Karthika Deepam 2 Today Episode:కార్తీక దీపం 2.. దశరథను చంపాలనుకున్న దక్షిణామూర్తి-సూరజ్ ను కొనేందుకు మాలిని ప్లాన్
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 16 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సూరజ్ ను లేపేయడానికి మర్డర్ ప్లాన్ చేశారేమోనని కార్తీక్ కు డౌట్ వస్తుంది. దీంతో జ్యోత్స్న, పారు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక రెస్టారెంట్స్ మధ్య పోటీకి అంతా రెడీ అవుతుంది. సూరజ్ కు మాలిని ఆఫర్ ఇస్తుంది.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 16 ఎపిసోడ్ లో కారు యాక్సిడెంట్ పై కార్తీక్ అనుమానపడతాడు. ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్, డీఎం రెస్టారెంట్స్ మధ్య పోటీకి అంతా సిద్ధమవుతుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

పారు మెడకు బెల్ట్
కారు యాక్సిిడెంట్లో పారిజాతం మెడకు గాయమవుతుంది. మెడ కండరాలకు గాయం కారణంగా పారుకు బెల్ట్ పెడుతుంది డాక్టర్. జీవితాంతం ఇలాగే ఉండాలా డాక్టర్ అని పారు కంగారు పడుతుంది. నొప్పి తగ్గేవరకూ ఇలాగే ఉండాలని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. యాక్సిడెంట్ అయింది సరే, కానీ ఆ ముఖానికి ఆయిల్ ఎందుకు రాసుకున్నావని పారును శివ నారాయణ అడుగుతాడు.
కార్తీక్ అనుమానం
యాటిట్యూడ్ కోసమని కార్తీక్, సూరజ్ చెప్తారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందా? అని కార్తీక్ ఆలోచిస్తాడు. బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయంట కదా అని సుమిత్ర అడుగుతుంది. కారు సర్వీసింగ్ చేయించేది నేనే కదా. నాకు అనుమానంగా ఉందని కార్తీక్ అనగానే జ్యోత్స్న, పారు షాక్ అవుతుంది. అంటే ఎవరైనా బ్రేక్ లు ఫెయిల్ చేశారా? అని శివ నారాయణ అడుగుతాడు.
మర్డర్ ప్లాన్ చేశారా?
సూరజ్ కార్లో బాగానే వెళ్లొచ్చాడు. ఆ తర్వాత జ్యోత్స్న కారు ఎక్కింది కానీ పారు మాత్రం భయపడింది. పారు ముఖానికి ఆయిల్ ఎందుకు ఉంది? బ్రోను వేసేయడానికి కారు బ్రేక్ లు తీసేసి మర్డర్ ప్లాన్ చేశారేమో అనిపిస్తుందని కార్తీక్ అనగానే పారు, జ్యో ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. నువ్వు పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరాల్సిందని కార్తీక్ తో వెటకారంగా అంటుంది పారు.
ఇదంతా పక్కనపెట్టండి, కాంపిటీషన్ కు టైమ్ అవుతుందని శివ నారాయణ చెప్తాడు. అందరూ వెళ్లిపోతారు. కారులో రెంచ్ ఒకటి కనిపించింది. అది ఎవరి తాలూకా? అని పారును అడుగుతాడు కార్తీక్. పారు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.
పోటీకి సై
ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్, డీఎం రెస్టారెంట్స్ కు మధ్య పోటీకి అంతా రెడీ అవుతుంది. రెండు టేబుల్స్ మీద వంటకు అవసరమైన అన్ని వస్తువులు పెడతారు. లైవ్ కుకింగ్ చేసి తమ వంటకాలను ఈ రెస్టారెంట్ చెఫ్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందని శివ నారాయణకు గౌరీ ప్రసాద్ చెప్తాడు. అప్పుడే దక్షిణామూర్తి, మాలిని వస్తారు.
సుమిత్ర భయం
బంధుత్వాలు ఎక్కడికి పోతాయి బాబాయ్ అని శివ నారాయణను మాలిని అడుగుతుంది. అందుకే రెచ్చగొట్టి మరీ పోటీకి పిలిపించారు కదా. మమ్మల్ని అవమానించడానికా? అని శివ నారాయణ అంటాడు. నా మెట్టింటి గౌరవాన్ని మీరు ఎక్కడ నాశనం చేస్తారేమోనన్న భయంతో వచ్చానని సుమిత్ర చెప్తుంది. మధ్యలో పారు మాట్లాడితే.. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని మాలిని అడుగుతుంది.
రక్తం ఎందుకు ఇచ్చారు?
పారు మా తాత భార్య అని కార్తీక్ చెప్తాడు. కానీ మా అల్లుడు ఈవిడ సొంత కొడుకు కాదు కదా అని దక్షిణామూర్తి కౌంటర్ ఇస్తాడు. ఎందుకు బాబాయ్ నటిస్తున్నారు? మీకు అంత ప్రేమ లేకపోతే రక్తం ఇచ్చి మామయ్య ప్రాణాలు ఎందుకు కాపాడతారు? మీరు ఎలా అయితే స్నేహితుడిపై ప్రేమను చంపుకోలేరో, అలాగే కూతురిపై ప్రేమను మా మామయ్య చంపుకోలేరని మాలిని అంటుంది. సుమిత్ర, మీ నాన్న నీ కోసమే ఆరాటపడుతున్నాడని మాలిని చెప్తుంది.
