Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. ఏం దెబ్బ కొట్టావ్ మాలిని-శివ నారాయణ ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్- జ్యో?

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 28 ఎపిసోడ్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. జ్యోత్స్న నిజం చెప్పడం కేవలం దీప కల అని చూపిస్తారు. ఇక సూరజ్ తన కొడుకే అని మాలిని బాంబ్ పేలుస్తుంది. తన భర్తను చంపేశారని సంచలన విషయాలు బయటపెడుతుంది. పూర్తి ఎపిసోడ్ వివరాలు మీ కోసం.

Published on: Aug 28, 2026, 07:13:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో.. దీప తన సొంత కూతురు అని తెలిసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు నుంచి బావతో నేను రాయించుకున్న అగ్రిమెంట్ కూడా రద్దు అయిపోయినట్లేనని పేపర్స్ ను జ్యోత్స్న చించేస్తుంది.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఇదంతా దీప కల

దీప నేను నీకు ఎంతో రుణపడి ఉన్నా. ఇప్పుడు కొంత తీర్చుకున్నానని అనుకుంటున్నా. ఇక నువ్వు మీ అమ్మను అమ్మా అని ధైర్యంగా పిలవొచ్చని జ్యోత్స్న చెప్తుంది. సుమిత్రను అమ్మా అని పిలిచిన దీప కన్నీళ్లు తెప్పిస్తుంది. కార్తీక్ వచ్చి దీప కన్నీళ్లు తుడుస్తాడు. ఏంటి ఈ కన్నీళ్లు? అని కార్తీక్ అడుగుతాడు. ఇదంతా కల అని పెద్ద ట్విస్ట్ ఇస్తారు.

శ్రీధర్ ప్రశ్నలు

మాలిని పక్కన దీపను కూర్చోమంటాడు కార్తీక్. శ్రీధర్ వచ్చి కార్తీక్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. ఈ పెళ్లి తర్వాత ఎవరి జీవితం మారిపోతుందో లీక్ చేయమని శ్రీధర్ అడుగుతాడు. కానీ కార్తీక్ మాత్రం ఏం చెప్పడు. ఓపిక పడితే అవాక్కయేలా షాక్ ఇస్తామంటాడు. వెళ్లి మాలిని పక్కన కూర్చుంటాడు కార్తీక్.

దీప కౌంటర్

ఏంట్రా అటు వైపు నువ్వు, ఇటు వైపు దీప.. మీ తాత నాకు భయపడి కాపలాగా పెట్టాడా అని మాలిని అడుగుతుంది. భయపడేందుకు నువ్వేమైనా రాక్షసివా అత్తా అని దీప కౌంటర్ వేస్తుంది. పెళ్లి అయిన తర్వాత బంతి భోజనం చేద్దామని కార్తీక్ చెప్తాడు. పాపం.. తాత మిస్ అయ్యాడని దీప వెటకారంగా అంటుంది. పెళ్లి వీడియో పంపిద్దామని కార్తీక్ చెప్తాడు.

సూరజ్ తమ్ముడు

సూరజ్ ను పెంచిన పెద్దాయన తెగ సంబరపడిపోతున్నాడని కార్తీక్ అంటాడు. పెంచడం నువ్వు చూశావా? నమ్మితేేనే కదా మోసం చేస్తారు. మీ అమ్మానాన్న హడావుడి బాగానే చేస్తున్నారని కార్తీక్ తో మాలిని అంటుంది. సూరజ్ ఇప్పుడు అనాథ కాదు. మా అమ్మానాన్నే సూరజ్ కు అమ్మానాన్న. సూరజ్ నాకు తమ్ముడే అని కార్తీక్ చెప్తాడు. నేను పిన్ని, సూరజ్ తమ్ముడు. వరుస సరిపోయిందని మాలిని హింట్ ఇస్తుంది.

పెళ్లి ఆగదా?

