ చెప్తాడు. అప్పుడే సూరజ్ ను పిలిపిస్తాడు. సూరజ్ చెంపపై లాగిపెట్టి కొడతాడు శివ నారాయణ. అప్పుడు దక్షిణామూర్తి రియాక్షన్ చూస్తాడు. కానీ దక్షిణామూర్తి నార్మల్ గానే ఉంటాడు. దక్షిణామూర్తిని వెళ్లమంటాడు శివ నారాయణ.
నా మీద అనుమానం తీర్చుకోవడానికి నన్ను కొట్టారు. ఇప్పుడు వచ్చిన మనిషి ఎలా రియాక్టవుతారో చూద్దామనుకున్నాడు. అంతేనా ఛైర్మన్ గారు అని సూరజ్ అడుగుతాడు. కానీ బయట పడడు. అవును, సూరజ్. కానీ ఒక్క మాట.. నా అనుకున్నవాళ్లనే నేను కొడతా. నేను కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకోకు అని శివ నారాయణ చెప్తాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


