Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- ట్విస్టులే ట్విస్టులు- మాలిని దెబ్బ, శివ నారాయణ ఓటమి- పోటీలో చెఫ్‌గా జో

Karthika Deepam 2 Serial July 17th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూలై 17వ ఎపిసోడ్‌ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగింది. దీప చెఫ్‌ను మాలిని కొనేస్తుంది. కోడలిని దక్షిణమార్తి నిలదీస్తాడు. దీప సైడ్ కాకుండా తనవైపు నిలబడాలని జ్యో అడిగితే సూరజ్ ఒప్పుకుంటాడు. జ్యో చెఫ్‌గా వంట పోటీలోకి దిగుతారు.

Published on: Jul 17, 2026, 07:29:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సూరజ్‌ను కొనేందుకు ట్రై చేసిన మాలిని ఫెయిల్ అవుతుంది. అక్కడే ఉండి అంతా విన్న శివ నారాయణ చప్పట్లు కొట్టి సూరజ్‌ను మెచ్చుకుంటాడు. మాలిని, శివ నారాయణ కొనడం, నిజాయితీ గురించి వాదించుకుంటారు.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 17 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 17 ఎపిసోడ్

ఐడియా నీది తిట్లు నాకు

నా దగ్గర నీ డబ్బుతో కొనేవాళ్లు ఎవరు ఉండరు. మీ మావయ్యకి చెప్పుకో అని శివ నారాయణ అంటాడు. మీరెప్పుడు వచ్చారని సూరజ్ అడిగితే.. అటు వెళ్తుంటే కనిపించి ఆగాం అని కార్తీక్ చెబుతాడు. పారు నీకు క్లారిటీ వచ్చిందిగా అని కార్తీక్ అంటే.. ఈ మనిషిని ఇందుకే ఇంట్లో ఉండమన్నా అని శివ నారాయణ అంటాడు.

అంతా వెళ్లిపోతారు. ఐడియా నీది తిట్లు నాకు అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. అంతా వంటల పోటీ దగ్గరికి వెళ్తారు. మీ చెఫ్‌లను పిలవండని చెబుతాడు. దీప తమ చెఫ్ కిరణ్‌ను పిలుస్తుంది దీప. ఆ కిరణ్ వెళ్లి దక్షిణామూర్తి వాళ్ల సైడ్ నిలబడతాడు. అక్కడ ఎందుకు నిల్చున్నావని దీప, కార్తీక్ అడుగుతాడు. నేను దక్షిణామూర్తి వాళ్ల సైడ్ వంట చేసేందుకు వచ్చానని చెఫ్ కిరణ్ షాక్ ఇస్తాడు.

దాంతో మాకోసం నిన్ను తీసుకొచ్చాం. మేము జీతం ఇస్తున్నాం అని శివ నారాయణ తిడతాడు. రెండు గంటల క్రితమే మీ చెఫ్‌ను మేము కొనేశాం. మీ రెస్టారెంట్‌లో జాబ్ రిజైన్ చేసి మా రెస్టారెంట్‌లో జాయిన్ అయ్యాడని మాలిని పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. కావాలంటే మెయిల్ చెక్ చేసుకోండి అని మాలిని అంటుంది. నువ్వు ఇంత దిగజారతావనుకోలేదు దక్షిణామూర్తి, రాత్రికి రాత్రే మా మనుషులను కొనేస్తావా అని శివ నారాయణ అంటాడు.

నీ మోసాన్ని ఎవరు క్షమించలేరు

నీ వాళ్లను కొనలేమని అన్నావుగా బాబాయ్ అని మాలిని అంటే.. అది తప్పని నిరూపించావుగా అని శివ నారాయణ అంటాడు. ఏంటమ్మా ఇది వాళ్ల చెఫ్ మనదాంట్లో జాయిన్ అవడం ఏంటని మాలినిని నిలదీస్తాడు దక్షిణామూర్తి. ఇక్కడ తెలియనట్లు నటించినంత మాత్రన నీ మోసాన్ని ఎవరు క్షమించలేరు అని శివ నారాయణ అంటాడు.

