Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- వంట పోటీలో దీప జ్యోత్స్న- చెఫ్‌కు కత్తి వార్నింగ్- దీప మాటలకు మారిన జో?

Karthika Deepam 2 Serial July 18th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 18వ ఎపిసోడ్‌‌లో జ్యోత్స్నను వంటపోటీలో పాల్గొనమని, దీపను సహాయంగా తీసుకోమని సూరజ్ ప్లాన్ చెబుతాడు. మాలినితో ఇద్దరం పోటీలో పాల్గొంటామని చెబుతుంది. మాలిని ఒప్పుకోదు. దీప సైకిల్ స్టోరీ చెప్పడంతో ఒప్పుకుంటుంది. దీప చేయి కలపమంటుంది.

Published on: Jul 18, 2026, 07:44:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కారుకు బ్రేకులు తీసింది మీరే అని నాకు తెలుసు అని పారిజాతంతో అంటాడు సూరజ్. మేము తీయడమేంటి, పెద్దవాళ్లతో ఇలాగేనే మాట్లాడేది అని పారిజాతం అంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 18 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 18 ఎపిసోడ్

సూరజ్ ప్లాన్

గ్రానీ నువ్వెళ్లు అని జ్యోత్స్న పంపిస్తుంది. పారు వెళ్తుంది. నాకు సపోర్ట్ చేస్తావనుకుంటే ఇలా ఇరికించావేంటీ అని జ్యో అడుగుతుంది. నీకు కావాల్సింది ఏంటీ ఓడిపోవడం. నువ్వు వంట చేస్తే ఓడిపోతాం. మీ తాతయ్యను నేను ఒప్పిస్తా అని రాహుల్ అంటాడు. నిన్ను నమ్మడం నాది తప్పు అని జ్యో అంటుంది.

మీ తాతయ్య ఒప్పుకునేలా నువ్వే వంట చేసేలా నేను ఒక ప్లాన్ చెబుతా విను. అది ఫాలో అయితే నువ్వు కోరుకుంది జరుగుతుంది. నా ప్లాన్ ఫాలోఅయితే నువ్వు ఓడిపోవు అని సూరజ్ ప్లాన్ చెబుతాడు. మరోవైపు పోటీలోకి దిగుతానని కార్తీక్‌తో అంటుంది దీప. తాతయ్య ఓడిపోతే తట్టుకోలేరు, అమ్మ తట్టుకోలేరు, జ్యోత్స్న వంట చేస్తే ఓడిపోతామని దీప అంటుంది.

సీఈఓ పోటీలోకి దిగకూడదు. ఇలాంటి క్లాజ్ ఉంది కాబట్టే సూరజ్ నిన్ను అడగలేదని, పైగా నువ్వు ప్రెగ్నెంట్. ఆ ఒత్తిడి తట్టుకోలేవు అని కార్తీక్ చెబుతాడు. మనం చాలా దారుణంగా మోసపోయామని దీప బాధపడుతుంది. ఇచ్చిన టైమ్ అయిపోయిందని మాలిని అంటుంది. ఇంతలో జ్యోత్స్న, సూరజ్ వస్తారు. మేము పోటీలోకి దిగుతున్నాం అని జ్యోత్స్న అంటుంది.

దీపకే చెడ్డ పేరు

మీ చెఫ్ ఎవరో రమ్మనండి అని మాలిని అంటుంది. ఇక్కడే ఉందని దీప చేయి లేపుతుంది జ్యోత్స్న. సూరజ్ నవ్వుతాడు. సీఈఓ దీపే మా చెఫ్ అని జ్యోత్స్న అంటుంది. తను వంట చేసిందంటే గెలిచే అవకాశం ఉందని భయపడుతుంది మాలిని. తను కంపెనీ సీఈఓ, తనెలా పోటీ చేస్తుందని మాలిని అంటుంది. వంట చేసేది నేను, నాకు సాయంగా దీప ఉంటుందని జ్యో అంటుంది.

దీపను సాయంగా ఉంటుందని చెబితే శివ నారాయణ ఒప్పుకుంటారు. అప్పుడు ఓడిపోయానన్న చెడ్డపేరు నీకు రాదు అని జ్యోకి సూరజ్ చెప్పింది గుర్తు చేసుకుంటుంది. ఈ ఐడియా సూరజ్ ఇచ్చి ఉంటాడు అని కార్తీక్‌తో దీప అంటుంది. దీప సీఈఓనే కాదు మంచి చెఫ్ కూడా. దీనికి ఒప్పుకుంటే పోటీ కంటిన్యూ చేద్దామని జ్యో అంటుంది.

దీప సైకిల్ స్టోరీ

దీప కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న మనిషిని పోటీలోకి దింపడం న్యాయం కాదు. దీప లేకుండా జ్యోత్స్న పోటీలోకి దిగాలని మాలిని అంటుంది. నా యోగ క్షేమాల గురించి ఆలోచించినందుకు కృతజ్ఞతలు. నా మొదటి కాన్పులో 8 నెలల గర్భవతిని. అప్పుడు ఇడ్లీ బండి నడిపాను. ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు సైకిల్ మాత్రమే ఉంది. ఆ సైకిల్ నడుపుకుంటూ వర్షంలో గోతిలో పడ్డాను. అప్పుడు నాకు సాయంగా ఎవరు లేరు నేను తప్పా అని దీప తన సైకిల్ స్టోరీ చెబుతుంది.

