Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. జ్యోత్స్న బెడ్‌రూమ్‌లో సూర‌జ్‌-ఫొటోలతో నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన జ్యో

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 31 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సూరజ్ మోసగాడు అని ఫొటోలతో ప్రూవ్ చేయాలని జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. కానీ సూరజ్ తెలివిగా తప్పించుకుంటాడు. తన బెడ్ రూమ్ లోకి సూరజ్ వచ్చినట్లు జ్యో భ్రమ పడుతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ మీ కోసం.

Published on: Jul 31, 2026, 06:58:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 31 ఎపిసోడ్ లో సూరజ్ ను ఇరికించాలని జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. సూరజ్ తీసిన తన ఫొటోలను చూపిస్తుంది. కానీ సూరజ్ తెలివిగా తప్పించుకుంటాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యోత్న్స బెడ్ రూమ్ లో సూరజ్

సడెన్ గా నిద్రలో నుంచి లేచిన జ్యోత్స్న తన బెడ్ రూమ్ లోనే ఉన్న సూరజ్ ను చూసి షాక్ అవుతుంది. నా బెడ్ రూమ్ లోకి ఎందుకు వచ్చావ్? అర్ధరాత్రి ఆడపిల్ల రూమ్ లోకి రావడం ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? అని జ్యో అడుగుతుంది. తెలీదు బంగారం, ఎందుకంటే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని సూరజ్ చెప్తాడు. ఇప్పుడే మా తాతను, డాడీని పిలుస్తానని జ్యో అంటుంది.

సెక్యూరిటీగా వచ్చానని

నువ్వే రమ్మన్నావని చెప్తా. నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఎందుకు వస్తా. నువ్వు ఉన్నావో లేదో చూద్దామని వచ్చా. నిన్ను ఎవరో ఎత్తుకెళ్లారని కల వచ్చింది. నీకు కాపలా కాయడానికి వచ్చా. బంగరాం విలువ రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే నేను సెక్యూరిటీగా వచ్చానని సూరజ్ అంటాడు. నా దగ్గర లైసెన్స్ డ్ రివాల్వర్ ఉంది, షూట్ చేస్తానని జ్యో అంటుంది.

జ్యో భ్రమ

సూరజ్ పైకి ప్లవర్ వాజ్ లు విసిరేస్తుంది జ్యోత్స్న. కానీ అదే ప్లేస్ లో పారిజాతం ఉంటుంది. అంటే ఇదంతా జ్యోత్స్న భ్రమ అని తెలుస్తోంది. సూరజ్ వచ్చాడని జ్యో గొడవ చేస్తుంది. వెంటనే సూరజ్ దగ్గరకు వెళ్లి తన గదిలోకి ఎందుకు వచ్చావని అడుగుతుంది. నువ్వే నా భవిష్యత్. మనసు ఇచ్చిన మనిషి కోసం చచ్చిపోయినా సరే. నువ్వు ఊహించుకున్నావని సూరజ్ అంటాడు.

సూరజ్ కు వార్నింగ్

ఇప్పటివరకూ మన మధ్య ఏం జరిగిందో మర్చిపోదాం. ఎవరి పని వాళ్లు చేసుకుందాం. నాకో లైఫ్ ఉంది. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నన్ను బంగారం అని పిలవడం, నన్ను చూడటం, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం మానేయాలి. నీకు టైమ్ దగ్గరపడింది. ఇంకా ఎన్ని రోజులో ఇంట్లో ఉండవని సూరజ్ కు జ్యో వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే వచ్చిన పారిజాతం తాత రూమ లో లైట్ వెలిగిందని జ్యోను లోపలికి లాక్కెళ్తుంది.

ఫొటోలు తీశావని కంప్లైంట్

మార్నింగ్ ను అందరినీ తీసుకొని వచ్చి సూరజ్ డోర్ కొడుతుంది జ్యోత్స్న. మా అమ్మాయి నీ మీద కంప్లైంట్ చేసింది. నువ్వు తన ఫొటోలు తీశావంటా కదా. తనను అన్ని విషయాల్లో ఇబ్బంది పెడతున్నావని కంప్లైంట్ చేసిందని సూరజ్ ను దశరథ అడుగుతాడు. కార్తీక్, సూరజ్ ను లోపలికి తీసుకెళ్లిన జ్యోత్స్న ఫొటో ఆల్బమ్ ను చూపిస్తుంది.

