Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..సుమిత్ర ప్రశ్నలతో వణికిపోయిన సూరజ్-కార్తీక్ ఫ్యామిలీకి మాలిని డబ్బు ఆశ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 22 ఎపిసోడ్ మహా రసవత్తరంగా సాాగుతుంది. పురిట్లోనే బిడ్డను అంటూ కార్తీక్ నోరు జారుతాడు. సూరజ్ ను సుమిత్ర వరుస ప్రశ్నలు వేస్తుంది. కాంచన ఫ్యామిలీని కొనేందుకు మాలిని డబ్బు పొగరు చూపిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 22, 2026, 07:04:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 22 ఎపిసోడ్ లో సూరజ్ కుటుంబం గురించి తెలుసుకునేందుకు సుమిత్ర వరుసగా ప్రశ్నలు వేస్తుంది. మరోవైపు కాంచన కుటుంబాన్ని కొనేందుకు మాలిని ఇంటికి వెళ్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దీపకు దిష్టి

తన తల్లి దగ్గర దీపను తెగ పొగిడేస్తాడు కార్తీక్. నా కోడలికి దిష్టి తీయాలి. దీని చేతిలో మాలిని, దక్షిణామూర్తి ఓడిపోయారు కదా. ఎంత తిట్టుకుని ఉంటారో అని కాంచన అంటుంది. అంటే ఓ బస్తెడు మిరపకాయలు కావాలి. ఎదుగుతున్న వాళ్లపై అందరి కళ్లు ఉంటాయని కార్తీక్ అంటాడు. ముఖ్యంగా పారిజాతం కళ్లన్నీ మనమీదే అని కార్తీక్ చెప్తాడు.

నోరు జారిన కార్తీక్

తాతకు పారు మీద పీకల దాకా కోపం ఉంది. అందుకే పురిట్లోనే బిడ్డను అని నోరు జారబోయి మళ్లీ కవర్ చేసుకుంటాడు కార్తీక్. పురిట్లో బిడ్డ ఏంటీ అని కాంచన అడిగితే.. జ్యోత్స్నను చిన్నప్పటి నుంచే తనకు అలవాటు చేసుకుందని కార్తీక్ అంటాడు. పారిజాతం మనవరాలిలా జ్యోత్స్న పెరిగిందని కాంచన అంటుంది. అది మాత్రం నిజమని కార్తీక్ చెప్తాడు. ఇక శౌర్య వచ్చి కాంచన మీద పంచ్ లు వేస్తుంది.

షాకిచ్చిన సుమిత్ర

మరోవైపు చేతిలో కర్ఛీఫ్ తో సూరజ్ దగ్గరకు వెళ్తుంది సుమిత్ర. జ్యోత్స్న కాలుకు దెబ్బ తగలగానే మా కంటే ఎక్కువ రియాక్టయ్యావ్ అని సుమిత్ర అడుగుతుంది. దెబ్బ తగలగానే రియాక్టయ్యా. అందరికి ఎలా చేస్తానో అలాగే చేస్తా. నా ప్రవర్తన తప్పుగా ఉందా అని సూరజ్ అడుగుతాడు. అవును అని సుమిత్ర షాకిస్తుంది. మరోసారి ఇలా జరగదని సూరజ్ చెప్తాడు. మరోసారి జ్యోత్స్న పూలకుండీని తన్నదు కదా. ఊహించనివి మనం అదుపు చేయలేం సూరజ్. ఎలా రియాక్టవుతామన్నది మన చేతుల్లో ఉండకపోవచ్చు అని సుమిత్ర అంటుంది.

సూరజ్ అమ్మానాన్న ఎవరు?

నేను ఇది అడగడానికి రాలేదు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. నేనే నీకు అన్ని విషయాలకు థ్యాంక్స్ చెప్పాలి. మనకు సాయంగా నిలపడే స్నేహితుడు ఎప్పుడూ గొప్పవాడే. జ్యోత్స్న పోటీకి దిగడానికి కారణం నువ్వే. నా కూతురికి సాయం చేసి కూడా గర్వం లేకుండా వినయంగా నిలపడ్డావ్. ఇంతకీ మీ అమ్మానాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? నీకు తోబుట్టువులు ఉన్నారా? మీది ఉమ్మడి కుటుంబమా? అని సుమిత్ర వరుసగా ప్రశ్నలు వేస్తుంది.

సూరజ్ టెన్షన్ పడతాడు. సూరజ్ ఏదో చెప్పబోతుంటే సుమిత్ర అని పారిజాతం పిలుస్తుంది. దీంతో సుమిత్ర మళ్లీ మాట్లాడతా అని వెళ్లిపోతుంది.