నమ్మకంతోనే అప్పుడు అడుగు వేశాను. ఆ అడుగే ఇక్కడికి తీసుకొచ్చింది. దానితో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. నాలాంటి ఐదో తరగతి చదివిన వ్యక్తితో ఓడిపోతే మీరు ఓడిపోతారని భయపడుతున్నారా అని దీప గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఏం తింటావు దీప ఇంత బలంగా మాట్లాడుతున్నావ్ అని మాలిని అంటే.. నా కుటుంబమే నా బలం అంటుంది దీప.

ఇద్దరు పోటీలోకి దిగడం నాకు ఓకే అని చెబుతుంది మాలిని. వంటల పోటీ స్టార్ట్ అవుతుంది. సుమిత్ర పక్కన కూర్చోమని మాలిని అంటుంది. సుమిత్ర కోపంగా చూస్తుంది. మీరు సుమిత్రకు తండ్రిలాంటి వ్యక్తి కూర్చోండని మాలిని అంటుంది. దాంతో దక్షిణామూర్తి కూర్చుంటాడు. సుమిత్ర లేవబోతుంటే వద్దని శివ నారాయణ అంటాడు.

2 కుటుంబాలు కలిసిపోయేలా ఉన్నాయి

లేస్తే ఆ మనిషికి గౌరవం, గుర్తింపు ఇచ్చినట్లే అంటాడు. దాంతో సుమిత్ర లేవదు. చూస్తుంటే రెండు కుటుంబాలు కలిసిపోయేలా ఉన్నాయని పారిజాతం అంటుంది. తాతతో చెప్పమని కార్తీక్ అంటే.. మెడ ఒక్కటే విరిగింది చాలని పారిజాతం అంటుంది. జ్యోత్స్నకు దీప ఎలా చేయాలో చెబుతుంది. ఎక్కువ సేపు నిలబడలేనంటుంది.

ఇంతలో అమ్ముడు పోయిన చెఫ్ దీప దగ్గరికి వచ్చి నాతో పోటీకి దిగడం అవసరమా. గెలుస్తామనే అని అంటాడు. కత్తి చూపిస్తూ అన్నం పెట్టిన వాళ్లను మర్చిపోవద్దంటారు. అదే తప్పంటే నమ్మకద్రోహం మరింత పెద్ద తప్పు. అలాంటి వారికి భగవంతుడు శిక్ష కచ్చితంగా వేస్తాడని దీప వార్నింగ్ ఇస్తుంది. చెఫ్ భయపడిపోతాడు.

మనం గెలవాలి జ్యోత్స్న అని దీప అంటే.. నేను ఓడించడానికి వచ్చాను. ఓడిపోతే అటు సూరజ్ గాడు ఇటు నువ్వు ఇద్దరు పోతారు అని మనసులో అనుకుంటుంది జో. దీప ఆల్రెడీ ఉప్పు వేసిన కూడా జో వేస్తుంది. ఆల్రెడీ వేశాను అని దాన్ని కవర్ చేసేందుకు వాటర్ పోస్తుంది దీప. పారిజాతం వైపు జ్యో రెండు వేళ్లు విక్టరీలా చూపిస్తుంది.

గంటలో 5 వంటలు

అంతా బాగుంది అంటే ఇది నాశనం చేస్తుంది. నింద దీపపై పోతుంది. సూరజ్ గాడు మా పార్టీలోకి చేరాడా ఏంటీ అని అనుకుంటుంది పారిజాతం. ఫ్రైలో జ్యోత్స్న వాటర్ ఎక్కువ పోస్తుంది. అలా పోయొద్దు. ఇది ఫ్రై. ఇలా చేస్తే గంటలో 5 వంటలు చేయలేమని దీప అంటుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్‌ను చూడమని సుమిత్ర చెబుతుంది.

అలా వెళ్లకూడదని కార్తీక్ అంటాడు. సరిగ్గా, ఫాస్ట్‌గా చేయమని జ్యోత్స్నను వేడుకుంటుంది దీప. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయమని అడిగానుగా అని దీప అడిగితే.. చేతులు మండుతాయని చేయేలదంటుంది జ్యోత్స్న. ఇది ఇద్దరి కుటుంబాలకు మధ్య జరిగే పోటీ, శివ నారాయణ గారు ఏమన్నారు నా మనవరాలిని పోటీగా దింపానని చెప్పారు. ఇద్దరం ఒకే స్థానంలో ఉన్నాం. గెలిస్తే మనవరాలు గెలిపించింది అంటారుగా అని దీప అంటుంది.

నిన్ను నాకు డీఏని చేశారు. ఇందులో గెలిస్తే నీ గురించి ఆలోచిస్తారుగా. ఒక్కసారి గెలిచి చూడు అందరూ నిన్ను ఎలా చేస్తారో అని మోటివేట్ చేస్తుంది దీప. దాంతో జ్యోత్స్నకు గెలవడం చాతకాదు అన్న శివ నారాయణ మాటలను గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. ఎవరి ముందో ఓడిపోయి మన కుటుంబం తలవంచుకునే పని చేయొద్దు అని దీప అంటుంది.

దీప మాటలకు మారిన జ్యోత్స్న

ఇక్కడి నుంచి ఆ బహుమతి తీసుకునే వెళ్లాలి. మన సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు గెలవడం కష్టమే. కానీ, నాకు నీ సాయం కావాలి. మనం కలిసి పోరాడుదాం. చేయి కలుపు జ్యోత్స్న. కలిసి గెలుద్దాం అని చేయి ఇస్తుంది దీప. ఇంతలో చివరి 30 నిమిషాలు అనౌన్స్ ఇస్తారు.

ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తుంది అని దీప అంటుంది. దీప మాటలకు జ్యోత్స్న మారినట్లుగా చూస్తుంది. అదంతా చూస్తున్నవాళ్లు టెన్షన్‌తో ఉండిపోతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More