కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ భర్త ఎలా అవుతాడు? నేనే నీ మొగుడిని-జ్యోత్స్నకు సూరజ్ దిమ్మతిరిగే షాక్-పెళ్లాం అంటూ
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 2 ఎపిసోడ్ లో జ్యోత్స్నపై దీప ఫైర్ అవుతుంది. కార్తీక్ తో పెళ్లి అన్నావంటే పళ్లు రాలగొడతానంటుంది. మరోవైపు జ్యోత్స్నకు తానే మొగుడిని అని సూరజ్ దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు. పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 2 ఎపిసోడ్ లో జ్యోత్స్న దిమ్మతిరిగేలా సూరజ్ మాటలంటాడు. కార్తీక్ వెంట పడటం ఆపేయమంటాడు. తానే జ్యోత్స్న భర్తను అని రెచ్చిపోతాడు. ఇంకా కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

దీప ఫైర్
దీప, కార్తీక్, జ్యోత్స్న ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటారు. జ్యోత్స్న స్పూన్ కింద పడిపోతుంది. అప్పుడు కార్తీక్ ప్లేట్లోని స్పూన్ ను జ్యో తీసుకుంటుంది. అది చూసి దీప.. ఆగవే అంటూ ఫైర్ అవుతుంది. దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బావ. నీ ఎంగిలి స్పూన్ తీసుకుని తింటుందని దీప అంటుంది. తింటే తప్పేంటీ అని జ్యో అడుగుతుంది.
పళ్లు రాలుతాయని
కార్తీక్ నా భర్త అని దీప చెప్తుంది. నా మెడలో తాళి కడితే నా భర్త అయ్యేవాడు. బావ.. నువ్వు, దీప భార్యభర్తలు కాకముందు.. భార్యాభర్తలం కావాల్సింది మనమే. నీ ఎంగిలి ఎన్ని సార్లు తిన్నా అని జ్యో అడుగుతుంది. నా ఇష్టం నేను తింటానని జ్యో అంటే.. పళ్లు రాలిపోతాయని దీప మాస్ వార్నింగ్ ఇస్తుంది.
కార్తీక్ కు పెళ్లాం
నేను నీతో ఎప్పుడో ఛాలెంజ్ చేశా దీప. కార్తీక్ కు దీప భార్య అనేది ఎప్పటికీ కాలేదు. నేను పుట్టకముందే బావకు పెళ్లాన్ని అయ్యా. ఏదో ఒక రోజు నిజంగానే అవుతానని జ్యోత్స్న అంటుంది. నోరు మూయకపోతే బాక్స్ లోపలికి వెళ్లిపోతుందని దీప అంటుంది. ఇదంతా సూరజ్ చూస్తాడు. అప్పుడు సూరజ్ ను కార్తీక్ పిలవడంతో జ్యో కోపంగా లేచి వెళ్లిపోతుంది.
దీపకు డ్రైవర్ గా కార్తీక్
తన స్కూటీని సూరజ్ నే ఉంచుకోమని కార్తీక్ చెప్తాడు. తన భార్య సీఈఓకు తానే కారు డ్రైవర్ ను అని చెప్తాడు. మరోవైపు బయటకొచ్చిన జ్యోత్స్నను స్కూటీ ఎక్కమని సూరజ్ అడుగుతాడు. మధ్యలో స్కూటీ ఆపిన సూరజ్.. దీప తిట్టిన విషయంలో జ్యోత్స్నను అసహ్యించుకుంటాడు. దీపకు, నాకు జరిగిన విషయం గురించి నీకెందుకు అని జ్యో అడుగుతుంది.
నీ మొగుణ్ని
పెళ్లయిన మగాడి వెంట పడే ఆడదాని గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా? బజారు.. అని సూరజ్ ఆగిపోతాడు. నన్ను అడగడానికి నువ్వెవరు అంటూ సూరజ్ కాలర్ పట్టుకుంటుంది జ్యో. నేను నీ మొగుణ్ని అని సూరజ్ అనగానే జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. నువ్వెలా నా మొగుడు అవుతావని జ్యో అడుగుతుంది. మరి కార్తీక్ ఎలా భర్త అవుతాడని రివర్స్ లో అడుగుతాడు సూరజ్.
