Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. సూరజ్ రహస్యం ఇదా? గతం తెలుసుకున్న కార్తీక్, తాత- కాలర్ పట్టుకున్న జ్యో
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే ఆగస్టు 3 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. సూరజ్ గతం గురించి శివ నారాయణ, కార్తీక్ కు తెలుస్తుంది. పెద్దయ్య ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. అయితే సూరజ్ తో పెళ్లి అనగానే జ్యో ఆవేశంతో ఊగిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో సూరజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కార్తీక్, దీప ట్రై చేస్తారు. సూరజ్ తో తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారని తెలియగానే జ్యోత్స్న ఆవేశంతో ఊగిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

సూరజ్ గురించి ఆరా
సూరజ్ ను పూర్తి వివరాలు అడుగుతారు కార్తీక్, దీప. తనకు తెలిసిన అమ్మాయి ఉందని కార్తీక్ అబద్ధం చెప్తాడు. ఇదంతా తలుపు చాటు నుంచి జ్యోత్స్న వింటుంది. కార్తీక్, దీప ఎంత అడిగినా సూరజ్ మాత్రం తన గురించి పూర్తి వివరాలు చెప్పడు. దీంతో ఇక్కడ ఎవరూ లేరు, మనసులో ఎవరున్నారో చెప్పమని సూరజ్ ను కార్తీక్, దీప అడుగుతారు.
కాలర్ పట్టుకున్న జ్యోత్స్న
జ్యోత్స్న ఉందని సూరజ్ అంటాడు. అప్పుడే కోపంగా జ్యోత్స్న లోపలికి వస్తుంది. నీ మనసులో నేనున్నానని చెప్పడానికి నీకెంత ధైర్యంగా అని సూరజ్ కాలర్ పట్టుకుంటుంది జ్యోత్స్న. నేను పూర్తిగా చెప్పేది విను. వదిన, నువ్వు ఏం అన్నావ్? ఇక్కడ ఎవరూ లేరని అన్నావ్ కదా. దానికే జ్యోత్స్న ఇక్కడ చాటుగా వింటుందని చెప్పాలనుకున్నా. కానీ ఇంతలోనే నువ్వు వచ్చావ్. నా మనసులో ఎవరూ లేరని సూరజ్ భలే కవర్ చేస్తాడు.
పెళ్లి సంబంధం గురించి
ఇటు జ్యోత్స్న కోపంతో తాత దగ్గరకు వెళ్తుంది. అప్పుడు సూరజ్ తీసిన జ్యోత్స్న ఫొటోలను శివ నారాయణ చూస్తుంటాడు. సూరజ్ మనల్ని మోసం చేశాడు. అబద్ధం చెప్పాడు. అతను మంచి ఫొటోగ్రాఫర్. అది వదిలేసి అడ్వైజర్ గా ఉండటం నిజంగా మోసం చేయడమే. ఈ ఫొటో చూడు ఎంత బాగా తీశాడో? దీన్ని నీ పెళ్లి సంబంధం గురించి మ్యారేజీ బ్రోకర్ గా ఇవ్వాలనుకుంటున్నా. నీ మాటలు నమ్మేందుకు ఆధారాలు లేవు. నీ ఫొటోలతో పాటు మా ఫొటోలు కూడా తీశాడు కదా అని జ్యోకు చిర్రెత్తుకొచ్చేలా శివ నారాయణ మాట్లాడతాడు.
సూరజ్ తో పెళ్లి సంబంధం గురించి కార్తీక్, దీప మాట్లాడుతున్నారని జ్యో చెప్తుంది. ఓ అప్పుడే మొదలెట్టేశారా? ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. సూరజ్ ఔట్ హౌజ్ లో ఉండటానికి పనికి రాడు. ఎక్కడికి పంపించాలో నాకు తెలుసు అని శివ నారాయణ అంటాడు. దీంతో కోపంతో జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
5 లక్షలు కావాలని
ఇక లంచ్ టైమ్ లో మాలిని గురించి మాట్లాడుకుంటారు. అందరిపై ఓ కన్నేసి ఉంచాలి. మాలిని మనిషి మనలోనే ఒకరు ఉన్నారేమో. వాళ్లను కనిపెట్టాలని శివ నారాయణ అంటాడు. ఆ పని సూరజ్ కు అప్పజెప్తామని దీప అంటుంది. అప్పుడే వచ్చిన సూరజ్ అర్జెంట్ గా రూ.5 లక్షలు కావాలని శివ నారాయణను అడుగుతాడు.
