Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. భార్యాభర్తలుగా సూరజ్, జ్యోత్స్న-దీపకు మాలిని అదిరే ఆఫర్- కార్తీక్ షాక్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 10 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గుడిలో శివ నారాయణ ఫ్యామిలీతో దక్షిణామూర్తి, మాలిని మాట్లాడతారు. సూరజ్, జ్యోత్స్నను పూజారి భార్యాభర్తలు అనుకుంటాడు. మరోవైపు దీపకు మాలిని ఆఫర్ ఇస్తుంది. అదేంటో పూర్తి ఎపిసోడ్ లో ఇక్కడ తెలుసుకోండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ లో శివ నారాయణ ఫ్యామిలీతో దక్షిణామూర్తి, మాలిని మాట్లాడతారు. సూరజ్, జ్యోత్స్నను భార్యాభర్తలని పూజారి అనుకుంటాడు. తన దగ్గర పని చేయమని దీపకు మాలిని ఆఫర్ ఇస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

దక్షిణామూర్తి హోమం
గుడిలో శివ నారాయణ, మాలిని హోమం చేయిస్తారు. ఆ హోమం పూర్తి అయిన తర్వాత శివ నారాయణ ఫ్యామిలీ దగ్గరకు దక్షిణామూర్తి వెళ్తాడు. నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించానో నీకు తెలియాలని శివ నారాయణకు చెప్తాడు దక్షిణామూర్తి. కనీసం వచ్చే జన్మలోనైనా నేను బతికినంత కాలం నన్ను నాన్న అని పిలిచే అదృష్టం కోసమే హోమం అని వివరిస్తాడు.
సుమిత్ర కోపం
నీదెంత రాతి గుండె నాన్న. అమ్మ అనే పిలుపునకు నన్ను దూరం చేసి, నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? గుండెల్లో లేని ప్రేమ గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణం లేని బంధానికి శాంతి అవసరమా? అని సుమిత్ర కోప్పడుతుంది. అవసరమే సుమిత్ర అని మాలిని దగ్గరకు వస్తుంది.
జ్యోత్స్నకు డౌట్
మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తుంది, ఎవడు ఈవిడ? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. దక్షిణామూర్తి కోడలు మాలిని అని సూరజ్ చెప్తాడు. నీకెలా తెలుసు అంటే?.. శత్రువుల గురించి తెలుసుకోవాలని ఛైర్మన్ చెప్తుంటారు కదా. వీకిపీడియాలో డీఎం రెస్టారెంట్ల గురించి బ్రౌజ్ చేస్తే నీక్కూడా తెలుస్తుందని జ్యోత్స్నకు సూరజ్ చెప్తాడు.
కార్తీక్ కు పిన్ని
ఎలా ఉన్నావ్ సుమిత్ర అని మాలిని అడుగుతుంది. తను నా కోడలు మాలిని, వరుసకు నీకు పిన్ని అవుతుందని కార్తీక్ కు దక్షిణామూర్తి పరిచయం చేస్తాడు. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటి కోడలు అయ్యాక వరుసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం బాబాయ్? మనం నేల మీద ఉన్నా లేకపోయినా, పిల్లల రూపంలో వరుసలు మిగిలే ఉంటాయని మాలిని అంటుంది.
గుండెల్లో మండే హోమం
మేనకోడలా ఎలా ఉన్నావ్? అని జ్యోత్స్నను మాలిని అడుగుతుంది. మీది సిటీలో చాలా పేరున్న వ్యాపారం. ఆన్ లైన్ లో బ్రౌజ్ చేస్తే ఫొటోలతో సహా మొత్తం డీటైల్స్ వస్తాయని మాలిని అంటుంది. దశరథ ఎక్కడ? అని మాలిని అడుగుతుంది. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారని గతాన్ని మర్చిపోయేవాడిని కాదు. నా గుండెల్లో మండే హోమం ఆరిపోదు. అనుకోకుండా ఎదురుపడ్డాం, మా దారిన వెళ్లనివ్వండని శివ నారాయణ వెళ్లిపోతాడు.
మీ తండ్రికూతుళ్ల మధ్య దూరాన్ని పిలిచేందుకు శాంతి హోమం చేయిద్దామనుకున్నా. తనే మీ దగ్గరకు వచ్చింది. ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రేమగా నాన్న అని పిలుస్తుందని దక్షిణామూర్తితో మాలిని చెప్తుంది. మనం వాళ్లకు చాలా రుణపడి ఉన్నామని మనసులోనే అనుకుంటుంది మాలిని.