నేను మా కోడలితో మాట్లాడుతున్నా. కాస్తా ఆగండి అని దక్షిణామూర్తి అంటాడు. మాలిని అడిగితే.. ఇతను నిన్న రాత్రి కాల్ చేసి మన దాంట్లో జాయిన్ అవుతానని చెప్పాడని, నాకు చెఫ్ అవసరం ఉంది ఎందుకు వద్దనాలి. మీకు ఎలాంటి అగ్రిమెంట్ లేదన్నాడు, అదైనా ప్రాబ్లమ్ ఉంటే అది నేను చూసుకుంటే అన్నాడు. కావాలంటే మాట్లాడుకోండని మాలిని అంటుంది.

మోసం చేసినోడు మొహమే చూడను ఇంకా మాటలేంటని శివ నారాయణ అంటాడు. దెబ్బ అదుర్స్ కదా. మనం చేయాల్సిన పని తను చేసింది. కానీ, దీపను చెడ్డదాన్ని చేయలేదని జ్యోత్స్న అంటుంది. నేను చేస్తానుగా అని పారిజాతం అంటాడు. దీప బాధ్యత నిర్లక్ష్యం అని పారిజాతం అంటే.. కార్తీక్ కౌంటర్ ఇస్తాడు.

నా కోడలు తప్పు చేయదు

మాలినిని సపోర్ట్ చేస్తాడు దక్షిణామూర్తి. మీవాడు జాబ్ వద్దనుకుంటే మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమైంది. నా కోడలు తప్పు చేయదు అని దక్షిణామూర్తి అంటాడు. ఇప్పుడు పోటీ గురించి ఆలోచించండని మాలిని అంటే.. వాళ్ల చెఫ్‌ని మీరు తీసుకున్నారుగా. వాయిదా వేద్దామా అని ఆలోచిస్తున్నామని గౌరీ కిషన్ అంటాడు.

పోటీ ఇప్పుడే ఇవాళే జరగాలి. విజేత ఎవరో తెలియాలని మాలిని అంటాడు. పోటీ స్టార్ట్ అయింది. పోటీదారులకు రెండు అవకాశాలు ఇస్తారు. ఒకటి చెఫ్ లేనందున దక్షిణామూర్తి రెస్టారెంట్‌ను విజేతగా ప్రకటించండి. లేదా మరొక చెఫ్‌ని తెచ్చుకోండి. పది నిమిషాలు టైమ్ ఇస్తున్నాను అని మాలిని అంటుంది. శివ నారాయణ వెనకడుగువేసే ప్రసక్తే లేదని వెళ్తాడు.

వాళ్ల చెఫ్ వస్తున్నట్లు ఒక్కమాట చెప్పాల్సింది అని దక్షిణామూర్తి అంటాడు. అతను రాలేదు. నేనే వెళ్లి డబ్బు ఆశ చూపి కొన్నాను. నాకు కావాల్సింది శివ నారాయణ పతనం. దానికోసం ఏదైనా చేస్తాను అని మాలిని మనసులో అనుకుంటుంది. మరోవైపు సూరజ్ తాపీగా జ్యూస్ తాగుతుంటాడు. జ్యోత్స్న వెళ్లి మాట్లాడుతుంది. పోటీ మొదలవకుముందే ఓడిపోయామని జ్యో అంటుంది.

జ్యోత్స్నవైపు సూరజ్

నువ్ కోరుకుందే జరిగిందిగా అని సూరజ్ షాక్ ఇస్తాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది. నీ గురించి నాకు తెలుసు అని సూరజ్ అంటాడు. సరే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నా మాట వినాలి. ఇప్పుడు పోటీలో నువ్వు ఏం సలహా ఇవ్వకుండా హెల్ప్ చేయాలి. ఈసారి నా వైపు నిలబడు. నావైపు నిలబడి నన్ను గెలిపించు. దీపకు హెల్ప్ చేయకుంటే ఓడిపోతుంది. అది నాకు కావాలి. నీకు ఏం కావాలన్న ఇస్తాను అని జ్యోత్స్న అడుగుతుంది.