కాంచన ఇంటికి మాలిని

అటు ఉదయం కాంచన ఇంటికి మాలిని వెళ్తుంది. మాలినిని చూసి అందరూ షాక్ అవుతారు. ఎలా ఉన్నావ్ కాంచన అని అడుగుతుంది మాలిని. నా ఇంటికి ఎందుకు వచ్చావ్? దీప ముందు ఆ మనిషిని బయటకు వెళ్లమను అని కాంచన కోప్పడుతుంది. ఇంటికి వచ్చిన అతిథికి చేయాల్సిన మర్యాద ఇదేనా? అని మాలిని అడుగుతుంది. నా కాళ్లు కదలవు, లేదంటే నీకు ఎలాంటి మర్యాద చేయాలో అలాగే చేసేదాన్ని అని కాంచన సీరియస్ అవుతుంది.

నా తండ్రి మచ్చలేని మనిషి అని కాంచన చెప్పగానే మాలిని వెటకారంగా నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. నీకు ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంట్లో నుంచి గెంటేసినందుకా? రెండో పెళ్లి చేసుకున్న శ్రీధర్ ను భర్తగా చేసినందుకా? అని మాలిని అంటుండగా.. కార్తీక్ వస్తాడు. పిన్ని అక్కడితో ఆగిపోతే నీకు మంచిది, నాకూ మంచిది అని కార్తీక్ అంటాడు.

అవమానించిన మాలిని

కార్తీక్ నువ్వు మాట్లాడకు. ఈ గొడవలు మాతోనే ఆగిపోవాలని కాంచన అంటుంది. ఇంటికి వచ్చి గొడవ పడుతుంటే నేను మాట్లాడుతానని కార్తీక్ చెప్తాడు. ఇదొక ఇల్లా? ఇలాంటి ఇంట్లో బతికేది ఒక బతుకా? మీ పరిస్థితికి కారణం తాత కాదా? అని మాలిని అవమానిస్తుంది. నీ కోడలిని మీ నాన్న తన ఇంటి పనిమనిషిని చేసుకున్నాడని మాలిని అంటుంది. ఇప్పుడు నా కోడలు సీఈఓ అని కాంచన గొప్పగా చెప్తుంది.

కాంచన ఫ్యామిలీకి ఆఫర్

ఇదే ఇంట్లో బతుకుతున్న ఈ మనిషే మిమ్మల్ని ఓడించిందని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. నా భర్త గురించి తెలియక మాట్లాడుతున్నారని దీప అంటుంది. తాతల ఆస్తుల మీద ఆశపడే మనవళ్లను చూసి ఉంటారు. ఎవరి మీద ఆధారపడని మనిషిని ఇక్కడ చూడండని కార్తీక్ కు భారీ ఎలివేషన్ ఇస్తుంది దీప. నా ముందు నా భర్తను అవమానిస్తే చూస్తూ ఊరుకోనని దీప వార్నింగ్ కూడా ఇస్తుంది.

ఈ జీవితం శివ నారాయణ రాసిపెట్టిన శాపం. మా బతుకులను వెక్కిరించింది చాలు, బయటకు వెళ్లు అని కాంచన మండిపడుతుంది. మీ జీవితాలను మార్చడానికి చెక్ ఇస్తున్నా. నాతో కలిసిపోతే మీ అందరి జీవితాలు మారిపోతాయి. నేను ఎవరిని కొనను. ఆఫర్ ఇస్తా. మీ కాల్ కోసం ఎదురు చూస్తుంటా అని మాలిని వెళ్లిపోతుంది.

శివ నారాయణ కోపం

సూరజ్ కు శివ నారాయణ కాల్ చేసి ఉన్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదని కోపంగా చెప్తాడు. మరోవైపు అమ్మ ఎందుకు మాట్లాడనివ్వలేదు. చెక్కు ముఖానికి కొట్టాల్సింది. అమ్మ ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావడం లేదని కార్తీక్ రగిలిపోతాడు. అత్త ఏం చేయాలో అదే చేస్తుంది. అత్తకు కోపం వస్తే ఊరుకోదని దీప చెప్తుంది.

అప్పుడే శివ నారాయణ వస్తాడు. ఫ్రూట్స్, చెక్ తీసుకొని కార్తీక్, సూరజ్ తో కలిసి దక్షిణామూర్తి ఇంటికి వెళ్తాడు. ఈ ఇంటికి తీసుకొచ్చారేంటీ అని సూరజ్ అడుగుతాడు. ఈ ఇల్లు నీకు తెలుసా? అని శివ నారాయణ అడిగితే.. సూరజ్ కవర్ చేస్తాడు. మరోవైపు నేనే నా తండ్రికి చెప్పానని దీపతో కాంచన చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More