Kartika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. మొగుణ్ని అవుతానన్న సూరజ్- జ్యోకు కౌంటర్- వేలికి గాయం- మాలినికి అన్యాయం
Kartika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 21 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. జ్యోత్స్నకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇస్తాడు సూరజ్. తాళి కట్టి మొగుడిని అవుతానంటాడు. మరోవైపు మాలిని అవమానంతో రగిలిపోతుంది. ఆమెకు అన్యాయం జరిగిందని దక్షిణామూర్తి అంటాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.
Kartika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 21 ఎపిసోడ్ లో జ్యోత్స్నను ఇష్టపడుతున్నట్లు చెప్పి సూరజ్ షాకిస్తాడు. మరోవైపు ఓటమితో మాలిని ఫీల్ అవుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

తాళి కడితే మొగుణ్ని
సూరజ్, జ్యోత్స్న ఆర్గ్యూ చేసుకుంటారు. నేను నీతో అరవలేనని జ్యోత్స్న అంటుంది. నువ్వంటే నాకిష్టం అని సూరజ్ షాక్ ఇస్తాడు. నువ్వంటే నాకిష్టం లేదని జ్యో అంటుంది. అది నాకు అనవసరం. నిన్ను ఇష్టపడమని చెప్పడం లేదు. ప్రస్తుతం నేను నీ లవర్ ను. తాళి కడితే మొగుణ్ని అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.
జ్యోత్స్నకు ప్రేమతో
నేను లవర్ ను అన్నాను కానీ నిన్ను లవర్ లా ఉండమన్నానా? నిన్ను పెళ్లాంలా ఉండమన్నానా? ప్రేమించొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు? అని సూరజ్ లాజిక్ గా మాట్లాడతాడు. నా ప్రేమ ఎప్పటికీ నీకే అని జ్యోత్స్న చేతిలో రోజా పువ్వు పెడతాడు సూరజ్. థ్యాంక్స్ అని చెప్పిన జ్యో, ఆ పువ్వును కిందపడేసి కాలితో తొక్కుతుంది. నిన్ను ఇలాగే కుడికాలి బొటన వేలితో తొక్కేస్తానని సూరజ్ కు వార్నింగ్ ఇస్తుంది.
విన్నింగ్ సెలబ్రేషన్స్
రాత్రి శివ నారాయణ ఇంట్లో కేక్ కట్ చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైనా చూస్తే మీకు ఇద్దరు మనవళ్లు, మనవరాళ్లు అనుకుంటారని దీప, కార్తీక్, జ్యోత్స్న, సూరజ్ ను ఉద్దేశించి శివ నారాయణతో పారు అంటుంది. నువ్వు ఏం అనుకుంటున్నావో చెప్పు అని శివ నారాయణ అడుగుతాడు. దీంతో పారు నోరు మూసుకుంటుంది. పారు నోట్లో కార్తీక్ కేకు కుక్కుతాడు.
దీప వెనుక కార్తీక్
ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉందని అంటారు అని శివ నారాయణ అనగానే పారు వెళ్లి అతని వెనుకాల నిలబడుతుంది. నేను చెప్పింది నా గురించి కాదు, దీప గురించి. ఈ గెలుపు తనది. ఆడదాని విజయం వెనుక మగాడు ఉంటాడు. దీప విజయం వెనుక కార్తీక్ ఉన్నాడని శివ నారాయణ అంటాడు. నా మనసులోని మాట చెప్పారని దీప అంటుంది. మీరు అందరికీ ఆదర్శంగా ఉంటారని ఛైర్మన్ ను సూరజ్ పొగిడేస్తాడు.
మాలినికి అన్యాయం
మరోవైపు ఓటమిని తలుచుకుంటూ మాలిని ఫీల్ అవుతుంటుంది. ఓడిపోయినందుకు బాధ పడుతున్నావా? అని మాలినిని దక్షిణామూర్తి అడుగుతాడు. ఓడిపోలేదు, కొత్త పాఠాలు నేర్చుకున్నామని మాలిని చెప్తుంది. నేను తలెత్తుకోలేను, నేను ఓడిపోయానని దక్షిణామూర్తి అంటాడు. గతాన్ని మార్చిపోగలవా? నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోగలవా? శివ నారాయణ కుటుంబం కారణంగా నువ్వు పడుతున్న బాధను మర్చిపోగలవా? అని మాలినిని దక్షిణామూర్తి అడుగుతాడు.
అవమానం
మన రెండు కుటుంబాలు కలవాలన్నదే లక్ష్యం. మనం ఓడిపోలేదు. మీ కూతురిని గెలిపించాం. దూరాన ఉన్న మీ కూతురిని తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టా. అది గెలుపు కాదా? అని మాలిని అడుగుతుంది. నువ్వు నన్ను గెలిపించావు. నా కూతురు నా దగ్గరకు వస్తుందన్న నమ్మకాన్ని కలిగించావని దక్షిణామూర్తి లోపలికి వెళ్లిపోతాడు.
ఓడిపోయింది మీరు కాదు మామయ్య, నేను. ఇది నాకు అవమానం. ఒక మంచే జరిగింది. బాబాయి బలం తెలిసిందని మాలిని అనుకుంటుంది.
జ్యోత్స్నకు గాయం
ఇటు శివ నరాయణ ఇంట్లో పూల కుండీ తగిలి జ్యోత్స్న కాలికి రక్తం వస్తుంది. వెంటనే సూరజ్ తన కర్ఛీఫ్ తో బొటనవేలిని క్లీన్ చేసి, కట్టు కడతాడు. చూసుకోవాలి కదా, అందరూ సంతోషంగా ఉన్న టైమ్ లో గాయమైందని సూరజ్ అంటాడు. జ్యోత్స్నకు రక్తం వస్తుంటే చూడలేకపోయానని అందరితో అంటాడు సూరజ్. ఈ పూల కుండీ ఇక్కడికి ఎలా వచ్చిందని జ్యో అడుగుతుంటే, సూరజ్ ఏదో కవర్ చేస్తాడు.
కుడి కాలి బొటన వేలికి గాయమైందని సూరజ్ అంటాడు. దీంతో తొక్కేయడానికి తన కుడికాలి బొటనవేలు చాలు అని అన్న మాటలను జ్యో తలుచుకుంటుంది. వీడు కావాలని ఇదంతా చేశాడా? అని డౌట్ పడుతుంది.
పారు చెప్పిన నిజం
జ్యోత్స్నను సూరజ్ ఇష్టపడుతున్నాడని పక్కకు వెళ్లిన తర్వాత కార్తీక్ తో దీప అంటుంది. వాడు మంచోడు ఏంట్రా? అసలు పూల కుండీ పెట్టిందే వాడురా అని మధ్యలోకి దూరి పారు అసలు విషయం చెప్తుంది. దీని వెనుకాల ఇంకా ఏదో ప్లాన్ ఉంది దీప అని పారు చెప్తుంటే కార్తీక్ వినిపించుకోడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