సూరజ్ పెళ్లాం జ్యో
బావే నా భర్త అని నా ఫ్యామిలీ చెప్పిందని జ్యో అంటే.. నువ్వే నా భార్యవి అని నా మనసు చెప్తుందని సూరజ్ అదిరే కౌంటర్ వేస్తాడు. ఆడదాని మెడలో మగాడు తాళి కడితేనే భర్త అవుతాడు. తాళి కట్టని కార్తీక్ నీకు మొగుడు అవుతే, నేను కూడా నీకు మొగుడే అవుతా. కార్తీక్ ను నువ్వు మొగడు అనుకో, నేను నిన్ను పెళ్లాన్ని అనుకుంటానని సూరజ్ అంటాడు. మరోసారి అదే మాట అంటే రాయితో తల పగలకొడతానని జ్యోత్స్న అంటుంది.
దీప భర్త కార్తీక్
దీప భర్త కార్తీక్. వాళ్ల కడుపులో బిడ్డ కూడా ఉంది. వేరొకరికి సొంతమైన మనిషిపై మనసు పడటం మనిషి లక్షణం కాదు. మామూలుగా నువ్వు బంగారానివి. కానీ నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావని సూరజ్ గట్టిగా బుద్ధి చెప్తాడు. కార్తీక్ కు ఇష్టం ఉంది కాబట్టే దీపకు తాళి కట్టాడు, సంసారం చేస్తున్నాడు. తండ్రి కాబోతున్నాడు. ఎవరో చెప్తే వినేందుకు నువ్వు చిన్న పిల్లవి కాదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉందని సూరజ్ చెప్తాడు.
శౌర్య మార్కులు
మరోవైపు శౌర్య ప్రోగ్రెస్ కార్డు దాచేయడం గురించి కాంచన నానా గొడవ చేస్తుంది. ఏంటి ఈ మార్కులు అని కూతురిని కార్తీక్, దీప తిడతారు. నేను కష్టపడి చదువుతున్న, మార్కులు రాకపోతే ఏం చేయాలి? మా ఫ్రెండ్స్ కు వాళ్ల పేరెంట్స్ ట్యూషన్ చెప్తారు. మరి నాకు ఎవరు చెప్తారని శౌర్య అడుగుతుంది. తప్పు మనదే దీప. ట్యూషన్ కు తీసుకెళ్లడం గురించి ఆలోచించాలని కార్తీక్ అంటాడు.
సూరజ్ సైట్ కొడుతున్నాడని
ఇక సూరజ్ మాటల గురించి జ్యోత్స్న ఆలోచిస్తుంటుంది. అప్పుడే సూరజ్ వాయిస్ మెసేజ్ చేస్తాడు. కార్తీక్ గురించి మర్చిపొమ్మంటాడు. అప్పుడే పారిజాతం వస్తుంది. సిగ్గు లేదా నీకు, చివరకు వాడితో కూడా సలహాలు ఇప్పించుకుంటున్నావ్ అని పారు అంటుంది. ఆ సూరజ్ నాకు సైట్ కొడుతున్నాడు. అందుకే నేను బావను ఇష్టపడటం చూడలేక ఇలా సలహాలు ఇస్తున్నాడని జ్యోత్స్న చెప్తుంది.
పెళ్లే శ్రీరామ రక్ష
అప్పుడప్పుడు శత్రువు మాట కూడా వినాలి. కార్తీక్ వెనుకాల పడితే ఏం మిగలదు. అందుకే కోటీశ్వరుడిని చూసి పెళ్లి చేసుకో. రెండు వైపులా ఆస్తి కలిసి వస్తుంది. ఇప్పుడు దీప ఏమో సీఈఓ. నువ్వు దీపకు అసిస్టెంట్ వి. దీప ఫాస్ట్ గా ఎదుగుతోంది. నువ్వు పడిపోతున్నావ్. దీపను ఈ ఇంటి వారసురాలిగా నిలబెట్టేందుకు కార్తీక్ రంగం సిద్ధం చేస్తున్నాడు. అందుకే నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని ఆస్తి అంతా నీ పేరు మీద రాయించుకోకపోతే జీవితాంతం దీపకు సేవలు చేసుకుంటేనే బతకాలని పారిజాతం హితబోధ చేస్తుంది.
ఇంతమందితో నేను ఒంటరి పోరాటం చేస్తున్నానని జ్యో అంటుంది. పెళ్లే నీకు శ్రీ రామ రక్ష. పెళ్లితో నీ జీవితం మారిపోతుందని గ్రానీ చెప్తే జ్యో ఆలోచనలో పడుతుంది.
శౌర్యకు ట్యూషన్ ఆఫీస్ లోనే అని కార్తీక్ చెప్తాడు. కానీ శౌర్య మాత్రం ఆఫీస్ కు వెళ్లనంటుంది. దీంతో శౌర్యపై కాంచన సెటైర్లు వేస్తుంది. దీంతో శౌర్య ఆఫీస్ కు వస్తానంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