జ్యోత్స్న ప్రశ్నలు
ఎందుకు తీసుకుని పారిపోవడానికా అని జ్యోత్స్న అడుగుతుంది. నాకు వెంటనే కావాలి. అర్జెంట్ సార్ అని సూరజ్ టెన్షన్ పడతాడు. జాబ్ చేయని వాడికి అడ్వాన్స్ ఎలా ఇస్తాం తాత. సూరజ్ పేరు మన కంపెనీ రిజిస్టర్ లో ఉండదు. తను ఎంప్లాయ్ కాదు కాబట్టి గ్యారెంటీ లేని మనిషికి రూ.5 లక్షలు ఎవరు ఇస్తారు? అని జ్యోత్స్న అంటుంది.
ఛైర్మన్ పేరు మీద
సూరజ్ ఎంప్లాయ్ కాదు. మనం అడ్వాన్స్ ఇవ్వలేం. కార్తీక్, సూరజ్ ను మేనేజర్ దగ్గరకు తీసుకెళ్లి రూ.5 లక్షలు ఇప్పించు. అవి నాకు ఇచ్చినట్లు రాసుకోమను. ఛైర్మన్ కు అయితే రూ.5 లక్షలు ఇవ్వొచ్చు కదా జ్యోత్స్న అని శివ నారాయణ భలే కౌంటర్ ఇస్తాడు. అప్పుడే సూరజ్ ను ఫాలో చేయమని కార్తీక్ చెవిలో చెప్తాడు శివ నారాయణ. దీంతో సూరజ్ వెనుకాలే కార్తీక్ వెళ్తాడు.
పెద్దయ్య ఆపరేషన్
సూరజ్ ఏమో హాస్పిటల్ కు వచ్చి బిల్ పే చేస్తాడు. అక్కడ బెడ్ పై ఓ పెద్దాయన ఉంటాడు. ఆపరేషన్ కు రూ.5 లక్షలు కట్టేశాను పెద్దయ్య అని సూరజ్ చెప్తాడు. పెద్దయ్యకు ఏం కాకూడదు డాక్టర్ అని సూరజ్ రిక్వెస్ట్ చేస్తాడు. పెద్దయ్య ద్వారా సూరజ్ ఎవరో తెలుసుకోవాలని కార్తీక్ అనుకుంటాడు.
జ్యో డౌట్
పారిజాతానికి ఫోన్ చేసిన జ్యోత్స్న ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్తుంది. ఆ సూరజ్ ఇంట్లోకానీ ఆఫీస్ లో కానీ ఉండటానికి వీల్లేదని చెప్పాను కదా. కానీ వీళ్లు యాక్షన్ తీసుకునేలా లేరు. ఏదో అవసరం ఉంటే తాత సూరజ్ కు రూ.5 లక్షలు ఇచ్చాడు. నాకో డౌట్ వచ్చింది. వీళ్లంతా నా వెనుకాల గుసగుసలు ఆడుతున్నారు. సూరజ్ అయితే ఉండకూడదని పారుకు జ్యో చెప్తుంది.
సూరజ్ అనాథ
అప్పుడే శివ నారాయణకు కార్తీక్ కాల్ చేసి సూరజ్ హాస్పిటల్ కు వచ్చిన విషయాన్ని చెప్తాడు. శివ నారాయణ కూడా హాస్పిటల్ కు వెళ్తాడు. అక్కడ పెద్దయ్యను కలిసి సూరజ్ గురించి కార్తీక్, శివ నారాయణ అడుగుతారు. వాడిది, నాది దేవుడు ముడివేసిన బంధం. వాడిని నేను పెంచా. వాడి అమ్మానాన్న లేరు. వాడొక అనాథ. వాడి నాలుగేళ్ల వయసప్పటి నుంచి అమ్మానాన్న నేనే అయ్యానని పెద్దయ్య చెప్తాడు.
జ్యోత్స్న మైండ్ బ్లాక్
హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో శివ నారాయణ అందరిని పిలిచి మాట్లాడతాడు. సూరజ్ కు అమ్మానాన్న లేరని శివ నారాయణ చెప్తాడు. సూరజ్ కు, జ్యోత్స్నకు పెళ్లి చేస్తే బాగుంటుందని అందరం అనుకుంటున్నామని సుమిత్ర అనగానే జ్యోత్స్నకు మైండ్ బ్లాక్ అవుతుంది. దీంతో జ్యో కోపంతో ఊగిపోతుంది.
సూరజ్ అంటే నాకు ఇష్టమని చెప్పానా? దీపను అనాథ అని వెక్కిరించేదాన్ని కదా, అందుకే అనాథకు ఇచ్చి పగ తీర్చుకోవాలనుకుంటున్నావని జ్యో అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


