Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2.. అసలు దీప ఎవరు? పాత చిచ్చు రేపిన మాలిని-సుమిత్రే మా అమ్మ-షాకిచ్చిన దీప

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 28 ఎపిసోడ్ లో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. జ్యో కోసం మాలిని పెళ్లి సంబంధం తీసుకొస్తుంది. కార్తీక్ కారణంగా జ్యోత్స్నకు అన్యాయం జరిగిందని పాత చిచ్చును రేపుతుంది మాలిని. సుమిత్ర మా అమ్మ అని దీప షాకిస్తుంది. పూర్తి ఎపిసోడ్ పై లుక్కేయండి.

Published on: Jul 28, 2026, 06:49:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 28 ఎపిసోడ్ లో హైడ్రామా రసవత్తరంగా సాగుతుంది. శివ నారాయణ ఇంట్లో అడుగుపెట్టిన మాలిని మాటల యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

జ్యోత్స్నకు పెళ్లి సంబంధం

నిన్ను చూసి చాలా నేర్చుకోవాలంటూ సూరజ్ పట్ల ఇంప్రెస్ అవుతాడు శివ నారాయణ. అప్పుడే రియల్ ఎస్టేట్ గంగాధర్ తన కొడుక్కి జ్యోత్స్నను ఇచ్చి పెళ్లి చేయమని అడిగేందుకు వస్తాడు. ఎవరు పంపిచారని శివ నారాయణ అడిగితే, మేడం అని వాళ్లు ఆన్సర్ చెప్తారు. అప్పుడే దశరథ వచ్చి జ్యోత్స్న పెళ్లి బాధ్యతను కార్తీక్, దీప తీసుకున్నారని శివ నారాయణకు చెప్తాడు.

జ్యోత్స్న చాలా ఇబ్బంది పడుతుంది. సుమిత్రను పిలిచి జ్యోత్స్నను చూసేందుకు పెళ్లి కొడుకు వాళ్లు వచ్చారని దశరథ అంటాడు. తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్స్న కూడా అదే షాక్ లో ఉంటుంది.

కార్తీక్ కు కాల్

మరోవైపు ఇంటి నుంచి త్వరగా వెళ్లిపోదామని దీపతో కార్తీక్ చెప్తాడు. ఇల్లు ఇన్విస్టిగేషన్ ఆఫీస్ లా మారింది, మా నాన్న ఆఫీసర్ అని కార్తీక్ అంటాడు. వెంటనే మంచి అబ్బాయిని చూసి జ్యోత్స్నకు పెళ్లి చేయాలని దీపతో కార్తీక్ చెప్తాడు. అప్పుడే కార్తీక్ కాల్ చేసి జ్యోత్స్నను చూసుకోవడానికి పెళ్లివాళ్లు వచ్చారని చెప్తాడు. దీప, కార్తీక్ ను త్వరగా రమ్మంటాడు.

జ్యోత్స్నకు మీ నాన్న పెళ్లి సంబంధం చూశారు. జ్యోను చూసుకోవడానికి వచ్చారంటా అని దీపను తీసుకెళ్తాడు కార్తీక్. అయితే ఈ సంబంధం చూసింది దీప, కార్తీక్ అని దశరథ.. పెళ్లి వాళ్లను తీసుకొచ్చింది దశరథనే అని దీప, కార్తీక్ అనుకుంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

జ్యోను పొగిడేసిన సూరజ్

జ్యోత్స్న చాలా స్పీడ్ అని మేడం చెప్పింది. కానీ ఆవిడ అలా లేదు అని పెళ్లి కొడుకు అంటాడు. దీంతో జ్యోత్స్న గురించి గొప్పగా చెప్తాడు సూరజ్. జ్యోత్స్న కవి రాసిని అందమైన కవిత లాంటిదే. ఆవిడ గురించి ఏమని వర్ణించాలి? ఏమని చెప్పాలి? పొద్దున గార్డెన్ లో తిరుగుతుంటే చందమామలా కనిపిస్తుంది. తాత మాట కోసం ఏమైనా చేస్తుంది. ఇలా జ్యోత్స్న గురించి లేనివి కూడా గొప్పగా చెప్పుకుంటూ పోతాడు సూరజ్.

ఓ లోపం

చంద్రుడిలా మచ్చలాగే ఈ పదహారణాల తెలుగమ్మాయిలోనూ ఓ లోపం ఉందని సూరజ్ అంటాడు. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు. అందరూ ఆ లోపం ఏంటీ అని అడుగుతారు. జ్యోత్స్నకు వంట చేయడం రాదు. కానీ మంచి వంట ఎలా చేయాలో తెలుసు అని సూరజ్ ట్విస్ట్ ఇస్తాడు. ఏ ఊరి సంబంధం అని కార్తీక్ అడిగితే.. అది మీరే చెప్పాలని శివ నారాయణ అంటాడు. దీంతో దీప, కార్తీక్ ఇప్పుడు కంగుతింటారు.