శివ నారాయణ వార్నింగ్
నా భర్త ప్రాణాలు తీయాలనుకుంది నా కోసమే మాలిని అని సుమిత్ర షాకింగ్ వ్యాఖ్యలు చేస్తుంది. ప్రతి దానికి ఓ క్షమాపణ ఉంటుంది కదా అని దక్షిణామూర్తి అడుగుతాడు. దీనికి ప్రక్షాళన తప్ప క్షమాపణ లేదని కోపంతో చెప్తుంది సుమిత్ర. ఇక పోటీకి వచ్చాం, రెస్టారెంట్స్ కు ఓనర్లులాగే ఉందాం. అలాగే మాట్లాడుకుందాం. అంతకుమించి ఏది మాట్లాడినా చూస్తూ ఊరుకోనని శివ నారాయణ వార్నింగ్ ఇస్తాడు.
పోటీ వేదిక దగ్గరకు అందరూ వెళ్తారు. పోటీ గురించి గౌరీ ప్రసాద్ వెల్లడిస్తాడు. ఇక్కడ పోటీపడే చెఫ్ లు ఒక గంటలో 5 వంటకాలు చేయాలి. అది మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన చెఫ్ లు రుచి చూస్తారు. శివ నారాయణ చెప్పిన దాని ప్రకారం ఓడిపోయిన వాళ్లే గెలిచిన వాళ్లకు బహుమతి ఇవ్వాలని గౌరీ ప్రసాద్ చెప్తాడు.
జ్యో కుట్ర
మరోవైపు సూరజ్, దీపను తాత దృష్టిలో చెడ్డవాళ్లను చేయాలి. ఈ పోటీలో వాళ్లు ఓడిపోవాలంటే ఏదో ఒక గొడవ చేయాలి. అందుకు ఏదో ఒక సాకు దొరకాలని పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. అప్పుడే మాలిని, సూరజ్ మాట్లాడటాన్ని జ్యోత్స్న, పారు చూస్తారు. దీంతో మాలినితో సూరజ్ చేతులు కలిపాడని తాతకు చెప్పమని పారును పంపిస్తుంది జ్యోత్స్న.
సూరజ్ కౌంటర్
మాలిని చేతి నుంచి జారిపోయిన ఉంగరాన్ని సూరజ్ తీసి ఇస్తాడు. నా చేతి నుంచి జారిపోయి నీ చేతికి వచ్చిందంటే అది నీకే రాసి ఉంది. నువ్వు ఎవరి మనిషివి? అని మాలిని అడుగుతుంది. నేను నా మనిషినే అని సూరజ్ అంటాడు. మరోవైపు పారు వెళ్లి అందరినీ తీసుకొస్తుంది. వాళ్లు చాటుగా ఉండి మాలిని, సూరజ్ మాటాలు వింటారు.
నువ్వు ఆ ఆఫీస్ లో ఏం చేస్తుంటావ్? అని సూరజ్ ను మాలిని అడుగుతుంది. నా ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి దీప సాయం చేశారు. అందుకే ఆమెకు అడ్వైజర్ గా ఉన్నానని సూరజ్ చెప్తాడు. నీ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ ఇస్తా, నాకు అడ్వైజర్ గా ఉంటావా? అని మాలిని అడుగుతుంది. ఉండను అని సూరజ్ ముఖం మీదే చెప్తాడు.
మనుషులు కూడా నచ్చాలని
నా లైఫ్ ను నేనే డిజైన్ చేసుకుంటా. నాకు చేసే పనే కాదు, మనుషులు కూడా నచ్చాలి. నేను ఎవరి హెల్ప్ తీసుకోను. నేను ఇలాగే బతుకుతాను. నన్ను నమ్మిన వాళ్లను నేను మోసం చేయను. మీరు వజ్రాల ఉంగరం పడేసిన సారే లొంగను అని మాలినికి సూరజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. నేను బంగారాన్ని కాదు. అది విలువ తగ్గుతుంది, పెరుగుతుంది. కానీ నేను ఒకేలా ఉంటానని సూరజ్ అంటాడు.
ఇది వ్యాపారం బాబాయ్
ఈ మాటలు విన్న శివ నారాయణ శభాష్ అంటూ చప్పట్లు కొడుతూ ముందుకు వస్తాడు. వెనకాలే ఎందుకు ఉన్నారని మాలిని అడుగుతుంది. ముందుకు వస్తే బేరసారాలు సాగవు కదా అని శివ నారాయణ అంటాడు. ఇది వ్యాపారం బాబాయ్. కొనేవాడికి అవసరం. అమ్ముడుపోయేవాడికి అవకాశం. అమ్ముడు పోకుండా ఉండేవాడు ఉండిపోతాడు అని మాలిని అంటుంది. నా వాళ్లు ఎవరిని నువ్వు డబ్బుతో కొనలేవని శివ నారాయణ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


