Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న ప్రేమ పాట్లు-సూరజ్ బర్త్ డే షాక్-స్వీట్ తో మాలిని సెలబ్రేషన్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 18 ఎపిసోడ్ లో జ్యోత్స్న ప్రేమ పాట్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పెద్దయ్యను జ్యోత్స్న కలిసి డబ్బు ఇవ్వడంతో సూరజ్ ఇంప్రెస్ అవుతాడు. సూరజ్ కు తన మనసులోని మాటను ఎలా చెప్పాలని జ్యో బుర్ర పాడు చేసుకుంటుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 18, 2026, 06:46:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 18 ఎపిసోడ్ లో.. దీప ఇచ్చిన సలహా మేరకు సూరజ్ ను పెంచిన పెద్దయ్య దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది. సూరజ్ గురించి పూర్తిగా చెప్పమని అడుగుతుంది. సూరజ్ నాలుగేళ్ల వయసు నుంచి నా దగ్గరే పెరిగాడు. వాడొక అనాథ. వాడికంటూ ప్రత్యేకంగా ఇష్టాలు ఏం లేవు. కానీ చాలా మొండివాడు అని పెద్దయ్య చెప్తాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దేవుడు వేసిన బంధాలే

పెద్దయ్యకు జ్యోత్స్న డబ్బులు ఇస్తుంది. నేను ఇస్తే సూరజ్ ఇచ్చినట్లేనని చెప్తుంది. నిన్ను చూస్తుంటే కేవలం ఫ్రెండ్ అని అనిపించడం లేదు. ఏవైనా దేవుడు వేసిన బంధాలే అని పెద్దయ్య అంటాడు. అక్కడి నుంచి జ్యోత్స్న వెళ్లిపోయిన తర్వాత సూరజ్ కు పెద్దయ్య కాల్ చేస్తాడు.

నీ ఫ్రెండ్ వచ్చింది. డబ్బులు కూడా ఇచ్చిందని జ్యోత్స్న వచ్చిన విషయాన్ని సూరజ్ కు పెద్దయ్య చెప్తాడు. నీ గురించి మంచీచెడులు అడిగింది. ఆ అమ్మాయి చాలా మంచిదిరా అని పెద్దయ్య చెప్తాడు.

జ్యోత్స్నకు థ్యాంక్స్

సూరజ్ వెంటనే జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు. అక్కడే దీప కూడా ఉంటుంది. పెద్దయ్య దగ్గరకు నువ్వెందుకు వెళ్లావ్? అని జ్యోను సూరజ్ అడుగుతాడు. కావాల్సిన వాళ్లను కలిస్తే మంచిదే కదా అని జ్యోత్స్న చెప్తుంది. నేను పెద్దయ్యకు చేయాల్సిన సాయం నువ్వు చేశావ్ కదా. అందుకే థ్యాంక్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు సూరజ్. జ్యో హ్యాపీగా ఫీల్ అవుతుంది. సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

సూరజ్ బర్త్ డే

థ్యాంక్స్ దీప అని జ్యోత్స్న సంబరపడిపోతుంది. నువ్విచ్చిన ఐడియా వల్ల సూరజ్ నన్ను మెచ్చుకున్నాడు. నేను పెద్దాయనను కలవడం వల్ల రేపు సూరజ్ బర్త్ డే అని తెలిసిందని దీప, కార్తీక్ కు జ్యోత్స్న చెప్తుంది. తనకు చెప్పకుండా సూరజ్ బర్త్ డే ఏర్పాట్లు చేయ్. అందరిముందు నీ మనసులోని మాటను చెప్పేయ్ అని జ్యోత్స్నకు దీప, కార్తీక్ కు చెప్తారు. భయపడకుండా తన ప్రేమను చెప్పమంటారు.

జ్యోత్స్న ప్రేమ పాట్లు

రాత్రి నిద్రపోతున్న జ్యోత్స్న ‘నేను రిజెక్ట్ చేస్తున్నాను’ అని సూరజ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఉలిక్కి పడి లేస్తుంది. సూరజ్ బర్త్ డేకు కావాల్సిన ఏర్పాట్లు చేశా. కానీ రేపు కూడా రిజెక్ట్ చేస్తున్నానని చెప్తే ఏం చేయాలి? సూరజ్ కు ఏం చెప్తే అర్థమవుతుంది? సరిగ్గా చెప్పలేకపోతే? ఒక పని చేద్దాం పేపర్ తీసుకొని ఏం చెప్పాలో రాసుకుందామని జ్యోత్స్న రాసుకొస్తుంది.

సూరజ్ నువ్వంటే ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డైరెక్ట్ ప్రేమిస్తున్నానంటే ఎప్పుడు ప్రేమలో పడ్డావంటాడా? ఇది వద్దు. సూరజ్ మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతానని జ్యోత్స్న రకరకాలుగా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటుంది. సూరజ్ కు మనసులో మాట ఎలా చెప్పాలని నైట్ అంతా ఆలోచిస్తూ కూర్చుంటుంది జ్యోత్స్న.

షాకిచ్చిన సూరజ్

ఉదయం సూరజ్ ఔట్ హౌజ్ లో రెడీ అయి కూర్చన్న జ్యోత్స్న సర్ ప్రైజ్ ఇస్తుంది. మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది. నువ్వు రావాలి. రమ్మని మా మమ్మీ చెప్పిందని జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. ఇది కాదు, నువ్వు వేరే ఏదో చెప్పాలనుకుంటున్నావని సూరజ్ అడుగుతాడు. భక్తురాలిలా దేవుడి కోసం వచ్చానని జ్యోత్స్న ప్రేమగా చెప్తుంది.

చూడు సూరజ్, మనమేమీ చిన్నపిల్లలం కాదు. నేను నా భయాన్ని వదిలేసి నా మనసులోని మాట చెప్తున్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావ్. ఈ మాట నువ్వు నమ్ముతావా? లేదా నిన్ను నమ్మించడానికి అని అటు తిరిగిన జ్యోత్స్న ఇటు తిరుగుతుంది. అప్పుడు సూరజ్ ఫోన్ మాట్లాడుతుండటం చూసి షాక్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ కాల్ ఏంటీ? అని కోపంతో వెళ్లిపోతుంది జ్యో.

ఈ సారి గెలిచేది మనమే

మరోవైపు దక్షిణామూర్తికి స్వీట్ ఇస్తుంది మాలిని. ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా మామయ్య అని మాలిని అడుగుతుంది. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన రోజు. కానీ జ్ణాపకాలతోనే బతకాల్సి వస్తుంది. మనం కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు బదులు తీర్చుకోవాల్సిందేనని దక్షిణామూర్తి ఫీల్ అవుతాడు. మనం అనుకున్నది జరిగే రోజు చాలా దగ్గర్లోనే ఉంది మామయ్య. ఈ సారి గెలిచేది మనమేనని మాలిని చెప్తుంది.

అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనే పరిస్థితి లేదు. మనం పెట్టిన దీపాన్ని మనమే రక్షిస్తున్నాం. దాన్ని ఏ గాలి ఆపలేదని మాలిని చెప్తుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More