మాలిని పంపించిందని

వీళ్లు నా పేరే చెప్పారని దీపతో దశరథ అంటాడు. వీళ్లు పంపిస్తే రాలేదు. మేడం పంపించారు. మేడం అంటే సీఈఓ దీప కాదు. డీఎం రెస్టారెంట్స్ ఎండీ మాలిని అని పెళ్లి వాళ్లు చెప్పడంతో శివ నారాయణ ఫ్యామిలీ మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే నేనే పంపించానని మాలిని, ఆ వెనుకాలే దక్షిణామూర్తి షాకింగ్ ఎంట్రీ ఇస్తారు. వీళ్లు నా మనుషులే, నేనే పంపించానని మాలిని చెప్తుంది.

మరోవైపు మాలిని ఇంటికి వచ్చిన విషయాన్ని శ్రీధర్ కు కాంచన చెప్తుంది. మళ్లీ మాలిని వచ్చిందంటే మన మీద పగ తీర్చుకోవడానికే కాంచన అని శ్రీధర్ టెన్షన్ పడతాడు.

దశరథ సీరియస్

ఇక మాలిని మనుషులు అని తెలిసి పెళ్లి వాళ్లపై శివ నారాయణ ఫైర్ అవుతాడు. మరోసారి ఈ ఇంటి చుట్టు పక్కలకు కూడా రాకండని వార్నింగ్ ఇస్తాడు. చెప్పకపోయినా చనువు తీసుకుని మాలిని, దక్షిణామూర్తి కూర్చుంటారు. అంత మర్యాద అవసరం లేదు బాబాయ్ కూర్చోవచ్చు అని వెటకారంగా మాట్లాడుతుంది మాలిని. లేచి బయటకు పోతారా? లేదా? అని దశరథ సీరియస్ అవుతాడు.

నువ్వు నా చావువి

నువ్వు శత్రువువి కాదు, నా చావువి. నువ్వు కళ్ల ముందు కనబడుతుంటే కాలుతున్న నిప్పును పట్టుకున్నట్లే ఉందని మాలినిపై దశరథ కోప్పడతాడు. నా కూతురికి సంబంధం తీసుకొచ్చే చనువు ఎవరిచ్చారని సుమిత్ర అడుగుతుంది. నువ్వు నా ఆడపడుచువి అనే బంధం సరిపోదా అని మాలిని అడుగుతుంది. సరిపోదని సుమిత్ర తెగేసి చెప్తుంది.

నీ కూతురేనా?

మేం మేనకోడలి కోసం కలుపుకోవాలనుకుంటున్నాం అని మాలిని అంటుంది. నీకు సంబంధం లేదని దశరథ అంటాడు. ఇది నిజంగా నీ కూతురేనా? ఎవరైనా ఇస్తే పెంచుకున్నావా? అని దశరథ, సుమిత్రను మాలిని అడుగుతుంది. మీరు నిజంగా దాని కన్నవాళ్లు అయితే దాని జీవితం నాశనం చేసేవాళ్లు కాదు. నేను నిజాలు మాట్లాడితే మీరు సరిపోరు. చెల్లెలు కొడుక్కే నీ కూతురితో పెళ్లి అని అన్నయ్య, కాంచన అనుకున్నారా లేదా? అని మాలిని అడుగుతుంది.

కార్తీక్ కౌంటర్

మీకు చేతగాక కాంచన కొడుకు ఎవరో అనాథ మెడలో తాళి కడితే అడిగే ధైర్యం లేదని మాలిని రెచ్చగొడుతోంది. నా భార్య అనాథ కాదని కార్తీక్ అంటాడు. మరి తల్లిదండ్రులు ఎవరు? అని మాలిని ప్రశ్నిస్తుంది. నేనే దీప తల్లిని, తండ్రిని. నా పేరే దీప ఇంటి పేరు అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్. నేను దీపను పెళ్లి చేసుకోకపోయినా, జ్యోత్స్న మెడలో తాళి కట్టేవాణ్ని కాదని కార్తీక్ అంటాడు.

సుమిత్ర మా అమ్మ

నువ్వే కట్టావో, ఆవిడే కట్టించుకునేలా చేసిందో అని మాలిని అనడంతో దీప సీరియస్ అవుతుంది. కానీ జ్యోత్స్నకు అన్యాయం జరిగిందనే మాలిని పదే పదే చెప్తుంది. నా మాట అబద్ధం అని జ్యోత్స్నను తల్లి మీద ఒట్టేసి చెప్పమను అని మాలిని షాకిస్తుంది. అసలు దీప ఎవరు? అని అడుగుతుంది. దీంతో మాటల యుద్ధం దీప వర్సెస్ మాలినిగా మారుతుంది. సుమిత్ర మా అమ్మ అని దీప చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More