నీకు వచ్చే లాభమేంటి. దీప ఓడిపోతే శివ నారాయణ పెట్టుకున్న నమ్మకం పోతుంది. నా వదినను మోసం చేయలేనని సూరజ్ అడుగుతాడు. ఫ్రెండ్‌గా నావైపు నిలబడు అని చాలా ప్రేమగా అడుగుతుంది జ్యోత్స్న. సరే ఈ ఒక్కరోజు నీవైపు నిలబడతా. కానీ, నువ్వు చెప్పినట్లు వినను. మా వదిన దీపకు కాకుండా నీకు సపోర్ట్‌గా ఉంటాను. నువ్వు ఏది చెబితే అది చేయను. నిన్ను సమర్థిస్తాను అని సూరజ్ అంటాడు.

దీంట్లో మోసం లేదుగా అని జ్యోత్స్న అంటే.. నువ్వు మోసం చేయనంత వరకు నేను చేయనని సూరజ్ అంటాడు. నన్ను క్షమించండి. నా వల్లే ఈ పోటీలోకి వచ్చామని సుమిత్ర అంటుంది. నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే నిప్పులు చేతులతో పట్టుకున్నట్లే, నేను ముందే ఆలోచించాను అని శివ నారాయణ అంటాడు.

పోటీలో చెఫ్‌గా జ్యోత్స్న

దీపను నిందిస్తుంది పారిజాతం. పోటీ గెలిచి తీరాలనే కార్తీక్ అంటాడు. చెఫ్ ఎవరో సీఈఓని అడగండి. ఎవరైనా ఆప్షన్ కింద ఇద్దరిని పెట్టుకుంటాం. కానీ దీప ఒక్కరినే పెట్టుకుంది. వాడు బెస్ట్ చెఫ్. బాగా ప్రాక్టీస్ చేసి పెట్టాం వాడిని. అలాంటి వాడే అటువైపు వెళ్లాడని జ్యోత్స్న అంటుంది. అంటే దక్షిణామూర్తి ముందు శివ నారాయణ ఓడిపోయినట్లేనా అని పారిజాతం అంటుంది.

మనం గెలవాలంటే మనకు మంచి చెఫ్ కావాలని కార్తీక్ అంటే.. ఇక్కడే ఉన్నారు. మేడమ్ జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారే తాతయ్య పరువు నిలబెడతారు అని సూరజ్ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. దానికి కాఫీ పెట్టడం కూడా రాదని పారు అంటుంది. అవసరమే అన్ని నేర్పుతుంది. జ్యోత్స్న గారు బాగా వంట చేస్తారని సూరజ్ మరింత ఇరికిస్తాడు.

అందరిలో దీన్ని బకరా చేయాలనే ఇలా చేస్తున్నాడని పారిజాతం అనుకుంటుంది. అంతా వద్దని అంటారు. నన్ను నమ్ముతున్నారా లేదా అని సూరజ్ అంటాడు. శివ నారాయణ నమ్ముతున్నా అంటాడు. దీపను అడిగితే నమ్ముతున్నా అంటుంది. నా దగ్గర ప్లాన్ ఉంది. చెఫ్ రెడీ అని చెప్పండి. నేను జ్యోత్స్నను తీసుకొస్తాను. నా మీద నమ్మకం ఉంటే ఒక్క అవకాశం ఇవ్వండని సూరజ్ అంటాడు.

ట్విస్టుల మీద ట్విస్టులు

సరే సూరజ్ నేను ఒకన్ని నమ్మాను వాడు మోసం చేశాడు. నిన్ను నమ్ముతున్నా. ఏం చేస్తావో చూస్తాను అని శివ నారాయణ అంటాడు. అంతా వెళ్లిపోతారు. రెయ్ బండ సచ్చినోడా అని సూరజ్‌ను తిడుతుంది పారిజాతం. కారు బ్రేకులు తీసేసింది మీరేనని నాకు తెలుసు అని మరింత పెద్ద ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More