Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..ఇది నిజమేనా? బద్ధ శత్రువు దీపతో కలిసిపోయిన జ్యోత్స్న-పోటీలో గెలుపు-కానీ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 20 ఎపిసోడ్ లో ట్విస్ట్ మామూలుగా ఉండదు. దీప, జ్యోత్స్న చేతులు కలుపుతారు. వంటల పోటీలో విన్నర్స్ గా నిలుస్తారు. దీంతో మాలిని, దక్షిణామూర్తికి అవమానం ఎదురవుతుంది. ఈ విజయం దీపదే అని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు. పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Jul 20, 2026, 06:55:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 20 ఎపిసోడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంటుంది. బద్ధ శత్రువుగా చూసే దీపతో జ్యోత్స్న చేయి కలుపుతుంది. వీళ్లు పోటీలో గెలుస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

చేతులు కలిపిన దీప, జ్యోత్స్న

పోటీలో గెలవడం కోసం చేతులు కలుపు జ్యోత్స్న అని దీప అడుగుతుంది. జ్యోత్స్న అనూహ్యంగా చేతులు కలుపుతుంది. ఎవరిని ఎవరికి జత చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు జ్యోత్స్న అని సూరజ్ అనుకుంటాడు. వీళ్లు చేతులు కలిపారంటే దీపే ఏదో చేసి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు.

నోరు జారిన పారు

మనం గెలుస్తున్నాం దీప, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. నచ్చావ్, ఇప్పుడు చూడు అని దీప వంటలు అదరగొట్టేస్తుంది. ఇక సూరజ్ పక్కకు వెళ్లిన విషయాన్ని చూడకుండా పారిజాతం నోరు జారుతుంది. మనం గెలవమని నీకు తెలుసు కదరా, మాట్లాడవేంట్రా గొట్టం అని పారు అంటుంది. అక్కడే ఉన్న శివ నారాయణ ఈ మాటలు విని పారుపై ఫైర్ అవుతాడు.

ఇద్దరు సమానంగా

వంటల పోటీలో ఇచ్చిన టైమ్ అయిపోతుంది. లాస్ట్ మినిట్లో దీప స్వీట్ రెడీ చేస్తుంది. జడ్జస్ వెళ్లి వంటకాలు టేస్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్లో నాలుగు వంటకాలను జడ్జీలు టేస్ట్ చేస్తారు. డీఎం రెస్టారెంట్ మసాల కర్రీ, బిర్యానీ.. జ్యోత్స్న రెస్టారెంట్ దమ్ బిర్యానీ బాగున్నాయి. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు సమానంగానే ఉన్నారని జడ్జీలు అనౌన్స్ చేస్తారు.

విన్నర్ జ్యోత్స్న రెస్టారెంట్

సెకండ్ రౌండ్లో స్వీట్ టేస్ట్ చేస్తారు. డీఎం రెస్టారెంట్ స్వీట్ బాగుందని ఒకరు, జ్యోత్స్న రెస్టారెంట్ స్వీట్ బాగుందని మరో జడ్జ్ వాదించుకుంటారు. మూడో జడ్జ్ ఏమో రెండు స్వీట్లను మరోసారి టేస్ట్ చేసి రెండు స్వీట్లు బాగున్నాయి. కానీ ఇందులో బెస్ట్ స్వీట్ ఏది అంటే.. జ్యోత్స్న రెస్టారెంట్ అని చెప్తాడు. దీంతో శివ నారాయణ ఫ్యామిలీ సంతోషంలో తేలిపోతుంది. మాలిని, దక్షిణామూర్తి ముఖాలు మాడిపోతాయి.

వాట్ ఏ సీన్

పోటీలో జ్యోత్స్న రెస్టారెంట్ గెలిచిందని గౌరీ ప్రసాద్ అనౌన్స్ చేస్తాడు. మాలిని చేతుల మీదుగా దీప, జ్యోత్స్న కలిసి బహుమతి అందుకుంటారు. న్యాయంగా ఈ బహుమతి మా జ్యోత్స్నకు దక్కాలి. వంటలు చేసింది నేనే అయినా, తను లేకపోతే అనుకున్న సమయంలో పూర్తయ్యేవి కావు. అందరి ముందు తనకు థ్యాంక్స్ చెప్తున్నా అని జ్యోత్స్నను దీప హగ్ చేసుకుంటుంది. ఇలాంటి ఘోరాన్ని చూస్తానని జీవితంలో అనుకోలేదని పారు అనుకుంటుంది.

శివ నారాయణ వంటలు

జ్యోత్స్న చేతుల నుంచి బహుమతి అందుకున్న శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు. మాటలు రావడం లేదు, సుమిత్ర నీ కూతురు సాధించిందని శివ నారాయణ అంటాడు. దీప, జ్యోత్స్నకు మాలిని కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా చెఫ్ ను నువ్వు కొనకపోయి ఉంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా మంచివాళ్లే అనే భ్రమలో ఉండేవాణ్ని అని మాలినితో శివ నారాయణ అంటాడు.

