Karthika Deepam 2: సస్పెన్స్ బాబోయ్-కార్తీక దీపం 2 మాలిని గతం ఏంటీ? అందరూ దాస్తున్న నిజం ఏంటీ? ఎండింగ్ తేడా కొట్టిందో!

Karthika Deepam 2: రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ లో సస్పెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మాలిని క్యారెక్టర్ చాలా మిస్టీరియస్ గా ఉంది. ఆమె గురించి అందరూ ఎలివేషన్ మామూలుగా ఇవ్వడం లేదు. అయితే అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండింగ్ ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి!

Published on: Jul 15, 2026, 12:00:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2: తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం అండ్ వంటలక్క క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కార్తీక దీపం 2' కూడా అదే రేంజ్ ట్విస్టులతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ హైప్ మరింత పెరిగింది. అందుకు కారణం మాలిని క్యారెక్టర్. ఆ పాత్రపై మేకర్స్ పెంచుతున్న అంచనాలే.

సస్పెన్స్ బాబోయ్-కార్తీక దీపం 2 మాలిని గతం ఏంటీ? అందరూ దాస్తున్న నిజం ఏంటీ? ఎండింగ్ తేడా కొట్టిందో! (jiohotstar1)
సస్పెన్స్ బాబోయ్-కార్తీక దీపం 2 మాలిని గతం ఏంటీ? అందరూ దాస్తున్న నిజం ఏంటీ? ఎండింగ్ తేడా కొట్టిందో! (jiohotstar1)

మాలిని పాత్ర చుట్టూ ‘మిస్టరీ’

కార్తీక దీపం 2 సీరియల్ కథలోకి దక్షిణామూర్తి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన మాలిని (కన్నడ నటి తేజస్విని ప్రకాష్) నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా కనిపిస్తోంది. అయితే, ఈమె వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? ఆమె గతం ఏంటి? శివ నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడమే ఆమె ఏకైక లక్ష్యమా? అనే విషయాలను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు.

హైప్

సాధారణంగా ఏ సీరియల్‌లో అయినా విలన్ మోటివ్ ఏంటో ఆడియన్స్‌కు ముందే హింట్ ఇస్తారు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ లో మాలిని విషయంలో మాత్రం ఆడియన్స్‌ను కంప్లీట్ డార్క్‌లో ఉంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

పీక్స్‌కు చేరిన ఎలివేషన్స్!

కార్తీక దీపం 2 సీరియల్ కథలో మాలిని క్యారెక్టర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల పాత్రలను మేకర్స్ వాడుకుంటున్నారు. ముఖ్యంగా సుమిత్ర, శివనారాయణ, కాంచనలు మాలిని గురించి మాట్లాడే ప్రతి మాట ఆ క్యారెక్టర్‌కు ఒక పెద్ద ఎలివేషన్‌లా మారుతోంది.

దీప, కార్తీక్‌లను మాలిని విషయంలో చాలా అలర్ట్‌గా ఉండమని వారు చేస్తున్న హెచ్చరికలు ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. "ఆమె మామూలు మనిషి కాదు" అనే నరేటివ్‌ను బలంగా ఇంజెక్ట్ చేయడం వల్ల, ప్రతి ఎపిసోడ్‌లో ఆమె ఏం చేయబోతుందా అనే ఉత్కంఠ రేగుతోంది.

ఆడ పులి

మాలిని క్యారెక్టర్ కు మేకర్స్ మామూలు హైప్ ఇవ్వడం లేదు. మాలిని ఆడ పులి అని, వేటకు సిద్ధమైందని కాంచన చెప్పిన మాటలు హైలైట్ గా నిలిచాయి. అయితే మాలిని గతం గురించి మాత్రం ఇప్పుడే ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో కార్తీక దీపం 2 సీరియల్ లో సస్పెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది.

ఎండింగ్ ఏం చేస్తారో?

బుల్లితెర విశ్లేషకుల ప్రకారం.. మేకర్స్ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఒక కత్తి మీద సాము లాంటిదే. మాలిని క్యారెక్టర్‌పై ప్రస్తుతం బిల్డ్ చేసిన ఎక్స్‌పెక్టేషన్స్ స్కై-హైలో ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆమె గతాన్ని రివీల్ చేసే సీన్స్ కానీ, లేదా ఈ డ్రామాకు ఇచ్చే ముగింపు కానీ ఆడియన్స్ ఊహించిన స్థాయిలో లేకపోతే.. ఇప్పటివరకు క్రియేట్ చేసిన హైప్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

గతంలో మొదటి సీజన్‌లో మోనిత క్యారెక్టర్‌ను సాగదీసి బోర్ కొట్టించినట్లు కాకుండా, దీనికి పక్కా జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More