అందరూ షాక్

అది చూసి కార్తీక్ షాక్ అవుతాడు. ఆ ఆల్బమ్ లో జ్యోత్స్న ఫొటోలు ఉంటాయి. జ్యోత్స్న చెప్పింది నిజమే మామయ్య, ఫొటోలు ఉన్నాయని కార్తీక్ చెప్తాడు. ఆ ఫొటోలను జ్యోత్స్న అందరికీ చూపిస్తుంది. ఒక అమ్మాయి ఫొటోలు చాటుగా తీశాడంటే వీడి క్యారెక్టర్ ఏంటీ అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. సూరజ్ ను వివరణ అడుగుతారు శివ నారాయణ, దశరథ.

భలే తప్పించుకున్న సూరజ్

దొరికిపోవడం ఏంటీ? ఫొటోగ్రఫీ నా హాబీ. మీ పర్మిషన్ లేకపోవడం ఏంటీ? మీ ఫొటోలు ముందే చూపించాను కదా. మొన్న రాత్రి మీరు ఔట్ హౌజ్ కు వచ్చారు. మీరు అస్తమానం వస్తుంటారు. దీనికి పారిజాతం సాక్ష్యం అని ఇరికిస్తాడు సూరజ్. అవును, వస్తుందని పారిజాతం ఒప్పుకొంటుంది. ఎప్పటిలాగే జ్యోత్స్న ఆ రోజు కూడా వచ్చింది. ఫొటోలు ఎలా ఉన్నాయని అడిగా. ఫొటోలు చూసి చాలా నేచురల్ గా ఉన్నాయని చెప్పిందని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు.

డ్రామా బయటపెట్టినా

అసలు సూరజ్ మన ఇంట్లోకి ఎలా వచ్చాడు? వీడు నన్ను, తాతను కాపాడాడు అన్నది పెద్ద అబద్ధం. కాలుకు దెబ్బ తగిలించుకోవడం కూడా అబద్ధమే. ఇదంతా రౌడీలతో కలిసి ఆడిన నాటకం. ఇంట్లో నా కాలికి దెబ్బ తగిలేలా చేసిందే సూరజ్. సూరజ్ పై పప్పు వేశానని నాపై కోప్పడ్డారు. నా శారీ తగలబెడతానని బెదిరించాడు. నేను వచ్చి వీడి షర్ట్ ఉతికానని జ్యోత్స్న నిజాలన్నీ చెప్పేస్తుంది. దీనికి అవును అని గ్రానీ తల ఊపుతుంది.

జ్యోకు మైండ్ బ్లాక్

పార్టీ రోజున ఫ్లవర్ ఇచ్చాడు. వీడు సైట్ కొడుతున్నాడని అప్పుడే అర్థమైంది. మన మధ్య ఉండే అర్హత వీడికి లేదని జ్యోత్స్న అంటుంది. నాపై ఎందుకు నిందలు వేస్తున్నారు. నాకు ఫొటోగ్రఫీ హాబీ అని సూరజ్ చెప్తాడు. మరి అందరి ఫొటోలు తీయాలి కదా అని జ్యోత్స్న అడుగుతుంది. సూరజ్ మిగతావాళ్ల ఫొటోలు చూపించి జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాడు.

మీ ఫ్యామిలీ అంటే నాకిష్టం. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు మీకు ఈ ఆల్బమ్స్ ఇచ్చేద్దామనుకున్నా. దీపకు ఇచ్చిన రెస్టారెంట్ బ్రాంచ్ లో ఫుడ్ కల్తీ చేసింది జ్యోత్స్ననే. దాన్ని బయటపెట్టిందే నేను. అప్పటి నుంచే జ్యోత్స్నకు నా మీద కోపం ఉందని సూరజ్ తెలివిగా చెప్తాడు.

ఉప్మా మాడిపోతుందని

జ్యోత్స్న, సూరజ్ ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఫొటోగ్రఫీ నా హాబీ. అందరి ఫొటోలు నా దగ్గరున్నాయి కదా. నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నా. అది మాడిపోతుందని సూరజ్ లోపలికి వెళ్లిపోతాడు. సూరజ్ మోసగాడు. ఔట్ హౌజ్ లో ఉండటానికి పనికి రాడని జ్యో అంటుంది. అవును, సూరజ్ ఔట్ హౌజ్ లో ఉండటానికి పనికి రాడని శివ నారాయణ అంటాడు.

ఇంట్లో శివ నారాయణ, సుమిత్ర, దశరథ, కార్తీక్, దీప కూర్చుని మీటింగ్ పెడతారు. నువ్వు ఏమైనా చెప్పు బావ, జ్యోత్స్నకు సూరజ్ కరెక్ట్ అని దీప అంటుంది. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More