భార్యాభర్తలుగా సూరజ్, జ్యోత్స్న
నవ గ్రహాల పూజ కోసం వచ్చిన సూరజ్, జ్యోత్స్నను చూసి అక్కడున్న పంతులు భార్యాభర్తలని అనుకుంటాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదని జ్యో కోపంగా చెప్తుంది. ప్రేమ పెళ్లి అయితే 10 పర్సంట్ డిస్కౌంట్ కూడా ఇస్తానని పంతులు నవ్వుతూ చెప్తాడు. ఎవరి పూజ వాళ్లు చేద్దామని సూరజ్ తో జ్యో అంటుంది. జ్యో ఎలా చేస్తే సూరజ్ అలా చేస్తాడు.
మనసులో ఉన్న అమ్మాయితో
నా జీవితంలో ప్రవేశించిన శని సూరజ్. వీడిని గెంటేసేయ్ అని శనీశ్వరుడిని జ్యో మొక్కుకుంటుంది. ఇది అనుకున్నది మాత్రం జరగకూడదని సూరజ్ కోరుకుంటాడు. ఈ పూజ తర్వాత దోషం పోయినట్లేనా? నా మనసులో ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వస్తుందా? అని జ్యోత్స్నను చూసి పంతులును సూరజ్ అడుగుతాడు. నీ మనసులో ఉన్న అమ్మాయితో ఏడు అడుగులు నడిచే టైమ్ వచ్చిందని పూజారి చెప్తాడు.
నేను సైలెంట్ గా ఉన్నానని ఎక్స్ ట్రాలు చేస్తున్నావేంటీ అని జ్యోత్స్న అడుగుతుంది. నా పెళ్లి గురించి అడిగితే నీకెందుకు? నేనేమైనా జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటానని అడిగానా? అని సూరజ్ కౌంటర్ వేస్తాడు. జ్యో వెనుకాలే సూరజ్ ప్రదక్షిణలు చేస్తూ దక్షిణామూర్తి ఫ్యామిలీ గురించి అడుగుతాడు. జ్యో మొత్తం డీటైల్స్ చెప్పేస్తుంది.
ఆటలో అరటిపండు
సూరజ్, జ్యోత్స్నను దూరం నుంచి చూస్తుంది పారిజాతం. జ్యో అంతు చూసే దాకా వదిలిపెట్టడని సూరజ్ గురించి అనుకుంటుంది. అప్పుడే తాత వాయిస్ తో పారిజాతం అని కార్తీక్ పిలవగానే.. పారు ఉలిక్కి పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి కార్తీక్ నవ్వుతుంటాడు. నువ్వు గొంతు మార్చావు, సూరజ్ ఏకంగా మనుషులనే మార్చేస్తున్నాడని పారు అంటుంది. కూరలో కరివేపాకు, ఆటలో అరటిపండు చేశారని పారు తెగ ఫీల్ అయిపోతుంది.
దీపకు మాలిని ఆఫర్
మరోవైపు గుడిలో ప్రసాదం పంచుతున్న దీప.. మాలిని దగ్గరకు వెళ్లి ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం రుచి చూసిన మాలిని ఇంప్రెస్ అవుతుంది. మా రెస్టారెంట్ లో చెఫ్ గా పని చేస్తావా? ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. నువ్వు ఊహించనంత శాలరీ ఇస్తానని మాలిని ఆఫర్ చేస్తుంది. ఒకరిని చూసిన తర్వాత అవతలి వాళ్లను కూడా అంచనా వేయాలని దీప అంటుంది.
జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ
ఎక్కడో నిజాయతీగా పని చేస్తుంటావు. కానీ అవసరాలను బట్టి నిజాయతీ మారుతుందని మాలిని అంటుంది. ఆ అవసరం తనకు లేదని దీప గట్టిగానే కౌంటర్ వేస్తుంది. ఇంత పదునైన మాటలున్నాయి. ఎక్కడైనా వంట మనిషిగా పని చేస్తున్నవా? అని మాలిని అడుగుతుంది. అప్పుడే తను వంట మనిషి కాదు, జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈఓ అని కార్తీక్ వచ్చి గొప్పగా చెప్తాడు. తను నా భార్య కూడా అని కార్తీక్ అంటాడు.
ఈ విషయం మాలినికి తెలియదనుకున్నావా? ఆ మనిషికి అన్ని తెలిసే కావాలని అడుగుతుందని శివ నారాయణ చెప్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


