Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2..కూతురికి పిండం పెడుతుంటే ఏం చేశారు? మాలినికి దిమ్మతిరిగేేలా దీప కౌంటర్!

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 29 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎవరికి ఎవరు తగ్గకుండా కౌంటర్లు వేసుకుంటారు. మాలినికి దీప దిమ్మతిరిగే సమాధానం చెప్తుంది. రూపాయికి మరో రూపాయితో మాలిని కౌంటర్ ఇస్తుంది. సూరజ్ ఏమో పారు గుట్టు రట్టు చేస్తాడు. పూర్తి ఎపిసోడ్ మీకోసం.

Published on: Jul 29, 2026, 06:52:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 29 ఎపిసోడ్ లో మాలినికి దీప దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. సూరజ్ కూడా గట్టిగానే మాట్లాడతాడు. పారిజాతం గుట్టు బయటపెడతాడు. కానీ మాలిని రూపాయికి రూపాయి ఇచ్చి లెక్క సరిపోయిందని చెప్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

సుమిత్ర మా అమ్మ

జ్యోత్స్నకు పెళ్లి సంబంధం తీసుకురావడమే కాకుండా శివ నారాయణ ఇంటికి నేరుగా వచ్చిన మాలిని మళ్లీ చిచ్చు రేపుతుంది. ఇంట్లో అందరితో మాటల యుద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే దీప వర్సెస్ మాలిని వాగ్వాదం జరుగుతుంది. సుమిత్రమ్మ మా అమ్మ అని దీప షాకిస్తుంది.

దీప కౌంటర్

సుమిత్ర మీ అమ్మనా అని మాలిని అడుగుతుంది. ఈ ఇంటి ఆడపడుచు కోడలికి ఆవిడ అమ్మ. నేను అమ్మలాగే చూస్తాను. ఆవిడను ఒక్క మాట అన్న ఊరుకోను. ఈ దక్షిణామూర్తి తాత ఏమో కూతురు బతికి ఉండగానే పిండం పెట్టారు. అప్పుడు ఏమైంది బంధం? మేనకోడలు మనసు గురించి ఆలోచించే మీకు, ఆడపడుచు మనసు అర్థం కాలేదా? మామయ్య నా ఆడపడుచుకు పిండం పెట్టొద్దు అని ఎందుకు ఆపలేదు? అని దీప గట్టిగా కౌంటర్లు ఇస్తుంది.

శభాష్ దీప

దీప మాటలతో మాలినికి మైండ్ బ్లాక్ అవుతుంది. అది మా సొంత విషయం. దాన్ని ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు అని మాలిని అంటుంది. ఇది వీళ్ల సొంత విషయం, ప్రశ్నించడానికి మీరు సరిపోరని దీప మళ్లీ కౌంటర్ ఇస్తుంది. శభాష్, దీప. నా మనసులో ఉన్న విషయమే చెప్పావ్. నా కూతురికి ఎప్పుడు, ఎలా పెళ్లి చేయాలో తెలుసని దశరథ అంటాడు.

జ్యోత్స్న పాత ప్రేమ

జ్యోత్స్న మనసులో పాత ప్రేమ అలాగే ఉందని మాలిని అంటుంది. నేను ఇప్పటికే ఆ మాట చెప్పా. తను మారుతుంది. జ్యోత్స్న నా శత్రువేమీ కాదు. తనకు పెళ్లి చేయాలి. సంబంధాలు చూస్తున్నారు. తన రాత ఎలా ఉందో ఎవరికి తెలుసు? అని కార్తీక్ మధ్యలో మాట్లాడతాడు. ఇక్కడ అందరి తలరాతలను మీ తాత మారుస్తాడని దక్షిణామూర్తి జోక్యం చేసుకుంటాడు.

షాక్ ఇచ్చిన దక్షిణామూర్తి

ఇక్కడ మీ అమ్మ, మీ బావ, మీ తాత ఇష్టం ఉన్నవాళ్లను పెళ్లి చేసుకున్నారు. కానీ నీ ఇష్టానికి విలువ లేదు. మీ తాత తన కూతురి మనసు ఒప్పించలేడా? మీ బావను నీకు ఇచ్చి పెళ్లి చేయలేడా? అని జ్యోత్స్నతో దక్షిణామూర్తి అంటాడు. నువ్వు నీ స్వార్థం చూసుకుంటావ్ శివ నారాయణ. రెండో పెళ్లి చేసుకున్నాడని గెంటేసిన నీ అల్లుడి ఇంటికి కోడలిగా పంపలేక నువ్వే కార్తీక్, జ్యోత్స్నలను విడదీశావని దక్షిణామూర్తి షాకింగ్ ఆరోపణలు చేస్తాడు.