సూరజ్ ఉత్తముడు అని దీప అంటుంది. ఈ ఉత్తముడితో జ్యోత్స్న పెళ్లి జరుగుతుందంటావా? ఏం చేసినా ఆగదంటావా? అని మాలిని కన్నింగ్ గా అడుగుతుంది. తథాస్తు దేవతలు దిగి వచ్చినా ఆగదని నమ్మకంతో చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న మెడలో కట్టేందుకు సూరజ్ తాళి తీసుకుంటాడు. అయినా పెళ్లి ఆగదా? అని మాలిని అంటూనే ఉంటుంది.

బాంబ్ పేల్చిన మాలిని

జ్యోత్స్న మెడలో తాళి కట్టబోతూ సూరజ్ ఆగిపోతాడు. మాలిని వైపే చూస్తుంటాడు. సూరజ్ తాళి కట్టు అని శివ నారాయణ, జ్యోత్స్న అడుగుతారు. కానీ సూరజ్ తాళిని కింద పడేయడంతో అందరూ షాక్ అవుతారు. పెళ్లి ఆగదా కార్తీక్? సూరజ్ నా కొడుకైనా ఈ పెళ్లి ఆగదా కార్తీక్? అని మాలిని మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తుంది.

మాలిని కొడుకే సూరజ్

సూరజ్ దగ్గరకు మాలిని వెళ్తుంది. భుజంపై చేయి వేసి సూరజ్ ఈ మాలిని కొడుకు అని దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది. సూరజ్ అనాథ కాదు. ఈ మాలిని, కృష్ణ‌మూర్తిలా ఒక్కగానొక్క కొడుకు అని గట్టిగా అరిచి చెప్తుంది మాలిని. సూరజ్ నీ కొడుకేంటి పిన్ని? మరి ఈ పెద్దాయని అని కార్తీక్ చూస్తుంటే ఆ పెద్దాయన కనిపించడు.

అతను నా మనిషే. అంతా నేను ఆడించిన నాటకమే. ఈ మాలిని పగకు నిలువెత్తు రూపం నా కొడుకు సూరజ్. నువ్వు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూసింది సూరజ్ నే. నిజాన్ని కంటితో చూశావ్. మనసుతో నమ్మలేకపోయావని కార్తీక్ తో మాలిని అంటుంది.

అందరికీ చెప్పాలని

దుర్మూహర్తం రాకపోయినా ఈ పెళ్లి జరగదు పంతులు. మీరు బయల్దేరొచ్చు. అతిథులారా, బంధువులారా శివ నారాయణ మనవరాలి పెళ్లి ముచ్చటగా మూడోసారి ఆగిపోయింది. మీరంతా ఇక్కడి నుంచి బయల్దేరొచ్చు. జరిగిన విషయం అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు చెప్పండి. ఇక్కడ జరిగింది ఒక ఏడాది పాటు గుర్తుండిపోవాలని మాలిని పొగరుతో చెప్తుంది.

నమ్మకద్రోహం చేశావ్ పిన్ని

ఏరా కార్తీక్.. ఇప్పుడు చెప్పు ఈ పెళ్లి జరుగుతుందా? సుమిత్ర నువ్వు చెప్పు నా కొడుకుతో నీ కూతురి పెళ్లి చేస్తావా? శివ నారాయణ బాబాయ్ మీరు చెప్పండి నా కొడుకుతో నీ మనవరాలి పెళ్లి చేస్తావా? అని వరుసగా అందరినీ అడుగుతుంది మాలిని. ఎంత నమ్మకద్రోహం చేశావ్ పిన్ని అని కార్తీక్ అంటాడు.

నా భర్తను చంపారు

నాకు, నా కొడుక్కి జరిగిన అన్యాయం కంటే ఇది చాలా తక్కువ. ఇది నమ్మక ద్రోహం అయితే నా భర్తను చంపిన మిమ్మల్ని ఏమనాలి? ద్రోహులు అనాలా, హంతకులు అనాలా? అయినా పగ పురుడుపోసుకుంది నా భర్త చావుతో కాదు. సుమిత్ర, దశరథల పెళ్లితోనే అని మాలిని షాకింగ్ విషయాలు చెప్తుంది.

సుమిత్ర పెళ్లి కూతురిగా ముస్తాబైనప్పుడే ఈ గొడవ మొదలైందని మాలిని అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More