థ్యాంక్స్ దక్షిణామూర్తి. నా మనవరాలు పోటీకి దిగకపోయి ఉంటే నేను పోటీపడేవాణ్ని అని శివ నారాయణ అంటాడు. నువ్వు అద్భుతమైన వంటవాడివని నాకు తెలుసు శివ నారాయణ అని దక్షిణామూర్తి, మాలిని వెళ్లిపోతారు.

ఆడపిల్లను చూశా

బయట జ్యోత్స్నకు సూరజ్ కంగ్రాట్స్ చెప్తాడు. బాగా ఎమోషనల్ అయ్యావ్. ఈ రోజు నీ ముఖంలో నిజమైన సంతోషం చూశా. గెలిచారనగానే దీపను అలా పట్టేసుకున్నావ్ ఏంటీ? అని జ్యోను సూరజ్ అడుగుతాడు. ఆ క్షణంలో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు అని జ్యో చెప్పింది. నిజమైన సంతోషం అంటే అదే జ్యోత్స్న. మొదటిసారి నీలో ఓ ఆడపిల్లను చూశా. గెలుపును ఆనందిస్తున్న అమాయకమైన అందాన్ని చూశా అని సూరజ్ తెగ పొగిడేస్తాడు.

జ్యో ఎప్పటిలాగే

ఎప్పటికీ ఇలాగే ఉండు. నువ్వు ఈ డ్రెస్ లో భలే ముద్దుగున్నావ్ తెలుసా. నిన్ను గెలిపిస్తే ఏదైనా ఇస్తా అన్నావ్ కదా. ఇస్తావా? అని సూరజ్ అడుగుతాడు. అయితే వెళ్లి దీపను అడుగు. నువ్వు నన్ను సర్కిల్ లో ఉంచావ్. నా చేతులతోనే దీపను పోటీలో దింపేలా చేశావ్. దీప నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది. నీకు మాత్రం ఓ స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందని జ్యోత్స్న మళ్లీ కోపంగా వెళ్లిపోతుంది.

సూరజ్ ప్లాన్

ఇక ఇంట్లో దీప, జ్యోత్స్నకు దిష్టి తీయమని సుమిత్రకు చెప్తాడు శివ నారాయణ. మీ ఇద్దరి దిష్టి పోవాలని సుమిత్ర దిష్టి తీస్తుంది. ఈ శివ నారాయణ ఓటమి తెలియని మనిషి కాడు. ఆ చెఫ్ ను మన దగ్గర నుంచి లాగేసుకోవడంతో ఆత్మ గౌరవం ఓడిపోతుందనుకున్నా. అప్పుడే సూరజ్ వచ్చి చెప్పాడు. తన ప్లాన్ ఏంటో దీప వెళ్లి టేబుల్ దగ్గర నిలబడేంతవరకూ అర్థం కాలేదు. సూరజ్ నీకు థ్యాంక్స్ అని శివ నారాయణ అంటాడు.

దీప విజయం

జ్యోత్స్న శివ నారాయణ మనవరాలిని అనిపించుకున్నావ్ అని తాత మురిసిపోతాడు. అవును, ఇది జ్యోత్స్న గెలుపు అని పారు అంటుంది. కాదు ఇది దీప విజయం. వంటలు రాని జ్యోత్స్న ఒంటరిగా ఎలా గెలుస్తుంది? దీప, జ్యోత్స్న కలిసి పని చేశారు. కలిసే గెలిపించారు. నా నమ్మకాన్ని నా దీప కాపాడింది. తన మీద నమ్మకాన్ని జ్యోత్స్న సంపాదించుకుందని శివ నారాయణ పొంగిపోతాడు.

జ్యోత్స్న కోపం

తాతను వంట చేయమని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. కానీ పార్టీ అరెంజ్ చేశానని శివ నారాయణ వెళ్లిపోతాడు. దీపతో కలిసి పోయావా? అని జ్యోను పారు అడుగుతుంది. మంచిదాన్ని కావాలనే దీపతో కలిసినట్లు నటించానని జ్యో చెప్తుంది. కోపంగా ఉన్న జ్యోత్స్న వెనకాలే వెళ్లి సూరజ్ బుజ్జగిస్తాడు. నువ్వు, దీప, మా బావ ముగ్గురు ఒకరే అని జ్యో అంటుంది.

ఈ రోజు నిన్నే గెలిపించా. నిజాయతీగా ఉండే గెలుపు ఎలా ఉంటుందో నీకు చూపించా. మీ తాత నీతో ఇలా ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? మీ అమ్మ ప్రేమ చూపించి ఎన్ని రోజులు అవుతుంది? అని సూరజ్ అంటాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More