సూరజ్ ప్రశ్నలు

దక్షిణామూర్తి నీకు మాటలతో చెప్తే సరిపోదురా అని పైకి దూసుకెళ్తాడు శివ నారాయణ. ఈ విషయాలు మీరు ఎందుకు చెప్పాలి? వాళ్లు మిమ్మల్ని వద్దనుకున్నారు. అయినా సరే శివ నారాయణను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఇది న్యాయమైంది కాదు అని సూరజ్ అడుగుతాడు. అది చెప్పడానికి నువ్వు ఎవరు? అని దక్షిణామూర్తి అడుగుతాడు. మనవడు అని చెప్పాడు కదా అని మాలిని అంటుంది.

ఎవరిని కొన్నావ్?

మేం రక్త సంబంధీకులం. ఎప్పటికైనా కలవాల్సినవాళ్లం. కానీ నువ్వు పరాయివాడివేనని సూరజ్ గురించి మాలిని అంటుంది. సూరజ్ ఎప్పుడూ పరాయివాడు కాదు మాలిని. వీడు నా మనిషి అని శివ నారాయణ అంటాడు. అది నాకు తెలుసు అని మాలిని అంటుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నా ఇంటి విషయాలు నీకు ఎలా తెలుస్తున్నాయి? ఎవరిని కొన్నావ్? అని శివ నారాయణ అడుగుతాడు.

పారు గుట్టు రట్టు

మాలిని ఉంగరం పారిజాతం వేలికి ఉందని ట్విస్ట్ ఇస్తాడు సూరజ్. ఇదే ఉంగరాన్ని వంటల పోటీల టైమ్ లో మాలిని ఆఫర్ చేశారు కానీ నేను తీసుకోలేదని సూరజ్ చెప్తాడు. అవును నాకు పారిజాతమే చెప్పింది. కానీ అన్నీ నిజాలే కదా అని మాలిని అంటుంది. శివ నారాయణ ఎలాంటి మనిషో నాకు తెలుసు. కానీ నేను పరాయివాడిని అనేది నిజం. నేను ఇక్కడ ఉండకూడదని సూరజ్ వెళ్లిపోతాడు.

రూపాయికి రూపాయి

ఏం శివ నారాయణ జ్యోత్స్న పెళ్లి ఎప్పుడు చేస్తావని దక్షిణామూర్తి అడుగుతాడు. చాలా తొందర్లోనే జరుగుతుంది. మంచి ముహూర్తం పెట్టి, ఫస్ట్ కార్డు మీకే ఇస్తామని దీప కౌంటర్ ఇస్తుంది. మాలిని వెళ్తూ వెళ్తూ శివ నారాయణ ఇచ్చిన రూపాయికి ఇంకో రూపాయి ఇచ్చి లెక్క సరిపోయిందని చెప్పి వెళ్తుంది. దీంతో శివ నారాయణ పిచ్చి కోపంతో ఊగిపోతాడు.

పారు బిల్డప్

మరోవైపు పారిజాతం ఓ గదిలో భయంతో వణికిపోతూ కూర్చుంటుంది. నన్ను బయటకు గెంటేస్తారని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి పారు డార్లింగ్, బయటకు రా డార్లింగ్. నువ్వు తలుపు తీయకపోతే తాత వచ్చి డోర్ తంతాడని అంటాడు. తప్పని పరిస్థితుల్లో డోర్ తీసిన పారిజాతం ఏదో డ్రామా స్టార్ట్ చేస్తుంది. బిల్డప్ గా కింద కూర్చుంటుంది.

తెలివిగా ఆన్సర్

నేను మాలినిని కలిశాను. నాకు ఫోన్ చేసి కలవాలంది. జ్యోత్స్నను తీసుకురమ్మంది. ఎందుకు అని అడగలేదు. చెప్పకుండానే తీసుకెళ్లా. మాలిని ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికే తీసుకెళ్లా. మీ కోసమే తీసుకెళ్లా. మాలిని నాకు ఫోన్ చేసి జ్యోత్స్నను తీసుకురమ్మని చెప్పగానే వద్దన్నా అనుకోండి జ్యోను కలిసేందుకు మరో ప్రయత్నం చేస్తుందని పారిజాతం తెలివిగా మాట్లాడుతుంది.

మరి ఈ విషయం తాతకు చెప్పొచ్చు కదా అని కార్తీక్ అడుగుతాడు. ముందే చెప్తే మీ తాత మాలిని మీద అరుస్తాడు. అప్పుడు మాలిని ఏం చేయాలనుకుంటుందో ఎలా తెలుస్తుంది. అది తెలుసుకుందామనే జ్యోత్స్నను తీసుకెళ్లా. జ్యో పెళ్లి గురించి అడిగింది. ఉంగరం ఆఫర్ చేసింది. నేను కాకపోతే ఇంకొకరు తీసుకునేవాళ్లు అని పారిజాతం చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More